
సాక్షి, తుమకూరు(కర్ణాటక): జిల్లాలోని మధుగిరి తాలూకాలోని మిడిగేశి దగ్గరున్న నాడ కచేరి ప్రభుత్వం కార్యాలయంలో ప్రజలు ఆధార్ కార్డు పని మీద వస్తే నిర్ణీత రుసుంతో పాటు లంచం ఇస్తేనే పనవుతోంది. ఆధార్ ముద్రణకు రుసుము రూ.15 మాత్రమే.
కానీ అక్కడి సిబ్బంది రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారని, లంచం ఇవ్వకుంటే ఏదో సాకు చెప్పి పని వాయిదా వేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ముడుపులు తీసుకుంటున్న వీడియోలను విడుదల చేశారు.