సాక్షి, విజయవాడ: ఈనెల 31వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయాన్ని మధ్యాహ్నం నుంచి మూసివేయనున్నారు. ఉదయం 10 గంటలకు మహానివేదన అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. గ్రహణం అనంతరం ఆలయ శుద్ధి, ప్రధానాలయ, ఉపాలయమూర్తులకు స్నపనాది కార్యక్రమమాల నిర్వహణ చేపడతారు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 8-30 గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. జనవరి 31న సాయంత్రం 5.18 నుంచి రాత్రి 8.41 గంటల వరకు చంద్ర గ్రహణం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment