KALVAKUNTLA candrasekharravu
-
కమలమ్మకు శ్రద్ధాంజలి
సంస్థాన్ నారాయణపురం : మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తల్లి కమలమ్మ దశదినకర్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. దశదినకర్మ సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెంలో ఆదివారం జరిగిం ది. కమలమ్మ ఈ నెల 5వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, కేసీఆర్.. మంత్రులు ఈటెల రాజేందర్, గుంటకండ్ల జగదీష్‌రెడ్డిలతో కలిసి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన లింగవారిగూడానికి వచ్చారు. కమలమ్మ సమాధి వద్ద చిత్రపటానికి పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతకుముందు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిశోర్, పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కలెక్టర్ టి.చిరంజీవులు, ఐజీలు శశిధర్‌రెడ్డి, గంగాధర్, జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు, జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా,ఆర్డీఓ వెంకటాచారి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మేరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి గంగిడి మనోహర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, దుబ్బాక నర్సింహారెడ్డి, మన్నె గోవర్దన్‌రెడ్డి, మాలె శరణ్యారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు హాజరై నివాళులర్పించారు. 35నిమిషాల పాటు ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన 1.40గంటలకు లింగవారిగూడానికి వచ్చారు. దాదాపు 35నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. మధ్యాహ్న భోజనం అక్కడే చేశారు. మధ్యాహ్నం 2.15గంటలకు హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరారు. గుడిమల్కాపురం గ్రామంలో స్థానికులను చూసి ఆగారు. దాదాపు 20నిమిషాల పాటు గ్రామస్తులతో మాట్లాడి వెళ్లారు. -
సాగుకు శిక్షణ కేంద్రం కావాలి
ఆర్మూర్/ఆర్మూర్ అర్బన్: ఆధునిక పద్ధతులతో వ్యవసాయ రంగంలో విప్లవం సృష్టించిన అంకాపూర్ గ్రామం దేశ రైతాంగానికి శిక్షణ కేంద్రం కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌లో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను తొలిసారి సిద్ధిపేట ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1986లో అంకాపూర్ గ్రామానికి స్వయంగా కారు నడుపుకుని వచ్చానన్నారు. గ్రామ రైతులకు పత్రిక విలేకరిగా పరిచయం చేసుకుని, వ్యవసాయ క్షేత్రాలను సందర్శించినట్లు చెప్పారు. అంకాపూర్ గ్రామస్తుల మర్యాదస్తులని, తనకు కోడికూరతో భోజనం చేయించి పంపారని గుర్తు చేసుకున్నారు. ఇక్కడి సాగు పద్ధతులను చూసిన తర్వాతే తన వ్యవసాయ క్షేత్రానికి అంకురార్పన చేశానన్నారు. ఆడవాళ్ల పెత్తనం కారణంగానే అంకాపూర్ ఆర్థిక పరిపుష్టి సాధించిందన్నారు. ఈ గ్రామ మహిళలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చుట్టుపక్కల 250 గ్రామాల్లో వ్యవసాయ విప్లవానికి అంకాపూర్ నాంది పలికి ందన్నారు. అంకాపూర్ రైతులు వాణిజ్య పంటలు పండిస్తూ అన్ని గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. దేశంలో వ్యవసాయ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న పంజాబ్ రాష్ట్రానికి విత్తనాలను సరఫరా చేస్తున్న ఘనత ఈ గ్రామానికే దక్కిందన్నారు. ఇక్కడి అభివృద్దే తనను గ్రామానికి రప్పించదని కీర్తించారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా అంకాపూర్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాన్ని, ఆధునిక హంగులతో అతిథి గృహాన్ని ని ర్మించాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా పర్యటనకు వచ్చినపుడల్లా ఇక్కడే బస చేస్తానని ఆయన అన్నారు. ప్రపంచంలోనే బ్రహ్మాండమైన విత్తనాలు పండించే సారవంతమైన భూములు తెలంగాణలో ఉన్నాయన్నారు. ఆధునిక, శాస్త్ర, సాంకేతిక రంగాలను వినియోగించుకుని వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామ న్నారు. ఇజ్రాయిల్ వ్యవసాయ విధానాలను అవలంభించాలని రైతులకు సూచించారు. ఇందుకు ప్రభుత్వ ఖర్చుతో రైతు బృందాన్ని ఇజ్రాయిల్ పంపుతామన్నారు. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో వ్యవసాయ విధానాల్ని అధ్యయనం చేసేందుకు అంకాపూర్ రైతులను పంపేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. -
7న కేసీఆర్ రాక
ఆర్మూర్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల ఏడున ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి సారిగా జిల్లాకు వస్తున్న కేసీఆర్ ఆర్మూర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొం టారని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆదివా రం తెలిపారు. ఆర్మూర్ పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి రూ. 114 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించనున్న రక్షిత మంచినీటి సరఫరా పథకానికి సీఎం శం కుస్థాపన చేస్తారన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోతల ద్వారా ఈ పథకానికి మళ్లిస్తారని వివరించారు. ఉదయం 9:30కు ముఖ్యమంత్రి పర్యటన ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంట్లో అల్పాహారం తీసుకుంటారు. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్మిం చిన శిలాఫలకం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభిస్తారు. తరువాత జిరాయత్‌నగర్ కాలనీలో గల మినీ స్టేడియంలో నిర్వ హించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌కు చేరుకుం టారు. అక్కడ వ్యవసాయ రంగంలో జాతీయ గుర్తింపు పొందిన రైతులతో సమావేశమవుతారు. గ్రీన్‌హౌజ్ వ్యవసాయం, తెలంగా ణ ప్రభుత్వం రైతులకు అందించే ప్రయోజనాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు అంకాపూర్‌లో విత్తన అభివృద్ధి కేంద్రం ఏర్పాటు గురించి చర్చిస్తారు. అనంతరం నేరుగా జిల్లా కేంద్రానికి చేరుకొని అధికారులతో సమీక్ష జరుపుతారు. వ్యవసా యపరంగా ముందున్న జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పర్చడానికి గల అవకాశాల గురించి చర్చించనున్నట్లు సమాచారం.