
సాక్షి, నూజివీడు (కృష్ణా జిల్లా) : నూజివీడు మండలం యలమందలో శుక్రవారం క్షుద్రపూజలు కలకలం రేపాయి. 100 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన అతి సుదీర్ఘమైన చంద్రగ్రహణం నాడు నరబలి ఇస్తే అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయనే మూఢ నమ్మకం ఉంది. దీంతో యనమదలకు చెందిన ఏడుగురు వ్యక్తులు క్షుద్రపూజలు చేయాలని నిశ్చయించుకున్నారు.
అనుకున్నదే తడవుగా ఓ ప్రాంతంలో ఇందుకు తగిన ఏర్పాటు పూర్తి చేశారు. నరబలి అనంతరం మృతదేహాన్ని పూడ్చేందుకు గొయ్యిని సైతం తవ్వించాడు. చిన్నం ప్రవీణ్ అనే వ్యక్తిని బలి ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకోగా, విషయం తెలుసుకున్న అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురి అరెస్టు చేశారు. క్షుద్రపూజలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment