licences
-
పశుపోషకులకు కొండంత భరోసా
సాక్షి, అమరావతి: నాణ్యమైన దాణాను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పశుపోషకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పశు పోషణ ఖర్చును భారీగా తగ్గించి.. పాడిరంగాన్ని లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా ఏపీ పశు దాణా చట్టం –2020 తీసుకొచ్చింది. దీని పరిధిలోకి దాణా తయారీ, సరఫరా, అమ్మకం కార్యకలాపాలన్నింటినీ తెచ్చింది. అంతేకాకుండా పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లపెంపకందార్లకు నాణ్యతా ప్రమాణాలు కలిగిన.. కల్తీలేని దాణా, ఖనిజ లవణ మిశ్రమాన్ని నిర్దేశించిన ధరలకు అందించేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1,680 మంది తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్ట్‌లకు ఈ చట్టం కింద లైసెన్స్‌లు జారీ చేసింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ నాసిరకం దాణా తయారీ, విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతోంది. లైసెన్సుల జారీ, శాంపిల్స్ తనిఖీల ద్వారా ఇప్పటివరకు రూ.5.25 కోట్లు వసూలు చేసింది. పశువుల ఆహార అవసరాలకే 70 శాతం ఖర్చు రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు, 1.76 లక్షల గొర్రెలు, 55 లక్షల మేకలు, 10.78 లక్షల పౌల్ట్రీ సంపద ఉంది. మూగజీవాలకు ఏటా 65 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అవసరం కాగా ఏటా సగటున 70.92 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోందని అంచనా. పశుపోషణ కోసం చేసే ఖర్చులో 70 శాతం వాటి ఆహార అవసరాల కోసమే ఉంటోంది. గతంలో నాణ్యత విషయంలో దాణా తయారీదారులు గోప్యత పాటించడం పశుపోషకులకు ఆశనిపాతంగా ఉండేది. దాణాలో.. తేమ, ముడి మాంసకృత్తులు, ముడి కొవ్వు పదార్థాలు, ముడి పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి. ఇలా తయారైన దాణాను అధిక మోతాదులో వినియోగిస్తే తప్ప ఆశించిన స్థాయిలో ఉత్పాదన వచ్చేది కాదు. ముడి మాంసకృత్తులను పెంచడానికి కొంతమంది తయారీదారులు చట్టవిరుద్ధమైన పనులు చేసేవారు. దీంతో పెట్టుబడి భారం పెరగడంతోపాటు నాణ్యమైన పాల ఉత్పత్తి రాక పశుపోషకులు ఆర్థికంగా నష్టపోయేవారు. మరోవైపు ఆరోగ్యవంతమైన పశువులు సైతం దీర్ఘకాలిక రోగాల బారిన పడేవి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఏపీ పశు దాణా చట్టం తెచ్చింది. ఈ చట్టం 2021 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. చట్టం అమలుకు ప్రత్యేక కమిటీలు పశు దాణా చట్టం అమలు కోసం ప్రత్యేకంగా పశుదాణా నాణ్యత, నియంత్రణ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘కంట్రోలింగ్ అథారిటీ, కలెక్టర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారుల నేతృత్వంలో జిల్లా స్థాయి లైసెన్సింగ్ అథారిటీలను నియమించింది. పశుదాణా నాణ్యతను తనిఖీ చేసేందుకు స్థానిక పశువైద్యులకు యానిమల్ ఫీడ్ ఇన్స్పెక్టర్లుగా బాధ్యతలు అప్పగించింది. వీరు క్షేత్ర స్థాయి తనిఖీల్లో సేకరించిన శాంపిల్స్‌కు ప్రభుత్వం గుర్తించిన ప్రయోగశాలల్లో నాణ్యతా పరీక్షలు చేస్తున్నారు. తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ షాపులను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఏపీ యానిమల్ ఫీడ్ యాక్ట్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ పేరిట ప్రత్యేకంగా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఇప్పటివరకు 1,680 మంది దాణా తయారీదారులు, అమ్మకందార్లకు లైసెన్సులు ఇచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక గతంతో పోలిస్తే నాసిరకం దాణా తయారీ, సరఫరా, అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని పశుపోషకులు చెబుతున్నారు. నాణ్యత లేని దాణా తయారుచేస్తే క్రిమినల్ కేసులు.. పశు దాణా చట్టం అమల్లోకి వచ్చాక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నాం. నాణ్యత లేని దాణా తయారీదారులు, నిరీ్ణత ప్రమాణాలు పాటించనివారు, తప్పుడు ప్రకటనలు ఇచ్చే కంపెనీలపై ఈ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించినట్టు తేలితే కనీసం ఏడేళ్లు జైలుశిక్ష, తగిన జరిమానా పడుతుంది. – డాక్టర్ అమరేంద్రకుమార్ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ -
నకిలీ మందులతో ఆర్ఎంపీ వైద్యం
సాక్షి, నర్వ(మహబూబ్‌నగర్): ఓ ఆర్ఎంపీ నకిలీ మందులతో అమాయక ప్రజలకు వైద్యం చేస్తున్న సంఘటన మండలంలోని కల్వాలలో సోమవారం రాత్రి వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి డ్రగ్స్ అధికారులు అరవింద్‌కుమార్, శ్రీకాంత్ కథనం ప్రకారం.. కల్వాలకు చెందిన కమ్మరి ప్రశాంత్‌కుమార్ కొంతకాలంగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామస్తుల అమాయకాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ మందులు అంటగడుతున్నాడు. దీనిని గమనించిన యువకులు డ్రగ్స్ అధికారులకు సమాచారం అందించడంతో సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడులు చేసి రూ.20 వేల విలువ గల నకిలీ మందులను గుర్తించారు. అలాగే అనుమతి లేకుండా నడుపుతున్న క్లినిక్‌ను సీజ్ చేశారు. లైసెన్స్ లేకుండా మందులు నిల్వ ఉంచినందున డ్రగ్స్ కాస్మొటిక్ యాక్టు సెక్షన్ 18(సి) ప్రకారం ఆర్ఎంపీ ప్రశాంత్‌కుమార్‌పై కేసు నమోదు చేశామని వారు తెలిపారు. -
లైసెన్స్ ఒకరిది.. అమ్మేది ఇంకొకరు..!
సాక్షి, మంచిర్యాల: వారు ఇచ్చిందే విత్తనం.. వారు ఇచ్చినవే ఎరువులు, మందులు ఇదీ జిల్లాలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో పరిస్థితి. జిల్లాలో 80శాతం ఫర్టిలైజర్ దుకాణాలను లైసెన్స్ పొందిన వ్యక్తులు కాకుండా వేరేవాళ్లు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. కనీస అర్హత లేకపోయినా.. ఎరువుల శాస్త్రీయ నామాలు తెలియకున్నా.. ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా రైతులకు విక్రయిస్తున్నారు. పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ విరివిగా ఫర్టిలైజర్ దుకాణాలు వెలుస్తున్నాయి. డిగ్రీ అర్హత, బీఎస్సీ అగ్రికల్చర్ రసాయన శాస్త్రం అర్హత సాధించిన వారికి ఫర్టిలైజర్ దుకాణం లైసెన్స్ ఇస్తారు. డిగ్రీ ద్వారా లైసెన్స్ పొందితే డీలర్‌గా ఎరువులు, విత్తనాలు, ఇతర రసాయన మందుల దుకాణాల నిర్వహణకు అవకాశం ఉంటుంది. రసాయన మందులు అమ్మాలంటే తప్పనిసరిగా ఎవరి సర్టిఫికెట్ ద్వారా లైసెన్స్ పొందారో వారిని టెక్నికల్ పర్సన్స్‌గా దుకాణంలో ఉంచాల్సి ఉంటుంది. దుకాణాల తనిఖీ సమయంలో టెక్నికల్ పర్సన్ లేకుండా విక్రయాలు జరిపితే 6ఏ యాక్టు కింద కేసు నమోదు చేయవచ్చు. 80 నుంచి 90 శాతం దుకాణాల్లో టెక్నికల్ పర్సన్ లేకుండానే విక్రయాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. సర్టిఫికెట్ కలిగిన వ్యక్తులు ఎక్కడో ఉంటారు. ఇక్కడ కనీసం పదో తరగతి పాస్ కాని వారు కూడా దుకాణాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఆయా కంపెనీల సేల్స్ మేనేజర్లు, సిబ్బంది చెప్పిన రసాయన మందులు రైతులకు అంటగడుతుంటారు. పంటలపై మందుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది.. ఎలాంటి వాతావరణం.. నేలలో పిచికారీ ప్రభావం తదితర అంశాలపై అవగాహన ఉండడం లేదు. వ్యవసాయ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో దుకాణదారులకు అడ్డులేకుండా పోతోంది. అవగాహన, శిక్షణ కరువు.. జిల్లాలో 320 ఫర్టిలైజర్, విత్తన దుకాణాలు ఉన్నాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నవారి పేరిట, డిగ్రీ అర్హత కలిగిన సర్టిఫికెట్ల పేరిట లైసెన్స్‌లు పొంది మంచిర్యాల జిల్లాలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుత జిల్లాలో వారు లేకపోయినా వారి సర్టిఫికెట్లతో దుకాణాల లైసెన్స్‌లు కొనసాగుతున్నాయి. వాటిని రద్దు చేసే అవకాశం లేదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. కానీ టెక్నికల్ పర్సన్ లేకుండా, అర్హులైన వ్యక్తులు లేకుండా దుకాణాలు నిర్వహించరాదు. దీంతోపాటు ప్రతీ డీలర్‌కు డిప్లామా ఇన్ అగ్రికల్చర్ టూర్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ఆఫ్ ఇన్‌ఫుట్(డీఏఈఎస్ఐ) కింద శాస్త్రవేత్తలు, రిటైర్డు వ్యవసాయ అధికారుల ద్వారా 48 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికేట్ అందజేస్తారు. ఈ శిక్షణ తరగతులు నామమాత్రం కాగా.. కొందరు “మామూలు’గానే సర్టిఫికేట్ పొందుతున్నట్లు తెలుస్తోంది. శిక్షణకు హాజరైన వారికి రూ.10వేలు, సర్టిఫికేట్ పొందడానికి మరో రూ.10వేలు తీసుకుంటున్నట్లు డీలర్లు చర్చించుకుంటున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో ఫెస్టిసైడ్స్‌పై అవగాహన సదస్సులు లేక రసాయనిక శాస్త్రీయ నామాలు, దాని ప్రభావం, వినియోగం తెలియకపోయినా విక్రయాలు సాగిస్తున్నారు. దుకాణాల ముందు విత్తన, ఎరువుల తదితర స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. రైతులు కొనుగోలు చేసిన విత్తనం, ఎరువు, రసాయన మందుల తాలుకు సరైన రశీదు ఇవ్వడం లేదు. తెల్లకాగితంపై రైతు పేరు, పేరు కొనుగోలు చేసిన తేదీ, ధర వేసి ఇస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఏ మందు అమ్మినా తయారీ, ఎక్స్పైరీ తేదీ, కంపెనీ, బ్యాడ్జి నెంబర్ తదితర వివరాలతో డీలర్ పేరుతో ఉన్న రశీదు అందించాల్సి ఉంటుంది. అమాయక రైతులను ఆసరాగా చేసుకొని ఇష్టానుసారం కంపెనీల ఆఫర్లకు ఆశపడి కట్టడబెతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. 90 శాతం మందికి శిక్షణ ఉమ్మడి జిల్లాలో గతంలో లైసెన్స్ పొందిన వారే ఎక్కువగా ఉన్నారు. డీఏఈఎస్ఐ 90 శాతం మంది డీలర్లు ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. డీలర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇష్టానుసారం అమ్మకానికి వీలు లేదు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు సాగిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – వీరయ్య, జిల్లా వ్యవసాయ అధికారి -
మ్యూచువల్ ఫండ్ విక్రయాల్లో టాప్ ఇన్వెస్టర్
సాక్షి,ముంబై: సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) ఏర్పాటు బాట పట్టారు. ఇందుకు అనుమతించ మంటూ రాకేష్ సంస్థ ఆల్కెమీ క్యాపిటల్ మేనేజ్మెంట్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. ఆల్కెమీ క్యాపిటల్‌కు రాకేష్ సహవ్యవస్థాపకుడుకాగా.. సమీర్ అరోరా ఏర్పాటు చేసిన హీలియోస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సైతం ఎంఎఫ్ లైసెన్స్ కోసం సెబీకి దరఖాస్తు చేసింది. మ్యూచువల్ ఫండ్ లైసెన్స్‌ల కోసం హీలియోస్ క్యాపిటల్ గత నెల 25న, ఆల్కెమీ క్యాపిటల్ జనవరి 1న సెబీకి దరఖాస్తు చేశాయి. పీఎంఎస్ సేవలు అటు సింగపూర్, ఇటు దేశీ నియంత్రణ సంస్థల వద్ద రిజిస్టర్ అయిన హీలియోస్ క్యాపిటల్.. ఇండియా ఫోకస్డ్ లాంగ్– షార్ట్, లాంగ్ ఓన్లీ ఫండ్‌ను నిర్వహిస్తోంది. గ్లోబల్ లాంగ్–ఓన్లీ ఈక్విటీ ఫండ్‌ను సైతం ఏర్పాటు చేసింది. ఇక హీరేన్ వేద్, అశ్విన్ కేడియా, లసిత్ సంఘ్వీ సైతం వ్యవస్థాపకులుగా కలిగిన ఆల్కెమీ క్యాపిటల్.. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు,ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్టులను నిర్వహిస్తోంది. కాగా బజాజ్ ఫిన్సర్వ్, క్యాపిటల్‌మైండ్ (వైజ్‌మార్కెట్స్ అనలిటిక్స్), ఫ్రంట్‌లైన్ క్యాపిటల్ సర్వీసెస్, యూనిఫై క్యాపిటల్, జిరోధా బ్రోకింగ్ తదితర కంపెనీలు సైతం ఎంఎఫ్ లైసెన్స్‌ను పొందేందుకు వేచిచూస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే సెబీ వద్ద పలు కంపెనీల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతేడాది జులై మొదలు ఇటీవలివరకూ మ్యూచువల్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, ఈక్విటీ మార్కెట్ల రికార్డు గరిష్టాల నేపథ్యంలోనూ పలు ఫండ్స్‌లో అమ్మకాలు కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపడం, పోర్ట్‌ఫోలియోలను పునర్నిర్మించు కోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు వివరించారు. -
రేడియో వినాలా.. మీ దగ్గర లైసెన్స్ ఉందా?
సాక్షి, హైదరాబాద్: బైక్ లైసెన్స్, కారు లైసెన్స్ గురించి అందరికీ తెలుసు.. కానీ, రేడియో లైసెన్స్ గురించి ఎప్పుడైనా విన్నారా! రేడియో వినాలన్నా పన్ను.. కొనాలన్నా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రేడియో కొన్నవారు తొలుత రూ.15 చెల్లించి లైసెన్సు తీసుకునేవారు. అది క్రమంగా రూ.50కి పెరిగింది. అప్పట్లో నగరంలోని ఆజంపురా పోస్టాఫీసులో రేడియో లైసెన్సు దొరికేది. లైసెన్సుకు ఏడాది గడువు ముగిశాక రెన్యువల్ చేసుకోవాల్సిందే. లైసెన్సు లేకుండా రేడియో వింటున్నామన్న సంగతి వైర్లెస్ ఇన్స్పెక్టర్కు తెలిసిందో ఇక అంతే! రేడియోను జప్తు చేసేవారు. రూ.50 జరిమానా చెల్లిస్తేనే రేడియోను తిరిగి ఇచ్చేవారు. ఈ నిబంధనలు నిజాం కాలం నుంచి 1985 వరకు ఉండేవి. ఇక్కడ 1935లో దక్కన్ రేడియో ప్రారంభమైంది. ఇంతకంటే ముందే 1918లోనే షేక్ మహబూబ్ నగరానికి రేడియోను పరిచయం చేశారు. ముంబైలో ఉండే తన మిత్రుడు ఇంగ్లండ్, జర్మనీ తదితర దేశాల్లో తయారైన రేడియోలను విక్రయించేవాడు. అతడి సలహా మేరకు నగరంలోని చెత్తాబజార్లో ‘మహబూబ్ రేడియో’పేరిట దుకాణం తెరిచారు. నగరంలో మొదటి రేడియో షాప్ అదే. ప్రస్తుతం ఈ దుకాణాన్ని ఆయన కొడుకులు మహ్మద్ ముజీబుద్దీన్, మహ్మద్ మొయినుద్దీన్ నడుపుతున్నారు. తొలినాళ్లలో ఉన్నత వర్గాలు, ధనికుల వద్ద మాత్రమే రేడియో ఉండేది. ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలు మాత్రం మహబూబ్ రేడియో దుకాణం దగ్గరికి వార్తలు వినేందుకు వచ్చేవారు. ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 7.30 గంటలకు ఆ ప్రాంతం జనంతో నిండిపోయేది. ‘మార్కోనీ’తో మొదలై.. మార్కోనీ తయారు చేసిన రేడియో నుంచి చివరిసారిగా ఫిలిప్స్ తయారు చేసిన రేడియో దాకా ఆ షాపులో ఉన్నాయి. 150 ఏళ్ల క్రితం తయారైన రేడియోలు ఇప్పటికీ పనిచేస్తుండటం విశేషం. తొలిసారి 1860లో మార్కోనీ తయారు చేసిన రేడియోకు ఒకే బ్యాండ్ ఉండేది. దాన్ని ‘లాంగ్ వే’అనేవారు. అనంతరం మీడియం వే, షార్ట్ వే.. ఇలా బ్యాండ్లు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం సింగిల్, షార్టు వేపై 1–3 వరకు, మీడియం వేపై 1200 వరకు బ్యాండ్లు వస్తున్నాయి. -
‘కార్పొరేట్’ బ్యాంకులకు సై..!
ముంబై: దేశంలో అంబానీ, అదానీ వంటి దిగ్గజ పారిశ్రామిక గ్రూపులు బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం కానుంది. స్వయంగా బ్యాంకులను తెరవడానికి బడా కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ ఒకటి ప్రతిపాదించింది. ఇందుకు అనుమతులు ఇచ్చేందుకు వీలుగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949కు అవసరమైన సవరణలు చేయాలని సూచించింది. పటిష్ట నిఘా ఇక్కడ కీలకాంశమని స్పష్టం చేసింది. అంతర్గతంగా గ్రూప్ సంస్థలకు రుణాలు, పరస్పర ప్రయోజనాలకు విఘాతాలు వంటి పలు అంశాల నేపథ్యంలో ఒక భారీ స్థాయి కార్పొరేట్ సంస్థకు పూర్తిస్థాయి బ్యాంకింగ్ లైసెన్సు మంజూరు చేయడానికి ఆర్బీఐ ఇప్పటివరకూ వెనకడుగు వేస్తూ వస్తోంది. ఈ అడ్డంకులు తొలగాలంటే తప్పనిసరిగా బ్యాంకింగ్ యాక్ట్‌కు సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటాను ప్రస్తుత 15% నుంచి 26%కి పెంచవచ్చని కూడా ఆర్బీఐ కమిటీ ప్రతిపాదించింది. ఇందుకు 15 సంవత్సరాల కాల వ్యవధిని సూచించింది. దీనివల్ల పెయిడ్ అప్ క్యాపిటల్‌కు సంబంధించి ఓటింగ్ హక్కులు పెరుగుతాయి. భారత ప్రైవేటు రంగ బ్యాంకులకు సంబంధించి కార్పొరేట్ నిర్మాణం, యాజమాన్య మార్గదర్శకాల సమీ క్షకు 2020 జూన్ 12న ఆర్బీఐ ఏర్పాటు చేసిన అంతర్గత కార్యాచరణ బృందం సమర్పించిన నివేదికను శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ ప్రజాబాహుళ్యంలో ఉంచింది. దీనిపై ఒక నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత వర్గాలు, నిపుణుల సలహాలను తీసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. నివేదికపై 2021 జనవరి 15వ తేదీలోపు అభిప్రాయాలను తెలపాలని కోరింది. బ్యాంకులుగా పెద్ద ఎన్బీఎఫ్సీలు: రూ.50,000 కోట్లు, ఆపైన భారీ రుణ పరిమాణం కలిగి, 10 ఏళ్లకు పైగా చక్కటి నిర్వహణ కలిగిన పెద్ద బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) బ్యాంకులుగా మార్చే అంశాన్ని పరిశీలించవచ్చని కూడా ఆర్బీఐ కమిటీ సూచించింది. కార్పొరేట్లు నిర్వహిస్తున్న ఎన్బీఎఫ్సీలకూ దీన్ని వర్తింపజేయవచ్చని తెలిపింది. అయితే దీనిపై ఎన్‌బీఎఫ్‌సీలకు మరికొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను సూచించాలని సిఫారసు చేసింది. ఆదిత్య బిర్లా, బజాజ్, మహీంద్రా, టాటా గ్రూపులు ఇప్పటికే దశాబ్దానికి పైగా ఎన్బీఎఫ్సీలను నిర్వహిస్తున్నాయి. నిజానికి దేశంలో మధ్య మధ్య స్థాయి బ్యాంకులకన్నా ఈ ఎన్బీఎఫ్సీలు పెద్దవి కావడం గమనార్హం. కనీస ప్రారంభ మూలధనం పెంపు కొత్త బ్యాంకుల ఏర్పాటుకు కనీస ప్రారంభ మూలధన్నాన్ని పెంచాలని ఆర్బీఐ కమిటీ సూచించింది. బ్యాంకుల విషయంలో ఈ మొత్తాలను రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు... అలాగే చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు రూ.200 కోట్ల నుంచి రూ. 300 కోట్లకు పెంచాలని పేర్కొంది. పెరుగుతున్న ప్రైవేటు బ్యాంకింగ్ వాటా... మొత్తం బ్యాంకింగ్ వ్యాపారంలో ప్రైవేటు రంగం వాటా గణనీయంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. 2000లో మొత్తం బిజినెస్‌లో ప్రైవేటు రంగం వాటా డిపాజిట్లకు సంబంధించి 12.63 శాతం ఉంటే, రుణాల విషయంలో ఈ రేటు 12.56 శాతంగా ఉండేదని వివరించింది. 2020లో ఈ శాతాలు వరుసగా 30.35 శాతం, 36.04 శాతానికి పెరిగాయని వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు క్రమంగా తమ మార్కెట్ వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులకు కోల్పోతున్నాయని తెలిపింది. మొండిబకాయిలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇబ్బందుల్లో చిక్కుకుంటున్న ప్రభుత్వ రంగ బ్యాలెన్స్ షీట్లే దీనికి కారణమని నివేదిక వివరించింది. ప్రైవేటు రంగానికి మూలధనం కూడా పెద్ద సమస్యగా ఉండడం లేదని తెలిపింది. గడచిన ఐదేళ్లలో మార్కెట్ నుంచి ప్రైవేటు బ్యాంకులు రూ.1,15,328 కోట్లు సమీకరించగలిగితే, ప్రభుత్వ బ్యాంకుల విషయంలో ఈ మొత్తం రూ.70,823 కోట్లుగా ఉందని పేర్కొంది. ఇందుకు అదనంగా ప్రభుత్వం నుంచి రూ.3,18,997 కోట్ల మూలధనం అందినట్లు వివరించింది. బ్యాంకింగ్ రంగంలో మార్పు! మొత్తంగా పరిశీలిస్తే, బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రూ.10 లక్షల కోట్లకుపైగా బ్యాలెన్స్ షీట్ల పరిమాణంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే ఆరేడు బ్యాంకులతో విలీనం అయ్యాయి. దీనికితోడు ఇప్పటికే 3–4 బడా ప్రైవేటు బ్యాంకులు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్బీఐ బడా కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్సులు ఇవ్వడమో లేక, వాటి ఎన్బీఎఫ్సీలను పూర్తి స్థాయి బ్యాంకులుగా మార్చడమో చేస్తే అవి మరింత పోటీని ఇస్తాయి. దేశంలో పలు మధ్య తరహా బ్యాంకులకన్నా పెద్దవిగా మారతాయి. పెద్ద ఎన్బీఎఫ్సీల్లో ఏదైనా ఆర్థిక సమస్యలు తలెత్తితే అది మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థపై ప్రభావం పడుతున్న అంశాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం, ఆర్బీఐ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కనబడుతోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) వంటి సంస్థలు దివాలా తీయడం తెలిసిందే. -
ఆబ్కారీలోనూ ఆమ్యామ్యాలు?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ప్రతీ పనికి మామూళ్ల వసూళ్లకు తెగబడిన పోలీసు సిబ్బంది జాబితాను ఇటీవల డీజీపీ విడుదల చేశారు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితయే. జాబితాలో పేర్లు ఉన్న సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమవుతుండగా.. మరో పక్క ఎక్సెజ్ శాఖలోనూ జాబితా ప్రకంపనలు సృష్టిస్తోంది. నెలనెలా మామూళ్లకు అలవాటు పడిన ఎక్సైజ్ సిబ్బంది వివరాలను స్టేషన్ల వారీగా ఆ శాఖ డైరెక్టర్ అకున్‌సబర్వాల్ నిఘా వర్గాల ద్వారా తెప్పించుకున్నట్లు సమాచారం. ఆ జాబితాలోని కొందరు సిబ్బందిపై రెండు, మూడు రోజుల్లో వేటు పడొచ్చనే ప్రచారం శాఖలో సాగుతోంది. మొదటి నుంచి అపవాదు.. ఎక్సైజ్ శాఖలోని పై స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు మామూళ్లు వసూలు చేయడానికి అలవాటు పడ్డారనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. భారీగా వసూళ్లకు పాల్పడుతూ నిబంధనలకు నీళ్లు వదులుతున్నారనే విమర్శలున్నాయి. మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్‌లతో మొదలుకొని కల్లు దుకాణాలకు లైసెన్స్ రెన్యూవల్, కొత్త దుకాణాల అనుమతుల విషయంలో భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనలో భాగంగా కొందరు సిబ్బంది చర్యలు తీసుకోవాలని భావిస్తూ డైరెక్టర్ జాబితా తెప్పించుకున్నట్లు సమాచారం. నిబంధనలు తూచ్.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాదారులు రింగ్‌గా ఏర్పడి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. నెలనెలా మామూళ్లకు అలవాటుపడిన ఎక్సైజ్ సిబ్బందికి గంప గుత్తగా వస్తున్న డబ్బు వస్తుండడంతో నిబంధనలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మద్యం దుకాణాలన్నీ కూడా చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నాయి. ఎమ్మార్పీ ధరలను యథేచ్చగా ఉల్లంఘించడంతో పాటు దాదాపు ప్రతీ వైన్స్‌ను బార్లలా మార్చేశారు. కేవలం పర్మిట్ రూమ్ ఉన్న వైన్స్‌ల్లో మాత్రమే మద్యం తాగేందుకు అనుమతించాల్సి ఉండగా.. ఈ విషయంలోనూ నిబంధనలకు పాతరేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రధాన వైన్స్‌లో పరిశీలిస్తే బార్‌ను తలపిస్తుండడం ఇందుకు నిదర్శంగా చెప్పొచ్చు. ఈ వైన్స్‌లో రెండు, మూడు గదులు ఏర్పాటు చేసి టేబుళ్లు, కుర్చీలతో అచ్చం బార్‌ను తలపిస్తుంది. అంతేకాదు మ ద్యం దుకాణాల్లో గ్లాసులు, తినుబండారాలు అమ్మొద్దనే నిబంధనను ఏ యజ మాని పట్టించుకోకున్నా అధికారులు వదిలేస్తుండడం గమనార్హం. కల్లు లైసెన్సుల విషయంలో పండుగే... గీత కార్మికులు చెట్ల నుంచి కల్లు తీసి అ మ్ముకునేందుకు జారీ చేసే లైసెన్సుల విషయంలో ఎక్సైజ్ సిబ్బంది పండుగ చేసుకుంటారనే విమర్శలున్నాయి. టీఎఫ్టీ(ట్రీ ఫర్ ట్యాపర్–చెట్టు నుంచి కల్లు తీసి నేరుగా అమ్ముకోవడం), ట్యాపర్ కోఆపరేటివ్ సొసైటీ(టీసీఎస్ – కనీసం 15 నుంచి 50 మంది వరకు సభ్యులుగా ఏర్పడి ఒక సొసైటీ ద్వారా కల్లు అమ్ముకోవడం)ల లైసెన్సుల జారీ విషయంలో ఎక్సైజ్ సిబ్బంది భారీ అవకతవకలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా బయటపెట్టింది. టీసీఎస్, టీఎఫ్‌టీల లైసెన్సుల విషయంలో రూ.లక్షలు చేతులు మారుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు మామూళ్లు అందుతున్నట్లు సమాచారం. అందుకే ఈ విషయంలో ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. మామూళ్లపై ఆరా.. పాలమూరు ప్రాంతంలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 25 మంది సీఐలు, 29 మంది ఎస్సైలు, 61 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 215 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొద్ది మంది ప్రతీనెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మద్యం దుకాణాలు, బార్‌షాపులు, కల్లు సొసైటీలు, దుకాణాల ద్వారా ప్రతీనెలా డబ్బులు దండుకుంటు న్నట్లు ఆధారాలతో సహా సేకరించారు. అంతేకాదు మద్యం దుకాణాల రింగ్ లీడర్ల డైరీల ద్వారా ఎవరెవరికి ఎంతెంత మామూళ్లు అందుతున్నాయనే వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. భారీగా అక్రమాలకు పాల్పడుతున్న కొద్దిమందిపై మొదటగా వేటు వేయాలని ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జాబితా రూపొం దించారనే ప్రచారం సాగుతోంది. -
మత్స్యమాఫియా
అలంపూర్ రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతున్న తుంగభద్ర, కృష్ణానదుల్లో మత్స్యసంపదను కొల్లగొడుతున్న అలవి వలలు స్థానిక మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. మత్స్యసంపదను మధ్య దళారీలు తరలించకుండా మత్స్యశాఖ, పోలీస్ యంత్రాంగం వరుస దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నా పెద్దగా స్పందన కనిపించడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రధానంగా అలంపూర్ గొందిమల్ల, కూడవెల్లి తదితర ప్రాంతాల్లో స్థానికేతరులు ధనార్జనే ధ్యేయంగా వైజాగ్, రాజమండ్రి, తమిళనాడు, ఏపీ వంటి ప్రాంతాల నుంచి అలవి వలలతో చేపలను వేటాడే నైపుణ్యం గల వారికి రోజువారి కూలీలు ఇస్తూ ప్రభుత్వం నిషేధించిన అలవి, పట్టు, నంజు, మ్యాట్ వంటి వలలతో చేపలను వేటాడుతూ మత్స్య సంపదను కొల్లగొడుతూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో దాదాపు 20 వేల మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయి. లైసెన్స్‌లు.. సొసైటీలు కులవృత్తి అయినంత మాత్రనా లేదా గంగపుత్రులు అయినంత మాత్రాన చేపలు వేటాడే అధికారం లేదు. ఇందుకోసం సంబంధిత మత్స్యశాఖ దగ్గర పేరు నమోదు చేసుకుని లైసెన్సులు పొందాలి. లేదా మత్స్యశాఖ సొసైటీలో కనీసం సభ్యుడై ఉన్నా చేపలను వేటాడవచ్చు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 20 వేల మంది మత్స్యకారులున్నారు. రాజోళి, అలంపూర్, క్యాతూరు ఇలా మిగతా చోట సొసైటీలు కూడా ఉన్నాయి. ఒక్కో సొసైటీలో 400–600 మంది దాకా ఉన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో అయిజ నుంచి అలంపూర్ దాక 13 సొసైటీలు ఉండగా యాక్టివ్ ఉన్న సొసైటీలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. గద్వాల నియోజకవర్గంలో 25 సొసైటీల్లో 38 సంఘాలు, 3,200 మంది లైసెన్స్‌దారులు ఉన్నారు. ఇక వీరి ఆర్థిక పరిస్థితిలు గమనిస్తే చాలా దయనీయంగా ఉన్నాయి. భద్రపరిచే పరికరాలేవీ..? రాష్ట్ర ప్రభుత్వం సహజసిద్ధ ఆర్థిక వనరులు పెంచే ప్రణాళికలో భాగంగా 2016–17 సంవత్సరానికి గాను రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ఇందులో రూ.900 కోట్లు నాబార్డు నుంచి రాగా కేవలం రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి చేపపిల్లను సరఫరా చేసింది. కానీ వీటిని భద్రపరిచేందుకు గాను టీవీఎస్ ఎక్సెల్ టాంటి మోపైడ్, బోట్లు, వల, ఐస్ బాక్స్ లాంటి పరికరాలు ఏవీ ఇవ్వలేదు. దీంతో పట్టిన చేపలను భద్రపరిచే పరిస్థితి లేకపవడంతో మత్స్యకారులు వాటిని మధ్యదళారీలకే అప్పగిస్తున్నారు. మధ్య దళారికే లాభాలు ఉదయం నుంచి సాయంత్రం దాక కష్టపడిన మత్స్యకారుడికి కడుపు నిండటం గగనంగా మారింది. రోజంతా కష్టపడితే 100 కిలోల చేపలు పడుతాయి. ఇందులో చేప బరువును బట్టి మార్కెట్లో ధర నిర్ణయిస్తారు. అయితే మార్కెట్లో అమ్మకంపై మెళకువలు తెలియని అసలైన మత్స్యకార్మికుడు దళారీకి చేపలు విక్రయిస్తున్నాడు. దీంతో కష్టపడిన మత్స్యకార్మికుడుకి రోజుకు సగటున రూ.150–200 వస్తే గగనం. ఇక అదే చేపలను కొనుగోలు చేసిన మధ్య దళారీ మాత్రం వాటిని హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు ఎగుమతి చేసి పెద్దఎత్తున లాభాలు పొందున్నాడు. లైసెన్సులు పొంది పేరు రిజిష్ట్రేషన్ చేయించుకున్న వారికి మత్స్యశాఖ అధికారులు మార్కెటింగ్‌పై ఎలాంటి శిక్షణ ఇవ్వకపోవడం, వారికి అవగాహన లేకపోవడంతో మధ్య దళారీలే లాభపడుతున్నారు. త్వరలో ఐఎఫ్‌డీఎస్ విధానం.. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఐఎఫ్‌డీఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీం) సమీకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ విధానం ద్వారా మత్స్యకారులకు 75 శాతం రుణ సౌకర్యం కల్పిస్తారు. అదేవిధంగా రూ.310 చెల్లించిన లైసెన్స్‌దారులకు కావాల్సిన పరికరాలు 75 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రతిపాదనలు సైతం పంపారు. అమాయకులు బలవుతున్నారు.. అలవి వలల విషయంలో అమాయకులైన స్థానిక మత్స్యకారులే బలవుతున్నారు. వీరి వెనక ఉన్న అసలైన మాఫియా మాత్రం తప్పించుకుంటున్నారు. దీనికంతా కారణం మత్స్యకారులకు మత్స్యశాఖ తగిన రుణ సౌకర్యాలు కానీ మార్కెటింగ్ స్కిల్స్, అవైర్నెస్ ప్రోగ్రాం నిర్వహించకపోవడమే. – అశోక్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి, ముదిరాజ్ మహాసభ కఠిన చర్యలు తప్పవు.. ప్రభుత్వం నిషేధించిన వలల ను ఉపయోగించడం కా కుండా ఎలాంటి అనుమతి, లై సెన్స్లు లేకుండా చేపలను వే టాడుతు మత్స్యసంపదను కొల్లగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. స్థానికంగా కొందరు మా ఫియా దీని వెనక ఉండి నడిపిస్తున్నట్టు సమాచారం. తగిన ఆధారాలతో వారిని కూడా పట్టుకుంటాం. – ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ, అలంపూర్ -
లైసెన్సు లేదు.. ఫైన్ వేస్కోండి!
సాక్షి, అమరావతి : ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా తమ డ్రైవింగ్ లైసెన్సు సస్పెండ్ అవ్వకుండా కొందరు వాహనాదారులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఎంతైనా ఫైన్ వేస్కోండి గానీ.. తమకు లైసెన్సు లేదంటూ ఎంచక్కా తప్పించుకుంటున్నారు. తమ తీరుతో రవాణా అధికారులను అవాక్కయ్యేలా చేస్తున్నారు. మితిమీరిన వేగం, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా, మద్యం తాగి వాహనం నడిపినా.. లైసెన్సు సస్పెండ్ చేయాలని గతేడాది సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాలిచ్చింది. దీంతో రవాణా శాఖ సస్పెన్షన్లపై గురి పెట్టింది. ఇప్పటివరకు 20 వేల డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసింది. అయితే దీని నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు అసలు తమకు లైసెన్సే లేదని చెబుతున్నారు. గతేడాది రవాణా శాఖ అధికారులు జరిపిన వాహన తనిఖీల్లో దాదాపు 78,130 మంది తమకు డ్రైవింగ్ లైసెన్సులు లేవని చెప్పడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 1.08 కోట్ల మందికి డ్రైవింగ్ లైసెన్సులున్నట్లు గణాంకాలుండగా.. ప్రతి వంద మందిలో 70 మంది లైసెన్సు లేదని చెప్పడంతో రవాణా శాఖ అధికారులు అవాక్కయ్యారు. ‘డ్రైవింగ్ లైసెన్సు లేదని చెబితే జరిమానా విధించి వదిలేస్తున్నారు. అదే లైసెన్సు ఉందంటే.. ఏకంగా ఆ లైసెన్సును సస్పెండ్ చేస్తున్నారు. దీని వల్ల మా ఉపాధి దెబ్బతింటోంది. అదే లైసెన్సు లేదని చెబితే ఉల్లంఘనలకు గానూ రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు జరిమానా చెల్లించి తప్పించుకోవచ్చు..’ అని వాహనదారులు చెబుతుండటం గమనార్హం. కాగా, ఆధార్‌తో డ్రైవింగ్ లైసెన్సులను లింక్ చేస్తున్నామని.. దీంతో అసలు విషయం తేలిపోతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా డ్రైవింగ్ లైసెన్సులు లేని వారి సంఖ్య అనంతపురం 6,426 చిత్తూరు 5,543 వైఎస్సార్ 1,909 కర్నూలు 7,014 నెల్లూరు 5,311 ప్రకాశం 2,483 గుంటూరు 4,233 కృష్ణా 10,593 పశ్చిమగోదావరి 9,209 తూర్పుగోదావరి 12,755 విశాఖపట్నం 6,541 శ్రీకాకుళం 2,198 విజయనగరం 3,915 మొత్తం 78,130 -
లైసెన్స్‌లు రద్దు... కంపెనీలు మాయం
సాక్షి, బిజినెస్ విభాగం 2జీ స్కామ్‌కు సాక్ష్యాలు లేవని రాజా, కనిమొళి తదితరులను నిర్దోషులుగా ప్రకటించింది ప్రత్యేక కోర్టు. ఇదే వ్యవహారానికి సంధించి గతంలో సుప్రీంకోర్టు 122 లైసెన్సులను రద్దు చేసింది. ఆయా సర్కిళ్లలో కార్యకలాపాలు సాగిస్తున్న పలువురు టెలికామ్ ఆపరేటర్లు లైసెన్సులు కోల్పోయారు. కొందరైతే ఆ దెబ్బకు మూటాముల్లే సర్దుకుని వెళ్లిపోయారు కూడా!! ఇంకొందరు కొనసాగినా మనుగడ సాగించలేకపోయారు. అసలు ఎవరెవరికి లైసెన్సులు దక్కాయి? ఎవరెంత నష్టపోయారు? ఆ వివరాలేంటో చూద్దాం... 2008 నాటికి దేశంలో టెలికామ్ ఆపరేటర్ల సంఖ్య 18. ఇపుడేమో 11. తాజా విలీనాలు, కొనుగోళ్ల తరవాత చివరికి మిగిలినవి భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియా, రిలయెన్స్ జియో, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ మాత్రమే. 2008లో అప్పటి కేంద్ర టెలికం మంత్రి కొత్త 2జీ లైసెన్స్‌లకు బిడ్లను ఆహ్వానించారు. ‘మొదట వచ్చినవారికి మొదట కేటాయింపు’ ప్రాతిపదికన 122 లైసెన్సులు జారీ చేస్తామంటూ ఈ బిడ్లు పిలిచారు. అయితే ఈ స్పెక్ట్రమ్ కేటాయింపులో పలు నియమాలు ఉల్లంఘించారని, కొన్ని సంస్థలు తమకు అనుకూలంగా లంచాలిచ్చాయనే ఆరోపణలొచ్చాయి. లైసెన్స్ పొందిన టెలికం సంస్థలివే.. యూనిటెక్ వైర్లెస్: 22 లైసెన్స్‌లు దేశీ రియల్టీ దిగ్గజం యూనిటెక్ లిమిటెడ్ 22 లైసెన్స్‌లు పొందింది. దీంతో నార్వేకు చెందిన టెలినార్... ఈ సంస్థలో 67.5 శాతం వాటా కొనుగోలు చేసి ఇండియాలోకి రంగప్రవేశం చేసింది. మొత్తంగా టెలినార్ గ్రూప్ రూ.6,100 కోట్లు ఈక్విటీ, రూ.8 వేల కోట్లు కార్పొరేట్ గ్యారంటీల రూపంలో పెట్టుబడి పెట్టింది. ► తైవాన్‌కు చెందిన లూప్ టెలికం 21 లైసెన్స్‌లు పొందింది. తరవాత దీన్ని ఖైతాన్ గ్రూప్ కొనుగోలు చేసింది. ► వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్... డాటాకామ్ సొల్యూషన్స్ పేరిట 21 లైసెన్స్‌లు. ► స్వాన్ టెలికామ్‌కు 13 లైసెన్స్‌లు దక్కాయి. ఎమిరేట్స్‌కు చెందిన ఎటిసలాట్– దేశీ రియల్టీ సంస్థ డీబీ కార్ప్ జతకట్టి స్వాన్‌ను, మరో 2 లైసెన్స్‌లను తీసుకున్నాయి. ► సింగపూర్‌కు చెందిన ఎస్ టెల్ లిమిటెడ్‌కు 6 లైసెన్స్‌లు దక్కగా... దీన్లో వాటాలను బహ్రెయిన్ టెలికమ్యూనికేషన్స్ (బాటెల్కో) కొనుగోలు చేసింది. ► రష్యాకు చెందిన సిస్టెమా, ఇండియాకు చెందిన శ్యామ్ గ్రూప్‌ల సంయుక్త భాగస్వామ్య కంపెనీయే సిస్టెమా శ్యామ్. దీనికి 21 లైసెన్స్‌లు దక్కాయి. ► దేశంలో 3వ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా ఉన్న ఐడియా... తొలిదశలో 9, రెండో దశలో మరో 4 లైసెన్స్‌లు దక్కించుకుంది. ళీ టాటా 3 లైసెన్స్‌లు దక్కించుకుంది. ఎవరికెంత నష్టం? కస్టమర్లు: టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గణాంకాల ప్రకారం దేశంలోని మొత్తం యాక్టివ్ సబ్స్క్రైబర్లలో 5 శాతం కస్టమర్లపై ఇది ప్రభావం చూపింది. మొత్తం 89.4 కోట్ల మంది యూజర్లలో 4.5 కోట్ల మంది సబ్స్క్రైబర్లు వారి టెలికం సర్వీస్ ప్రొవైడర్లను మార్చుకోవాల్సి వచ్చింది. టెలికం రంగంలో పోటీ తగ్గడంతో స్థానికంగా ఉన్న టెలికం కంపెనీలు టారిఫ్ ధరలను కూడా పెంచేశాయి. విదేశాలతో పోలిస్తే సుమారు 30 శాతం ధరలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. విదేశీ పెట్టుబడిదారులు: 2జీ స్కామ్ ప్రభావం 11 కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. మరీ ముఖ్యంగా యూఏఈకి చెందిన ఎటిసలాట్, రష్యాకు చెందిన సిస్టెమా, నార్వేకు చెందిన టెలినార్ గ్రూప్ సంస్థలకు 2జీ దెబ్బ గట్టిగానే తగిలింది. దీంతో విదేశీ టెలికం కంపెనీలకు మన దేశీయ టెలికం రంగంపై నమ్మకం పోయింది. ఇక్కడి టెలికం బిడ్లు, లైసెన్స్ జారీలో పారదర్శకత లేదన్న విషయం తేటతెల్లం కావటంతో ఆ తర్వాత జరిగిన టెలికం బిడ్లలో విదేశీ కంపెనీలేవీ పాల్గొనలేదు. ఇది ఒక రకంగా అప్పడు టెలికం మార్కెట్లో ఉన్న భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలకు కలిసొచ్చింది. టెలికం వెండర్స్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద కూడా ప్రభావం చూపించింది. నోకియా, సిమెన్స్, ఎరిక్సన్, హువావే, విప్రో వంటి టెక్నాలజీ కంపెనీలపై ప్రభావం పడింది. టవర్ల నిర్వహణ, సాంకేతిక అభివృద్ధి కోసం యూనినార్‌తో నోకియా, సిమెన్స్, ఎటిసలాట్‌తో టెక్ మహీంద్రా ఒప్పందం చేసుకున్నాయి. సుమారు 400 మిలియన్ డాలర్ల ఒప్పందాలు రద్దయ్యాయని అంచనా. బ్యాంకులు, టవర్ల నిర్వహణ కంపెనీలపై కూడా ప్రభావం చూపించింది. -
20 వేల సంస్థలకు కేంద్రం భారీ షాక్
న్యూఢిల్లీ: స్వచ్ఛంద సంస్థలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 వేల స్వచ్ఛంద సంస్థల లైసెన్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం 13వేల స్వచ్ఛంద సంస్థలు మాత్రమే సరైన లైసెన్స్‌లు కలిగి ఉన్నాయని, మిగితా సంస్థలన్నీ కూడా నిబంధనలు ఉల్లంఘించాయని కేంద్రం ప్రకటించింది. మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విదేశీయుల విభాగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమయంలో దేశంలో మొత్తం 33 వేల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని, వీటిల్లో 20 వేల సంస్థలు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని అతిక్రమించాయని, లైసెన్స్ విషయంలో తప్పుడు ధ్రువపత్రాలు ఉపయోగించడంతోపాటు అనైతికంగా వ్యవహరించారని, అందుకే వారి లైసెన్స్‌లు రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. చట్టపరంగా 13 వేల సంస్థలకు మాత్రమే ప్రస్తుతం గుర్తింపు ఉన్నట్లు స్పష్టం చేసింది. -
భారీ సంఖ్యలో టీవీ, ఎఫ్ఎం చానెల్స్ పై వేటు
న్యూఢిల్లీ: సమాచార, ప్రసార మంత్రిత్వి శాఖ సంచలన నిర్ణయ తీసుకుంది. భారీ సంఖ్యలో టీవీ ఛానెల్స్, ఎఫ్ ఎం లపై వేటు వేసింది. ఇటీవల సంవత్సరాలలో నిబంధనలు ఉల్లంఘించిన 73టీవీ ఛానెళ్ళు, 24 ఎఫ్ ఎం చానెల్స్ , తొమ్మిది వార్తాపత్రికలు లైసెన్సులను ఐ అండ్ బి శాఖ రద్దు చేసింది. కాలపరిమితి మించిన కొన్ని టీవీ చానల్స్, నిబంధనలు ఉల్లంఘించిన ఆరు ప్రైవేట్ ప్రసారసాధనాలు సహా, 24 ఎఫ్ఎం, ఛానల్ లైసెన్సుల రద్దు చేసింది. మంత్రిత్వ శాఖ అనుమతి ఒప్పందం (జీవోపీఏ) ప్రకారం ప్రసార మార్గదర్శక నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఈనిర్ణయం తీసుకున్నామని కేంద్ర సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ రాజ్యసభలో చెప్పారు. అలాగే 1867 సం.రం నాటి పీఆర్బీ చట్టాన్ని ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ అండ్ పబ్లికేషన్ గా ఇప్పటికే మార్చినట్టు చెప్పారు. మరోవైపు ప్రింట్ మీడియా ప్రమాణములను కట్టడిచేసే పనిలోమంత్రిత్వ శాఖ పూర్తిగా దృష్టి పెట్టింది. ప్రభుత్వ విధానాల సరళీకరణ తరువాత ఈ రంగంలో నెలకొన్న అసాధారణ అభివృద్ధి కారణంగా వీటిని అప్ డేట్ చేయాలని, ప్రింట్ సెక్టార్లో న్యాయ విధానం పునరుద్దరించాల్సిన అవసరం వచ్చిందని మంత్రి తెలిపారు. కాగా దేశంలో 42 ప్రైవేట్ ఛానెళ్లు, 196 కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో 892 రిజిస్టర్డ్ ప్రయివేట్ శాటిలైట్ టీవీ ఛానల్స్ ఉన్నాయి. -
తాగినోడికి తాగినంత!
- ఇక ఎక్కడపడితే అక్కడ మద్యం లభ్యం - జిల్లాలో రూ.3 వేల కోట్ల ఆదాయమే లక్ష్యం - లైసైన్సుల నుంచి సమకూరనున్న రూ.200 కోట్లు - బాగా వ్యాపారం జరిగే దుకాణాల స్థానంలో ఔట్లెట్లు చిత్తూరు (అర్బన్) : ఎప్పుడు పడితే అప్పుడు కావాల్సిన చోట మద్యం అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో మద్యం అమ్మకాల ద్వారా రెండేళ్లకు ఏకంగా రూ.3 వేల కోట్ల ఆదాయం సేకరించడమే లక్ష్యంగా 2015-17 మద్యం పాలసీ గెజిట్‌ను విడుదల చేసింది. గత ఏడాది జిల్లాలో మద్యం దుకాణాల లెసైన్సు ఫీజులు, పర్మిట్ రూమ్‌లు, దరఖాస్తు రుసుముల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.150 కోట్లు సమకూరింది. మద్యం అమ్మకాల ద్వారా రూ.వెయ్యి కోట్ల వరకు ఆదాయం లభించింది. అయితే గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ ఆదాయం ఆర్జించడానికి కొత్త ఎత్తుగడ వేసింది. గత ఏడాది జిల్లాలో ఎక్కడయితే ఎక్కువ మొత్తంలో మద్యం అమ్మకాలు జరిగాయో ఆ ప్రాంతాల్లో ఈసారి ప్రభుత్వ మద్యం దుకాణాల ఔట్ లెట్లు వెలుస్తాయి. జిల్లాలోని ఎక్సైజ్ పోలీసు స్టేషన్లను ఆధారంగా చేసుకుని ప్రతి సర్కిల్లో గత ఏడాది ఎక్కడయితే అత్యధికంగా మద్యం అమ్మకాలు జరిగాయో ఆ ప్రాంతంలో పది శాతం ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడానికి గెజిట్‌లో ఆదేశాలు జారీ చేసింది. ఈ లెక్కన చిత్తూరు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో 28 మద్యం దుకాణాలుంటే గత ఏడాది ఎక్కువ మొత్తంలో వ్యాపారం జరిగిన ఐరాల పాటూరు సంతగేటు, రంగంపేట క్రాస్, యాదమరి కన్నికాపురం ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు జిల్లాలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు చెందిన షాపింగ్ మాల్స్, మండలానికి యాభై వరకు ఉన్న అనధికార బెల్టు షాపులు, ప్రైవేటు మద్యం దుకాణాల్లో నిత్యం మద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక గత ఏడాది ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలను తెరవడానికి సమయం కేటాయించారు. అయినప్పటికీ ఉదయం 8 నుంచే దుకాణాల్లో మద్యం దొరికేలా వెసులుబాటు ఉండేది. ఈసారి అధికారిక మద్యం విక్రయాల సమయాన్ని కూడా మార్చేశారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయించుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలిచ్చేసింది. సమకూరే ఆదాయమిదీ అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఈ సారి రూ.30 లక్షలు లెసైన్సు ఫీజు నిర్ణయించిన 151 దుకాణాల నుంచి రూ.45.3 కోట్లు, రూ.34 లక్షలు జరిగే 11 దుకాణాల నుంచి రూ.3.74 కోట్లు, రూ.37లక్షలు జరిగే 46 దుకాణాల నుంచి రూ.17.02 కోట్లు, రూ.45 లక్షలు జరిగే 112 దుకాణాల నుంచి రూ.50.4 లక్షలు, రూ.50 లక్షలు జరిగే 68 దుకాణాల నుంచి రూ.34 కోట్లు, రూ.40 లక్షలు జరిగే 21 దుకాణాల నుంచి రూ.8.4 కోట్లు లెసైన్సుల రుసుముల రూపంలో ఆదాయం సమకూరనుంది. ఇది కాకుండా ఒక్కో దుకాణానానికి 4 దరఖాస్తులు వచ్చి పడ్డా దరఖాస్తుకు సగటున రూ.40 వేలు రుసుము లెక్కన రూ.6.56 కోట్లు, 410 మద్యం దుకాణాలకు పర్మిట్ గదుల రుసుము రూపంలో (ఒక్కో పర్మిట్ రూమ్‌కు రూ.2లక్షలు) రూ.8.2 కోట్లు వసూలు కానుంది. వీటితో పాటు మద్యం విక్రయాలు కలిపి రెండేళ్లకు జిల్లాలో సుమారు రూ.3 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించనుంది. -
ఎరువుల కొరత సృష్టిస్తే లెసైన్సుల రద్దు: ప్రత్తిపాటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టించే దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి లెసైన్సులు రద్దుచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ప్రస్తుత సీజన్లో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడమే కాకుండా ఎక్కువ ధరలకు యూరి యాను విక్రయిస్తున్నారని ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఆయన శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా, కాంప్లెక్స్ ఎరువుల కొరత లేదని.. అయితే కొంతమంది దుకాణ యజమానులు కావాలని కొరత సృష్టించి రైతులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఎరువుల విషయంలో కృత్రిమ కొరత సృష్టించినా, ఎక్కువ ధరకు అమ్మినా లెసైన్సుదారులతో పాటు వ్యవసాయశాఖ ఏడీ, ఏఓలనూ సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రైతులెవరైనా ఎరువులు కొన్నాక ఎక్కువ ధరకు విక్రయించారని అనిపిస్తే ఆ బిల్లులతో సహా వచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. అందుకోసం రెండు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. ఒకటి గుంటూరులో 1832216644, మరొకటి వ్యవసాయశాఖ పరిధిలో కిసాన్ కాల్ సెంటర్ 18001801551 నంబర్లు ఉంటాయని తెలి పారు. రాష్ట్రంలో 7.58 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటే, ఇప్పటికే 5.88 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చామన్నారు. మరో 1.88 మెట్రిక్ టన్నుల ఎరువులకు కేంద్రం డెలివరీ అనుమతి కూడా ఇచ్చిందన్నారు. ఈ ఏడాది సాగుబడి ఏ మాత్రం తగ్గలేదని, గతేడాది 35.92 లక్షల హెక్టార్లలో జరిగిందని, ఈ ఖరీఫ్ సీజన్లోనూ అంతే స్థాయిలో సాగవుతోందని చెప్పారు. రానున్న రబీకి కూడా విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తొలి దశలో రూ. 50 వేలైనా మాఫీ ఇదిలావుంటే.. రైతుల రుణ మాఫీకి సంబంధించి తొలి దశలో కనీసం రూ. 50 వేలైనా మాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ప్రత్తిపాటి పేర్కొన్నారు. లక్షన్నర రూపాయల ప్రాతిపదికన రాష్ట్రంలో రూ. 42 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉందని.. అయితే రూ. 50 వేల లోపు రుణాలున్న వారే 40శాతం మంది రైతులు ఉన్నారని ఆయన చెప్పారు. రైతుల ఖాతాల్లో రూ. 50 వేలు జమ చేయడం ద్వారా వారికి కొంతవరకైనా వెసులుబాటు కలుగుతుందన్నారు. మిగతా సొమ్మును మరో రెండు దఫాల్లో చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. బ్యాంకులు రుణ మాఫీకి సంబంధించి వివరాలు సేకరించడంలో జాప్యం జరుగుతోందని, వీలైనంత త్వరలో వివరాలివ్వాలని ఆదేశించామన్నారు. రైతుల రుణ మాఫీకి ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. -
408 మద్యం షాపులకు లెసైన్స్
- 154 షాపులకు దరఖాస్తులు నిల్ - 80 షాపులకు ఒకే ఒక్క దరఖాస్తు - దరఖాస్తు రుసుం ద్వారా రూ. 14.89 కోట్ల ఆదాయం కాకినాడ క్రైం : జిల్లాలో 562 మద్యం షాపులకు గాను 408 షాపులకు మాత్రమే లెసైన్స్‌లు మంజూరయ్యాయి. లక్కీడిప్ ద్వారా వ్యాపారులకు ఈ షాపులను కేటాయించారు. జిల్లాలో 555 మద్యంషాపులు ఉండగా రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం డివిజన్లోని 7 షాపులు కొత్తగా చేరాయి. దాంతో వీటి సంఖ్య 562కు చేరింది. 154 షాపులకు దరఖాస్తులేవీ అందలేదు. రెండేళ్ల క్రితం జారీ చేసిన మద్యంషాపుల లెసైన్స్‌ల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండడంతో కొత్తగా లెసైన్స్‌ల మంజూరుకు ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. గతసారి 555 షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా 434 షాపులకు 4500 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దఫా 562 షాపులకుగాను 408 షాపులకు మాత్రమే 5,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాజమండ్రి డివిజన్లో 96 షాపులకు 1,654, కాకినాడ డివిజన్లో 149 షాపులకు 2,563, అమలాపురం డివిజన్లో 163 షాపులకు 1,740 దరఖాస్తులు అందాయి. కాకినాడ నార్త్ స్టేషన్ పరిధిలోని ఒక షాపునకు అత్యధికంగా 117 దరఖాస్తులు వచ్చాయి. రాజమండ్రి డివిజన్లో15 షాపులకు, కాకినాడ డివిజన్లో 23 షాపులకు, అమలాపురం డివిజన్లో 42 షాపులకు ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చాయి. భద్రాచలంలోని ఏడు షాపులకు గాను రెండు షాపులకు మాత్రమే దరఖాస్తులు అందాయి. మిగిలిన 154 షాపులకు మరోమారు దరఖాస్తులు ఆహ్వానించవచ్చని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కేవలం మద్యంషాపుల దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ. 14.89 కోట్ల ఆదాయం లభించింది. లక్కీడిప్ ద్వారా కేటాయింపు మద్యం షాపుల లెసైన్స్‌లను లక్కీడిప్ ద్వారా వ్యాపారులకు కేటాయించారు. కాకినాడ అంబేద్కర్ భవన్లో భారీ ఏర్పాట్ల మధ్య శనివారం డీఆర్ఓ బి. యాదగిరి రాజమండ్రి డివిజన్లోని షాపులకు లక్కీ డ్రా తీశారు. అలాగే కాకినాడ డివిజన్‌కు కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్, అమలాపురం డివిజన్‌కు జెడ్పీ సీఈఓ భగవాన్ లక్కీడిప్ తీశారు. లక్కీ డిప్లో షాపులు దక్కించుకున్న వారికి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ లెసైన్స్‌లు అందజేశారు. భారీ బందోబస్తు జిల్లా నలుమూలల నుంచి సుమారు ఆరు వేల మంది వ్యాపారులు, వారి అనుచరులు కాకినాడ అంబేద్కర్ భవన్‌కు చేరుకోవడంతో డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర రెడ్డి నేతృత్వంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్టాండు సెంటర్ నుంచి వార్ఫు రోడ్డు మీదుగా ట్రాఫిక్ మళ్లించారు. -
లక్కీ కిక్కు ఎవరికో?
సంగారెడ్డి క్రైం: జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ సోమవారం జరగనుంది. అదృష్టం ఎవరిని వరించేనోనని దరఖాస్తు చేసుకున్న వారిలో ఉత్కంఠ మొదలైంది. ఉదయం 11 గంటలకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డా. ఎ.శరత్ సమక్షంలో సంగారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో లాటరీని నిర్వహిస్తారు. దుకాణాలను దక్కించుకున్న వారికి లెసైన్సులు అదేరోజు ఖరారు చేస్తారు. జిల్లాలో 176 దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా 161 వాటికి మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 1,195 మంది దరఖాస్తులు చేసుకున్నారు. సంగారెడ్ది ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 102 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా 87 దుకాణాలకుగానూ 449 దరఖాస్తులు వచ్చాయి. మెదక్ పరిధిలోని 74 మద్యం దుకాణాలకుగానూ 746 దరఖాస్తులు దాఖలయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్చెరు, నర్సాపూర్‌లో ఫీజు పెద్దమొత్తంలో ఉండటంతో దుకాణాల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదు. జిల్లాలోని జోగిపేట, మెదక్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు పోటీ నెలకొన్నది. -
కొత్త పాలసీ ఏంటో..?
ఖమ్మం క్రైం: ఎక్సైజ్ కొత్త పాలసీ విధానం ఇంకా ప్రకటించక పోవడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. వైన్‌షాపుల లెసైన్స్ గడువు జూన్ 30వ తేదీతో ముగియనుంది. దీంతో కొత్త షాపులకు లెసైన్స్ ఇచ్చేందుకు అనుసరించాల్సిన అంశాలపై ఎక్సైజ్ అధికారులకు ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ కారణంగా గడువు ముగిసేలోపు చేయాల్సిన పనులు ఏ విధంగా చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ విధి విధానాలు ఖరారు కావాల్సి ఉంది. అలాగే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపారు. షాపుల లెసైన్స్‌లు రెన్యువల్ చేసే సమయంలో ఆ షాపులను పరిగణలోకి తీసుకోవాలా..? వద్దా..? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే జిల్లా ఉన్నతాధికారులు మాత్రం కిందిస్థాయి సిబ్బందిని పూర్తి వివరాలను అందజేయాలని ఆదేశించారు. ఏయే ప్రాంతాల్లో ఎంతెంత అమ్మకాలు జరుగుతున్నాయనే పూర్తి వివరాలను కమిషనర్ కోరినట్లు తెలిసింది. సీమాంధ్రలో కలుస్తున్న తొమ్మిది వైన్‌షాపులకు సంబంధించి ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ షాపులను తెలంగాణ రాష్ట్రంలో కలపాలా... ఆంధ్రా రాష్ట్రంలో ఉంచాలా అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయించకపోవడంతో అధికారులు దానికి సంబంధించి ప్రత్యేక నివేదికను తయారు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 153 వైన్‌షాపులు, 44 బార్ అండ్ రెస్టారెంట్లు, మూడు క్లబ్‌లకు సంబంధించి లెసైన్స్‌లను పాత విధానంతోనే అమలు చేస్తారా... లేక కొత్త రాష్ట్రంలో కొత్త విధానాలు రూపొందిస్తారో... వేచి చూడాల్సి ఉంది. నేడు వైన్‌షాపుల యజమానులతో కమిషనర్ సమావేశం రాష్ట్రంలో లెసైన్స్ విధానంపై శనివారం హైదరాబాద్‌లో జిల్లా వైన్‌షాపుల యజమానులతో కమిషనర్ నదీం అహ్మద్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మద్యం పాలసీ విధానం అమలు తీరు గురించి చర్చించనున్నట్లు తెలిసింది. వరుస ఎన్నికల నేపథ్యంలో షాపు యజమానులకు కొంత నష్టం జరగడంతో.. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించి షాపు యజ మానులతో మాట్లాడేందుకు హైదరాబాద్‌కు పిలిపించినట్లు వైన్‌షాపు యజమానులు తెలిపారు.