
ప్రిన్సిపల్ శకుంతల, సీటు కింద బొమ్మ
చిక్కబళ్లాపురం(బెంగళూరు): సాధారణంగా ఎవరైనా కొత్తగా పదవి చేపడితే వారికి అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు మర్యాదపూర్వకంగా ఆహ్వానం తెలుపుతారు. ఈ తతంగం ఎక్కడైన జరిగేది. కానీ కళాశాలకు ప్రిన్సిపల్‌గా వచ్చిన ఓ మహిళకు తన మొదటి రోజే చేదు అనుభవం ఎదురైంది. ఈ వింత ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని ఎంజీ రోడ్డులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన ప్రిన్సిపల్‌గా వచ్చిన శకుంతల తన గదిలో ఓ విచిత్రమైన బొమ్మను చూసి షాకయ్యారు.
గురు వారం ఉదయం ఆమె ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆమె గదిని శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది ఆమె సీటు కింద శుభ్రం చేస్తుండగా ఒక బొమ్మకు పసుపు, కుంకుమ పూసి ఉంచారు. దీంతో చేతబడి చేసి నట్లు అనుమానిస్తున్నారు. కళాశాలలో ఇటువంటి చర్యలు జరగడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కొత్త ప్రిన్సిపాల్ అంటే గిట్టని వారు ఎవరైనా ఇలా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: కాలేజ్ స్టూడెంట్స్ కిస్సింగ్ కాంపిటీషన్ వీడియో.. పోలీసుల అదుపులో ఒకరు
Comments
Please login to add a commentAdd a comment