witchcraft
-
అమానుషం.. వైద్యం పేరుతో 9 నెలల చిన్నారికి వాతలు.. అల్లాడిన పసి ప్రాణం
కొరాపుట్: మూఢ నమ్మకం ముక్కు పచ్చలారని పసికందు ప్రాణం తీసింది. నవరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి జోడాబర–2 గ్రామంలో ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుఖదేవ్ గొండో కుమారుడు రూపేష్ గొండో(9 నెలలు) తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతున్నాడు. దీంతో కుటుంబీకులు మంత్రగాడుని సంప్రదించగా, శిశువు పొట్ట, గుండెపై కొడవలితో వాతలు పెట్టించారు. నొప్పి తట్టుకోలేక ఆ పసి ప్రాణం అల్లాడిపోయింది. విషయం తెలుసుకున్న ఆశా కార్యకర్త సుభావతి గొండో అంబులైన్స్‌కు సమాచారం అందిదంచి, రూపేష్‌ను బొడబరండి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందించగా, ఆస్పత్రిలో ఎవరికీ తెలియకుండా కుటుంబీకులు శిశువుని తిరిగి ఇంటికి తెచ్చారు. మరోసారి మంత్రగాడితో పూజలు చేయించగా, రూపేస్ మృతిచెందాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. చదవండి: సీఎం పదవి ఖాళీగా లేదు! ఒకరిద్దరూ గొంతు చించుకుంటే సీఎం కాలేరు! -
బాధ్యతలు తీసుకున్న తొలిరోజే షాకైన ప్రిన్సిపల్.. ఆమె కుర్చీ కింద..
చిక్కబళ్లాపురం(బెంగళూరు): సాధారణంగా ఎవరైనా కొత్తగా పదవి చేపడితే వారికి అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు మర్యాదపూర్వకంగా ఆహ్వానం తెలుపుతారు. ఈ తతంగం ఎక్కడైన జరిగేది. కానీ కళాశాలకు ప్రిన్సిపల్‌గా వచ్చిన ఓ మహిళకు తన మొదటి రోజే చేదు అనుభవం ఎదురైంది. ఈ వింత ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని ఎంజీ రోడ్డులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన ప్రిన్సిపల్‌గా వచ్చిన శకుంతల తన గదిలో ఓ విచిత్రమైన బొమ్మను చూసి షాకయ్యారు. గురు వారం ఉదయం ఆమె ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆమె గదిని శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది ఆమె సీటు కింద శుభ్రం చేస్తుండగా ఒక బొమ్మకు పసుపు, కుంకుమ పూసి ఉంచారు. దీంతో చేతబడి చేసి నట్లు అనుమానిస్తున్నారు. కళాశాలలో ఇటువంటి చర్యలు జరగడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కొత్త ప్రిన్సిపాల్ అంటే గిట్టని వారు ఎవరైనా ఇలా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: కాలేజ్ స్టూడెంట్స్ కిస్సింగ్ కాంపిటీషన్ వీడియో.. పోలీసుల అదుపులో ఒకరు -
నెల్లూరులో దారుణం.. కన్న బిడ్డలపై క్షుద్ర పూజల కలకలం!
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షుద్ర పూజల పేరుతో పిల్లలకు చంపేందుకు కన్న తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. వివరాల ప్రకారం.. పెద్దిరెడ్డిపల్లి చెందిన వేణుకు పెళ్లి అయిన 12 ఏళ తర్వాత పూర్విక, పునర్విక(4) కవల పిల్లలు జన్మించారు. కాగా, తండ్రి వేణు.. తన ఇంట్లో ఇద్దరు పిల్లలను కూర్చోపెట్టి క్షుద్రపూజలు చేశాడు. అనంతరం, చిన్న పాప నోట్లో కుంకుమ పోసి తండ్రి వేణు.. పాప గొంతునులిమాడు. ఈ క్రమంలో పిల్లలిద్దరూ పెద్దగా కేకలు పెట్టడంతో స్థానికులు పాపను రక్షించారు. కాగా, పాప పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో పారిపోయిన వేణును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. అయితే, వేణు.. శాంతి పూజల కోసమా లేక క్షుద్ర పూజల కోసం ఇలా చేశాడా.. అనేది తెలియాల్సి ఉంది. కన్న బిడ్డలనే ఇలా వేణు చంపాలని చూడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: వింత ఆచారం.. సమాధులే దేవాలయాలు! -
జగిత్యాలలో క్షుద్రపూజల కలకలం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో ఆదివారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు ఇళ్ల ముందు విచిత్రమైన ముగ్గులు, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేశారు. కాలనీవాసులు సోమవారం ఉదయం లేచి చూసేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కన్పించడంతో ఆందోళన చెందుతున్నారు. -
చెరువు దగ్గరకు పిలిచి ముగ్గు వేసి.. పూజలు చేసి.. చీకటి పడగానే..
మైసూరు: ఈ హైటెక్ యుగంలో కూడా క్షుద్రపూజలని నమ్మి ఒక బాలున్ని హత్య చేశారు. నిందితులు కూడా మైనర్ బాలలే కావడం గమనార్హం. జిల్లాలోని నంజనగూడు పట్టణంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. హతుడు హెమ్మరగాల గ్రామానికి చెందిన సిద్దరాజు కుమారుడు మహేష్ (16). వివరాలు.. ధనుర్ అమావాస్య కావడంతో పని ఉందని చెప్పి మహేష్‌తో పాటు ముగ్గురు స్నేహితులు పట్టణంలోని ఒక చెరువు వద్దకు వచ్చారు. నిందితుల్లో ఒకడు తన తాత వద్ద చేతబడిలో శిక్షణ పొందాడు. అక్కడ ఒక బొమ్మను తయారుచేసి దానికి మహేష్ అని పేరు పెట్టారు. ముగ్గు వేసి పూజలు చేసి మహేష్‌ను చెరువులో ముంచి చంపి వెళ్లిపోయారు. మహేష్ చెరువులో ఈతకొడుతూ మునిగిపోయారని ఊళ్లో ప్రచారం చేశారు. దీంతో గ్రామస్తులు, పోలీసులు చేరుకుని పరిశీలించగా చేతబడి సామగ్రి కనిపించింది. నంజనగూడు పోలీసులు ఆరా తీసి ముగ్గురు మైనర్ బాలురని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. -
మంత్రాలతో నీ కొడుకు ఆరోగ్యం నయం చేస్తానంటూ..
సాక్షి,నేరేడ్మెట్( హైదరాబాద్): మంత్రాల పేరుతో ఓ మహిళను మోసం చేసిన కేసులో నిందితుడిని నేరేడ్మెట్ పోలీసులు గురువారంఅరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇన్స్పెక్టర్ నర్సింహ్మస్వామి సమాచారం మేరకు... లోయర్ ట్యాంక్‌బండ్‌కు చెందిన శ్యామల కొడుకు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయంలో నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆర్.కె.పురానికి చెందిన రాకేష్‌ను ఆమె సంప్రదించింది. దీంతో మంత్రాలు, పూజల పేరుతో కొడుకు ఆరోగ్యం నయం చేయడంతోపాటు ఇంట్లోని ఇతర సమస్యలనూ బాగు చేస్తానని నిందితుడు ఆమెను నమ్మించాడు. ఇందుకు బాధితురాలు రూ. 2.60 లక్షలతోపాటు 5 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. తరువాత పూజలు ఎప్పుడు చేస్తావని బాధితురాలు నిందితుడిని అడుగగా రేపుమాపు అంటూ కాలాయాపన చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో అనుమానం వచ్చి తన డబ్బు, బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వాలని ఇంటికి వెళ్లి నిందితుడిని గట్టిగా అడిగింది. ఈ నెల 10న నిందితుడు బా ధితురాలని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో మంత్రాలు, పూజల పేరుతో నిందితుడు తనను మోసం చేశాడని బాధితురాలు గుర్తించింది. పలువురు మహిళలు కూడా బెదిరించారని బాధితురాలు నేరేడ్మెట్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశామని ఇన్స్పెక్టర్ వివరించారు. చదవండి: chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య -
మీ ఇంట్లో అతీంద్రియ శక్తులు, పూజలు చేస్తే ఐశ్వర్యం దక్కుతుందని.. చివరికి
మీర్‌పేట( హైదరాబాద్): మీ ఇంట్లో అతీంద్రియ శక్తులు ఉన్నాయని, క్షుద్రపూజలు చేస్తే శక్తులు మీ వశమై ఐశ్వర్యం, సంపద మీకు దక్కుతుందని నమ్మించి మోసానికి పాల్పడిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ గాంధీ నగర్‌కు చెందిన పిల్లి జితేందర్ (34) ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాకు చెందిన అబ్ధుల్ గని (48) వృత్తిరీత్యా కార్పెంటర్. కుషాయిగూడ చీరాగల్లికి చెందిన మహ్మద్ దస్తగిరి (35) వస్త్ర వ్యాపారి. వీరు ముగ్గురు పథకం ప్రకారం 8నెలల క్రితం మీర్‌పేట సర్వోదయనగర్‌కు చెందిన కృష్ణవేణి ఇంటికి వచ్చి వారి ఇంట్లో అతీంద్రియ శక్తులు ఉన్నాయన్నారు. క్షుద్ర పూజలు చేయడం ద్వారా ఆ శక్తులు వారి సొంతమవుతాయని చెప్పారు. అవి సొంతమైతే కుబేరులవుతారని వారిని నమ్మించారు. క్షుద్ర పూజలు చేసేటప్పుడు బంగారు ఆభరణాలు, నగదు ఉంచాలని తెలిపారు. వారు ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.11లక్షల నగదును మూటలో కట్టి ఉంచారు. క్షుద్రపూజలు చేసిన అనంతరం పూజ ముగిసిందని అక్కడి నుంచి జారుకున్నారు. వారు వెళ్లాక మూటను విప్పి చూడగా అందులోని బంగారం, నగదు కనిపించకపోవడంతో షాక్‌కు గురై మోసపోయినట్లు గ్రహించారు. ఆలస్యంగా వెలుగులోకి... ఈ సంఘటన జరిగిన 8 నెలల తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. క్షుద్ర పూజల పేరిట మోసపోయినట్లు తెలుసుకున్న బాధిత కుటుంబం జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక, బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో ఎలాగోలా ధైర్యం చేసి జరిగిన మోసంపై ఆగస్టు 9వ తేదీన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు కృష్ణవేణి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్షుద్రపూల పేరిట మోసానికి పాల్పడిన ముగ్గురు నిందితులు పిల్లి జితేందర్, అబ్ధుల్ గని, మహ్మద్ జితేందర్‌లను గురువారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2.66 లక్షల నగదు, మూడు బంగారు నాణేలు, ఒక బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
పొద్దున ఇంటి ఎదుట ఊడ్చేందుకు వచ్చి చూస్తే.. షాక్
నల్లగొండ క్రైం: నల్లగొండ మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో క్షుద్రపూజల కలకలం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన బొల్లోజు వెంకటాచారి ఇంటి గేట్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి చేతి ఎముక, తాయత్తులు, నిమ్మకాయలు, పసుపుకుంకుమ కలిపిన బియ్యం, జాకెట్‌ముక్క, జీడి, వక్క, గాజులు, గవ్వలు, వెంట్రుకలు, పాయింట్ ముక్క, తదితరాలు కలిపి ఉంచారు. బుధవారం తెల్లవారుజామున వెంకటాచారి భార్య రత్నమ్మ ఇంటి ఎదుట ఊడ్చేందుకు వచ్చి చూడగా ఈ వస్తువులన్నీ కనిపించడంతో భయాందోళనకు గురై కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంకటాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లగొండ రూరల్ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి కీలక ఆధారాలను, ఇంటిఎదుట వదిలివెళ్లిన వస్తువులపై ఉన్న వేలిముద్రలను పోలీసులు సేకరించారు. కీలక ఆధారాలు లభించడంతో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందం గాలిస్తోంది. వివాహబంధం తెంచే కుట్ర.. జూన్ 16న వెంకటాచారి చిన్న కుమారుడు ప్రవీణ్‌చారితో నల్లగొండకు చెందిన యాదగిరి – సావిత్రిల కుమార్తె అఖిలతో వివాహం జరిగింది. కుటుంబ బంధాన్ని తెంచేందుకు గిట్టనివారు ఎముకలు, జీడిగింజలు, పసుపు బియ్యం తదితర వస్తువులను కలిపి ఇంటి గేట్ ఎదుట వదిలి వెళ్లి ఉంటారని, అఖిల తల్లిదండ్రులకు గిట్టనివారే ఈపని చేసి ఉంటారని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. సీసీకెమెరాల్లో కీలక ఆధారాలు.. బైక్‌పై వచ్చిన దుండగులు వెంకటాచారి ఇంటి ఎదుట భయంగొలిపే వస్తువులను వదిలివెళ్లినట్లు గ్రామంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైంది. వీటి ఆధారంగా ఆ ఇంటి నుంచి వచ్చిపోయిన ఫోన్ కాల్స్‌ను, అఖిల తల్లిదండ్రులైన యాదగిరి– సావిత్రిలకు గిట్టనివారిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
చేతబడి కలకలం: ఉదయం లేచి చూస్తే మనిషి అదృశ్యం!
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లాలోని చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో చేతబడి ఘటన కలకలం రేపింది. గత రాత్రి ఇంటి ముందు మంచంలో పడుకున్న చీమల సతీష్ అనే వ్యక్తి ఉదయం లేచి చూసేసరికి కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వేతకగా పడుకున్న వ్యక్తి మంచం ప్రక్కన చేతబడికి సంబంధించిన మనిషి బొమ్మ, ముగ్గు గీసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు, బొగ్గు కనిపించాయి. వాటిని చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సతీష్ పడుకున్న మంచంలో అతని సెల్ ఫోన్ అలానే ఉంది. బైక్‌తోపాటు సతీష్ కనిపించకపోవడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. చేతబడి చేసి సతీష్ ఏం చేసి ఉంటారోనని అతని భార్య, తల్లి, బంధువులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇదే తరహాలో ఒక వ్యక్తి అదృశ్యమైనా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదని గ్రామస్తులు చెబుతున్నారు. చదవండి: Photo Stories: అరుదైన ‘ఎర్రమీనం’ -
క్షుద్రపూజలు చేసిన కుటుంబానికి దేహశుద్ధి
ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ పట్టణంలోని రాజారాంనగర్ కాలనీలో గల శ్మశాన వాటికలో క్షుద్రపూజలు చేస్తున్న వారిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. పట్టణంలోని ప్రియాంక క్లీనిక్‌కు చెందిన ఆయుర్వేద వైద్యుడు సమీర్ రాయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో శ్మశాన వాటికలో క్షుద్రపూజలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన స్థానికులు కొందరు అటువైపు వెళ్లి చూశారు. విషయం తెలిసి ఆగ్రహంతో చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కలకత్తాకు చెందిన సమీర్‌రాయ్ కుటుంబం పదిహేనేళ్ల క్రితం ఇక్కడకు వలస వచ్చింది. తమ ఇంట్లో తరచూ కలహాలు చోటు చేసుకుంటుండడంతో పురోహితుని సలహా మేరకు పూజలు చేసి నట్లు సమీర్ రాయ్ నమ్మించే ప్రయత్నం చేశారని స్థానికులు తెలిపారు. -
క్షుద్ర పూజలు చేస్తున్నారని తల్లీకూతుళ్లను..
రాంచీ : క్షుద్రపూజలు చేస్తున్నారనే నెపంతో తల్లీకూతుళ్లను విచక్షణా రహితంగా చితకబాది, ఆపై కత్తితో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని సింగ్భూమ్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. సింగ్భూమ్ జిల్లాలోని రోవాఓలి గ్రామానికి చెందిన సుభాష్ ఖాన్‌దైత్ తన ఇంట్లో ఓ పూజ నిర్వహించాడు. ఈ పూజకు పక్కింటి రామ్‌బిలాస్ అనే వ్యక్తి భార్య హాజరయ్యింది. అయితే పూజ అనంతరం ఇంటికి చేరుకున్న ఆమె అనారోగ్యం పాలైంది. దీంతో తన భార్య సుభాష్ నిర్వహించిన క్షుద్రపూజల కారణంగానే అనారోగ్యం పాలైందని భావించిన రామ్‌బిలాస్.. కుటుంబసభ్యులతో కలిసి సుభాష్ ఇంటిపై దాడికి దిగాడు. ఈ నేపథ్యంలో సుభాష్ తన ఇద్దరు కుమారులతో ఇంట్లో నుంచి తప్పించుకోగా అక్కడే చిక్కుకుపోయిన అతడి భార్య, కూతురిపై రామ్ బిలాస్, అతడి కుటుంబసభ్యులు దాడి చేశారు. తల్లీకూతుళ్లను విచక్షణా రహితంగా చితకబాది, కత్తితో నరికి చంపేశారు. దాడి నుంచి తప్పించుకున్న సుభాష్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య
ఎస్‌ఎస్‌తాడ్వాయి(ములుగు) : మంత్రాల నెపంతో ఓ గిరిజన వృద్ధుడిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం ఆశన్నగూడ ఎల్లాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మెస్సు సాంబయ్య(60) బుధవారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్తానని చెప్పి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. స్థానిక జామాయిల్ ప్లాంటేషన్ రోడ్డుపై దుండగులు దారి కాచి హత్య చేశారు. గురువారం ఉదయం విషయం తెలిసిన కుటుంబ సభ్యులు బోరున రోదించారు. పస్రా సీఐ అనుముల శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై రవీందర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. వివరాలను సేకరించి, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పోలీసులు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. మంత్రాల నెపంతోనే హత్య చేశారని మృతుడి కుమారుడు రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృ తం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా గ్రామంలో అనారోగ్యంతో కొందరు మృతిచెందగా సాంబయ్య మంత్రాలు చేశాడని హత్యకు చేశారని భార్య పోషక్క ఆరోపించింది. -
చేతబడులు చేస్తున్నాడనే అనుమానంతో..
కోల్‌కతా : చేతబడులు చేస్తున్నాడన్న అనుమానంతో వ్యక్తి చేతి వేళ్లను నరికి వేయాల్సిందిగా ఆదేశించాడో గ్రామపెద్ద. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని భిర్భూమ్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భిర్భూమ్ జిల్లాలోని పన్రుయ్ గ్రామానికి చెందిన ఫాండీ సర్థార్ దినసరి కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా గ్రామంలో కొంతమంది రోగాల బారిన పడుతున్నారు. సర్థార్ చేతబడుల కారణంగానే గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని గ్రామస్తులు భావించారు. సర్థార్ను గ్రామ పంచాయితీకి తీసుకురాగా గ్రామ పెద్ద అతనికి మరణశిక్ష విధించాడు. ఆ తర్వాత కొన్నికారణాల వల్ల మరణశిక్షను రద్దుచేసి చేతి వేళ్లు నరికి వేయాల్సిందిగా ఆదేశించాడు. దీంతో గ్రామ పెద్ద ఆదేశాల మేరకు అతని పది చేతి వేళ్లను కర్కశంగా నరికివేశారు. ఆ తర్వాత సర్థార్ కుటుంబసభ్యులు అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఎలాంటి కేసు నమోదు కాకపోయినా విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
గుప్తనిధుల కోసం తమ్ముడి కొడుకునే...
ఖానాపూర్ : ఆధునిక యుగంలోనూ జనం మూఢనమ్మకాలను వీడడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంతమంది మూఢనమ్మకాలను విశ్వసిస్తూ అనాగరికంగా వ్యవహరిస్తున్నారు. గుప్త నిధుల కోసం మనుషులను బలిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖానాపూర్ మండలం బీర్నంది గ్రామపంచాయతీ పరిధిలోని రంగపేట గ్రామంలో సొంత తమ్ముడి కుమారుడినే బలిచ్చే ప్రయత్నం జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆలస్యంగా వెలుగులోకి.. రంగపేట గ్రామానికి చెందిన గోనె లచ్చన్న–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వీరికి ఎదురుకాళ్లతో జన్మించిన చిన్న కుమారుడు మహేశ్(13) ఉన్నాడు. లచ్చన సోదరుడు (అన్న) లింగన్న గత పదిహేను రోజుల క్రితం తమ్ముడిని కలిశాడు. ఎదురుకాళ్లతో ఉన్న నీ కుమారుడు మహేశ్‌ను తమకు ఇస్తే తమకు వచ్చే దాంట్లో నీకు సగం బంగారం ఇస్తానని చెప్పాడు. వచ్చే దాంతో పెద్ద ఇల్లు కట్టుకోవచ్చని ఆశచూపాడు. దీంతో ఆందోళనకు గురైన మహేశ్ తల్లి లక్ష్మి తానేందుకు కుమారున్ని ఇస్తానని వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన జరిగి పదిహేను రోజులైంది. ఈ క్రమంలో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తన కుమారుడికి ప్రాణభయం ఉందని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై గోగికారి ప్రసాద్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నామని తెలిపారు. -
చంద్రగ్రహణం..క్షుద్రపూజలు కలకలం
-
చంద్రగ్రహణం.. నరబలికి యత్నం..
సాక్షి, నూజివీడు (కృష్ణా జిల్లా) : నూజివీడు మండలం యలమందలో శుక్రవారం క్షుద్రపూజలు కలకలం రేపాయి. 100 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన అతి సుదీర్ఘమైన చంద్రగ్రహణం నాడు నరబలి ఇస్తే అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయనే మూఢ నమ్మకం ఉంది. దీంతో యనమదలకు చెందిన ఏడుగురు వ్యక్తులు క్షుద్రపూజలు చేయాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఓ ప్రాంతంలో ఇందుకు తగిన ఏర్పాటు పూర్తి చేశారు. నరబలి అనంతరం మృతదేహాన్ని పూడ్చేందుకు గొయ్యిని సైతం తవ్వించాడు. చిన్నం ప్రవీణ్ అనే వ్యక్తిని బలి ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకోగా, విషయం తెలుసుకున్న అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురి అరెస్టు చేశారు. క్షుద్రపూజలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. -
మంత్రగత్తె ఆశీర్వాదం తీసుకున్నారా?
న్యూఢిల్లీ: ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను శ్రీలంక 2-0తో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. దాంతో యూఏఈలో పాక్ పై సిరీస్ గెలిచిన తొలి జట్టుగా లంక చరిత్ర కెక్కింది. అయితే ఈ సిరీస్ గెలవడానికి మంత్రగత్తె ఆశీర్వాదమే కారణమంటూ మొత్తం పర్యటన ముగిసిన తరువాత లంక కెప్టెన్ చండిమాల్ వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యాడు. అదే నిజమైతే.. ఆపై జరిగిన వన్డే, టీ 20 సిరీస్ ను ఎందుకు గెలవలేదంటూ పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ సైతం ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే భారత పర్యటనకు లంక జట్టు వచ్చిన తరుణంలో చండిమాల్ కు ఊహించని ప్రశ్న ఎదురైంది. 'టీమిండియాపై సిరీస్ గెలవడానికి మంత్రగత్తె అశీస్సులు తీసుకున్నారా?' అంటూ ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు చండిమాల్ బిక్కమొహం వేశాడు. ఆ ప్రశ్నకు ఏమి చెప్పాలా అని చండిమాల్ సతమతం అవుతుండగా పక్కనే ఉన్న జట్టు మేనేజర్ అసంక గురుసిన్షా దానికి ముగింపు ఇచ్చాడు. 'అందరిలానే మాకు కొ్న్ని నమ్మకాలున్నాయి. కానీ అంతిమంగా మైదానంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన జట్టుదే విజయం'అని సర్దిచెప్పుకున్నాడు. -
ఐదుగురు మహిళలను చెట్టుకు కట్టేసి..
