బుట్టాయగూడెం(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చేతబడి నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం వెలుతురివారిగూడెం గ్రామానికి చెందిన ఓ గిరిజనుడిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చేతబడి చేస్తున్నాడనే నెపంతో బుధవారం రాత్రి అతి కిరాతకంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.