
ప్రతీకాత్మక చిత్రం
మైసూరు: ఈ హైటెక్ యుగంలో కూడా క్షుద్రపూజలని నమ్మి ఒక బాలున్ని హత్య చేశారు. నిందితులు కూడా మైనర్ బాలలే కావడం గమనార్హం. జిల్లాలోని నంజనగూడు పట్టణంలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. హతుడు హెమ్మరగాల గ్రామానికి చెందిన సిద్దరాజు కుమారుడు మహేష్ (16). వివరాలు.. ధనుర్ అమావాస్య కావడంతో పని ఉందని చెప్పి మహేష్‌తో పాటు ముగ్గురు స్నేహితులు పట్టణంలోని ఒక చెరువు వద్దకు వచ్చారు.
నిందితుల్లో ఒకడు తన తాత వద్ద చేతబడిలో శిక్షణ పొందాడు. అక్కడ ఒక బొమ్మను తయారుచేసి దానికి మహేష్ అని పేరు పెట్టారు. ముగ్గు వేసి పూజలు చేసి మహేష్‌ను చెరువులో ముంచి చంపి వెళ్లిపోయారు. మహేష్ చెరువులో ఈతకొడుతూ మునిగిపోయారని ఊళ్లో ప్రచారం చేశారు. దీంతో గ్రామస్తులు, పోలీసులు చేరుకుని పరిశీలించగా చేతబడి సామగ్రి కనిపించింది. నంజనగూడు పోలీసులు ఆరా తీసి ముగ్గురు మైనర్ బాలురని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment