చేతబడులు చేస్తున్నాడనే అనుమానంతో.. | Bengal Man Fingers Cutted Over Witchcraft Allegations | Sakshi
Sakshi News home page

చేతబడులు చేస్తున్నాడనే అనుమానంతో..

Published Thu, Oct 11 2018 2:35 PM | Last Updated on Thu, Oct 11 2018 2:39 PM

Bengal Man Fingers Cutted Over Witchcraft Allegations - Sakshi

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫాండీ సర్థార్‌

కోల్‌కతా : చేతబడులు చేస్తున్నాడన్న అనుమానంతో వ్యక్తి చేతి వేళ్లను నరికి వేయాల్సిందిగా ఆదేశించాడో గ్రామపెద్ద. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని భిర్‌భూమ్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భిర్‌భూమ్‌ జిల్లాలోని పన్‌రుయ్‌ గ్రామానికి చెందిన ఫాండీ సర్థార్‌ దినసరి కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా గ్రామంలో కొంతమంది రోగాల బారిన పడుతున్నారు. సర్థార్‌ చేతబడుల కారణంగానే గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని గ్రామస్తులు భావించారు.

సర్థార్‌ను గ్రామ పంచాయితీకి తీసుకురాగా గ్రామ పెద్ద అతనికి మరణశిక్ష విధించాడు. ఆ తర్వాత కొన్నికారణాల వల్ల మరణశిక్షను రద్దుచేసి చేతి వేళ్లు నరికి వేయాల్సిందిగా ఆదేశించాడు. దీంతో గ్రామ పెద్ద ఆదేశాల మేరకు అతని పది చేతి వేళ్లను కర్కశంగా నరికివేశారు. ఆ తర్వాత సర్థార్‌ కుటుంబసభ్యులు అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఎలాంటి కేసు నమోదు కాకపోయినా విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement