20 వేల సంస్థలకు కేంద్రం భారీ షాక్
న్యూఢిల్లీ: స్వచ్ఛంద సంస్థలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 వేల స్వచ్ఛంద సంస్థల లైసెన్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం 13వేల స్వచ్ఛంద సంస్థలు మాత్రమే సరైన లైసెన్స్‌లు కలిగి ఉన్నాయని, మిగితా సంస్థలన్నీ కూడా నిబంధనలు ఉల్లంఘించాయని కేంద్రం ప్రకటించింది.
మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విదేశీయుల విభాగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమయంలో దేశంలో మొత్తం 33 వేల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని, వీటిల్లో 20 వేల సంస్థలు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని అతిక్రమించాయని, లైసెన్స్ విషయంలో తప్పుడు ధ్రువపత్రాలు ఉపయోగించడంతోపాటు అనైతికంగా వ్యవహరించారని, అందుకే వారి లైసెన్స్‌లు రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. చట్టపరంగా 13 వేల సంస్థలకు మాత్రమే ప్రస్తుతం గుర్తింపు ఉన్నట్లు స్పష్టం చేసింది.