నకిలీ మందులతో ఆర్‌ఎంపీ వైద్యం | RMP Doctor Treatment With Expired Medicines | Sakshi
Sakshi News home page

నకిలీ మందులతో ఆర్‌ఎంపీ వైద్యం

Published Tue, Jan 4 2022 10:11 AM | Last Updated on Tue, Jan 4 2022 10:11 AM

RMP Doctor Treatment With Expired Medicines - Sakshi

సాక్షి, నర్వ(మహబూబ్‌నగర్‌): ఓ ఆర్‌ఎంపీ నకిలీ మందులతో అమాయక ప్రజలకు వైద్యం చేస్తున్న సంఘటన మండలంలోని కల్వాలలో సోమవారం రాత్రి వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి డ్రగ్స్‌ అధికారులు అరవింద్‌కుమార్, శ్రీకాంత్‌ కథనం ప్రకారం.. కల్వాలకు చెందిన కమ్మరి ప్రశాంత్‌కుమార్‌ కొంతకాలంగా ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామస్తుల అమాయకాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ మందులు అంటగడుతున్నాడు.

దీనిని గమనించిన యువకులు డ్రగ్స్‌ అధికారులకు సమాచారం అందించడంతో సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడులు చేసి రూ.20 వేల విలువ గల నకిలీ మందులను గుర్తించారు. అలాగే అనుమతి లేకుండా నడుపుతున్న క్లినిక్‌ను సీజ్‌ చేశారు. లైసెన్స్‌ లేకుండా మందులు నిల్వ ఉంచినందున డ్రగ్స్‌ కాస్మొటిక్‌ యాక్టు సెక్షన్‌ 18(సి) ప్రకారం ఆర్‌ఎంపీ ప్రశాంత్‌కుమార్‌పై కేసు నమోదు చేశామని వారు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement