చేతబడి చేస్తోందని.. నగ్నంగా ఊరేగింపు! | Woman forced to eat human excreta on witchcraft charge | Sakshi
Sakshi News home page

చేతబడి చేస్తోందని.. నగ్నంగా ఊరేగింపు!

Published Wed, Aug 13 2014 3:18 PM | Last Updated on Tue, Oct 2 2018 8:44 PM

చేతబడి చేస్తోందని.. నగ్నంగా ఊరేగింపు! - Sakshi

చేతబడి చేస్తోందని.. నగ్నంగా ఊరేగింపు!

బీహార్లో ఓ మహిళను చేతబడి చేస్తోందన్న ఆరోపణలతో అశుద్ధం తినిపించి.. నగ్నంగా తిప్పించారు. ఆ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. కనియా దేవి అనే ఈ మధ్యవయసు మహిళను సక్రైలి గ్రామంలో తిట్టి, కొట్టి, ఆమెను తీవ్రంగా అవమానించారు. గ్రామంలో ఓ బాలుడు మరణించడంతో ఈమే చేతబడి చేసిందన్న అనుమానంతో ఈ పనికి పాల్పడ్డారు. కొంతమంది వ్యక్తులు కలిసి కనియాదేవితో అశుద్ధం తినిపించి, నగ్నంగా ఊరేగించారని జిల్లా పోలీసు అధికారి రాకేష్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ఆరుగురు నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు కాగా ఒకరిని అరెస్టు చేశారు.

బీహార్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై చేతబడి ముద్ర వేసి వారిని చిత్రహింసలు పెట్టడం ఎప్పటినుంచో ఉంది. దీనిపై కఠిన చట్టాలు చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఎప్పుడో ప్రతిపాదించింది. బీహార్ మానవహక్కుల కమిషన్ కూడా దీనిపై స్పందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement