లక్కీ కిక్కు ఎవరికో?
సంగారెడ్డి క్రైం: జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ సోమవారం జరగనుంది. అదృష్టం ఎవరిని వరించేనోనని దరఖాస్తు చేసుకున్న వారిలో ఉత్కంఠ మొదలైంది. ఉదయం 11 గంటలకు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డా. ఎ.శరత్ సమక్షంలో సంగారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో లాటరీని నిర్వహిస్తారు.
దుకాణాలను దక్కించుకున్న వారికి లెసైన్సులు అదేరోజు ఖరారు చేస్తారు. జిల్లాలో 176 దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా 161 వాటికి మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 1,195 మంది దరఖాస్తులు చేసుకున్నారు. సంగారెడ్ది ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 102 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా 87 దుకాణాలకుగానూ 449 దరఖాస్తులు వచ్చాయి. మెదక్ పరిధిలోని 74 మద్యం దుకాణాలకుగానూ 746 దరఖాస్తులు దాఖలయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పటాన్‌చెరు, నర్సాపూర్‌లో ఫీజు పెద్దమొత్తంలో ఉండటంతో దుకాణాల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదు. జిల్లాలోని జోగిపేట, మెదక్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు పోటీ నెలకొన్నది.