న్యూఢిల్లీ: ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా పాకిస్తాన్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను శ్రీలంక 2-0తో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. దాంతో యూఏఈలో పాక్ పై సిరీస్ గెలిచిన తొలి జట్టుగా లంక చరిత్ర కెక్కింది. అయితే ఈ సిరీస్ గెలవడానికి మంత్రగత్తె ఆశీర్వాదమే కారణమంటూ మొత్తం పర్యటన ముగిసిన తరువాత లంక కెప్టెన్ చండిమాల్ వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యాడు. అదే నిజమైతే.. ఆపై జరిగిన వన్డే, టీ 20 సిరీస్ ను ఎందుకు గెలవలేదంటూ పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ సైతం ప్రశ్నించాడు.
ఈ క్రమంలోనే భారత పర్యటనకు లంక జట్టు వచ్చిన తరుణంలో చండిమాల్ కు ఊహించని ప్రశ్న ఎదురైంది. 'టీమిండియాపై సిరీస్ గెలవడానికి మంత్రగత్తె అశీస్సులు తీసుకున్నారా?' అంటూ ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు చండిమాల్ బిక్కమొహం వేశాడు. ఆ ప్రశ్నకు ఏమి చెప్పాలా అని చండిమాల్ సతమతం అవుతుండగా పక్కనే ఉన్న జట్టు మేనేజర్ అసంక గురుసిన్షా దానికి ముగింపు ఇచ్చాడు. 'అందరిలానే మాకు కొ్న్ని నమ్మకాలున్నాయి. కానీ అంతిమంగా మైదానంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన జట్టుదే విజయం'అని సర్దిచెప్పుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment