eclipse
-
నేడు సోమావతి అమావాస్య..కొన్ని కోట్ల గ్రహణములతో..
ఈ అమావాస్య అత్యంత శక్తిమంతమైనది. సోమవారంతో కూడిన అమావాస్య కావడంతో దీన్ని సోమావతీ అమావాస్య అని పిలుస్తారు. ఇక ఇది కొన్ని కోట్ల సూర్యగ్రహణములతో సమానమైనది. సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని శాస్త్రం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. సోమవతీ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి: ⇒ సోమావతీ అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం. ⇒ ఈ సోమావతీ వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ⇒ శని మంత్రాన్ని పఠించి, శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించాలి. ⇒ గంగా నది, త్రివేణీ సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతీ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే, ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు, బాధలు తొలగుతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. ⇒ వేదవ్యాస మహర్షి చెప్పినదాని ప్రకారం - సోమావతీ అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసి, పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. సోమావతి అమావాస్య గురించి ఒక కథఉంది. పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైన ఏడుగురు కుమారులు, పెళ్లికాని కుమార్తె ఉంది. ఒకరోజు పెళ్ళికాని ఆ కుమార్తెను ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడతారు. ఈ విషయమై ఒక పురోహితుడి దగ్గరకి వెళ్లి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది ఆ వర్తకుని భార్య. అది చూసి పురోహితుడు ఆమె పెళ్లైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా.. వారు చాలా బాధపడి దీనికి ఎలాంటి పరిష్కారమూ లేదా అని అడుగుతారు. అప్పుడు పురోహితుడు సింఘాల్ ప్రాంతానికి వెల్లి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు, తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరితో కలిసి ఆ ప్రాంతానికి బయలుదేరుతాడు. వీరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సివస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టు కిందే విశ్రాంతి తీసుకుంటారు. ఆ చెట్టుపైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి ఆ రాబందు పిల్లలను తినటం పరిపాటి. ఈ సారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంట తన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయ చేస్తుంది. ఆ ఇద్దరు అక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలలు పాటు సేవ చేయగా.. ఈ సోమావతి అమావాస్య రోజునే ఈ కన్య నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావిచెట్టు దగ్గరికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. ఇది సోమావతీ అమావాస్య కథ. అంతేగాకుండా సోమావతీ అమావాస్య రోజున పూర్వీకుల కోసం దానం చేస్తే కోపంతో ఉన్న పూర్వీకులు కూడా సంతోషించి తమ సంతతి పురోగతిని దీవిస్తారు. ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజున వివాహితులు , అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరతాయి. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుని, పార్వతీపరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి, వీలైతే మౌనం పాటించాలి. (చదవండి: సైన్స్ ఆగిపోయిన సమయాన ..) -
వీడిన సూర్యగ్రహణం
సాక్షి, హైదరాబాద్ : ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం వీడింది. సూర్యుడికి చంద్రుడు అడ్డు రావడంతో గగన తలంలో వలయాకార సుందర దృశ్యం ఆదివారం కనువిందు చేసింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది. తొలుత భారత్‌లో గుజరాత్‌లోని ద్వారకలో గ్రహణం కనిపించింది. ముంబైలో ఆకుపచ్చ వర్ణంలో సూర్యడు సాక్షాత్కరించాడు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో సంపూర్ణ సూర్యగ్రహణం ఆవిష్కృతమైంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9.16 గంటలకు సూర్యగ్రహణం మొదలైంది. ఇది మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు మరింత స్పష్టం కన్పించనుంది. భారత్‌లో మాత్రం ఉదయం 9.56 గంటలకు ఆరంభమై...మధ్యాహ్నం 3 గంటలా 4 నిమిషాలకు ముగిసింది. సూర్యగ్రహణం వీడడంలో భారత్‌లో కొన్ని ఆలయాలు ఈ రోజు తెరచుకున్నాయి. సూర్యగ్రహణం అనంతరం తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశారు. అలాగే పుణ్యాహవచనం నిర్వహించారు. ఏకాంతంగానే శ్రీవారికి పూజా కైంకర్యాలు చేశారు. నేడు పూర్తిగా దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే విజయవాడలో దుర్గమ్మ ఆలయం తెరుచుకుంది. సాయంత్రం పంచహారతుల అనంతరం అమ్మవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనం లభించనుంది. -
సూర్యగ్రహణంతో కరోనా తగ్గుతుందా?
సాక్షి, హైదరాబాద్ : ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతం అయింది. అరుదుగా సంభవించే పూర్తి స్థాయి వలయాకార సూర్యగ్రహణం ఆదివారం ప్రారంభమైంది. సూర్యుడికి చంద్రుడు అడ్డు రావడంతో గగన తలంలో వలయాకార సుందర దృశ్యం కనువిందు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఉదయం 9.15 గంటలకు సూర్యగ్రహణం మొదలు కాగా, ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రమే ఇది సంపూర్ణంగా కనిపిస్తోంది. భారత్‌లోనే మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా దర్శనం ఇస్తోంది. ఈ ఏడాదిలో ఇదే తొలి సూర్యగ్రహణం. ఇది పాక్షిక సూర్య గ్రహణం కాగా, డిసెంబర్ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9.16 గంటలకు సూర్యగ్రహణం మొదలైంది. ఇది మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు మరింత స్పష్టం కన్పించనుంది. భారత్‌లో మాత్రం ఉదయం 9.56 గంటలకు ఆరంభమై...మధ్యాహ్నం 3 గంటలా 4 నిమిషాలకు ముగియనుంది. అయితే తెలంగాణలో మధ్యాహ్నం 1.44 గంటల వరకు 51 శాతం గ్రహణం వుంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10 గంటల 21 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటా 49 నిమిషాల వరకు 46 శాతం గ్రహణం ఉండనుంది. (సూర్యగ్రహణం నేడే) సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది.. కాగా భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడి ప్రవేశంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడిని చంద్రుడు కప్పేయడం కారణంగా భూమిపై చంద్రుడి నీడ మాత్రమే కన్పిస్తుంది. ఈ సూర్యగ్రహణం ఒక్క అమావాస్య రోజున మాత్రమే జరుగుతుంది. డెహ్రాడూన్, సిర్సా, టెహ్రీ ప్రాంతాల్లో వలయాకారంలో కన్పించే సూర్యగ్రహణాన్ని, ఢిల్లీ, ఛండీగఢ్, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు పట్టణాల్లోని ప్రజలు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. ఇక గ్రహణం రోజున దేశంలోని అనేక ఆలయాలను మూసివేశారు. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం, స్నానం చేయరాదని పెద్దలు చెప్తుంటారు. దేవుళ్ల విగ్రహాలను తాకరాదని, గ్రహణం విడిచిన తర్వాత మాత్రమే స్నానం చేసి తినాలని చెప్తుంటారు. గ్రహణం అనంతరం ఆలయాలు సంప్రోక్షణ చేసి మరుసటి రోజు నుండి యధావిధిగా దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. 0.001 శాతం మాత్రమే వైరస్ అంతం.. ఇక ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను సూర్యగ్రహణం వేళ అతినీలలోహిత కిరణాలు హరిస్తాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కిరణాలు భూమి మీద పడినపుడు కరోనా వైరస్ 0.001 శాతం మాత్రమే చనిపోయే అవకాశముంది. -
చంద్రగ్రహణం..క్షుద్రపూజలు కలకలం
-
చంద్రగ్రహణం.. నరబలికి యత్నం..
సాక్షి, నూజివీడు (కృష్ణా జిల్లా) : నూజివీడు మండలం యలమందలో శుక్రవారం క్షుద్రపూజలు కలకలం రేపాయి. 100 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన అతి సుదీర్ఘమైన చంద్రగ్రహణం నాడు నరబలి ఇస్తే అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయనే మూఢ నమ్మకం ఉంది. దీంతో యనమదలకు చెందిన ఏడుగురు వ్యక్తులు క్షుద్రపూజలు చేయాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఓ ప్రాంతంలో ఇందుకు తగిన ఏర్పాటు పూర్తి చేశారు. నరబలి అనంతరం మృతదేహాన్ని పూడ్చేందుకు గొయ్యిని సైతం తవ్వించాడు. చిన్నం ప్రవీణ్ అనే వ్యక్తిని బలి ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకోగా, విషయం తెలుసుకున్న అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురి అరెస్టు చేశారు. క్షుద్రపూజలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. -
అరుదైన అద్భుతం ఆవిష్కృతం నేడే...
శుక్రశనివారాల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అరుదైన ఖగోళ అద్భుతం ఆవిష్కృతం కానుంది. 21వ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం (వివిధ దశలు దాటే ప్రక్రియ మొత్తం ఆరుగంటలకు పైగానే) అందరికీ కనువిందు చేయనుంది. భారత కాలమానం ప్రకారం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి (27న) 10.44 నిముషాలకు మొదలై శనివారం (28న) తెల్లవారుజామున 4.58 నిముషాలకు ముగియనుంది. శనివారం తెల్లవారుజామున ఒంటిగంట 2 గంటల 43 నిముషాల మధ్యలో చంద్రగ్రహణం ఉచ్ఛదశకు చేరిన సందర్భంగా ముదురు ఎరుపులో కనిపిస్తుంది. దీనిని ‘బ్లడ్ మూన్’గా అభివర్ణిస్తున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణంలో సూర్యుడి ప్రత్యక్ష కిరణాలు భూమి అంచుల నుండి చంద్రుడిపై పడతాయి. అప్పుడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈ మొత్తం చంద్రగ్రహణ దశనే బ్లడ్‌మూన్‌గా పిలుస్తున్నారు.అయితే మళ్లీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం చోటుచేసుకోవాలంటే మరో 105 ఏళ్లు అంటే 2123 జూన్ 9వ తేదీ వరకు వేచి చూడాల్సిందే మరి... ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, దక్షిణ అమెరికాల్లోని ప్రజలకు ఇది కనువిందు చేయనుంది. ఉత్తర అమెరికా (యూఎస్ఏ)ప్రజలకు (వారికి శుక్రవారం పగలు అయినందున) ఇది కనిపించే అవకాశాలు లేవు. ఆయా దేశాల కాలమానాలను బట్టి చందమామ ఎంత స్పష్టంగా కనపడుతుందనేది ఆధారపడి ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తూర్పు ఆసియా దేశాల్లో కొంత ఆలస్యంగా శనివారం తెల్లవారుజామున, మిగతా చోట్ల శుక్రవారం రాత్రి గ్రహణంలో జాబిల్లి కనిపిస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మిగతా ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అంటార్కికా అంతటా అన్ని గ్రహణదశలు వీక్షించవచ్చు. భారత్‌లో... భారత్‌లో చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి 10గంటల 44 నిముషాలకు మొదలై అర్థరాత్రి ఒంటిగంటకు సంపూర్ణ గ్రహణ దశ ప్రారంభమవుతుంది. గంటా 43 నిముషాల పాటు కనిపించే ఈ బ్లడ్‌మూన్ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వీక్షించవచ్చు. కాలుష్య ప్రభావం కారణంగా దేశంలోని కొన్ని మెట్రోనగరాల్లో ఈ గ్రహణం పూర్తిస్థాయిలో కనబడకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇది మరింత స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ గ్రహణం సందర్భంగా భూమి నుంచి కక్ష్యలో జాబిల్లి అత్యంత దూరంలో ఉండడం వల్ల మామూలుగా కంటే చిన్నగా కనిపిస్తుంది. సూపర్‌మూన్ (చంద్రుడు తన కక్ష్యలో భూమికి అతి సమీపంగా వచ్చినపుడు) సందర్భంగా కంటే కూడా ఇంకా చిన్నదిగా కనిపించడాన్నే ‘మైక్రో మూన్’గానూ పిలుస్తారు. భూమి నీడ మధ్యలోంచి చందమామ ఎక్కువ సమయం ప్రయాణిస్తున్న కారణంగానే అధికసమయం చీకటి ఏర్పడి సుదీర్ఘ గ్రహణం ఏర్పడేందుకు కారణమవుతుంది. సంపూర్ణ సూర్యగ్రహణం సందర్బంగా తీసుకునే జాగ్రత్తలకు భిన్నంగా దీనిని వీక్షించేందుకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు, అద్దాలు అవసరం లేదు. అయితే ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటేనే వీక్షికులకు ఈ గ్రహణం స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయి. అదేరోజు రాత్రి అంగారక గ్రహం (మార్స్) కూడా చందమామకు అత్యంత చేరువగా కనిపించడం ఈ సారి మరో ప్రత్యేకత. ఈ గ్రహాన్ని కూడా పరికరాల అవసరం లేకుండా నేరుగా కళ్లతో చూసే అవకాశాలున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. సెల్ఫీలు దిగొచ్చు... గ్రహణం చూస్తే ఇది జరుగుతుంది, అతి జరుగుతుందనే అపోహలు, మూఢనమ్మకాలు పక్కనపెట్టి ఈ అరుదైన సందర్భాన్ని పూర్తిస్థాయిలో భారతీయులు ఆనందించాలని ఖగోళ శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. ఈ శతాబ్దంలోనే అతి సుదీర్ఘ గ్రహణం సందర్భంగా ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తూ ‘ఎకిలిప్స్ ఈటింగ్’ హాష్‌ట్యాగ్‌తో సెల్ఫీలు అప్లోడ్ చేయాలంటూ కోరారు. గ్రహణాలు వీక్షిస్తే ఆరోగ్యపరంగా, ఇతరత్రా నష్టాలు వాటిల్లుతాయనే కొన్ని అపోహలు భారతీయుల్లో ఉండడం దురదృష్టకరమని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్‌కు చెందిన నిరుజ్ మోహన్ రామానుజమ్ అన్నారు. గ్రహణమపుడు ఆకాశం అత్యంత సుందరంగా, మనోహరంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటే మంచిదని, లేకపోతే ఇలాంటి అరుదైన ఘట్టాలను చూసే అవకాశాన్ని కోల్పోతామన్నారు. ఈ గ్రహణమపుడు కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి ఫోటోలు దిగి వాటిని పంపించాల్సిందిగా ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. పర్వతాల వెనక్కు సూర్యుడు మాయమైనపుడు ఎలాంటి భయం లేనపుడు సూర్యుడిని చంద్రుడు దాచిపెడితే ఎందుకు భయపడాలంటూ ప్రశ్నించారు. చదవండి: క్రవారం భూమి అంతం..!! -
రేపు తిరుమల ఆలయం మూసివేత
తిరుమల: చంద్రగ్రహణం కారణంగా 27వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 28వ తేదీ తెల్లవారు జామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బుధవారం తెలిపారు. శుక్రవారం రాత్రి 11.54కు చంద్రగ్రహణం ప్రారంభమై శనివారం ఉదయం 3.49 వరకు ఉంటుంది. గ్రహణం సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. శనివారం ఉదయం 4.15కు సుప్రభాతంలో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసి పుణ్యహవచనం నిర్వహిస్తారు.అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చనసేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. 27న ఆర్జిత, గరుడ సేవలు రద్దు.. చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలతో పాటు పౌర్ణమి గరుడ సేవనూ టీటీడీ రద్దు చేసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి తిరుమలలో అన్నప్రసాద వితరణ కూడా నిలిపివేస్తున్నారు. తిరిగి శనివారం ఉదయం 9గంటల నుంచి అన్నప్రసాదాలు పునఃప్రారంభం కానున్నాయి. భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదాల విభాగం ఆధ్వర్యంలో 20వేల పులిహోర, టమోటా అన్నం ప్యాకెట్లను సాయంత్రం 3 నుంచి 5 వరకు పంపిణీ చేయనున్నారు. తిరుమలలోని ఐదు అన్నప్రసాదాల వితరణ కేంద్రాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్, నాదనీరాజన వేదిక ప్రాంగణంలో అన్నదానం నిర్వహిస్తామన్నారు. మరోవైపు తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, స్లాట్ దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. -
శుక్రవారం భూమి అంతం..!!
వాషింగ్టన్ : 21వ శతాబ్దంలోనే దీర్ఘకాల చంద్రగ్రహణం ఈ నెల 27(శుక్రవారం) సంభవించనుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపెక్కనున్నాడు(బ్లడ్ మూన్). సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరసలోకి రావడం వల్ల ఇది జరుగుతుంది. సూర్యుడి కిరణాలు భూమిపై ప్రసరించి అతికొద్ది మొత్తంలో చంద్రుడిని చేరడంతో చందమామ ఎరుపు రంగులోకి మారతాడు. ఇదే సమయంలో అంగారక గ్రహం మన కంట పడనుంది. మునుపెన్నడూ ఎరుగని రీతిలో అత్యంత ప్రకాశవంతంగా అంగారక గ్రహం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ శతాబ్దపు ఖగోళ వింతను తిలకిద్దామని ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, మరికొందరు మాత్రం శుక్రవారమే మానవుని మనుగడకు ఆఖరి రోజని హడలెత్తిపోతున్నారు. బ్లడ్మూన్తో పాటుగా అంగారక గ్రహం కనిపిస్తే విపత్కర పరిస్థితులు సంభవిస్తాయని పూర్వీకులు విశ్వసించేవారు. అయితే, అది నిజమేనని ఇప్పటికీ కొందరు నమ్ముతున్నారు. శుక్రవారం ప్రళయం సంభవించడం ఖాయమని వారు అంటున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. 2003లో చివరిసారిగా అంగారక గ్రహం ఆకాశంలో కనిపించిందని, అప్పుడేం జరగనిది ఇప్పుడు జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నారు. 2003లో మార్స్ గ్రహం కనిపించినప్పుడు భూమికి, అంగారకుడికి మధ్య దూరం 56 మిలియన్ కిలోమీటర్లని చెప్పారు. శుక్రవారం గతంలో కంటే అత్యంత ప్రకాశవంతంగా మార్స్ ప్లానెట్ కనిపించనుందని వెల్లడించారు. -
31న కనకదుర్గ ఆలయం మూసివేత
సాక్షి, విజయవాడ: ఈనెల 31వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయాన్ని మధ్యాహ్నం నుంచి మూసివేయనున్నారు. ఉదయం 10 గంటలకు మహానివేదన అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. గ్రహణం అనంతరం ఆలయ శుద్ధి, ప్రధానాలయ, ఉపాలయమూర్తులకు స్నపనాది కార్యక్రమమాల నిర్వహణ చేపడతారు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 8-30 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. జనవరి 31న సాయంత్రం 5.18 నుంచి రాత్రి 8.41 గంటల వరకు చంద్ర గ్రహణం ఉంటుంది. -
31న శ్రీవారి ఆలయం మూసివేత
సాక్షి, తిరుమల: ఈనెల 31వ తేదీన తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని ఉదయం నుంచి రాత్రివరకు మూసివేయనున్నారు. ఆరోజు చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూసి ఉంచనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. -
గ్రహణం వేళ కోవెలల మూసివేత
-నేటి ఉదయం సంప్రోక్షణానంతరం పునర్దర్శనాలు రామచంద్రపురం రూరల్ : చంద్రగ్రహణంతో సోమవారం జిల్లాలోని ఆలయాలను మూసివేశారు. ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు అభిషేకాలు, పూజలు జరిపించారు. మధ్యాహ్నం 12.30 గంటల ఆలయాన్ని మూసివేశారు. తిరిగి మంగళవారం ఉదయం 8.30 గంటలకు పునర్దర్శనం కల్పించనున్నట్లు ఈఓ పెండ్యాల వెంకట చలపతిరావు తెలిపారు. అప్పనపల్లిలో.. మామిడికుదురు (పి.గన్నవరం): చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీబాలబాలాజీ స్వామి ఆలయాన్ని సోమవారం ఉదయం 11 గంటలకు మూసివేశారు. స్వామి వారికి ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు చెల్లించి ఆలయాన్ని మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి స్వామి వారి దర్శనాన్ని పునరుద్ధరిస్తామని ఈఓ పొలమూరి బాబూరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్ తెలిపారు. తలుపులమ్మ లోవలో.. తుని రూరల్ : లోవ దేవస్థానంలో సోమవారం శ్రావణమాసం, పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తలుపులమ్మవారికి ప్రీతికరమైన చండీహోమాన్ని వేదపండితులు ముష్టి వెంకట పురుషోత్తమశర్మ, రాణి సుబ్రహ్మణ్య శర్మ, శశాంక్ త్రిపాఠి నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్, చైర్మన్ కరపా అప్పారావు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా హోమం అనంతరం ప్రత్యేక పూజలు చేశాక ఉదయం 11.15 గంటలకు ఆలయం తలుపులను మూసివేశారు. జాతీయ రహదారివద్ద ఉన్న నమూనా ఆలయాన్ని కూడా మూసివేసినట్టు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం ఉదయం 8.45 గంటలకు భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు. అయినవిల్లిలో.. అయినవిల్లి (పి.గన్నవరం) : చంద్రగ్రహణం సందర్భంగా అయినవిల్లి విఘ్నేశ్వరాలయాన్ని సోమవారం ఉదయం 11 గంటల నుంచి మూసివేశారు. మంగళవారం తెల్లవారు జామున ఆలయ ప్రధానార్చకులు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి సంప్రోక్షణ పూజలు చేసి ఆలయాన్ని తెరుస్తారని, ఉదయం 6 గంటల నుంచి స్వామికి యథావి«ధిగా పూజలు నిర్వహిస్తామని ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు. -
వరస కడుతున్న విదేశీ కంపెనీలు
♦ ప్రీమియం ఉత్పత్తులతో ఎంట్రీ ♦ గట్టిపోటీనిస్తున్న దేశీ బ్రాండ్లు ♦ రూ.7 వేల కోట్లకు పరుపుల పరిశ్రమ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెర్టా, కింగ్ కోయిల్, ఎక్లిప్స్, స్ప్రింగ్ ఎయిర్, సిమ్మన్స్... ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? విదేశీ ‘పరుపుల’ బ్రాండ్లు. పెరుగుతున్న టూరిజానికి తగ్గట్టుగా హోటళ్లు, రిసార్ట్‌లతో ఆతిథ్య రంగం మంచి జోష్‌మీద ఉండటం, ఇళ్లలోనూ ఖరీదైన పరుపుల వాడకం పెరుగుతుండటంతో దేశంలో అవకాశాల్ని అందిపుచ్చుకోవటానికి ఈ కంపెనీలు క్యూ కడుతున్నాయి. కొన్నాళ్ల కిందటి వరకూ ఇక్కడి డీలర్లు నేరుగా విదేశాల నుంచి పరుపులను తెప్పించి విక్రయించేవారు. అయితే దిగుమతి పన్నులు ముడిపడి ఉండడంతో ఉత్పత్తులు ఖరీదు కావటం... డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండటంతో నేరుగా విదేశీ కంపెనీలే ఇండియాలో తయారీకి సై అంటున్నాయి. బెడ్డింగ్ సొల్యూషన్స్‌లో ఈ విదేశీ బ్రాండ్లకు దేశీ దిగ్గజాలు కర్లాన్, సెంచురీ, డ్యూరోఫ్లెక్స్, స్లీప్‌వెల్, గోద్రెజ్ ఇంటీరియో, స్ప్రింగ్ ఫిట్, పెప్స్, నీల్కమల్ వంటివి గట్టి పోటీనిస్తున్నాయి. ఒకదాన్ని మించి ఒకటి: అంతర్జాతీయ కంపెనీల్లో 100 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న కంపెనీలు కూడా ఉన్నాయి. విక్రయాల పరంగా ప్రపంచ నంబర్ 1 కంపెనీ తమదేనని సీలీ చెబుతోంది. అట్లాంటాకు చెందిన సిమ్మన్స్ బెడ్డింగ్ కంపెనీకి 250 యూఎస్ పేటెంట్లు ఉన్నాయి. కంపెనీ 140 ఏళ్లకుపైగా ఈ రంగంలో ఉంది. 110 దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. కింగ్ కాయిల్ 80 దేశాల్లో అడుగు పెట్టింది. స్ప్రింగ్ ఎయిర్ ప్రపంచ టాప్-10 కంపెనీల్లో ఒకటి. సీలీ భారత్‌లో అత్యంత ఖరీదైన పరుపులను అమ్ముతోంది. సీలీ పరుపుల ధరలు భారతీయ రేంజ్లో రూ. 45,000 నుంచి రూ.1.2 లక్షల వరకు ఉన్నాయి. అంతర్జాతీయ రేంజ్లో రూ.లక్ష నుంచి రూ.11.5 లక్షల వరకు ఉన్నాయి. ఇక్కడి మార్కెట్ కోసమే ఇండియన్ రేంజ్‌ను ప్రవేశపెట్టడం విశేషం. హైదరాబాద్‌లో రూ.3 లక్షలు ఆపైన ఖరీదు చేసే అల్ట్రా ప్రీమియం పరుపులు అన్ని బ్రాండ్లవీ కలిపి నెలకు 10-12 యూనిట్లు అమ్ముడవుతున్నాయని సీలీ గ్యాలరీ ప్రమోటర్ శ్రీనివాసరావు తెలిపారు. పోటీ పెరగటంతో నిలకడగా ధర... గత రెండేళ్లుగా దేశీయ బ్రాండ్ల పరుపుల ధర పెరగలేదని రిపోస్ చెబుతోంది. మార్కెట్లో తీవ్రపోటీ ఉందని, విదేశీ దిగ్గజాలు కూడా నేరుగా మార్కెట్లోకి అడుగు పెడతున్నాయని తెలియజేసింది. పరుపుల ధర పెంచాల్సి వస్తే కంపెనీలు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయని ఒక డీలర్ వెల్లడించారు. విదేశీ బ్రాండ్ల ఉత్పత్తుల ధర ఏటా 10 శాతం పెరుగుతోందని మరో డీలర్ తెలిపారు. భారత్‌లో పరుపుల మార్కెట్ విలువ సుమారు రూ.7,000 కోట్లుగా ఉన్నట్లు అంచనా. ఇందులో 15 శాతం వృద్ధి రేటుతో వ్యవస్థీకృత రంగం మూడింట ఒకవంతు కైవసం చేసుకుంది. మెట్రో నగరాలే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఎక్స్‌క్లూజివ్ షోరూంలు, డీలర్ నెట్‌వర్క్‌తో కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఇప్పుడు దాదాపు అన్ని కంపెనీల ఉత్పత్తులు ఆన్లైన్లో లభిస్తున్నాయి. ఉత్పత్తులూ ప్రత్యేకమే.. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. నాణ్యమైన పరుపులను వాడాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీలు ప్రత్యేకతను చూపేందుకు నేచురల్ ప్రోడక్ట్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. అలోవెరా తాపడంతో యాక్సెసరీస్‌ను రిపోస్ మ్యాట్రెస్ తయారు చేస్తోంది. వెదురు, సహజ రబ్బరు, ఆర్గానిక్ కాటన్‌తోనూ ఉత్పత్తి చేస్తున్నట్టు రిపోస్ మ్యాట్రెస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వి.బాలాజీ చెప్పారు. భారత్‌లో తొలిసారిగా సోయా రసంతోనూ యాక్సెసరీస్ రూపొందించినట్లు తెలియజేశారు. కింగ్ కాయిల్ సైతం సహజ సిద్ధ రబ్బరు, ముడి పదార్థాలతో పరుపులను తయారు చేస్తోంది. ఎక్లిప్స్ ఒక అడుగు ముందుకేసి పేటెంట్ కలిగిన అలర్జీ ఫ్రీ పరుపులను విక్రయిస్తోంది. పరుపుల తయారీలో భారత్‌లో అతిపెద్ద కంపెనీ అయిన కర్లాన్ ఆదాయంలో రూ.లక్షకు మించి ఖరీదున్న సూపర్ ప్రీమియం ఉత్పత్తుల వాటా 10 శాతానికి పైగా ఉంది. రెండేళ్ల క్రితం ఇది 5 శాతానికే పరిమితం. దీన్నిబట్టి ఇక్కడి మార్కెట్ పెరుగుతున్న వేగం అర్థం చేసుకోవచ్చు. అన్ని కంపెనీలు కస్టమర్లు కోరిన రంగులు, సైజుల్లో పరుపులను తయారు చేసి ఇస్తున్నాయి. -
28న చంద్రగ్రహణం, సూపర్‌మూన్!
-
'బ్లడ్‌మూన్'.. ఓ అద్భుత ఆవిష్కారం
సెప్టెంబర్ 27 ఆదివారం రాత్రి ఖగోళంలో ఓ అరుదైన, అపురూపమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. గత 33 ఏళ్లలో ఇలాంటి ఘటన సంభవించడం ఇదే మొదటిసారి కాగా, మరో 18 ఏళ్ల దాకా ఈ దృశ్యాన్ని మనం చూడలేము. అదే సూపర్ మూన్. చంద్రగ్రహణం, సూపర్ మూన్ రెండూ ఒకేసారి సాక్షాత్కరిస్తాయి. ఈ అరుదైన బ్లడ్ మూన్‌ను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు, విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భూమికి చంద్రుడికి మధ్య సాధారణంగా ఉండే దూరం.. బాగా తగ్గడమే సూపర్ మూన్. అంటే రోజూ మనకు కనిపించే చందమామ ఈ 27 రాత్రి మరింత పెద్దగా, ఎర్రగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తున్నామంటున్నారు. స్కై అండ్ టెలిస్కోప్ పత్రిక కథనం ప్రకారం వాతావరణం అనుకూలిస్తే ఉత్తర అమెరికాలోని తూర్పుప్రాంత ప్రజలు ఈ చంద్రగ్రహణం మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేదాకా అన్ని దశలను చూడగలుగుతారు. ఈ సమయంలో చంద్రుడు మామూలు సమయంలో ఉండే సైజు కన్నా 14 శాతం పెద్దగా ఉంటాడని, అందుకే దీన్ని 'సూపర్ మూన్'గా పిలుస్తారని ఆ పత్రిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 1982లో సూపర్ మూన్, చంద్రగ్రహణం ఒకేసారి ఏర్పడ్డాయి. తర్వాత మళ్లీ 2015 సెప్టెంబర్ 27న ఇలా కనిపిస్తుంది. 2033 లో అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది ఖగోళంలో సంభవించే అరుదైన చంద్రగ్రహణాల్లో ఒకటి. చంద్రుడికి, సూర్యుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు ఏర్పడేదే చంద్రగ్రహణం అని మనందరికీ తెలుసు. కానీ ఈ ఆదివారం సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేస్తుంది. అయినా కొంత సూర్యకాంతి చంద్రుడిపై పడుతూ ఉండడంతో అప్పుడు జాబిల్లి నారింజరంగులో మెరిసిపోతూ అబ్బురంగా కనిపించనుంది. అందుకే శాస్త్రజ్ఞులు బ్లడ్ మూన్ అంటున్నారు. కాగా, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.40 గంటలకు ప్రారంభమై సుమారు 72 నిమిషాల పాటు (గంటా 12 నిమిషాల పాటు) కొనసాగనుంది. ఉత్తర, దక్షిణ అమెరికాలు, ఐరోపా, ఆఫ్రికా ఖండాలు, పశ్చిమాసియా, తూర్పు పసిఫిక్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చెబుతోంది. అంటే భారత ఉపఖండం సహా మిగతా ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లో ఇది కనిపించదట. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఈ గ్రహణం సంభవిస్తుంది, చంద్రుడు కూడా పెద్దగా కనిపిస్తాడు. అయితే అప్పటికి భారతదేశంలో సూర్యోదయం అయిపోతుంది కాబట్టి, చంద్రుడు కనిపించడు. ఈస్ట్రన్ డేలైట్ టైమ్ (ఈడీటీ) ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటల సమయం కాబట్టి, అప్పుడు పాశ్చాత్య దేశాల్లో చంద్రుడు కనిపిస్తాడు. మరోవైపు ఉత్తరాభాద్ర నక్షత్ర మీనరాశిలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుందని గ్రహశాస్త్రపండితులు తెలిపారు. 72 నిముషాల సుదీర్ఘకాలం పాటు కొనసాగే సంపూర్ణ గ్రహణం భారతదేశంలో కనపడకపోయినా ద్వాదశ రాశులపై దాని ప్రభావం ఉంటూనే ఉంటుందంటున్నారు. -
వాస్తు తప్ప ‘గ్రహణం’ పట్టించుకోరా?
సీఎం కేసీఆర్‌కు మర్రి శశిధర్‌రెడ్డి ప్రశ్న చంద్రగ్రహణం రోజు కృష్ణా ట్రయల్ రన్ ఏమిటని విమర్శ అమీర్‌పేట: హిందువుల ఆచారం ప్రకారం గ్రహణం అనేది శుభకార్యాలకు మంచిదికాదని ఆస్థాన పండితులు చెబుతున్నా..సీఎం కేసీఆర్ పట్టుదలకు పోయి కృష్ణాజలాల అనుసంధానం పనులు చంద్రగ్రహణం రోజునే చేయించడం దురదృష్టకరమని సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. శనివారం అమీర్‌పేటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సచివాలయానికి వాస్తు సరిగ్గాలేదని దానిని వేరేచోటుకు మార్చేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్...మరి గ్రహణం రోజు కృష్ణాజలాల అనుసంధానం పనులు చేపట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కృషి వల్లే నగరానికి కృష్ణాజలాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పండుగ పూట నీటిపరఫరా నిలిపివేస్తారా? మంచినీటి వినియోగం ఎక్కువగా ఉన్న హనుమజ్జయంతి, ఈస్టర్ పండుగ నాడు పనుల పేరుతో నీటిపరఫరాను నిలిపివేయడం సరికాదని శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. పండుగలను దృష్టిలో పెట్టుకుని రెండురోజులు పనులను వాయిదా వేయాలని స్వయంగా హోంమంత్రి, జలమండలి ఎండీని కలిసి కోరినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ప్రజల మేలుకోసం ఎవరైనా మంచి సలహలు ఇస్తే స్వీకరిస్తానని చెబుతున్న సీఎం మాటలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని విమర్శించారు. కృష్ణాజలాల రెండవదశ పనులను వేగవంతంగా పూర్తి చేయించింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని, మూడవదశ విషయంలో తాను, పీజేఆర్ కలిసి అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. -
ఆలయాల మూసివేత
చంద్ర గ్రహణానంతరం మహా సంప్రోక్షణ నేటి ఉదయం 6.30 గంటల నుంచి ద ర్శనాలు చోడవరం/నక్కపల్లి: చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని దేవాలయాలన్నింటినీ బుధవారం మూసివేశారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి మూసివేశారు. గ్రహణ కాలం ముగిశాక రాత్రి ఆలయాన్ని తెరచి మహా సంప్రోక్షణ, రాజభోగం, ఆరాధన, పవళింపు సేవ నిర్వహించారు. గురువారం ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు యధావిధిగా దర్శనాలు అందజేయనున్నారు. దీంతో సింహగిరి బోసిబోయింది. నక్కపల్లి ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయం, ఒడ్డిమెట్ట లక్ష్మిగణపతి ఆలయాలను మూసివేశారు. గ్రహాణం విడిచాక సంప్రోక్షణ అనంతరం ఆలయాలను తెరుస్తామని అర్చకులు వరప్రసాద్, జయంతి గోపాలకృష్ణలు తెలిపారు. నిత్యం పూజలతో భక్తులకు దర్శన మిచ్చే అనకాపల్లి నూకాంబిక ఆలయం, చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరాలయం, శ్రీ స్వయంభూ గౌరీశ్వరాలయంతోపాటు కేశవస్వామి ఆలయం, చోడవరం, వడ్డాది, గోవాడ, మాడుగుల వెంకటేశ్వరస్వామి ఆలయాలు, అర్జునగిరి ల క్ష్మీనృసింహస్వామి ఆలయం మూసివేశారు. వెంకన్నపాలెం షిర్డిసాయిబాబా ఆలయాల సముదాయంలో ఉన్న ఉపాలయాలు, నూకాంబిక, మరిమాంబ, ముత్యమాంబ, దుర్గాంబిక ఆలయాలు, అభయాంజనేయస్వామి ఆలయాలు కూడా మూసివేశారు. గ్రహణం మధ్యాహ్నం ప్రారంభమైనప్పటికీ ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను పంపలేదు. గ్రహణం అనంతరం రాత్రి 7గంటలకు ఆలయాల్లో సంప్రోక్షణ అనంతరం పూజలు యథావిధిగా ప్రారంభిస్తామని స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం ప్రధాన అర్చకుడు కొండమంచిలి గణేష్ తెలిపారు. గురువారం ఉదయం నుంచి ఆలయాల్లో దర్శనాలు ఉంటాయన్నారు. -
మాదిరి ప్రశ్నలు
1. సౌర కుటుంబంలో అతిపెద్ద సహజ ఉపగ్రహం? 1) చంద్రుడు 2) గనిమెడా 3) ఫ్లూటో 4) శుక్రుడు 2. భూమికి అతి సమీపంలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహం ఆవర్తన కాలం? 1) 84.6 నిమిషాలు 2) 86.4 నిమిషాలు 3) 68.4 నిమిషాలు 4) 86.8 నిమిషాలు 3. విశ్వాంతరాళంలో వస్తువు భారం? 1) రెట్టింపు 2) శూన్యం 3) అనంతం 4) ఏదీకాదు 4. చంద్రుడిపై గురుత్వత్వరణం విలువ... భూమి గురుత్వత్వరణ విలువలో ఎన్నో వంతు ఉంటుంది? 1) ఆరో 2) ఐదో 3) నాలుగో 4) మూడో 5. భూమి గురుత్వత్వరణాన్ని కనుక్కో వడానికి ఉపయోగించే సాధనం? 1) స్పైరోమీటరు 2) బారోమీటరు 3) హైడ్రోమీటరు 4) ఎట్వినాస్ బ్యాలెన్స సమాధానాలు 1) 2; 2) 1; 3) 2; 4) 1; 5) 4. 3