
సాక్షి, ఒడిశా: మంత్రాలతో రోగాలను నయం చేస్తామని చెబుతూ, అమాయకులను మోసం చేస్తున్నారన్న ఆరోపణలతో ఐదుగురు మహిళలను చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ భయనక సంఘటన ఒడిశాలోని బాదాసాహి జిల్లాలోని మధుపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని స్థానికులు ఐదుగురి మహిళలపై చేతబడి చేస్తున్నారని ఆరోపణలు మోపారు. గ్రామస్థులు అందరు కలిసి వారిని ఓ చెట్టుకు కట్టేశారు. అనంతరం వారిని చితకబాదారు. ఆపడానికి ప్రయత్నించిన వారి భర్తలను కూడా చితకబాదారు. దీనిని చూడడానికి చాలా మంది గుంపులు గుంపులుగా తరలి వచ్చారు.
ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీలు, ఫొటోలు చూసే వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు చెబుతున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
చేతబడి చేస్తున్నారని మహిళలను చెట్టుకు కట్టేసి చితకబాదారు
Comments
Please login to add a commentAdd a comment