practising
-
పారిస్ ఒలింపిక్స్ 2024: సన్నాహకాలు.. ఓ లుక్కేయండి (ఫొటోలు)
-
దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా! చివరికి సుప్రీం కోర్టు..
భారతదేశ తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా సన్నీ తాజాగా సుప్రీం కోర్టులో సైన్ లాంగ్వేజ్‌లో వాదన వినిపించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఇంటర్ప్రెటర్ సహాయంతో ఆమె తన వాదనలు వినిపించి ప్రశంసలు పొందింది. ‘ఇలాంటిది చాలా మునుపే జరగాలి. ఆలస్యం చేశాం’ అని జస్టిస్ చంద్రచూడ్ సారా సన్నీని ఉద్దేశించి అన్నారు.సారా పరిచయం. సెప్టెంబర్ 22 సుప్రీం కోర్టు కేసు నంబర్ పిలువగానే నల్లగౌనులో అడ్వకేట్ సారా సన్ని తన ఇంట్రప్రేటర్ సౌరవ్ రాయ్ చౌదరితో కోర్టు హాల్లోకి ప్రవేశించింది. ధర్మాసనంలో సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఉన్నారు. దివ్యాంగుల హక్కుల కోసం జావేద్ ఆబిది ఫౌండేషన్ వారు వేసిన ఆ కేసులో ఫౌండేషన్ తరఫున సారా వాదనలు మొదలెట్టింది. వెంటనే కోర్టు హాలు సైలెంట్ అయ్యింది. ఎందుకంటే సారా సైన్ లాంగ్వేజ్ ద్వారా తన వాదనలు వినిపిస్తుంటే వాటిని అంతే వేగంగా ఇంట్రప్రేటర్ కోర్టుకు విన్నవిస్తున్నాడు. అలాగే కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్‌ను సైన్ లాంగ్వేజ్ ద్వారా సారాకు తెలియచేసి బదులుగా సారా సమాధానాన్ని కోర్టుకు చెబుతున్నాడు. సుప్రీంకోర్టులో మొదటిసారిగా ఇలా ఒక ఒక బధిర అడ్వకేట్ మౌనవాదన వినిపించింది. దీనిని చూసిన జస్టిస్ చంద్రచూడ్ ‘ఇప్పటికైనా ఇది సాధ్యమైంది.. ఎప్పుడో జరగాల్సింది’ అన్నారు. కోర్టులో ఉన్న అడ్వకేట్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సారాను, ఇంట్రప్రెటర్ను మెచ్చుకున్నారు. కేసు తదుపరి విచారణకు వాయిదా పడింది. ఒక గొప్ప అనుభూతితో సారా సన్ని కోర్టు బయటకు నడిచింది. ఇలాంటి ఘనతను సాధించిన మొదటి మహిళా బధిర అడ్వకేట్ కదా మరి. కేరళ అమ్మాయి సారా సన్ని స్వస్థలం కొట్టాయం. ఆమె తండ్రి సన్ని కురువిల్లా చార్టర్డ్ అకౌంటెంట్. తల్లి బెట్టి గృహిణి. ఈ దంపతులకు పుట్టిన అబ్బాయి ప్రతీక్ బధిరుడు. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు కవల ఆడపిల్లలు పుట్టారు. ఇద్దరూ మళ్లీ బధిరులే. వారిలో ఒకరు సారా మరొకరు మారియా. ముగ్గురు సంతానం బధిరులే అయినా తల్లిదండ్రులు ఆ లోటు వారికి తెలియనివ్వకుండా పెంచారు. కొడుకు అమెరికాలో బధిరుల స్కూల్లో ఉపాధ్యాయుడిగా, మారియా చార్టర్డ్ అకౌంటెంట్‌గా స్థిరపడ్డారు. సారా మన దేశంలో మొదటి బధిర అడ్వకేట్ అయ్యింది. వాదనలు చేస్తూ... సారా బాల్యం నుంచి అందరితో తెగ వాదించేది. ఆమెకు చెవుడు ఉండటం వల్ల మాటలు రాలేదు. కాని సైన్ లాంగ్వేజ్‌తో అందరితో తెగ వాదనలు చేసేది. ‘పెద్దయ్యి లాయర్ అవుతుందేమో’ అని సరదాగా తల్లిదండ్రులు అనుకునేవారు. అన్నట్టుగానే జరిగింది. సారా, మారియా ఇద్దరూ బెంగళూరులో చదువుకున్నారు. అక్కడే బి.కాం. చేసి ఒకరు లా వైపు మరొకరు చార్టెర్డ్ అకౌంటెన్సీ వైపు వెళ్లారు. రెండేళ్ల క్రితం సారా లా పట్టా తీసుకుంది. అయితే కర్నాటక కోర్టుల్లో కేసులు వాదించాలంటే ఇంట్రప్రెటర్లకు అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం– కోర్టు పరిభాష ఇంట్రప్రెటర్లకు తెలియదని కోర్టు భావించడమే. అయితే సారా తన వాదనలను కాగితం మీద రాసి జడ్జికి ఇచ్చేది. ఈ విధానాన్ని జడ్జి ఆశ్చర్యంగా చూసేవారు. మెచ్చుకునేవారు కూడా. సుప్రీం కల ‘ఏ రోజైనా నేను సుప్రీం కోర్టులో వాదించాలని అనుకున్నాను’ అంటుంది సారా. ఆమె కల ఎట్టకేలకు నెరవేరింది. ప్రతిభావంతంగా వాదనలు చేయగలిగింది. ‘దివ్యాంగులు దేనినీ వెలితిగా భావించకూడదు. సాధించాలి. నేను వారికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. బధిరులు అడ్వకేట్లుగా రాణించగలరు. కాకపోతే వారి కోసం ఇంట్రప్రెటర్ల వ్యవస్థను ప్రభుత్వం తయారు చేయాలి. అంతేకాదు ఇంట్రప్రెటర్ల ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తే బాగుంటుంది’ అని కోరుతోంది సారా. (చదవండి: తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..) -
ఆ ఒక్కటి జరిగితే యశస్వి జైస్వాల్ కెరీర్ నెక్స్ట్ లెవెల్ కే..!
-
WTC ఫివర్ ఫేవరెట్ గా ఇండియా ఎందుకంటే..!
-
నకిలీ మందులతో ఆర్ఎంపీ వైద్యం
సాక్షి, నర్వ(మహబూబ్‌నగర్): ఓ ఆర్ఎంపీ నకిలీ మందులతో అమాయక ప్రజలకు వైద్యం చేస్తున్న సంఘటన మండలంలోని కల్వాలలో సోమవారం రాత్రి వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి డ్రగ్స్ అధికారులు అరవింద్‌కుమార్, శ్రీకాంత్ కథనం ప్రకారం.. కల్వాలకు చెందిన కమ్మరి ప్రశాంత్‌కుమార్ కొంతకాలంగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామస్తుల అమాయకాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ మందులు అంటగడుతున్నాడు. దీనిని గమనించిన యువకులు డ్రగ్స్ అధికారులకు సమాచారం అందించడంతో సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడులు చేసి రూ.20 వేల విలువ గల నకిలీ మందులను గుర్తించారు. అలాగే అనుమతి లేకుండా నడుపుతున్న క్లినిక్‌ను సీజ్ చేశారు. లైసెన్స్ లేకుండా మందులు నిల్వ ఉంచినందున డ్రగ్స్ కాస్మొటిక్ యాక్టు సెక్షన్ 18(సి) ప్రకారం ఆర్ఎంపీ ప్రశాంత్‌కుమార్‌పై కేసు నమోదు చేశామని వారు తెలిపారు. -
చేతబడి నెపంతో వ్యక్తి హత్య
బుట్టాయగూడెం(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చేతబడి నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం వెలుతురివారిగూడెం గ్రామానికి చెందిన ఓ గిరిజనుడిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చేతబడి చేస్తున్నాడనే నెపంతో బుధవారం రాత్రి అతి కిరాతకంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గంగానమ్మకు గిరిజన మహిళ బలి
-
గంగానమ్మకు గిరిజన మహిళ బలి
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన వై రామవరం మండలం చింతకర్ర పాలెంలో ఓ గిరిజన మహిళను స్థానికులు బలిచ్చారు. ఆమె వల్లే తమ గ్రామానికి అరిష్టం చుట్టుకుందనే మూఢనమ్మకంతో ఈ ఘటనకు పాల్పడ్డట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, గత కొద్ది రోజులుగా ఓ పదిమంది వ్యక్తులు ఈ ప్రాంతంలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని వారే లేని పోని నమ్మకాలు అమాయక గిరిజనులకు కల్పించి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్లగా చింతకర్ర గ్రామంలో గంగానమ్మ దేవత ఆలయం ఉంది. దానికి ఎదురుగానే కేర చినలక్ష్మీ అనే గిరిజన మహిళ ఇళ్లు ఉంది. ఆమె ఆ గ్రామంలో కూలీ చేసుకొని బతుకుతుంటుంది. అయితే, ఇటీవలె ఆ గ్రామంలో ఓ సోది చెప్పే మహిళ గ్రామానికి అరిష్టం చుట్టుకుందని, అందువల్లే వర్షాలు రావడం లేదని, పంటలు పండలేదని చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కొంతమంది క్షుద్ర పూజలు చేసేవారితో కూడి స్థానికులు ఆమెను గంగానమ్మ దేవతకు బలివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అందుకే ఆమెను బలిచ్చే సమయంలో చిత్ర హింసలకు గురిచేసేముందు ఎన్ని అరుపులు అరిచినా కనీసం ఒక్కరు కూడా సహాయం చేసేందుకు రాలేదు అని తెలుస్తోంది. ఆమె శరీరంపై కర్పూరం పెట్టి గాయపరిచారని, అనంతరం తలపై చెంబుతో బలంగా కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందని చెబుతున్నారు.