-
ఐదుగురు మహిళలను చెట్టుకు కట్టేసి..
సాక్షి, ఒడిశా: మంత్రాలతో రోగాలను నయం చేస్తామని చెబుతూ, అమాయకులను మోసం చేస్తున్నారన్న ఆరోపణలతో ఐదుగురు మహిళలను చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ భయనక సంఘటన ఒడిశాలోని బాదాసాహి జిల్లాలోని మధుపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని స్థానికులు ఐదుగురి మహిళలపై చేతబడి చేస్తున్నారని ఆరోపణలు మోపారు. గ్రామస్థులు అందరు కలిసి వారిని ఓ చెట్టుకు కట్టేశారు. అనంతరం వారిని చితకబాదారు. ఆపడానికి ప్రయత్నించిన వారి భర్తలను కూడా చితకబాదారు. దీనిని చూడడానికి చాలా మంది గుంపులు గుంపులుగా తరలి వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీలు, ఫొటోలు చూసే వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు చెబుతున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చేతబడి చేస్తున్నారని మహిళలను చెట్టుకు కట్టేసి చితకబాదారు -
క్షుద్రపూజలతో టెస్ట్ సిరీస్ గెలిచాం!
కొలంబో : ఆధునిక టెక్నాలజీతో మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా మారుతున్నవేళ క్రికెట్ రంగంలో ఊహించని పిడుగు! ప్రత్యర్థిని ఓడించాలంటే సమర్థత, మెరుగైన ప్రాక్టీస్, నిలకడతనం కంటే మంత్రాలు, చేతబడులను నమ్ముకుంటున్నవైనం!! ఇటీవల పాకిస్తాన్‌పై శ్రీలంక టెస్టు సిరీస్ నెగ్గడానికి కారణం క్షుద్రపూజలేనని లంక కెప్టెన్ దినేశ్ చండీమల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఏమైంది? : శ్రీలంక- పాకిస్తాన్ జాతీయ జట్ల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వేదికగా(సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 29 వరకు) రెండు టెస్ట్‌లు, ఐదు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌లు జరిగాయి. టెస్ట్ సిరీస్‌ను లంక 2-0 తేడాతో కైవసం చేసుకుంది. పర్యటన ముగించుకుని లంక టీం మంగళవారం స్వదేశానికి చేరుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ చండీమల్ విలేకరులతో మాట్లాడుతూ సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. మంత్రగత్తె ఆశీర్వాదంతో.. : ‘‘క్రికెట్లో ఆటగాడికి టాలెంట్ ఒక్కటే సరిపోదు. కాస్త అదృష్టం కూడా కలిసిరావాలని నేను నమ్ముతాను. ఆ అదృష్టం మనకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా దొరుకుతుందో చెప్పలేం. అందుకే మతగురువులు, మంత్రగాళ్లు అనే తేడా లేకుండా అందరి దగ్గరా నేను ఆశీర్వాదాలు తీసుకుంటాను. పాకిస్తాన్‌తో సిరీస్ ఆడేందుకు వెళ్లేముందు ఓ మంత్రగత్తెను కలిశా. శ్రీలంక చేతిలో పాకిస్తాన్ ఓడిపోయేలా చేతబడి చేస్తానని ఆమె మాటిచ్చారు. ఆ తల్లి ఆశీర్వాదబలం, పూజల వల్లే మేం సిరీస్ గెలిచాం’’ అని లంక సారధి చండీమల్ చెప్పారు. రెండు మ్యాచ్‌ల్లోనూ అతను శతకం, అర్థశతకం సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మంత్రాలతో మ్యాచ్‌లు గెలవొచ్చా? : చండీమల్ వ్యాఖ్యలపై యావత్ క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. క్రికెట్లో క్షుద్రపూజలేంటని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఒకవేళ మంత్రాలతో మ్యాచ్‌లు గెలవగలిగితే.. టెస్ట్ సిరీస్ నెగ్గిన శ్రీలంక జట్టు, ఆ తర్వాత జరిగిన వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో దారుణంగా ఎందుకు ఓడిపోయింది?’ అని ప్రశ్నిస్తున్నారు. పాక్‌తో టెస్ట్ సిరీస్ నెగ్గిన లంక.. 0-5తో వన్డే సిరీస్‌ను, 0-3 తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. -
చేతబడి నెపంతో ముగ్గురి దారుణహత్య!
ఒడిశా: సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలపై విశ్వాసం చెరిగిపోవడం లేదు. మూఢ నమ్మకాలతో సాటిమనుషుల ప్రాణాలను సైతం బలిగొంటున్నారు. ఇలాంటి ఘటనలు మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట ప్రతినిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లా గుణుపురంలో చేతబడి చేస్తున్నారని నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని విచక్షణ లేకుండా దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. గతకొంత కాలంగా గ్రామంలో ముగ్గురు వ్యక్తులు చేతబడి చేస్తున్నారంటూ పుకార్లు లేచాయి. అది నిజమని నమ్మిన గుణుపురం గ్రామస్తులు.. ఆ ముగ్గురు కుటుంబ సభ్యులకు పురుగుల మందు తాగించి హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మంత్రాలనెపంతో దంపతులపై గొడ్డళ్లతో దాడి
నెక్కొండ(వరంగల్ జిల్లా): నెక్కొండ మండలం బిక్యాతండాలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాల నెపంతో గ్రామానికి చెందిన గుగులోత్ రాజమ్మ(60), శత్రు(65) అనే దంపతులపై ఐదుగురు వ్యక్తులు గొడ్డళ్లతో దాడికి దిగారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చేతబడి నెపంతో వ్యక్తి హత్య
బుట్టాయగూడెం(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చేతబడి నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం వెలుతురివారిగూడెం గ్రామానికి చెందిన ఓ గిరిజనుడిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చేతబడి చేస్తున్నాడనే నెపంతో బుధవారం రాత్రి అతి కిరాతకంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రాల నెపంతో పెద్దమ్మను చంపేశారు!
మంత్రాలు చేస్తోందనే అనుమానంతో ఓ వృద్ధురాలిని గొంతుకోసి చంపారు. ఈ దారుణం కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్‌పేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్లపు నర్సమ్మ(65) కుమారులు, కూతుళ్లకు పెళ్లిళ్లయి పోవటంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆమె మరిది కుటుంబ సభ్యులు తరచూ వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు కారణం పెద్దమ్మ నర్సమ్మ మంత్రాలే కారణమని వారు అనుమానం పెంచుకున్నారు. ఒంటరిగా ఉండే నర్సమ్మను ఆదివారం రాత్రి గొంతుకోసి చంపారు. సోమవారం ఉదయం ఈ ఘోరం వెలుగుచూసింది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని, వివరాలు సేకరిస్తున్నారు. -
అనంతలో క్షుద్రపూజల కలకలం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలం శాబాలలో ఆదివారం క్షుద్రపూజల వ్యవహారం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు శాబాల ప్రాంత మైదానంలో క్షుద్రపూజలు నిర్వహించినట్టు తెలిసింది. దాంతో గ్రామస్తులంతా భయాందోళనలో ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నగ్నంగా క్షుద్రపూజలు: ముగ్గురు మహిళల అరెస్ట్
వరంగల్: క్షుద్రపూజలు నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లోని గిరిప్రసాద్‌నగర్ కాలనీలో ఆదివారం జరిగింది. కాలనీకి చెందిన ముగ్గురు మహిళలు.. ఈ మధ్య కాలంలో.. అందంగా, బలంగా, పొడవైన వెంట్రుకలతో ఉన్న మహిళలకు గాలం వేసి వారిని క్షుద్రపూజలకు వినియోగిస్తున్నారు. శనివారం రాత్రి కాలనికి చెందిన ఒక మహిళను క్షుద్రపూజలకోసం తీసుకెళ్లారు. నగ్నంగా తయారుచేసి వింత వింత చేష్టలు చేయడంతో.. ఆ మహిళ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
చేతబడి నెపంతో వ్యక్తి దారుణ హత్య!
నల్లగొండ(మఠంపల్లి): మఠంపల్లి మండలంలోని వర్దాపురం గ్రామపంచాయితీ పరిధిలోని రాజీవ్‌నగర్ కాలనీలో మల్లారపు దానయ్య (50) శనివారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. మఠంపల్లి ఎస్‌హెచ్‌వో సుల్తాన్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు దానయ్య భార్య రూతమ్మ, కుమారుడు వీరబాబు వర్దాపురంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. కాగా రాత్రి ఇంటిలో దానయ్య ఒక్కడే నిద్ర పోయాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున మంచంపై విగతజీవుడై ఉన్న దానయ్య తలపై గొడ్డలితో నరికి చంపిన గాయాలు ఉన్నాయి. దీంతో కుమారుడు వీరబాబు తన తండ్రి దానయ్యను గత కొంత కాలంగా చేతబడి చేస్తున్నావు నిన్ను ఎలాగైనా చంపుతామంటూ గ్రామానికి చెందిన పల్లె ప్రసాద్, శ్రీను అనే వ్యక్తులు పలుమార్లు మా ఇంటిపైకి వచ్చి బెదిరింపు లకు పాల్పడ్డారని తన తండ్రిని వారే హత్య గావించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పంచనామా నిమిత్తం హుజూర్నగర్ వైద్యశాలకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. కాగా మృతునికి భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చేతబడి నెపంతోనే హత్య ... కాగా మిర్యాలగూడ డీఎస్పీ గోనె సందీప్ ఆదివారం రాజీవ్‌నగర్ కాలనీలో హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం మఠంపల్లి పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. దానయ్యను చేతబడి నెపంతో గ్రామానికి చెందిన వారే హత్య గావించారని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. రెండురోజులలో నిందితులను అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట ఇన్ఛార్జ్ సీఐ కోట్ల నర్సింహారెడ్డి, హుజూర్నగర్ ఎస్ఐ అఖిల్‌జామా తదితరులున్నారు. -
క్షుద్రవిద్యల నెపంతో ఆరుగురి హత్య
క్షుద్రవిద్యలు, మంత్రాల నెపంతో జరుగుతున్న వరుస హత్యలు ఒడిశాలోని గిరిజన గ్రామాలను వణికిస్తున్నాయి. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబంలోని ఆరుగురిన్ని కొట్టిచంపిన ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. ఒడిశాలోని గిరిజన గ్రామం లాహందాలో ఈ విషాదం చోటుచేసుకుంది. చేతబడులు, మంత్రాలు వేస్తున్నారనే అపోహతో కుటుంబంపై గ్రామస్తులు దాడిచేశారు. పదునైన ఆయుధాలు, కత్తులతో విరుచుపడ్డారు. దీంతో కుటుంబంలోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒక మహిళ, నలుగురు పిల్లలు కూడా ఉన్నారన్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని పోలీసు అధికారి అజయ్ ప్రతాప్ ఎలిపారు. దీంతో డీజీపి సంజీవ్ మారిక్ ఆధ్వర్యంలోని బృందం ఘటనా స్థలాన్ని సందర్శించింది. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించి, నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు కోసం డీజీపీ ఆదేశించారు. దీంతో గ్రామంలోని పురుషులందరూ పరారీలో ఉన్నారు. కాగా రాయగఢ్ జిల్లాలో ఇలాంటిదే మరో దారుణం జరిగింది. క్షుద్రవిద్యలు, మంత్రాలు తెలుసనే ఆరోపణలతో గ్రామంలోని జగన్బంధు అనే వ్యక్తిని గ్రామస్తులు కొట్టి చంపేశారు. ఆ తర్వాత సజీవ దహనం చేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. -
మంత్రాల నెపంతో వృద్ధ దంపతుల దారుణహత్య
పట్నా: మంత్రాల నెపంతో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. బీహార్‌లోని పతారా గ్రామానికి చెందిన జానకీ మాంఝీ, లక్ష్మీదేవి దంపతులు చేతబడి చేస్తున్నారనే ఆరోపణలతో గొంతుకోసి చంపేశారు. క్షద్రవిద్యలు ప్రయోగిస్తూ గ్రామస్తులను ఇబ్బందుల కు గురి చేస్తున్నారనే అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసు అధికారి ధనుంజయ్ కుమార్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్తులు సోహారా మాంజీ, మరో ఇద్దరిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కాగా రెండేళ్ల క్రితం ఇలాంటి సంఘటనపై స్పందించిన బీహార్ మానవహక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి కేసుల్లో 1999 చట్ట ప్రకారం కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. -
చేతబడి చేస్తోందని.. నగ్నంగా ఊరేగింపు!
బీహార్‌లో ఓ మహిళను చేతబడి చేస్తోందన్న ఆరోపణలతో అశుద్ధం తినిపించి.. నగ్నంగా తిప్పించారు. ఆ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. కనియా దేవి అనే ఈ మధ్యవయసు మహిళను సక్రైలి గ్రామంలో తిట్టి, కొట్టి, ఆమెను తీవ్రంగా అవమానించారు. గ్రామంలో ఓ బాలుడు మరణించడంతో ఈమే చేతబడి చేసిందన్న అనుమానంతో ఈ పనికి పాల్పడ్డారు. కొంతమంది వ్యక్తులు కలిసి కనియాదేవితో అశుద్ధం తినిపించి, నగ్నంగా ఊరేగించారని జిల్లా పోలీసు అధికారి రాకేష్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ఆరుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు కాగా ఒకరిని అరెస్టు చేశారు. బీహార్‌లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై చేతబడి ముద్ర వేసి వారిని చిత్రహింసలు పెట్టడం ఎప్పటినుంచో ఉంది. దీనిపై కఠిన చట్టాలు చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఎప్పుడో ప్రతిపాదించింది. బీహార్ మానవహక్కుల కమిషన్ కూడా దీనిపై స్పందించింది.