నూజివీడు మండలం యలమందలో శుక్రవారం క్షుద్రపూజలు కలకలం రేపాయి. 100 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన అతి సుదీర్ఘమైన చంద్రగ్రహణం నాడు నరబలి ఇస్తే అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయనే మూఢ నమ్మకం ఉంది. దీంతో యనమదలకు చెందిన ఏడుగురు వ్యక్తులు క్షుద్రపూజలు చేయాలని నిశ్చయించుకున్నారు.