JEE
-
జేఈఈ మెయిన్ తొలి సెషన్ ఫలితాలు విడుదల.. 14 మంది విద్యార్థులకు 100 పర్సంటేజ్
-
JEE Main 2025 Results : 14 మంది విద్యార్థులకు 100 పర్సంటేజ్
ఢిల్లీ : ఐఐటీ, జేఈఈ లాంటి కఠినతరమైన పరీక్షలో విద్యార్థులు సరికొత్త రికార్డ్‌లు సృష్టించారు. కొద్ది సేపటి క్రితం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన జేఈఈ మెయిన్ 2025 సెషన్ వన్ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 100 పర్సంటేజ్ సాధించారు. వారిలో ఐదుగురు రాజస్థాన్ విద్యార్ధులు కాగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సాయి మనోఘ్న గుత్తికొండ విద్యార్థిని 100శాతం ఉత్తీర్ణతతో టాపర్‌గా నిలిచారు. ప్రతిష్టాత్మక ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో బీటెక్ చేసేందుకు, అదే విధంగా ఐఐటీల్లో బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు అర్హత పరీక్షగా ఎన్టీఏ ఏటా రెండుసార్లు జేఈఈ–మెయిన్ పరీక్షలు నిర్వహిస్తోంది. మొదటి దఫా పరీక్షకు జాతీయ స్థాయిలో 13.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో దాదాపు 2 లక్షల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉంటారని అంచనా.300 మార్కులకు పరీక్ష మూడు సబ్జెక్ట్‌లలో 300 మార్కులకు పరీక్ష నిర్వహించారు. మ్యాథమెటిక్స్ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25 ప్రశ్నలు చొప్పున మొత్తం 75 ప్రశ్నలతో ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహించారు. కాగా ప్రశ్నల క్లిష్టత స్థాయి ఓ మోస్తరుగా ఉందని, ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, గత ప్రశ్న పత్రాలు సాధన చేసిన వారికి కొంత మేలు కలిగించేదిగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు.రెండు సెషన్లలోనూ మ్యాథమెటిక్స్ విభాగం ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నప్పటికీ.. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో కొందరు విద్యార్థులకు జవాబులిచ్చేందుకు సమయం సరిపోలేదు. ఫిజిక్స్ విభాగం ప్రశ్నలు సులభంగా, కెమిస్ట్రీలో కొన్ని సులభంగా, కొన్ని ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 50 శాతం ప్రశ్నలు చాలా సులభంగా ఉండడం విద్యార్థులకు ఉపశమనం కలిగించింది.ఈ రెండు విభాగాల ప్రశ్నలకు అభ్యర్థులు 45 నిమిషాల చొప్పున సమయంలో జవాబులు ఇవ్వగలిగారు. అయితే మిగతా గంటన్నర సమయంలో మ్యాథమెటిక్స్‌లో 15 నుంచి 20 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉండడమే ఇందుకు కారణంగా సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే కెమిస్ట్రీ ప్రశ్నలు.తొలిరోజు రెండు సెషన్లలోనూ ప్రశ్నలు జేఈఈ–మెయిన్ గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువగా అడిగారు. ముఖ్యంగా 2021, 2022 ప్రశ్నలకు సరిపోలే విధంగా చాలా ప్రశ్నలు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. ఇక కెమిస్ట్రీలో అధిక శాతం ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే.. డైరెక్ట్ కొశ్చన్స్‌గా అడగడంతో ప్రాక్టీస్ చేసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది.ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 35 శాతం, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 35 శాతం, ఇన్–ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 30 శాతం ప్రశ్నలున్నాయి. కెమికల్ బాండింగ్, బయో మాలిక్యూల్స్, మోల్ కాన్సెప్ట్, కాటలిస్ట్సŠ, వేవ్ లెంగ్త్, ఎస్ఎంఆర్, పొటెన్షియల్ మీటర్, కెమికల్ ఈక్వేషన్ ఎనర్జీ, రేడియో యాక్టివ్ డికే, ఆర్గానిక్ కెమిస్ట్రీ (3 ప్రశ్నలు), కో ఆర్డినేట్ కాంపౌండ్, ఆక్సిడేషన్ స్టేట్ల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఫిజిక్స్, మ్యాథ్స్‌లో ఇలా.. ఫిజిక్స్‌లో థర్మోడైనమిక్స్, ప్రొజెక్టైల్ మోషన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్, డయోడ్స్, ఈఎం వేవ్స్, మోడ్రన్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, సెమీ కండక్టర్స్, హీట్ ట్రాన్స్ఫర్, ఏసీ సర్క్యూట్, డైమెన్షనల్ ఫార్ములా, ఫోర్స్, మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా ఆఫ్ స్పియర్ నుంచి ప్రశ్నలు అడిగారు.మ్యాథ్స్‌లో స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, సింపుల్ ప్రాబ్లమ్, వెక్టార్, 3డి జామెట్రీ, షార్టెస్ట్ డిస్టెన్స్ ప్రాబ్లమ్, మాట్రిసెస్, డిటర్మినెంట్స్, బయనామియల్ థీమర్, ట్రిగ్నోమెట్రీ, క్వాడ్రాట్రిక్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్, సిరీస్, పారాబోలా, ఏరియా ఆఫ్ సర్కిల్, పెర్ముటేషన్, హైపర్ బోలా, డిఫరెన్షియల్ ఈక్వేషన్, సర్కిల్ ఇంటర్సెక్టింగ్ ప్రాబ్లమ్స్ అడిగారు.అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ అంచనా ఇలా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే.. జనరల్ కేటగిరీలో 91–92 మార్కులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 79–80, ఓబీసీ కేటగిరీలో 77–78, ఎస్సీ కేటగిరీలో 56–58, ఎస్టీ కేటగిరీలో 42–44 మార్కులు కటాఫ్‌గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
నెలాఖరుకు జేఈఈ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ–2025 నోటిఫికేషన్ ఈ నెలాఖరులో వెలువడనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నవంబర్ మొదటి వారంలో ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించే వీలుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. జనవరిలో మొదటి విడత జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ లేదా మే నెలలో రెండో విడత మెయిన్స్‌ను ఆన్లైన్ పద్ధతిలో చేపట్టనున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశానికి ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)ను నిర్వహిస్తారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు పంపుతారు. అడ్వాన్స్‌డ్‌లో పొందిన ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఇంజనీరింగ్ సీట్లు పొందే వీలుంది. ఈ పరీక్షను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలపై దృష్టి పెట్టారు. ఏయే కేంద్రాలను ఎంపిక చేయాలనే సమాచారాన్ని ఎన్టీఏ సేకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొదటినుంచీ తెలంగాణ వ్యాప్తంగా 21 పట్టణాల్లో జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్నారు. అయితే గత ఏడాది నుంచి పరీక్ష కేంద్రాలను కుదించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పరీక్ష కేంద్రాలను 17 పట్టణాలకే పరిమితం చేశారు. కాగా, గత ఏడాది జేఈఈ రాసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా ఈ సంవత్సరం పరీక్ష కేంద్రాలను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నారు.సిలబస్‌పై కసరత్తు.. గత సంవత్సరం జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌కు కూడా పరీక్ష సిలబస్‌ను తగ్గించారు. 2020లో కరోనా కారణంగా 8 నుంచి 12వ తరగతి వరకూ కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్‌లో కొన్ని చాప్టర్లను తీసివేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈతో పాటు ఇతర జాతీయ సిలబస్ ఉండే విద్యార్థులకు జేఈఈలో ఆయా చాప్టర్లను తొలగించాలనే డిమాండ్ వచ్చింది. ఈ కారణంగా గత సంవత్సరం కొన్ని చాప్టర్లను ఇవ్వలేదు. అయితే, ఈ ఏడాది ఆ సమస్య లేదని అధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పాత సిలబస్‌ను మళ్లీ కలపడమా? లేదా ఈ సంవత్సరం కూడా గత ఏడాది మాదిరిగానే నిర్వహించడమా? అనే దానిపై ఎన్టీఏ, ఇతర కేంద్ర సంస్థలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
నీట్, జేఈఈ క్రాక్ చేసి.. మెడికల్, ఐఐటీ వద్దంటూ..
ఏదైనా సాధించాలనే తపన మనసులో గాఢంగా ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ఇందుకు నీట్, జేఈఈ పోటీపరీక్షలు మినహాయింపు కాదని నిరూపించాడు అసోంకు చెందిన ఓ కుర్రాడు. సీబీఎస్సీ 12వ తరగతి బోర్డు పరీక్షలో టాపర్‌గా నిలవడమే కాకుండా నీట్, జేఈఈలలో మంచి స్కోర్ సాధించాడు. అయినప్పటికీ తన అభిరుచికే పట్టంకడుతూ.. మెడికల్ సీటు, ఐఐటి మద్రాస్ అవకాశాన్ని వదిలి ఐఐఎస్సీలో సైన్స్ గ్రాడ్యుయేషన్ చేయాలని నిర్ణయించుకున్నాడు.ఆ కుర్రాడి పేరు అధిరాజ్ కర్. అసోంతోని గౌహతి నివాసి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించి, సీబీఎస్సీ బోర్డు 12వ తరగతి పరీక్షలో కెమిస్ట్రీలో వందశాతం మార్కులు సాధించడంతోపాటు టాపర్‌గా నిలిచాడు. అలాగే నీట్ యూజీలో అసోంలో టాపర్‌గా నిలిచాడు. అదేవిధంగా మద్రాస్ ఐఐటీలోనూ సీటు దక్కించుకున్నాడు. అయితే అధిరాజ్ అటు ఐఐటీగానీ, ఇటు ఎంబీబీఎస్‌లను ఎంచుకోకుండా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో సైన్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నాడు.అధిరాజ్ కెమిస్ట్రీ, బయాలజీలో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ తరహాలోని వివిధ జాతీయ స్థాయి పరీక్షలలో మంచి ప్రతిభ కనబరిచాడు. పరిశోధనారంగంలో అతనికున్న అభిరుచి అతనిని ఐఐఎస్సీ వైపు నడిపించింది. అకడమిక్ విద్యకు అతీతంగా అధిరాజ్కు వన్యప్రాణుల సంరక్షణ, సంగీతంపై అమితమైన ఆసక్తి ఉంది. ఈ నేపధ్యంలోనే డబ్ల్యుడబ్ల్యుఎఫ్ నేచర్ వైల్డ్ విజ్డమ్ క్విజ్‌లో మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. అధిరాజ్ గౌహతి యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బిమల్ కర్, డాక్టర్ మధుశ్రీ దాస్‌ల కుమారుడు. -
పరీక్షలు నీటుగా నిర్వహించాలంటే...
ఏ పరీక్ష అయినా వందలాది మంది వ్యక్తులు నిజాయితీగా ఉన్నప్పుడే లీకులు లేకుండా నిర్వహించడం సాధ్యమవుతుంది. వచ్చే ఆర్థిక లాభం ముందు తీసుకునే రిస్క్ తక్కువనిపించినప్పుడు, లీకులకు అవకాశం మరీ ఎక్కువ. పైగా ఏదోలా అడ్మిషన్ పొందితే కోర్సు దానికదే పూర్తవుతుంది అనే ధోరణి ఉన్నప్పుడు అడ్డదారులు తొక్కడం ఇంకా పెరుగుతుంది. అందుకే ‘నీట్’ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో అసలు దేశంలో పరీక్షల నిర్వహణ తీరును మార్చడమే దీనికి పరిష్కారం. దేశంలో ప్రస్తుతం కాగితం, పెన్నులతో నిర్వహిస్తున్న అన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా మార్చడంతో పాటు, ప్రశ్నపత్రాల కూర్పు తీరు కూడా మారాలి.భారతదేశంలో ఐఐటీలు లేదా ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలల్లో ప్రవేశించడం, వాటి కోర్సులు పూర్తి చేయడం కంటే కష్టం. నాతోపాటు ఐఐటీ మద్రాస్‌లో చేరిన 200 మందిలో నాలుగేళ్ల కోర్సు పూర్తిచేయనివాళ్లు దాదాపుగా లేరు. అందుకే ప్రవేశ పరీక్ష పాసయ్యేందుకు అవసరమైతే అడ్డదారులు తొక్కేందుకూ వెనుకాడరు. అర్హత లేని వారు ఒకవేళ అడ్మిషన్ పొందినప్పటికీ సకాలంలో కోర్సు పూర్తి చేయడం అసాధ్యంగా మారేలా ఉంటే... వాళ్లు ప్రవేశ పరీక్ష గట్టెక్కితే అదే పదివేలనుకునే పరిస్థితి తప్పుతుంది.కాగితం, పెన్ను ఆధారంగా పరీక్షలు జరిగినప్పుడు కూడా పేపర్లు లీక్‌చేసే గ్యాంగ్‌లు ఉండేవి. అప్పటికి అత్యాధునిక టెక్నాలజీలతో వాళ్లు ప్రశ్న పత్రాల లీక్ చేసే వాళ్లు. అవసరమైన వాళ్లకు చేరవేసే వాళ్లు కూడా. పరీక్ష కేంద్రాల్లో లేదా ప్రశ్న పత్రాల ప్రింటింగ్ కేంద్రాల్లో కొందరితో కుమ్మక్కైతే చాలు. ఏ పరీక్ష అయినాసరే... లీకుల్లేకుండా నిర్వహించడం అనేది వందలాది మంది వ్యక్తులు నిజాయితీగా ఉన్నప్పుడు, అది కూడా భారీ మొత్తాలు ఆశచూపినా తట్టుకునే సామర్థ్యం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అందుకే కాగితం పెన్నుతోనైనా సరే... లీకుల్లేకుండా ఐఐటీ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలను నిర్వహించడం అసాధ్యమే. వచ్చే ఆర్థిక లాభం ముందు తీసుకునే రిస్క్ తక్కువనిపిస్తుంది. మరి ఏమిటి చేయడం? దానికోసం నాలుగు సూచనలు:1. దేశంలో ప్రస్తుతం కాగితం, పెన్నులతో నిర్వహిస్తున్న అన్ని పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షలుగా మార్చాలి. జేఈఈ (మెయిన్స్), ఇంకా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మూల్యాంకన పరీక్షలు ఇలాగే జరుగుతున్నాయి. హ్యాకర్లు కంప్యూటర్ ఆధారిత పరీక్షలపై దాడి చేసే అవకాశం ఉంది. అందుకని కంప్యూటర్లలో అనధికార సాఫ్ట్వేర్లను నియంత్రించాలి. ఎన్ క్రిప్షన్తో కూడిన ప్రశ్న పత్రాన్ని డౌన్ లోడ్ చేసుకునేందుకు తొలి పది నిమిషాలు, పరీక్ష పూర్తయిన తరువాత సమాధానాలను సింక్ చేసేందుకు మరో పది నిమిషాలు మాత్రమే ఇంటర్నెట్ ఇవ్వాలి. రోజురోజుకూ మెరుగవుతున్న కృత్రిమ మేధ సాయంతోనూ హ్యాకింగ్ సమస్యను అధిగమించే అవకాశముంది. 2. ప్రవేశ పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ప్రశ్న పత్రాలను నాణ్యంగా కూర్చడమూ ఎంతో కీలకం. ఎక్కువమందికి టాప్ స్కోర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మోసం చేసినా పాసవలేమన్న స్థాయిలో ప్రశ్న పత్రాలు ఉండాలి. భారత్‌లోని యూజీసీ లాంటి అత్యున్నత విద్యా వ్యవస్థల నాయకులతో సహా చాలామంది, పరీక్ష కఠినమైతే కోచింగ్ వంటివి మరింత విçస్తృత స్థాయికి చేరుకుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూంటారు. పరీక్ష ఎంత కఠినమైనా... ఐఐటీ, ఎంబీబీఎస్ వంటి వాటికి కోచింగ్ ఎప్పటికప్పుడు పెరిగేదే కానీ తగ్గదు. ప్రశ్న పత్రాలను తేలికగా కూర్చడం లేదా తక్కువ పరిమితి ఉన్న సిలబస్ ఆధారంగా సిద్ధం చేయడం వల్ల మాత్రమే కోచింగ్‌కు తక్కువ ప్రాధాన్యం ఏర్పడుతుంది. కానీ అప్పుడు నాణ్యత తగ్గిపోతుంది. పరీక్ష స్థాయి ఆధారంగా ప్రశ్న పత్రం కఠినత్వం ఉండాలి. బోర్డు పరీక్షలైతే సగటు విద్యార్థులను వేరు చేయడమన్నది 50 పర్సంటైల్ వద్ద ఉండటం మంచిది. నీట్, జేఈఈ వంటి పరీక్షలైతే ఈ పర్సంటైల్ 90 – 95 మధ్య ఉంటే మంచిది. ఇందుకు పరీక్ష కఠినంగా ఉండటం అవసరం. అదే సమయంలో ప్రతిభావంతుడైన ఒక విద్యార్థి, ఆయా బోధనాంశాల్లో నైపుణ్యమున్నవారు ఇద్దరూ సరిగ్గా సమాధానాలు చెప్పేలా ఉండాలి. ఫ్యాక్చువల్ తప్పులపై ఆధారపడి ప్రశ్నలు రూపొందిస్తే (ఈ ఏడాది నీట్లో ఇలాగే జరిగింది) అది నాణ్యమైన ప్రశ్నపత్రం కాదు. 3. అర్థవంతమైన బహుళార్థక ప్రశ్నలు ఇవ్వాలి. ప్రవేశ పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానాలు అంచనా కట్టవచ్చుననీ, సమాధానం కచ్చితంగా తెలియకపోయినా కొన్ని మోసపు పద్ధతుల ద్వారా సరైన సమాధానం రాబట్టవచ్చుననీ అనుకుంటారు. ఇది వాస్తవం కాదు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలంటే విషయంపై లోతైన అవగాహన అవసరం. విద్యార్థుల మేధకు పరీక్ష పెట్టేలా కొన్ని తప్పుడు సమాధానాలు కూడా ఉంటాయి. కాబట్టి నీట్, జేఈఈ వంటి పరీక్షలకు ఈ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు సరిగ్గా సరిపోతాయి. వివరణాత్మకమైన సమాధానాలు రాస్తే... ప్రశ్న పత్రాలు దిద్దేవారి తీరునుబట్టి మార్కుల్లో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు విద్యార్థికి సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించే తత్వం ఉందా, లేదా అనేది తేల్చవు. కాబట్టి కొన్ని వివరణాత్మక ప్రశ్నలూ జోడించడం మేలు. వీటిని సెకెండ్ పేపర్లో పెట్టి తులన అనేది టాప్ 20 శాతం విద్యార్థులకే పరిమితం (టాప్ 10 శాతం విద్యార్థులను ఎంపిక చేయడం మన లక్ష్యమైనప్పుడు) చేస్తే దిద్దడంలో తేడాలు గణనీయంగా తగ్గుతాయి. 4. నీట్, జేఈఈ వంటి పరీక్షల నిర్వహణకు అత్యంత కీలకమైన మరో అంశం పారదర్శకత. అన్ని ప్రశ్నలను బహిరంగ పరచకపోయినా నమూనా లేదా మాదిరి ప్రశ్నలు కొన్నింటినైనా జన సామాన్యానికి అందుబాటులో ఉంచాలి. ఎంత శాతం మంది విద్యార్థులు ఏ ఆప్షన్ ఎంచుకున్నారు వంటి సమాచారం అందివ్వాలి. ఈ ఆప్షన్స్కూ, విద్యార్థి పరీక్షలో సాధించిన మార్కులకూ మధ్య సంబంధాలను వివరించాలి. ఈ ఏర్పాట్ల వల్ల ప్రధానంగా రెండు లాభాలు ఉంటాయి. ప్రశ్న పత్రాలు కూర్చేవారు ఏకాగ్రతతో ఆ పని చేస్తారు. రెండోది పరీక్ష, నిర్వహణ... రెండింటిపై నమ్మకం పెరుగుతుంది. ర్యాంకుల నిర్ధారణకు పర్సంటైల్స్, స్కేల్డ్ స్కోర్లను జాగ్రత్తగా వినియోగించడం అవసరం. కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షల్లో ఒక్కో విద్యార్థికి ఒక్కో రకమైన ప్రశ్న పత్రం వస్తుంది కాబట్టి సమాధానాల ద్వారా వచ్చిన మార్కులు అర్థం లేనివిగా మారిపోతాయి. అందుకే వీటికి బదులుగా అందరికీ తెలిసిన సైకోమెట్రిక్ టెక్నిక్‌ల సాయంతో స్కేల్డ్ స్కోర్లను నిర్ధారించాల్సిన అవసరముంది. ఈ స్కేల్డ్ స్కోర్స్ ఆధారంగా పర్సంటైల్ మార్కులు సిద్ధమవుతాయి. మోసాలను పసిగట్టేందుకు నిరర్థక ప్రశ్నలు, సైకోమెట్రిక్ అనాలసిస్, స్టాటిస్టిక్స్ వంటివి ఎంతో ఉపయోగపడతాయి. ఒకవేళ ఏదైనా నిరర్థక ప్రశ్న వస్తే వాటిని పక్కనపెట్టాలి. తప్పుడు మార్గాల్లో సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసిన వారిని డిస్క్వాలిఫై చేయాలి. జేఈఈ మెయిన్ ్స పరీక్ష నిర్వహణకు ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రేవేట్ ఏజెన్సీలపై ఆధారపడుతోంది. నీట్‌ను మాత్రం స్వయంగా నిర్వహిస్తోంది. నాణ్యమైన, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రశ్న పత్రం తయారీ ఎన్టీఏకు కష్టమేమీ కాబోదు. అయితే ఈ రకమైన ప్రశ్న పత్రం తయారీని చాలా శ్రద్ధతో, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో తయారు చేయాల్సి ఉంటుంది. బోధనాంశాలపై పట్టున్నవారు, ప్రత్యేకమైన ఏజెన్సీలు, ప్రశ్నల రూపకల్పన, సమాధానాల విశ్లేషణలకు అత్యాధునిక సైకోమెట్రిక్ పద్ధతులను ఉపయోగించడం అవసరమవుతుంది. ఎందుకంటే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఎన్ టీఏ విశ్వసనీయతపై, అది నిర్వహించే పరీక్షలపై పెద్ద ప్రశ్న చిహ్నం పడింది కాబట్టి! సమాజం మొత్తం ఈ రకమైన స్థితికి చేరడం భవిష్యత్తులో వృత్తినిపుణులుగా ఎదగాల్సిన విద్యార్థులకు ఏమంత మంచిది కాదు.శ్రీధర్ రాజగోపాలన్ వ్యాసకర్త ‘ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సహ–వ్యవస్థాపకుడు (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్‌లో కెరీర్‌పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్‌ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్‌లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్‌లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్‌గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్‌ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్‌ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్‌పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్‌ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్‌లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్‌లో మీ కలల కెరీర్‌కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి -
జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు
-
కోటాలో విద్యార్థి అదృశ్యం కలకలం.. వారంలో రెండో ఘటన
జేఈఈ (JEE) విద్యార్థి రచిత్ అదృశ్యం మరవక ముందే రాజస్థాన్‌లోని కోటాలో 18 ఏళ్ల నీట్(NEET) కోచింగ్ విద్యార్థి అదృశ్యం కలకలం రేపతోంది. రెండు రోజుల క్రితం సికార్ జిల్లాకు చెందిన యవరాజ్ అనే విద్యార్థి అదృశ్యం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను నీట్ మెడికల్ ప్రవేక్ష పరీక్ష కోసం కోటాలో కోచింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. యువరాజు కోటాలోని ట్రాన్స్‌పోర్టు నగరలోని హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం ఉదయం 7 గంటలకు క్లాస్‌కు హాజరయ్యేందుకు బయటకు వెళ్లి యూవరాజ్ అదృశ్యం అయ్యాడు. అతను తన మొబైల్ ఫోన్‌ను హాస్టల్లోనే వదిలి వెళ్లాడు. వారం రోజుల క్రితమే రచిత్ సోంధ్య అనే విద్యార్థి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల జేఈఈ(JEE) విద్యార్థి రచిత్.. హాస్టల్ నుంచి క్లాస్‌కు బయలుదేరి అదృశ్యం అయ్యారు. సీసీటీవీ ఫుటేజుల వివరాల ప్రకారంలో కోటాలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన రచిత్ .. హాస్టల్ నుంచి బయటకు వచ్చి.. ఒక క్యాబ్‌లో అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గత సోమవారం రచిత్ బ్యాగ్, మొబైల్ ఫోన్, హాస్టల్ రూం తాళం చెవిని అటవీ ప్రాంతానికి సమీపంలోని గరడియా మహాదేవ్ ఆలయం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు విద్యార్థుల అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. వెతుకుతున్నారు. వారికోసం పోలీసులు ప్రత్యేకంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. -
జేఈఈ–2024కి ఎన్నికల గండం!
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)–2024కి పలు రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల రూపంలో ఆటంకాలు తప్పేలా లేవు. జేఈఈ మెయిన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏటా రెండుసార్లు జనవరి, ఏప్రిల్‌ల్లో నిర్వహిస్తోంది. అనంతరం జూన్/జూలై నాటికి అడ్వాన్స్‌డ్‌ను కూడా నిర్వహించి ఆయా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలను చేపడుతోంది. అయితే వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈకి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల రూపంలో అడ్డంకులు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీనివల్ల పరీక్షలు ఆలస్యమై ప్రవేశాల్లో కూడా జాప్యం జరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నం.. దేశంలో ఎన్నికల హడావుడి డిసెంబర్‌కన్నా ముందే ఆరంభం కానుంది. ఆ నెలలో మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లలో ఆయా రాష్ట్రాల అధికార యంత్రాంగం మొత్తం నిమగ్నమై ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల తంతు ముగిశాక 2024 మార్చి, ఏప్రిల్‌ల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభకు సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఏర్పాట్లలోనూ అధికార యంత్రాంగం మొత్తం తలమునకలై ఉంటుంది. ఈ ఎన్నికల ప్రభావం జేఈఈపై పడుతుందని.. ఎన్నికల సమయంలో పరీక్షల నిర్వహణ కష్టసాధ్యం కాబట్టి వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. గతేడాది ఇదే పరిస్థితి.. జేఈఈ మెయిన్ 2022కు కూడా ఇలాగే ఆటంకాలు ఏర్పడ్డాయి. అప్పట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఎన్నికలతో పరీక్షల షెడ్యూల్ వాయిదా పడింది. ఆ విద్యా సంవత్సరానికి జేఈఈ పరీక్షల షెడ్యూల్‌ను ఎన్టీఏ ముందరి సంవత్సరం అంటే 2021 సెప్టెంబర్ నాటికే విడుదల చేయాల్సి ఉండగా 2022 ఫిబ్రవరిలో కానీ విడుదల కాలేదు. ఆ షెడ్యూల్‌ను కూడా మూడుసార్లు మార్చి విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. ఏటా జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించేలా ఈ పరీక్షల సాధారణ షెడ్యూల్ ఉండగా జేఈఈ–2022 మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు, రెండో సెషన్ పరీక్షలు మే 24 నుంచి 29 వరకు ఉంటాయని ప్రకటించింది. వివిధ రాష్ట్రాల బోర్డుల పరీక్షలు అదే సమయంలో ఉండడం, సీబీఎస్ఈ ప్లస్2 తరగతుల పరీక్షల నేపథ్యంలో మళ్లీ రెండుసార్లు వేరే తేదీలను ప్రకటించినా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు ఆ ఏడాది జూన్, జూలైకు పరీక్షలను వాయిదా వేశారు. ఫలితంగా జూన్ 3న జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆగస్టు 28కి వాయిదా పడింది. ఈసారి అంతకన్నా ఎక్కువగా డిసెంబర్ ముందు నుంచే ఎన్నికల హడావుడి ఆరంభం కానుండడం, ముఖ్యమైన పార్లమెంటు ఎన్నికలు కూడా జరగాల్సి ఉండడంతో జేఈఈ పరీక్షలు ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆయా విద్యాసంస్థల నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 2024 జేఈఈ షెడ్యూల్ సెప్టెంబర్‌లో విడుదల చేస్తారో, లేదో అనుమానమేనని అంటున్నారు. -
గిరిజన విద్యార్థి.. కష్టాలను అధిగమించి,ఐఐటీలో సీటు సాధించింది
జె.ఇ.ఇ. ఎంట్రన్స్‌లో ర్యాంకు కొట్టడం సామాన్యం కాదు.అందుకై కొందరు రాజస్తాన్ వెళ్తారు. కొందరు హైదరాబాద్, విజయవాడ చేరుకుంటారు.తల్లిదండ్రులు గైడ్ చేస్తారు. కాని నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు పుట్టిన కోయ విద్యార్థిని కొర్సా లక్ష్మి గురుకుల పాఠశాలలో చదువుకునే మంచి ర్యాంకు సాధించింది.పాట్నా ఐఐటీలో సీటు సాధించింది. కోయలలో ఒక అమ్మాయి సాధించిన స్ఫూర్తినిచ్చే విజయం ఇది. కొర్సా లక్ష్మి పరిచయం. కొంతమంది ఇళ్లల్లో, నిజానికి చాలామంది ఇళ్లల్లో పిల్లలు జె.ఇ.ఇ. ఎంట్రన్స్ రాయడానికి తల్లిదండ్రులు చాలా శ్రద్ధ పెడతారు. బాగా చదివించే కోచింగ్ సెంటర్ కోసం అవసరమైతే రాజస్థాన్‌లోని కోటాకు వెళతారు లేదా హైదరాబాద్, విజయవాడలలో ప్రఖ్యాత కోచింగ్ సెంటర్లలో వేస్తారు. ఇక పిల్లలు ఇంట్లో ఉండి చదువుకుంటుంటే టీవీలు బంద్ చేస్తారు. మాటా పలుకూ లేకుండా పిల్లలు ఇరవై నాలుగ్గంటలూ చదువుకునేలా చేస్తారు. మెటీరియల్ తెచ్చిస్తారు. చాలా హైరానా పడతారు. అదేం తప్పు కాదు. కాని ఇలాంటివన్నీ లేకుండా కూడా కొంతమంది విజయం సాధిస్తుంటారు. కొత్తగూడెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుకున్న కోయ విద్యార్థిని కుర్సా లక్ష్మి అలాంటి విజేతే. పట్టుదలతో చదువుకుని ర్యాంకు సాధించిన విజేత. ఐసులమ్మే తండ్రి కూతురు కొత్తగూడెం నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన తండా కాటాయగూడెం. 300 గడపలున్న గ్రామం ఇది. అందరూ కోయలే. వ్యవసాయ కూలీలే. ఏ కొద్దిమందికో కాసింత భూమి ఉంటుంది. కొర్సా లక్ష్మి తండ్రి కన్నయ్యకు ఎకరం భూమి ఉంది. కాని వాన పడితేనే పండుతుంది. కన్నయ్య వ్యవసాయ కూలీగా వెళతాడు. తల్లి శాంతమ్మ కూడా. వ్యవసాయ పనులు లేనప్పుడు తన టీవీఎస్ ఎక్సెల్ మీద ఐస్ బాక్స్ పెట్టుకుని ఐసులమ్ముతాడు. ముగ్గురు పిల్లలు. కాని పెద్ద కొడుకు చదువు ఇష్టం లేక 7వ తరగతిలో ఇంట్లో నుంచి పారిపోయాడు. రెండో కొడుకు మామూలు చదువే. చివరి అమ్మాయి లక్ష్మి బాగా చదువుకోవాలని నిశ్చయించుకుంది. పిన్ని స్ఫూర్తి కన్న తల్లిదండ్రులు చదువు లేని వారు కావడంతో లక్ష్మికి చదువులో ఏ సాయమూ చేయలేకపోయేవారు. ఆరవ తరగతి నుంచి కొత్తగూడెం గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న లక్ష్మికి పిన్ని సుమలత స్ఫూర్తిగా నిలిచింది. డిగ్రీ చదువుకున్న సుమలత హాస్టల్లో ఉన్న లక్ష్మిని తరచూ కలుస్తూ చదువు విలువ చెబుతూ వచ్చింది. డబ్బుకు విలువ ఇవ్వని వారు కూడా చదువుకు విలువ ఇస్తారని తెలిపింది. సెలవుల్లో ఇంటికి తీసుకువచ్చి లక్ష్మి మంచి చెడ్డలు చూసేది. ఆమె మాటలు లక్ష్మి మనసులో నాటుకుపోయాయి. ‘ఏ రోజూ కూడా రాత్రి ఒంటి గంట లోపు లక్ష్మి పుస్తకం మూయగా చూడలేదు’ అని లక్ష్మి బాబాయ్ రవి తెలిపాడు. గురుకుల పాఠశాలలో కొత్తగూడెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో దాదాపు వేయి మంది అమ్మాయిలు 6 నుంచి ఇంటర్ వరకూ చదువుతున్నారు. ప్రిన్సిపాల్ దేవదాసు, ఉపాధ్యాయులు వీరి చదువు మీద బాగా శ్రద్ధ పెడుతున్నారు. చురుకైన విద్యార్థినులను ఎంపిక చేసి జె.ఇ.ఇలో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్లో ఎం.పి.సి తీసుకున్న లక్ష్మి 992 మార్కులు సాధించింది. దాంతో ఇంకా ఉత్సాహంతో జె.ఇ.ఇకి ప్రిపేర్ అయ్యింది. జె.ఇ.ఇ అడ్వాన్స్‌డ్‌లో 1371వ ర్యాంకు సాధించింది. పాట్నా ఐ.ఐ.టిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో మొన్నటి ఆగస్టు మొదటివారంలో సీటు పొందింది. గురుకుల పాఠశాల నుంచి ఈ ఘనత సాధించిన అమ్మాయి లక్ష్మీ. ఐ.ఏ.ఎస్ చేయాలని... బాగా చదువుకుని ఐ.ఏ.ఎస్ చేయాలనేది తన లక్ష్యమని కొర్సా లక్ష్మి చెప్పింది. జె.ఇ.ఇలో మంచి ర్యాంకు సాధించి ఐ.ఐ.టిలో సీటు పొందడంతో ఐ.టి.డి.ఏ అధికారులు లక్ష్మిని ప్రశంసించారు. ట్యాబ్ ఇచ్చి ఆర్థిక సహాయం చేశారు. లక్ష్మి ఇంత బాగా చదవడంతో ఇంకా కొంతమంది ఆమె చదువును ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు. ఆ ప్రోత్సాహం వల్ల లక్ష్మి ఐ.ఏ.ఎస్ చదివి పేద వర్గాల కోసం పని చేయాలని నిశ్చయించుకుంది. -
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. వారంలో మూడో కేసు
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థులు వరుస ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇటీవల కాలంలో విద్యార్థుల బలవన్మరణాలు పెరిగిపోయాయి. మానసిక ఒత్తిడి, చదవు భయంతో బంగారు భవిష్యత్తును చేజేతులారా చిదిమేస్తున్నారు. వారానికి ఒక ఆత్మహత్య కేసు నమోదవ్వడం కలవరపెడుతున్నాయి. తాజాగా కోటాలో గురువారం మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు విడిచాడు. కోటాలో గడిచిన వారం రోజుల వ్యవధిలో విద్యార్ధి ఆత్మహత్య నమోదవ్వడం ఇది మూడోది కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని అజంఘర్‌కు చెందిన 17 ఏళ్ల మనీష్ ప్రజాపత్ ఆరు నెలల కిత్రం కోటాకు వచ్చాడు. ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఏమైందో ఏమో కానీ గురువారం ఉదయం తన హాస్టల్ రూమ్‌లో విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని వద్ద ఎలాంటి సుసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. కాగా కోటాలో ఈ ఏడాది బలవన్మరణం చెందిన విద్యార్థుల సంఖ్య 21కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఇదే పట్టణంలో 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అఖిల భారత స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కోటా ప్రసిద్ధి గాంచింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వేల మంది విద్యార్థులు కోచింగ్ కోసం వస్తుంటారు. ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే చదువులో ఒత్తిడి వల్ల అక్కడ విద్యార్థులు ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. చదవండి: Hyderabad: తాగుడుకు బానిసైన భర్త.. ఉద్యోగం మానేసి అబద్ధాలు చెప్తుండటంతో -
TS: ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల దందాపై ఉన్నత విద్యామండలి దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల సీట్ల దందాకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలుపెట్టింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న టాపర్స్ జాబితాపై దృష్టి పెట్టనుంది. జేఈఈ ద్వారా జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొంది, జోసా కౌన్సెలింగ్ ద్వారా వాటిల్లో చేరిన వారి వివరాలు సేకరించాలని యోచిస్తోంది. ఇదే విద్యార్థులు రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొంది, చివరలో రద్దు చేసుకోవడం వెనుక కథేంటో తేల్చాలని నిర్ణయించింది. ప్రైవేటు కాలేజీలతో కుమ్మక్కయినట్లు బయటపడితే కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన మండలి త్వరలో ఇందుకు సంబంధించిన విధివిధానాలకు రూపకల్పన చేయనుంది. ర్యాంకర్లకు కాలేజీల వల్ల జేఈఈ, ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించిన రాష్ట్ర విద్యా ర్థులు అటు ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నారు. ముందుగా రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉన్న కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్, డేటాసైన్స్ వంటి కోర్సుల్లో తొలి విడత కౌన్సెలింగ్‌లోనే సీట్లు పొందుతున్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేస్తున్నారు. ఆ తర్వాత వీరికి జోసా కౌన్సెలింగ్‌లోనూ సీట్లు వస్తున్నాయి. వాటిల్లోనూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా పొందిన సీటును రద్దు చేసుకోకుండా ఎంసెట్ కౌన్సెలింగ్ అన్ని దశలు అయిపోయే వరకు అలాగే ఉంచి చివర్లో రద్దు చేసుకుంటున్నారు. ఈ సీట్లను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ముందే ఎక్కువ డబ్బులకు మాట్లాడుకున్న వారికి కాలేజీలు సీట్లు కేటాయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ ర్యాంకర్లకు కూడా ముందే వల వేసి ఒప్పందం చేసుకుంటున్నారని, ఈ మేరకు కొంత మొత్తం ముట్టజెబు తున్నారని విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో రూ.కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని, ఉన్నతాధికారులకు సైతం ఇందులో వాటాలు ఉంటున్నాయని ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీల దందాపై ప్రతి ఏటా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ తంతుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా నివేదికలు ఇస్తున్నాయి. దీంతో ఈ అడ్డగోలు వ్యాపారానికి చెక్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఏం చేయబోతున్నారు..? తొలిదశలోనే సీటు సాధించి చివరి కౌన్సెలింగ్ వరకూ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరని వారి వివరాలు సేకరిస్తారు. జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకుని, జోసా కౌన్సెలింగ్‌లో వారికి సీటు ఎప్పుడొచ్చింది? ఎప్పుడు రిపోర్టు చేశారు? అనే వివరాలు సేకరిస్తారు. ఇదంతా విద్యార్థుల ఆధార్ నంబర్ ఆధారంగా చేయాలని భావిస్తు న్నారు. విద్యార్థులకు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ద్వారా లబ్ధి చేకూరిందా అనేది నిగ్గు తేల్చేందుకు వారి బ్యాంకు ఖాతాలతో పాటు తల్లిదండ్రులు, బంధువుల బ్యాంకు ఖాతాలను కూడా చెక్ చేసే వీలుందని ఓ అధికారి తెలిపారు. ప్రాథమిక ఆధారాలు లభిస్తే తక్షణమే జాతీయ సంస్థలతో మాట్లాడి ఆ విద్యార్థి ఎక్కడ సీటు పొందినా బ్లాక్ చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. ఈ క్రమంలో కాలేజీలు, విద్యార్థులపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడ బోమని అధికారులు అంటున్నారు. కాలేజీల సీట్ల వ్యాపారంలో పావులు కావొద్దంటూ విద్యార్థులను హెచ్చరించేలా ప్రచారం సైతం చేసేందుకు మండలి సిద్ధమవుతోంది. -
జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్
-
సివిల్స్‌లో ఫెయిల్ అయిన చాట్ జీపీటీ
-
‘జేఈఈ’ సెషన్–2కు అభ్యర్థుల తాకిడి
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్–2023 సెకండ్ సెషన్‌కు అభ్యర్థుల తాకిడి విపరీతంగా పెరగనుంది. జనవరిలో నిర్వహించిన మొదటి సెషన్ పరీక్షలకన్నా రెండో సెషన్‌కు ఎక్కువమంది హాజరుకానున్నారని ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. జనవరి సెషన్ సమయంలో ఇంటర్ పరీక్షల సన్నద్ధతతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఉండడంతో తొలిసెషన్ కన్నా రెండో సెషన్‌నే ఎక్కువ మంది ప్రాధాన్యతగా తీసుకున్నారు. అయితే, ఈసారి తొలిసెషన్ పరీక్షలలో కూడా గతంలో కన్నా రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగిన తొలిసెషన్ కంప్యూటర్ ఆధారిత (కంప్యూటర్ బేస్డ్ టెస్టు–సీబీటీ) పరీక్షకు మొత్తం 8,60,064 మంది పేపర్–1కు.. 46,465 మంది పేపర్–2కు రిజిస్టరయ్యారు. వీరిలో పేపర్–1కి 8,23,967 (95.80 శాతం) మంది.. పేపర్–2కి 95 శాతానికి పైగా హాజరయ్యారు. వచ్చేనెల 6 నుంచి రెండో సెషన్ పరీక్షలు ఇక జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసింది. సెకండ్ సెషన్ నిర్వహించే పట్టణాలకు సంబంధించిన సిటీ స్లిప్‌లను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారం ఆరంభంలో అభ్యర్థుల అడ్మిట్ కార్డులను ఎన్టీయే విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే.. తొలి సెషన్ పరీక్షల సమయంలో ఇంటర్మీడియెట్, సీబీఎస్ఈ ప్లస్2కు సంబంధించిన ప్రాక్టికల్స్ నేపథ్యంలో విద్యార్థుల నుంచి పరీక్షల షెడ్యూల్లో మార్పుల కోసం అనేక వినతులు ఎన్టీయేకు అందాయి. అదే సమయంలో కొందరు విద్యార్థులు ఉన్నత న్యాయస్థానంలో కేసులూ దాఖలు చేశారు. అయితే, పరీక్షల వాయిదాకు కోర్టు అంగీకరించలేదు. దేశవ్యాప్తంగా 574 పరీక్ష కేంద్రాలు.. ఇంటర్మీడియెట్ పరీక్షల సన్నద్ధత సమయంలోనే జేఈఈ తొలి సెషన్లో 8.6 లక్షల మందికిగాను 8.22 లక్షల మంది హాజరయ్యారు. రెండో సెషన్ ప్రారంభమయ్యే నాటికి ఇంటర్ పరీక్షలు పూర్తికానున్న నేపథ్యంలో ఇంకా ఎక్కువమంది హాజరయ్యే అవకాశం ఉంటుందని ఆయా కాలేజీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. తొలి సెషన్లో పాల్గొన్న వారితో పాటు కొత్తగా మరింత మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా 290 పట్టణాల్లోని 574 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఏపీలోని 25 పట్టణాల్లో జరుగుతుంది. తుది ఫలితాలు ఏప్రిల్ 30 లోపు ఇక జేఈఈ మెయిన్ తుది ఫలితాలు ఏప్రిల్ 30లోపు వెలువడనున్నాయి. ఏప్రిల్ 30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. మెయిన్‌లో అర్హత సాధించిన తొలి 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌లో దరఖాస్తుకు అవకాశముంటుంది. రెండు సెషన్లలో సాధించిన మార్కుల్లో ఎక్కువ మార్కులను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు. తొలిసెషన్లో దేశవ్యాప్తంగా 100 స్కోర్ పాయింట్లు సాధించిన విద్యార్థులు 20 మంది ఉన్నారు. 100 స్కోర్ పాయింట్లతో పాటు అత్యధిక స్కోర్ పాయింట్లు సాధించిన విద్యార్థుల్లో సగం మంది తెలుగువారే. బాలికల్లో టాప్ స్కోరు పాయింట్లను సాధించిన వారిలోనూ తెలుగు అమ్మాయిలే ఉన్నారు. -
జేఈఈ పరీక్ష కేంద్రాల కుదింపు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 24 నుంచి జరిగే జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కుదించింది. గతంలో 21 పట్టణాల్లో నిర్వహించే ఈ పరీక్షను ఈసారి 17 పట్టణాలకే పరిమితం చేసినట్టు స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో గతంలో భౌతికదూరం పాటించాల్సి వచ్చిందని, అభ్యర్థులు గుంపులుగా ఉండకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈసారి ఆ తీవ్రత లేకపోవడంతో పరీక్ష కేంద్రాలను తగ్గించినట్టు పేర్కొన్నారు. కోవిడ్ కాలంలో నాలుగు దఫాలుగా నిర్వహించిన పరీక్షను ఈసారి రెండు దఫాలకు తగ్గించిన విషయం తెలిసిందే. పరీక్ష కేంద్రాల విషయంలో విద్యార్థుల వెసులుబాటు, పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనను ప్రామాణికంగా తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే పరీక్ష కేంద్రాల తగ్గింపు వల్ల పలు జిల్లాల్లో విద్యార్థులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆదిలాబాద్‌లో పరీక్ష రాసే విద్యార్థులు నిజామాబాద్‌కుగానీ, హైదరా బాద్‌కుగానీ వెళ్లాల్సి ఉంటుంది. వికారాబాద్ అభ్యర్థులు హైదరాబాద్‌లోగానీ, సంగారెడ్డిలోగా నీ రాయాల్సి ఉంటుంది. గద్వాల విద్యార్థులు మహబూబ్‌నగర్ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు 95 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్, గద్వాల, వికారాబాద్, మంచిర్యాలలో ఉన్న కేంద్రాలను ఈసారి తీసేశారు. పరీక్ష కేంద్రాలు ఇవే. జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాల జాబితాను ఎన్టీఏ ప్రకటించింది. ఇందులో హయత్‌నగర్, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ ఉన్నాయి. -
నీట్, జేఈఈకి ప్రత్యేక శిక్షణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులు నీట్, జేఈఈ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందేలా పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ‘ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ సమ్మర్ కోచింగ్’ పేరిట వేసవిలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీలకు దీటుగా పైసా ఖర్చు లేకుండా శిక్షణ ఇవ్వాలన్నది బోర్డు లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి మొదటి వారంలో ఇంటర్ సిలబస్ పూర్తి చేసి, మరో వారం రివిజన్ చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత జనవరి రెండో వారం నుంచి ప్రతి కాలేజీలోనూ జేఈఈ, నీట్‌కు సంసిద్ధుల్ని చేసే ప్రక్రియను మొదలు పెడతారు. మార్చి నెలాఖరుకు ఇంటర్ పరీక్షలు ముగుస్తాయి. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ మొదలు పెడతారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కోచింగ్ వల్ల జాతీయ స్థాయి పరీక్షల్లోనే కాకుండా, తెలంగాణ ఎంసెట్‌లోనూ మంచి ర్యాంకులు పొందే వీలుందని అధికారులు వివరిస్తున్నారు. సీనియర్ లెక్చరర్లతో శిక్షణ శిక్షణలో భాగంగా నీట్, జేఈఈకి సంబంధించిన మాదిరి ప్రశ్నాపత్రాలను ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులందరికీ అందించనున్నారు. వీటి ఆధారంగా జిల్లా స్థాయిలో అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. వీరిలో మంచి మార్కులు పొందిన వంద మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందులో బాలురు 50 మంది ఉంటే, బాలికలు 50 మంది ఉండాలని బోర్డు మార్గదర్శకాల్లో పేర్కొంది. వార్షిక పరీక్షల అనంతరం ప్రతి జిల్లా కేంద్రంలో ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అన్ని వసతులు ఉన్న చోట వీటిని నెలకొల్పుతారు. ఉచిత వసతి, భోజనం, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు స్టడీ మెటీరియల్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న సీనియర్ సబ్జెక్టు లెక్చరర్లతో శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నారు. అయితే ప్రత్యేక కోచింగ్ విషయంలో ప్రభుత్వ అ«ద్యాç³కులు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జేఈఈ మొదటి దశ పరీక్షలు జనవరిలో, రెండో దశ ఏప్రిల్‌లో జరుగుతాయి. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 1తో ముగుస్తాయి. ఇలాంటప్పుడు ప్రత్యేక శిక్షణకు సమయం ఎక్కడ ఉంటుందనే సందేహాలు వారు వ్యక్తం చేస్తున్నారు. ర్యాంకులు రాకపోతే ఆ వైఫల్యాలను తమ పైకి నెట్టే వీలుందని కూడా అంటున్నట్టు తెలిసింది. -
టాప్‌గేర్‌లో ఎంసెట్... రివర్స్‌లో జేఈఈ
సాక్షి, హైదరాబాద్: రానురాను జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీలవైపు మొగ్గుచూపే విద్యార్థులు తగ్గిపోతున్నారు. ఏటా జేఈఈ రాసే విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా, స్థానిక ఎంసెట్ రాసేవారి సంఖ్య పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. ఇంటరీ్మడియెట్ నుంచే విద్యార్థులు ఎంసెట్‌ను లక్ష్యంగా పెట్టుకుంటున్నారని ఉన్నత విద్యామండలి వర్గాలు అంటున్నాయి. 2014లో జేఈఈ మెయిన్స్ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుంటే, 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. వాస్తవానికి మన రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ (సంయుక్త ప్రవేశ పరీక్ష) రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉంటే, ఇప్పుడు 1.30 లక్షలకు పడిపోయింది. 2018లో రాష్ట్రంలో 1.47 లక్షల మంది ఎంసెట్ రాయగా, 2022 నాటికి ఇది 1.61 లక్షలకు పెరిగింది. ఎంసెట్ ద్వారా విద్యార్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందితే, జేఈఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో, అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీల్లో సీట్లు దక్కించుకుంటారు. మార్పునకు కారణాలేంటి? సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) సర్వే ప్రకారం గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఎక్కువగా ఉపాధి వైపే మొగ్గుతున్నారు. ఏదో ఒక ఉద్యోగం కోసం వెతుక్కునే వారి సంఖ్య అబ్బాయిల్లో పెరుగుతోంది. కోవిడ్ తర్వాత ప్రతీ కుటుంబంలోనూ ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ వంటి సాంకేతిక పట్టాతో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంఎస్ కోసం అమెరికా, బ్రిటన్, ఆ్రస్టేలియా వంటి దేశాలకు వెళ్లినా, చదువుకన్నా ఉపాధి వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు అంతర్జాతీయ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జేఈఈ వంటి విపరీతమైన పోటీ ఉండే పరీక్షలపై ఆసక్తి చూపడం లేదు. స్థానిక ఎంసెట్‌తో ఏదో ఒక కాలేజీలో సీటు తెచ్చుకోవడానికే ఇష్టపడుతున్నారు. కాలేజీల తీరులోనూ మార్పు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులు సాధారణంగా ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ కోర్సులనే ఎంచుకుంటున్నారు. ఎంసెట్‌లో 30 వేల ర్యాంకు వచి్చనా ఏదో ఒక కాలేజీలో సీఎస్ఈలో సీటు దొరుకుతుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఏదో ఒక ప్రైవేటు సంస్థలో చేరి ఉపాధి అవకాశాలున్న కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నారు. దీంతో సులువుగానే సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్తున్నారు. దీనికితోడు రాష్ట్రంలో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు పెరుగుతున్నాయి. డిమాండ్ లేని సివిల్, మెకానికల్ సీట్లు తగ్గించుకుని, సీఎస్ఈ, దాని అనుబంధ కంప్యూటర్ కోర్సుల్లో సీట్లను కాలేజీలు పెంచుకున్నాయి. ఈ సీట్లే ఇప్పుడు 58 శాతం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జేఈఈ కోసం పోటీ పడాలనే ఆలోచన విద్యార్థుల్లో సన్నగిల్లుతోంది. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌కు హాజరవుతున్న విద్యార్థులు ఇలా.... -
అమెజాన్ సంచలన ప్రకటన.. భారత్‌లో ఆ ప్లాట్‌ఫాం బంద్!
ఇటీవల జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలును పరిశీలన, ఆపై వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నట్లు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రకటించిన రెండు వారాల లోపే తాజాగా మరో సంచలన ప్రకటన చేసింది. దేశంలోని హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రారంభించిన తన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంను మూసివేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ప్రస్తుత అకాడమిక్ సెషన్లో నమోదు చేసుకున్న వారికి పూర్తి రుసుమును రీఫండ్ చేస్తామని ఈకామర్స్ దిగ్గజం తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో వర్చువల్ లెర్నింగ్ డిమాండ్ పెరగడంతో ఈ ప్లాట్‌ఫాంను గత ఏడాది జనవరిలో ప్రారంభించింది. ఇందులో జేఈఈ (JEE)తో సహా పోటీ పరీక్షలకు కోచింగ్‌ను అందిస్తోంది. ఒక అంచనా ఆధారంగా.. ప్రస్తుత కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అమెజాన్ అకాడమీని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అయితే, కస్టమర్లు అక్టోబర్ 2024 వరకు పొడిగించిన సంవత్సరం పాటు పూర్తి కోర్సు మెటీరియల్‌ని ఆన్లైన్లో యాక్సెస్ చేయగలరని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో విద్యాసంస్థలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆన్లైన్ విద్యను అందిస్తోన్న పలు సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీని ఫలితమే.. ప్రముఖ ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ ఇటీవలే 2,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. ఇదే దారిలో అన్అకాడమీ, టాపర్, వైట్ హ్యాట్ జూ, వేదాంతు వంటి ఇతర కంపెనీలు కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో తొలగింపులను ప్రకటించాయి. చదవండి: Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్! -
నవంబర్‌లో ఆకాష్ టాలెంట్ హంట్– 2022
లబ్బీపేట (విజయవాడ తూర్పు): దేశ వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది నిరుపేదలు, బాలికలకు ఉచితంగా జేఈఈ, నీట్ శిక్షణ ఇచ్చేందుకు నవంబర్‌లో ఆకాష్ బైజూస్ జాతీయ టాలెంట్ హంట్ పరీక్ష–2022 (అంతే 2022) నిర్వహించనున్నట్లు ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ గుదే సంజయ్‌గాంధీ తెలిపారు. ఆ పరీక్షకు సంబంధించి పోస్టర్‌ను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్‌గాంధీ మాట్లాడుతూ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా అందించే స్కాలర్‌షిప్‌లకు అదనంగా ఇవి అందించనున్నట్లు తెలిపారు. ఉచిత శిక్షణకు అర్హులను ఎంపిక చేసేందుకు నవంబర్ 5 నుంచి 13 వరకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో ఎంపిక చేసిన తేదీల్లో ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు ఏదైనా సమయంలో ఒక గంట పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆఫ్‌లైన్ పరీక్షను ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలో 90 మార్కులు ఉంటాయని, 35 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయన్నారు. దేశ వ్యాప్తంగా 285 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా బిజినెస్ హెడ్ రవికిరణ్ ఏర్పుల, బ్రాంచి మేనేజర్ జి.గోపీనాథ్‌లు పాల్గొన్నారు. (క్లిక్: పిల్లల భవిష్యత్తే మనకు ముఖ్యం.. అధికారులతో సీఎం జగన్) -
ఎంసెట్, నీట్, జేఈఈకి ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, నీట్, జేఈఈకి సన్నద్ధమవుతున్న విద్యార్థులకు టీ–శాట్ ద్వారా ఉచిత శిక్షణ కొనసాగుతుందని ఇంటర్ బోర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ సమయంలో 2020లో ప్రారంభించిన ఈ శిక్షణకు విద్యార్థుల నుంచి మంచి స్పందన ఉందని, ఇప్పటికే 12 వేల మంది నమోదు చేసుకు న్నారని బోర్డ్ స్పష్టం చేసింది. జాతీయ పోటీ పరీక్షలపై సమగ్ర శిక్షణ ఇవ్వడమే కాకుండా, మోడల్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. టీ–శాట్ ద్వారా సాయంత్రం 6.30 గం టల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సదు పాయాన్ని వినియోగించుకోవచ్చని సూచించింది. ఇంజనీరింగ్ పీజీసెట్– 2022 గడువు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఇంజనీరింగ్ పీజీసెట్ (టీఎస్ పీజీఈసీఈటీ– 2022) దరఖాస్తులకు అపరాధ రుసుము లేకుండా ఈనెల 30 వరకు గడువు పొడిగించి నట్లు కన్వీనర్ లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. చివరి సంవత్సరం పరీక్షలు రాసే బీఈ, బీటెక్ విద్యార్థులు, వివిధ రకాల సెమిస్టర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా పీజీఈసెట్‌కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 15లోగా విద్యార్థులందరికీ యూనిఫాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ జూలై 15లోగా యూనిఫాం అందజేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈమేరకు షెడ్యూల్‌ను రూపొందించి జిల్లా, మండల విద్యాశాఖాధికారులతో పాటు, పాఠశాల ప్రధానోపాధ్యా యులకు పంపింది. మొత్తం 33 జిల్లాల్లో 22,78,569 మంది విద్యార్థులున్నట్టు గుర్తించారు. వీరికి 67,75,522 మీటర్ల వస్త్రం అవసరమని అంచనా వేసి, ఈమేరకు ఆర్డర్లు ఇచ్చారు. మొదటి దశలో 24,69,214 మంది విద్యార్థులకు జూలై 4వ తేదీలోగా యూనిఫాం అందించాలని, మిగతా విద్యార్థులకు జూలై 15లోగా ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. కొత్తగా ప్రవేశం పొందే వారికి కూడా యూని ఫాం ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నామని, ఈ ప్రక్రియ జూలై నెలాఖరుకల్లా పూర్తయ్యే వీలుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. (క్లిక్: గురుకులాల్లో మరో 1,000 కొలువులు!) -
23 నుంచి జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి మొదటి దశలో నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 20 నుంచి మొదలవ్వాల్సిన పరీక్షను 23కు మార్చారు. తొలి విడత పరీక్షలు ఈ నెల 29 వరకూ జరుగుతాయి. ఆడ్మిట్ కార్డుల డౌన్లోడ్ ప్రక్రియను శనివారం నుంచే అనుమతించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. పూర్తిగా ఆన్లైన్ మోడ్‌లో దేశవ్యాప్తంగా 501 ప్రాంతాల్లో మెయిన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎవరెవరికి ఎక్కడ పరీక్ష అనే విషయాన్ని జేఈఈ మెయిన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది. పరీక్ష రాసే పట్టణం పేరు మాత్రమే వెబ్సైట్లో ఉంటుందని, పరీక్ష కేంద్రం ఎక్కడనేది హాల్ టిక్కెట్లో ఇస్తామని తెలిపింది. పరీక్షలోనూ మార్పులు రెండేళ్ళ కోవిడ్ తర్వాత నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఈసారి కొంత కఠినంగా ఉండే అవకాశం కన్పిస్తోంది. పరీక్ష విధానంలో మార్పులే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. గత రెండేళ్ళుగా సెక్షన్–ఏలో నెగెటివ్ మార్కింగ్ ఉండేది. ఇప్పుడు దీన్ని సెక్షన్–బీలో కూడా పెడుతున్నారు. ఈ విభాగంలో ఇచ్చే న్యూమరికల్ ప్రశ్నలకు దీన్ని పెట్టడం వల్ల విద్యార్థులు ఆచితూచి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నపత్రం మొత్తం 20 మార్కులకు ఉంటుంది. ఇదిలా ఉండగా, గతంలో మొత్తం 90 (ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు) ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. దీంతో మొత్తం మార్కుల సంఖ్య 360గా ఉండేది. ఇప్పుడు 90 ప్రశ్నల్లో 75కే జవాబు ఇవ్వాలి. మిగతా 15 చాయిస్‌గా తీసుకోవచ్చు. దీంతో ప్రశ్నపత్రం 300 మార్కులకే ఉండనుంది. సమాన మార్కులు వస్తే టై బ్రేకర్ విధానం 2021లో రద్దు చేసిన టై బ్రేకర్ విధానాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మళ్ళీ తెరమీదకు తెచ్చింది. ర్యాంకుల్లో సమానమైన స్కోర్ సాధించినప్పుడు వయసును కూడా ప్రామాణికంగా తీసుకోవడం ఈ విధానంలో ప్రత్యేకత. ఇద్దరు విద్యార్థులు పరీక్షలో సమానమైన మార్కులు సాధిస్తే ముందుగా గణితం, ఫిజిక్స్, కెమెస్ట్రీల మార్కులను పరిగణనలోనికి తీసుకుంటారు. ఆ తర్వాత తప్పు సమాధానాల నిష్పత్తిని సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో మార్కులు ఉంటే వయసును పరిగణనలోనికి తీసుకుంటారు. అప్పుడు కూడా ఇద్దరూ సమానంగా ఉంటే, ముందు ఎవరు దరఖాస్తు చేశారో చూసి ర్యాంకులు నిర్ధారిస్తారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష మొదటి విడత ఈ నెల 23 నుంచి 29 వరకూ , ఆ తర్వాత జూలై 21 నుంచి 30 వరకూ రెండో విడత జరుగుతుంది. కోవిడ్ సమయంలో నాలుగు విడతల పరీక్ష విధానాన్ని రెండు విడతలుగా మార్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది ఈ పరీక్ష రాస్తున్నారు. -
జేఈఈ.. ఆసక్తి తగ్గుతుందోయీ!
సాక్షి, హైదరాబాద్: కేంద్రం అధీనంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర సంస్థల్లో ప్రవే శాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)పై విద్యార్థుల్లో క్రమంగా ఆసక్తి తగ్గుతోంది. 2014లో జేఈఈ మెయిన్స్ కోసం దేశవ్యాప్తంగా 13.57 లక్షలమంది దర ఖాస్తు చేసుకోగా గతేడాది ఈ సంఖ్య 10.48 లక్షలకు తగ్గింది. దరఖాస్తు చేసిన వారి లోనూ దాదాపు లక్ష మంది పరీక్ష రాసేం దుకు ఇష్టపడట్లేదు. రాష్ట్రాల ఎంసెట్ పేపర్ల తో పోలిస్తే జేఈఈ పరీక్ష పేపర్లు విశ్లేష ణాత్మకంగా ఉండటం, ప్రశ్నలు ఎక్కువ భాగం సుదీర్ఘంగా ఉండటం కూడా కారణ మని నిపుణులు అంటున్నారు. దీంతో విద్యా ర్థులు ఎక్కువగా రాష్ట్రాల సెట్లపై దృష్టి పెడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రస్థాయి, కేంద్రస్థాయి సిలబస్‌లో ఉన్న కొన్ని చిక్కులవల్ల కూడా జేఈఈని విద్యా ర్థులు కఠినంగా భావిస్తూ క్రమంగా పరీక్షకు దూరమవుతున్నట్లు ఉందని చెబుతున్నారు. రాష్ట్రాల్లోనూ పెరిగిన వనరులు రాష్ట్ర పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో విసృ ్తత మౌలిక వసతులు, నాణ్యమైన ఉపాధి కోర్సుల్లో సీట్లు పెరగడం కూడా జేఈఈ హాజరు తగ్గడానికి ఓ కారణమని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంక టరమణ తెలిపారు. అనేక రాష్ట్రాల్లో లా, టీచింగ్, ఎంబీఏ వంటి కోర్సుల వైపు విద్యా ర్థులు మళ్లుతున్నారని పేర్కొన్నారు. అలాగే ఇంజనీరింగ్ తర్వాత విదేశీ విద్యకు వెళ్లాలనే ఆలోచన ఉన్నవారు జేఈఈ వంటి కష్టమైన పరీక్షల వైపు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సైన్స్ కోర్సుల ప్రాధాన్యత పెరగడం వల్ల ఉపాధి అవకా శాలు మెరుగవుతున్నాయని, వాటి ఆధారం గా విదేశీ విద్య, అక్కడ ఉపాధి అవకా శాలు మెరుగవుతాయనే ఆలోచన కూడా జేఈఈకి విద్యార్థులు క్రమంగా దూరం జరగడానికి కారణమవుతోందని ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొ.పాపిరెడ్డి చెప్పారు. పట్టు సాధించలేక... కరోనా లాక్డౌన్ సమయంలో కోచింగ్ సెంటర్లు మూతపడటం వల్ల విద్యార్థులు పెద్దగా సన్నద్ధమవ్వలేకపోయారని, ఈ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని జేఈఈ గణిత శాస్త్ర అధ్యాపకుడు సత్యా నంద్ విశ్లేషించారు. 2021లో అన్ని రాష్ట్రా ల్లోనూ తొలుత ఆన్లైన్ క్లాసులే జరగడంతో జేఈఈకి సిద్ధం కావడంపై పట్టు సాధించ లేకపోయామనే భావన విద్యార్థుల్లో ఉందని ఓ ప్రైవేటు కాలేజీలో రసాయనశాస్త్ర అధ్యా పకుడిగా పనిచేస్తున్న కొసిగి రామనాథం తెలిపారు. పరీక్షకు హాజరయ్యేవారిలో 30 శాతం మాత్రమే సీరియస్‌గా ప్రిపేపర్ అవు తున్నారని, మిగతావారు అరకొరగా సన్నద్ధ మయ్యే వాళ్లేనని 15 ఏళ్లుగా జేఈఈ కోచింగ్ ఇస్తున్న శ్యామ్యూల్ అభిప్రాయపడ్డారు. -
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే జేఈఈ అడ్వాన్స్ పరీక్షల షెడ్యూల్ కారణంగా తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. బుధవారం రిషెడ్యూల్ చేసిన తేదీల ప్రకారం.. ఏప్రిల్ 22 నుంచి మే 6 వరకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు.. ఏప్రిల్ 23 నుంచి మే 7 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11,12 న ఎన్విరాన్మెంటల్ పరీక్ష ఉండనుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్.. ►ఏప్రిల్ 22 న పేపర్ 1 తెలుగు/ సంస్కృతి ►ఏప్రిల్ 25 న ఇంగ్లీష్ పేపర్ 1 ►ఏప్రిల్ 27న మాథ్స్ పేపర్1A, బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 ►ఏప్రిల్ 29న మాథ్స్ పేపర్ 1B జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్1 ►మే2 న ఫిజిక్స్ పేపర్ 1, ఎకానమిక్స్ పేపర్1 ►మే 6న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్.. ►ఏప్రిల్ 23న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2, ►ఏప్రిల్ 26 న ఇంగ్లిష్ పేపర్ 2 ►ఏప్రిల్ 28న మాథ్స్ పేపర్ 2A, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2, ►ఏప్రిల్ 30న మాథ్స్ పేపర్ 2B, జూవాలజీ పేపర్2, హిస్టరీ పేపర్ 2 ►మే 5న ఫిజిక్స్ పేపర్ 2, ఎకానమిక్స్ పేపర్ 2, ►మే 7న కెమిస్ట్రీ పేపర్2, కామర్స్ పేపర్2 -
ఆలస్యం కానున్న ‘జేఈఈ’.. కారణం అదేనా!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ–2022 షెడ్యూల్ ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్లో మార్పులు చేయాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తోంది. దీనికి తోడు కరోనా కేసులు పెరుగుతుండటాన్ని కూడా పరిగణలోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్¯ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష.. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తారు. సాధారణంగా ఈ సమయానికే షెడ్యూల్ ప్రకటించి, ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్స్ తొలి దశ పరీక్ష నిర్వహించాలి. కానీ, ఇప్పటికీ షెడ్యూల్ ప్రకటించకపోవడంతో జేఈఈ ప్రక్రియ పూర్తవడానికి వచ్చే ఏడాది చివరి వరకూ పట్టొచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జేఈఈ మెయిన్–22ను ఎప్పుడు నిర్వహిస్తారు? ఎన్ని దశల్లో పరీక్షలుంటాయి? పరీక్ష విధానంలో మార్పులేమైనా ఉంటాయా? అనే సందేహాలు విద్యార్థుల్లో తలెత్తుతున్నాయి. రెండేళ్లుగా ఆలస్యం... ►2019 జేఈఈ షెడ్యూల్‌ను 2018, జూలై 7న ప్రకటించారు. 2019 జనవరి, ఏప్రిల్‌లో రెండు దశల్లో పరీక్ష నిర్వహించారు. ► 2020 పరీక్షల షెడ్యూల్‌ను 2019, ఆగస్టు 28న ప్రకటించారు. 2020, జనవరిలో మొదటి విడత జరిగింది. ఏప్రిల్‌లో జరగాల్సిన రెండో విడత పరీక్ష కరోనా కారణంగా సెప్టెంబర్‌లో నిర్వహించారు. ► 2021 జేఈఈ షెడ్యూల్‌ను 2020, డిసెంబర్ 16న ప్రకటించారు. 2020లో కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం పూర్తి కాకపోవడంతో పలువురు అభ్యర్థులు జేఈఈ మెయిన్‌కు హాజరు కాలేకపోయారు. దీంతో 2021 జేఈఈ మెయిన్స్‌ను నాలుగు విడతల్లో.. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) షెడ్యూల్ ఇచ్చింది. ఫిబ్రవరి, మార్చి సెషన్ల పరీక్షలు యథాతథంగా జరిగినా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్, మే సెషన్ల పరీక్షలు ఆలస్యమయ్యాయి. ఈ పరీక్షలు సెప్టెంబర్ 2కి గాని పూర్తికాలేదు. ► మూడేళ్లూ పరీక్షల షెడ్యూల్‌ను డిసెంబర్ నాటికే ప్రకటించారు. జేఈఈ మెయిన్స్–2022 షెడ్యూల్ మాత్రం ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. జేఈఈ ఆధారంగానే రాష్ట్ర ఎంసెట్... ఇంత వరకూ జేఈఈ నిర్వహణపై స్పష్టత రాలేదు. కరోనా కారణంగా మరింత ఆలస్యం చేస్తారా? ఎన్ని దఫాలుగా పరీక్ష నిర్వహిస్తారు? ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఉంటుందా? అనే సందేహాలకు స్పష్టత రావాల్సి ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా జేఈఈ ర్యాంకుల తర్వాతే రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. జేఈఈ ర్యాంకులు వచ్చిన వాళ్లు కేంద్ర సంస్థలకు వెళ్తున్నారు. అలా ఖాళీ అయిన ఇంజనీరింగ్ సీట్ల కోసం రాష్ట్రంలో మళ్లీ భర్తీ చేపట్టాల్సి ఉంటుంది. దీంతో జేఈఈ షెడ్యూల్ రాష్ట్ర ఎంసెట్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. -
జేఈఈ–2022 జాడేది?
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్డ్–2022 షెడ్యూల్‌పై విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జేఈఈ షెడ్యూల్‌ను పరీక్షకు ఆరు నెలల ముందుగా ప్రకటించడం ఆనవాయితీ. అయితే కరోనా, తదితర కారణాలతో గత కొన్నేళ్లుగా షెడ్యూల్ ప్రకటనలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్–2022ను ఎప్పుడు నిర్వహిస్తారు? ఎన్ని దశల్లో పరీక్షలుంటాయి? పరీక్ష విధానంలో మార్పులేమైనా ఉంటాయా? అనే సందేహాలు విద్యార్థుల్లో తలెత్తుతున్నాయి. కరోనాతో అస్తవ్యస్తం.. 2019 జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను 2018 జూలై 7న ప్రకటించారు. 2019 జనవరి, ఏప్రిల్‌ల్లో రెండు దశల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఇక 2020 పరీక్షల షెడ్యూల్‌ను 2019 ఆగస్టు 28న ప్రకటించారు. 2020 జనవరిలో మొదటి సెషన్ పరీక్షలు పూర్తి చేసినా.. రెండో సెషన్ ఏప్రిల్ పరీక్షలను కరోనా కారణంగా సెప్టెంబర్‌లో నిర్వహించారు. ఇక 2021 జేఈఈ షెడ్యూల్‌ను 2020 డిసెంబర్ 16న ప్రకటించారు. 2020లో కరోనా కారణంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం పూర్తి కాకపోవడంతో పలువురు అభ్యర్థులు జేఈఈ మెయిన్‌కు హాజరు కాలేకపోయారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 2021 జేఈఈ మెయిన్‌ను నాలుగు విడతల్లో.. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) షెడ్యూల్ ఇచ్చింది. ఫిబ్రవరి, మార్చి సెషన్ల పరీక్షలు యథాతథంగా జరిగినా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్, మే సెషన్ల పరీక్షలు ఆలస్యమయ్యాయి. ఈ పరీక్షలు సెప్టెంబర్ 2కి గాని పూర్తికాలేదు. గత మూడేళ్లూ పరీక్షల షెడ్యూల్‌ను డిసెంబర్ మధ్య నాటికే ప్రకటించారు. 2022 జేఈఈ మెయిన్ షెడ్యూల్ మాత్రం ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ఈసారి కూడా నాలుగు విడతలు ఉంటాయా? జేఈఈ మెయిన్‌ను రెండు విడతలకు బదులు 2021లో నాలుగు విడతల్లో నిర్వహించారు. 2022లో కూడా అదే విధానం ఉంటుందా? ఉండదా? అనే సందేహం వెంటాడుతోంది. నాలుగు విడతల వల్ల 2021లో ఐఐటీ అడ్మిషన్లు చాలా ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలో మార్పులు చేస్తారా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కరోనా కారణంగా ఆయా రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డుల పరీక్షలు ఆలస్యం కావడంతో ఇంటర్ మార్కుల వెయిటేజీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తొలగించింది. ఈసారి కూడా ఇదే విధానం ఉంటుందా? లేదా అనేదానిపైనా విద్యార్థుల్లో సందేహాలు ఉన్నాయి. ఇలా అనేక అంశాలపై ఆధారపడి పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సి ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మాదిరిగా నాలుగు విడతల్లో జేఈఈ ఉంటే.. ముందు బోర్డు పరీక్షలకు సిద్ధమై తదుపరి జేఈఈకి సన్నద్ధం కావాలని యోచిస్తున్నారు. -
ఆన్‌లైన్‌లోనూ అత్యుత్తమ బోధన
Sushma Boppana About Infinity Learn: కోవిడ్ తర్వాత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్లైన్ అభ్యసనానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీచైతన్య విద్యాసంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఇన్ఫినిటీ లెర్న్’ అనే ఎడ్యుటెక్ సంస్థను ప్రారంభించింది. నీట్, జేఈఈ విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు అందిస్తోంది. మూడు దశాబ్దాలకు పైగా బోధనానునుభవంతో ఆన్‌లైన్‌లోనూ అత్యుత్తమ శిక్షణ అందించి విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని ‘ఇన్ఫినిటీ లెర్న్’ సహ వ్యవస్థాపకురాలు సుష్మ బొప్పన పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇన్ఫినిటీ లెర్న్’ గురించి ఆమె మాటల్లోనే... నాణ్యమైన కంటెంట్ ఇతర సంస్థలకు భిన్నంగా నాణ్యమైన కంటెంట్ అందించే ప్రధాన లక్ష్యంగా ‘ఇన్ఫినిటీ లెర్న్’ను తీర్చిదిద్దాం. ఆఫ్‌లైన్‌లో బోధిస్తున్న విధానానికి దీటుగా డిజిటల్‌లోనూ అత్యుత్తమ శిక్షణ అందించే ఏర్పాటు చేశాం. విద్యార్థులకు కేవలం ఆన్లైన్లో పాఠాలు చెప్పడం, హోమ్‌వర్క్‌లు కేటాయించడమే కాకుండా ఆ విద్యార్థికి సబ్జెక్టుపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాం. గత 36 ఏళ్లుగా శ్రీచైతన్య విద్యాసంస్థల ద్వారా సాధించిన అనుభవం ఈ వ్యూహాలు అమలు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. నీట్, జేఈఈపై దృష్టి మొదటగా నీట్, జేఈఈపై దృష్టి సారించాం. నీట్ లాంగ్‌టర్మ్ శిక్షణకు దేశవ్యాప్తంగా విద్యార్థులు చేరుతున్నారు. టెస్ట్ సిరీస్‌కూ ఆదరణ లభిస్తోంది. 2023 నాటికి జాతీయ స్థాయి పోటీ పరీక్షలతోపాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్, ఇంగ్లీషు లాంగ్వేజ్ పాఠాలు, కంప్యూటర్ కోర్సులు అందించే ఆలోచన ఉంది. 2024 నాటికి శ్రీచైతన్య విద్యార్థులు కాకుండా మరో 10 లక్షల మంది విద్యార్థులు నేరుగా ‘ఇన్ఫినిటీ లెర్న్’ ప్రయోజనాలు పొందేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ‘అమెజాన్ అకాడమీ’తోనూ ఒప్పందం కుదుర్చుకుని నీట్, జేఈఈ పరీక్షల పూర్తి కోర్సులను అందిస్తున్నాం. నీట్–2021లో రికార్డుస్థాయి ఫలితాలు సాధించాం. వచ్చే ఏడాది మరిన్ని ర్యాంకులు సాధించే అవకాశం ఉంది. ప్రణాళిక, పర్యవేక్షణ ఇన్ఫినిటీ లెర్న్‌లో విద్యార్థి స్థాయికనుగుణంగా బోధన ఉంటుంది. అప్పుడే విద్యార్థుల్లో విశ్వాసం పెరుగుతుందనేది మా నమ్మకం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కాన్సెప్ట్ ఓరియెంటెడ్, ప్రాబ్లమ్ ఓరియెంటెడ్, న్యూమరికల్ అంశాలుగా విద్యార్థుల అవసరాల మేరకు కంటెంట్ అందిస్తున్నాం. ఆన్‌ౖలñ న్లో విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నారో తెలుసుకునే విధంగా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. తరగతిలో నేర్చుకున్న అంశాలను హోమ్ వర్క్ ద్వారా సాధన చేయడం, అందులో విద్యార్థులకు ఎదురైన అనుభవాలు, సందేహాలు నివేదికల రూపంలో అధ్యాపకుడికి చే రతాయి. వాటిని తర్వాత తరగతిలో ఉపాధ్యాయుడు విశ్లేషించి సందేహాలుంటే నివృత్తి చేస్తారు. దీంతో ఎప్పటికప్పుడు అంశాలపై పట్టు పెంచుకునే అవకాశం ఉంటుంది. అప్పుడే వారు పరీక్షల్లోనూ రాణించగలుగుతారు. టెక్నాలజీ వినియోగం తరగతి గదిలో స్మార్ట్ బోర్డులను ఏర్పాటు చేసి ‘హైబ్రిడ్ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ప్రోగ్రామ్’ను రూపొందించాం. నీట్ లాంగ్‌టర్మ్ విద్యార్థులందరికీ దీన్ని అమలు చేస్తున్నాం. తద్వారా ఆన్లైన్ ప్లాట్‌ఫాంను మరింత మెరుగుపరుస్తున్నాం. ఉపాధ్యాయ ఆధారిత బోధన కంటే విషయ ఆధారిత బోధనకు ప్రాధాన్యతనిస్తున్నాం. విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వినేటపుడు టెక్నాలజీ సమస్యలు తలెత్తకుండా అప్లికేషన్ తయారుచేశాం. పాఠాలు, స్టడీమెటీరియల్, యానిమేషన్ అంశాలను జోడించి బోధన సాగిస్తున్నాం. స్కాలర్షిప్ టెస్ట్ శ్రీచైతన్య విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులతోపాటు ఇతర విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల అవసరాలు తీర్చేలా దీన్ని రూపొందించాం. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో నిపుణులైన అధ్యాపకులు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోలేనిచోట విద్యార్థులకు ప్రయోజనం కలగాలని భావించాం. నామమాత్రపు ధర నిర్ణయించి కోర్సులను అందిస్తున్నాం. రూ.99 నుంచి కోర్సు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ‘స్కోర్’ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా దీర్ఘకాలిక శిక్షణ అందిస్తున్నాం. -
ఐఐటీల్లో తగ్గుతున్న విదేశీ విద్యార్థులు
సాక్షి, అమరావతి: దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలుగా పేరొందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎంపికయ్యే విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ నుంచి వారికి మినహాయింపునిచ్చారు. నేరుగా జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా ఎంపిక అవకాశం కల్పించారు. అయినా అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. పరీక్షకు హాజరవుతున్నవారిలోనూ ఒక శాతానికి మించి ఉత్తీర్ణులు కావడం లేదు. అర్హత సాధిస్తున్నవారు తక్కువే.. గతేడాది (2020) జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో దాదాపు 209 మంది ప్రవాస భారతీయులు (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా–ఓసీఐ), 23 మంది పీఐవోలు (పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్), 23 విదేశీ జాతి కేటగిరీ అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ రాశారు. వీరిలో విదేశీ జాతి కేటగిరీ కింద నలుగురు, పీఐవో కేటగిరీలో 16 మంది, ఓసీఐ కేటగిరీలో 133 మంది అర్హత సాధించారు. అర్హత సాధించకపోవడానికి కారణం ఇదే.. దేశంలోని విద్యార్థులు జేఈఈకి ఇంటర్మీడియెట్ ఆరంభం నుంచే సన్నాహాల్లో ఉంటున్నారు. విదేశీ విద్యార్థులు కేవలం పరీక్షకు ముందు మాత్రమే సిద్ధమవుతున్నారు. పైగా వారి విద్యలోని అంశాలకు, అడ్వాన్స్డ్ సిలబస్‌లోని అంశాలకు మధ్య చాలా అంతరం ఉంటోంది. దీంతో వారు అర్హత మార్కులను సాధించలేకపోతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అర్హత సాధించినవారిలోనూ ఐఐటీల్లో చేరుతున్నవారు తక్కువగానే ఉంటున్నారు. పొరుగు దేశాల విద్యార్థులే అధికం.. ఐఐటీల్లో యూజీ కోర్సుల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది మనదేశానికి చుట్టుపక్కల ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు దేశస్తులే. ఇతర దేశస్తులు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో యూజీ కోర్సులు చేయడానికి వెళ్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. మనదేశంలో యూజీ కోర్సుల్లో చేరేవారి కంటే పోస్ట్రుగాడ్యుయేషన్, పీహెచ్డీ కోర్సుల్లో చేరే విదేశీ విద్యార్థుల సంఖ్యే ఎక్కువ. ఐఐటీ రూర్కీలో 144 మంది విదేశీ విద్యార్థులుండగా వారంతా పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో చేరినవారే. ఇక ఢిల్లీ ఐఐటీలో 98 మంది విదేశీ విద్యార్థులుండగా వారు కూడా పీజీ, పీహెచ్డీ కోర్సులను అభ్యసిస్తున్నవారే. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు నమోదు చేసుకున్న విదేశీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో విదేశాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఈసారి రద్దు చేశారు. అంతర్జాతీయ ర్యాంకింగ్‌పై ప్రభావం కాగా.. విదేశీ విద్యార్థుల తగ్గుదల ప్రభావం దేశంలోని విద్యా సంస్థలకు ప్రపంచ ర్యాంకింగ్‌పై పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచ స్థాయి ర్యాంకులు ప్రకటించే సంస్థలు ఆయా విద్యాసంస్థల్లోని విదేశీ విద్యార్ధుల సంఖ్యను ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటాయని వివరిస్తున్నారు. విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుదల ఐఐటీలకు ప్రతికూలంగా మారుతోందని చెబుతున్నారు. -
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. జేఈఈ మెయిన్స్ ర్యాంకులు గత నెల 15వ తేదీన ప్రకటించారు. ఇందులో అర్హత సాధించిన వారు అడ్వాన్స్డ్ పరీక్ష రాశారు. జాతీయ స్థాయిలో 23 ఐఐటీలు, 32 జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు (ఎన్ఐటీలు), 26 ట్రిపుల్ ఐటీ కాలేజీలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో నడిచే మరో 33 విద్యా సంస్థల్లో దాదాపు 50 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా దసరా రోజున వెలువడే జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగానే ఈ సీట్లను భర్తీ చేస్తారు. దీని కోసం ఈ నెల 16వ తేదీ నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ ఆథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించనుంది. అర్హత సాధించిన విద్యార్థులు అదే రోజు కౌన్సెలింగ్ కోసం పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 22, 24 తేదీల్లో జోసా మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. తాము సాధించిన ర్యాంకుల ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో విద్యార్థులు తెలుసుకునేందుకు దీనిద్వారా వీలుంటుంది. ఇది ముగిసిన తర్వాత అధికారికంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ నెల 25 వరకు వెబ్ ఆప్షన్లలో ఎన్నిసార్లయినా మార్పులు చేసుకోవచ్చు. 25వ తేదీ అర్ధరాత్రి తర్వాత దీని గడువు ముగుస్తుంది. 27న ఉదయం 10 గంటలకు తొలి రౌండ్ సీట్లు కేటాయిస్తారు. సీట్లు వచ్చిన అభ్యర్థులు ఈ నెల 30 నాటికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 1న రెండో విడత, 6న మూడో విడత, 10న నాల్గవ విడత, 10న నాల్గవ విడత, 14న ఐదవ విడత, 18న ఆరవ విడత కౌన్సెలింగ్ చేపడతారు. ఆఖరి విడతలో సీట్లు దక్కిన వాళ్ళు నవంబర్ 20 నాటికి రిపోర్ట్ చేయాలి. అటో ఇటో తేలిపోతుంది జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు ప్రకటించిన తర్వాత విద్యార్థులకు ఓ స్పష్టత వచ్చే వీలుంది. ఎంసెట్‌లో మంచి ర్యాంకులు పొందినవారు టాప్ టెన్ కాలేజీల్లో సీట్లు దక్కించుకున్నారు. వీరు జెఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా మంచి ర్యాంకు సాధించి ఐఐటీ లేదా ఎన్ఐటీలో నచ్చిన బ్రాంచ్‌లో సీటు పొందగలిగితే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో వచ్చిన సీటును వదులుకునే అవకాశం ఉంది. -
మన పరీక్షలు ఎంత ‘నీట్’?
దేశంలో బోలెడు పోటీ ఉన్న ప్రవేశపరీక్షలవి. ఒకటి వైద్యవిద్యకూ, మరొకటి ఇంజనీరింగ్ విద్యకూ సంబంధించినది. ప్రతిష్ఠాత్మకమైన ఆ చదువుల్లో చేరడానికి అర్హత నిర్ణయించే ‘నీట్’, ‘జేఈఈ’ - ఈ జాతీయ స్థాయి పరీక్షలు రెండూ తాజాగా వివాదాస్పదం కావడం విచిత్రం. దేశ మంతటా ఒకే ప్రవేశ పరీక్ష ఉండాలంటూ ప్రతిష్ఠాత్మకంగా పెట్టుకున్న ఎగ్జామ్‌లు ఇవి. కానీ, వీటిలో సైతం దొడ్డి దారిన పాస్ చేసి, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం సంపాదించి పెట్టేలా అక్రమార్కులు విజృంభించడం నివ్వెరపరుస్తోంది. మన పరీక్షావిధానాల్లోని డొల్లతనానికి ఇది నిలువెత్తు నిదర్శనం. అటు జేఈఈ, ఇటు నీట్ రెండింటిలో అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణకు దిగాల్సి రావడం ఈ ప్రవేశపరీక్షల విశ్వసనీయతను వెక్కిరిస్తోంది. ప్రాసంగికతను ప్రశ్నిస్తోంది. వైద్యవిద్యలో ప్రవేశాల కోసం 2012లో మొదలుపెట్టినప్పటి నుంచి ‘నీట్’ వివాదాలు రేపుతూనే ఉంది. ఈ జాతీయ ప్రవేశపరీక్ష విద్యార్థుల ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక అంతరాలను బట్టి కొందరికి వరం, మరికొందరికి శాపమనే వాదన చాలా కాలంగా నడుస్తోంది. కొన్నేళ్ళుగా తమిళనాడు, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో వివాదమూ నెలకొంది. అప్పట్లోనే పలువురు విద్యార్థుల ఆత్మహత్యలతో తమిళనాట ‘నీట్’ రద్దు ఎన్నికల వాగ్దానమూ అయింది. ఇటీవల వారం రోజుల్లో ముగ్గురి ఆత్మహత్యతో ఈ నెల 13న అక్కడి కొత్త డీఎంకె ప్రభుత్వం తమిళనాట నీట్‌ను మినహాయిస్తూ, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. పన్నెండో తరగతి మార్కులే వైద్యవిద్యలో ప్రవేశానికి అర్హతగా తీర్మానించింది. రాష్ట్రపతి ఆమోదం పొందితే తప్ప, ఈ బిల్లు కాస్తా చట్టం కాదు. ఇంతలోనే పులి మీద పుట్రలా ఈ దొడ్డిదారి పాస్ వివాదం. ఎవరైనా సరే రూ. 50 లక్షలిస్తే చాలు... అసలు విద్యార్థి బదులు వేరెవరినో కూర్చోబెట్టి, ‘నీట్’ రాయించి, మెడికల్ కాలేజీ సీటు ఇప్పించే నాగపూర్‌లోని కోచింగ్ బండారం ఈ నెల 22న సీబీఐ బయటపెట్టింది. కథ కొత్త మలుపు తిరిగింది. ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం జేఈఈ (మెయిన్స్), వాటిలో పాసైన 2.5 లక్షల మంది ప్రతిష్ఠాత్మక ఐఐటీలలో చేరేందుకు రాసే జేఈఈ (అడ్వాన్స్డ్)కు సైతం ఇప్పుడు బురదంటుకుంది. ఈ ఏడాది నుంచి 4 దశలైన ఈ పరీక్షలో నాలుగోది కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ). పేరొందిన జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ) నిర్వహిస్తున్న ఇందులోనూ అక్రమాలు జరిగాయని సీబీఐ తేల్చింది. 15 లక్షలిస్తే, విద్యార్థి పరీక్ష రాసే కంప్యూటర్లోకి సుదూరంగా ఎక్కడి నుంచో సాంకేతికంగా జొరబడి, జవాబులు రాసి పాస్ చేయించే మోసాలు బహిర్గతమయ్యాయి. ఇలా అక్రమాలకు పాల్పడ్డ విద్యార్థుల్లో కొందరిపై ఎన్టీఏ తాజాగా మూడేళ్ళు నిషేధం పెట్టింది. పట్టుబడని దొంగల సంఖ్య పరమాత్ముడికి ఎరుక. వెరసి, జేఈఈ, నీట్ – రెండూ లోపరహితం కాదని తేలిపోయింది. ఏటా లక్షలాది విద్యార్థులు అనేక నెలలు శ్రమించి ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ఈ ఏడాది 15.3 లక్షల మంది నీట్, 9.4 లక్షల మంది జేఈఈ మెయిన్స్ రాశారు. ఎంతటి ప్రతిభావంతులైనా ఈ ఎంట్రన్స్ టెస్టుల్లో పాసైతేనే, కోరుకున్న వైద్య, ఇంజనీరింగ్ వృత్తివిద్యాభ్యాసం చేయగలుగుతారు. అందుకోసం అనేక మంది లక్షలు పోసి మరీ కోచింగ్‌లు తీసుకుంటూ ఉంటారు. కుటుంబ వార్షికాదాయం రూ. 2.5 లక్షల కన్నా తక్కువుండి, గ్రామీణ ప్రాంతాల్లో తమిళ మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులు, వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలకు నీట్ ఓ ప్రాణాంతక పోటీగా మారింది. సమాజంలోని ఉన్నత సామాజిక, ఆర్థిక వర్గాలకే ఎంబీబీఎస్ సీటొచ్చే పరిస్థితి. విభిన్న వర్గాలకు చోటు లేకుండా పోతోంది. తమిళనాడు సర్కార్ నియమించిన కమిటీ ఆ సంగతే తేల్చింది. 2013లో ఒకసారి నీట్ జరిగినా, సుప్రీమ్ కోర్టు నిషేధంతో కొన్నేళ్ళు ఆగింది. 2016లో కోర్టు ఉత్తర్వుల సవరణతో 2017– 18 విద్యా సంవత్సరం నుంచి నీట్ మళ్ళీ దేశవ్యాప్తంగా తప్పనిసరి తంతుగా మారింది. అప్పటి నుంచి నీట్ నుంచి మినహాయింపు కోసం తమిళనాడు లాంటి రాష్ట్రాలు ప్రయత్నిస్తూనే వస్తున్నాయి. బాగా చదివి, పన్నెండో తరగతిలో మార్కులు తెచ్చుకున్నవారు సైతం దేశవ్యాప్త సిలబస్, కోచింగ్ అంతరాలతో నీట్ సరిగ్గా రాయలేక, ఒత్తిడి, ఆందోళనతో కొన్నేళ్ళుగా ఎందరో పసివాళ్ళు ప్రాణాలు తీసుకోవడం కన్నీరు తెప్పిస్తోంది. ప్రతిభకు పట్టం కట్టడం, అందరికీ సమాన అవకాశాల కల్పన, విద్యార్థుల ప్రాణాలు – ఇలా ఎన్నో ముడిపడ్డ సున్నిత అంశమిది. నీట్‌ను యథాతథంగా కొనసాగించ రాదు. అలాగని, రాష్ట్రానికో రకం సిలబస్, ఒక్కోచోట ఒక్కోరకం మార్కుల కేటాయింపున్న బహుభాషా దేశంలో, పన్నెండో తరగతి మార్కులతోనే దేశవ్యాప్త ప్రవేశాలు నిర్ణయించాలని పట్టుబట్టడమూ సరైనది కాదు. వైద్యం రాష్ట్ర జాబితాలోది కాగా, విద్యను రాష్ట్ర పరిధి నుంచి ఎమర్జెన్సీ కాలంలో కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోకి తెచ్చారు. మళ్ళీ ఇప్పుడిలా నీట్‌తో కేంద్రం పెత్తనమన్నది విమర్శ. ఇరుపక్షాలూ సమగ్రంగా ఆలోచించి, తగు చర్యలు చేపట్టాలి. బలహీన వర్గాలకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వడం, లేదంటే ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు రిజర్వు చేయడం లాంటివి చేయవచ్చు. ఈ పరీక్షలు, మార్కులే ప్రపంచం కాదనీ, బతకడానికి నీట్ ఒక్కటే మార్గం కాదనీ పెద్దలు, టీచర్లు పిల్లలకు ధైర్యమివ్వాలి. ప్రభుత్వమేమో జేఈఈలో అక్రమాలకు ఎథికల్ హ్యాకర్లతో అడ్డుకట్ట వేయాలి. పారదర్శకమనే ఆన్లైన్ పరీక్షలే ‘డిజిటల్ ఇండియా’ వేళ అక్రమాలకు నెలవైనప్పుడు వ్యవస్థ నిద్ర మేల్కోవాల్సిందే. ఎందుకంటే, ఇది లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు. కోట్లాది కుటుంబాల ఆకాంక్షలకు విపత్తు. -
జేఈఈ, నీట్ కోర్సులు: అమెజాన్‌తో చేతులు కలిపిన శ్రీ చైతన్య
న్యూఢిల్లీ: అమెజాన్ అకాడెమీ, విద్యాసంస్థల గ్రూప్ శ్రీ చైతన్య తాజాగా చేతులు కలిపాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ), నేషనల్ ఎలిజిబిలిటీ–కమ్–ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసేవారి కోసం పూర్తి స్థాయి సిలబస్ కోర్సులను ఆవిష్కరించనున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం అమెజాన్ అకాడెమీలో శ్రీ చైతన్య అధ్యాపకులు లైవ్ ఆన్లైన్ తరగతులు బోధిస్తారు. అమెజాన్ అకాడెమీ రూపొందించిన బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ స్థాయి దాకా కంటెం ట్ విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని అమెజాన్ ఇండియా డైరెక్టర్ అమోల్ గుర్వారా, ఇన్ఫినిటీ లెర్న్ (శ్రీ చైతన్య గ్రూప్) డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. చదవండి : సిద్ధాంత్‌కు సీటివ్వండి! -
‘ఫిట్జీ’ ఆ విద్యార్థికి రూ.4 లక్షలు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: బోధన నచ్చలేదని చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వాలని విద్యార్థి చేసిన వినతిని ఫిట్జీ పినాకిల్ సంస్థ తిరస్కరించడంతో వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచింగ్ మానేసిన విద్యార్థికి ఫీజు తిరిగి ఇచ్చేయాలని సంబంధిత సంస్థకు హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్సు మొత్తం ఫీజు మొదటే తీసుకోవడాన్ని కమిషన్ తప్పుపట్టింది. ఫిట్జీలో కోర్సులో చేరి తర్వాత మానేసిన విద్యార్థి తన ఫీజు తిరిగి ఇవ్వాలని కోరగా నిరాకరించింది. దీనిపై ఆ విద్యార్థి వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ ఫిట్జీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వాదోపవాదనలు విని పైతీర్పు ఇచ్చింది. అయితే విచారణలో ‘చేరే సమయంలో విద్యార్థికి తిరిగి ఫీజు చెల్లించబోమని విషయాన్ని ముందే చెప్పాం’ అని ఫిట్జీ వాదించింది. ఈ ఒప్పందంపై ఆ విద్యార్థి సంతకం చేశారని కూడా గుర్తు చేయగా ఆ వాదనను కమిషన్ తోసిపుచ్చింది. ఫీజు వివాదం వినియోగదారుల కమిషన్ పరిధిలోకి రాదని ఫిట్జీ విద్యా సంస్థ పేర్కొనగా కమిషన్ తిరస్కరించింది. విద్యా సంస్థ ముసుగులో కోచింగ్ కేంద్రం నిర్వహిస్తున్నారని కమిషన్ పేర్కొంది. విద్యార్థికి రూ.4.35 లక్షల ఫీజు, రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఫిట్జీకి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇది 45 రోజుల్లో చెల్లించకపోతే 9 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారుల కమిషన్ హెచ్చరించింది. -
Telangana: ఎంసెట్, నీట్, జేఈఈ విద్యార్థులకు ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, నీట్, జేఈఈలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందిస్తోందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులతో పాటు ప్రైవేటు కళాశాలల వారు కూడా వినియోగించుకోవాలని కోరారు. శుక్రవారం తన కార్యాలయంలో షార్ట్ టైం ఆన్లైన్ కోచింగ్‌ను మంత్రి ప్రారంభించారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. http://tscie.rankr.io లింక్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ పొందవచ్చని తెలిపారు. -
జేఈఈ–మెయిన్ నాలుగో ఎడిషన్ వాయిదా
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–మెయిన్ ఫోర్త్ ఎడిషన్‌ను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం ప్రకటించారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం రెండు సెషన్ల మధ్య 4 వారాల విరామం ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫోర్త్ ఎడిషన్ జేఈఈ–మెయిన్ పరీక్షను ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 2 వరకూ నిర్వహిస్తామన్నారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకూ జరగాల్సి ఉంది. జేఈఈ–మెయిన్ నాలుగో సెషన్ కోసం ఇప్పటికే 7.32 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారని ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రిజిస్ట్రేషన్ గడువును జూలై 20 దాకా పొడిగించినట్లు పేర్కొన్నారు. జేఈఈ–మెయిన్ నాలుగో సెషన్ ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో జరుగనుంది. ఈ పరీక్షను 334 దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ డైరెక్టర్ సాధన పరాశర్ చెప్పారు. పరీక్ష కేంద్రాల సంఖ్యను 828కి పెంచినట్లు తెలిపారు. -
జేఈఈ ప్రిపేర్ విద్యార్థుల కోసం అమెజాన్ ఫ్రీ కోచింగ్
మీరు జేఈఈ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ఐఐటీ జేఈఈ కోర్సుల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం అమెజాన్ అకాడమీ ఫ్రీ కోచింగ్ అందిస్తుంది. అమెజాన్ ఇండియా జనవరిలో అమెజాన్ అకాడమీ పేరుతో ఒక ఎడ్టెక్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఐఐటీ జేఈఈ విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తోంది. నిపుణులైన జేఈఈ ఉపాధ్యాయులచే లైవ్ సెషన్స్ కూడా అందిస్తుంది. ఈ పరీక్షల కోసం మీరు అమెజాన్ అకాడమీ (https://academy.amazon.in/) వెబ్సైట్లో ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ సేవలు ఉచితంగా లభిస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌లో అమెజాన్ అకాడమీ పేరుతో ఉన్న యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. కొన్ని నెలల పాటు మొత్తం కంటెంట్ ఉచితంగా అందించనున్నట్లు అమెజాన్ అకాడమీ పేర్కొంది. కేవలం విద్యార్థులు తమ ఇంటి దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ ఉంటే చాలు ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. అమెజాన్ అకాడమీ ప్లాట్‌ఫామ్ లో జేఈఈ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు అవసరమయ్యే మొత్తం కంటెంట్ ఉంటుంది. అనుభవం గల టీచర్లు చెప్పే లైవ్ ఆన్లైన్ క్లాసులకు హాజరు కావొచ్చు. మాక్ టెస్టుల్లో పాల్గొనొచ్చు. నిపుణుల సారథ్యంలో జేఈఈ పరీక్షలకు ప్రిపేర్ కావొచ్చు. రియల్ టైమ్‌లో తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అమెజాన్ అకాడమీ నిర్వహించే జేఈఈ మాక్ టెస్టులకు హాజరై ఆల్ ఇండియా ర్యాంక్ తెలుసుకోవచ్చు. భారతదేశంలో జేఈఈ రాయాలనుకుంటున్నవారితో పోటీపడటంతో పాటు తమ స్కోర్స్ కంపేర్ చేసుకోవచ్చు. చదవండి: సుప్రీంకోర్టుకు ‘ఇస్రో కుట్ర కేసు’ నివేదిక -
JEE Advanced 2021: అడ్వాన్స్‌డ్‌లో విజయం ఇలా..!
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఉత్తీర్ణులవ్వడం తప్పనిసరి. ఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించడానికి ప్రత్యేక మ్యాజిక్ ఫార్ములాలు అంటూ ఏమీలేవు. పక్కా ప్రణాళిక, పట్టుదలతో కూడిన ప్రిపరేషన్ మాత్రమే అడ్వాన్స్‌డ్‌లో విజయానికి దారి చూపుతుంది. జేఈఈ అడ్వాన్స్ పరీక్ష జులై 3న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం సబ్జెక్ట్ వారీ ప్రిపరేషన్ టిప్స్.. ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో ఇంజనీరింగ్ చదవాలని దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు కోరుకుంటారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో అర్హత సాధించిన వారు మాత్రమే ఐఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అందుకే విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించేందుకు ఇంటర్లో చేరిన తొలిరోజు నుంచే ప్రిపరేషన్ సాగిస్తుంటారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరు కావాలంటే.. మొదట జేఈఈ మెయిన్ పరీక్షల్లో టాప్‌లో నిలవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం నాలుగుసార్లు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ పరీక్షలు.. ఇప్పటికే రెండుసార్లు జరిగాయి. ఈ ఏడాది ఇలా ఈ ఏడాది జులై 3వ తేదీన అడ్వాన్స్డ్ పరీక్ష జరుగనుంది. కొవిడ్ కారణంగా గతేడాది రాయలేకపోయిన వారు, ప్రస్తుతం అడ్వాన్స్డ్ పరీక్షలకు హాజరుకాబోయే వారితో ఈసారి పోటీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి విద్యార్థులు సరైన ప్రణాళికతో సబ్జెక్ట్ వారీ ప్రిపరేషన్‌తో ముందుకు వెళ్తేనే పరీక్షలో విజయం సాధించేందుకు వీలుంటుంది. సన్నద్ధత ఇలా ప్రస్తుత సంవత్సరం జరిగే పరీక్షా స్వరూపంలో ఎలాంటి మార్పులు లేవు. ఎప్పటిలాగానే ఆన్లైన్ విధానంలో మూడు గంటల కాలవ్యవధితో పరీక్షను నిర్వహించనున్నారు. సిలబస్ విషయానికివస్తే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలుంటాయి. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్ట్ వారీగా ఆయా సిలబ్ అంశాలపై దృష్టిపెట్టి ప్రిపరేషన్ కొనసా గించాలని నిపుణులు సూచిస్తున్నారు. సబ్జెక్ట్‌ల వారీగా ప్రిపరేషన్ మ్యాథమెటిక్స్ : జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో మ్యాథమెటిక్స్ విభాగంలో మంచి స్కోర్ సాధించాలంటే.. ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఇందులో సూత్రాలను ఎక్కువగా గుర్తుపెట్టుకోవ డానికి షార్ట్ కట్ మెథడ్స్‌ను తెలుసుకోవాలి. కోఆర్డినేట్ జామెట్రీ, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్తోపాటు 3డీ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టార్ అల్జీబ్రా, ఇంటిగ్రేషన్, కాంప్లెక్స్ నెంబర్స్, పారాబోలా, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థీరమ్, లోకస్ తదితర అంశాలపై బాగా పట్టు సాధించాలి. కెమిస్ట్రీ: కెమిస్ట్రీ సబ్జెక్టు కాంబినేషన్ అఫ్ థియరీగా ఉంటుంది. ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్ వంటి కలయికతో ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కెమిస్ట్రీ కోసం ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని నోట్‌బుక్‌లో రాసుకోవ డం ద్వారా ఆయా అంశాలను త్వరగా రివిజన్ చేసుకోవ డానికి వీలుంటుంది. ఇందులో కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్, ఆల్కహాల్స్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మోకెమిస్ట్రీ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అంతేకాకుండా మోల్కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఫినాల్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, అటామిక్ స్ట్రక్చర్, గ్యాసియస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, డీ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఫిజిక్స్ : ఈ సబ్జెక్టుకు సంబంధించి బేసిక్ ఫిజిక్స్ కాన్సెప్ట్లపై అభ్యర్థులు పట్టు సాధించాలి. లాజికల్ థింకింగ్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. సమస్యలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఫండమెంటల్స్‌పై పట్టు సాధించడానికి ఎన్సీఈఆర్టీ ఫిజిక్స్ బుక్స్, హెచ్‌సీ వర్మ, డీసీ పాండే ఫిజిక్స్ బుక్స్‌ను చదవాలి. అలాగే ఒక టాపిక్ మొదలు పెట్టినప్పడు దానికి సంబంధించిన సమస్యలను అదేరోజు పూర్తిచేసుకునే విధంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. ఇందులో ఎలక్ట్రో డైనమిక్స్, మెకానిక్స్ వంటివి కీలకమైన టాపిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అలాగే హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎస్హెచ్ఎం అండ్ వేవ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అలాగే సెంటర్ ఆఫ్ మాస్, మూమెంటమ్ అండ్ కొలిజన్, సింపుల హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్‌లో లోతైన అవగాహన ