
ఏలూరు, సాక్షి: రాష్ట్రంలో టీడీపీ అరాచక పాలన ఆరంభం కాకమునుపే.. దమనకాండకు దిగుతోంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై, సానుభూతిపరులపై రాజకీయ ప్రతీకార చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు కొనసాగుతుండగా.. తాజాగా నూజివీడులో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది.
గెలుపు మదంతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు నూజివీడు టౌన్ పెద్ద గాంధీ బొమ్మ సెంటర్‌లో కత్తులతో వైఎస్సార్‌సీపీ నేత మీద దాడికి దిగారు. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ నడకుదుటి గిరీష్‌పై దాడి చేశారు. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. కొందరు ధైర్యం చేసి ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు.
ఈ ఘటనలో గిరీష్ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఘటన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా.. అడ్డుకునే ప్రయత్నాలేవీ చేయకపోవడం ఘోరం. పోలీసులు వ్యవహరించిన తీరుపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: టీడీపీ వేధింపులకువైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బలి
Comments
Please login to add a commentAdd a comment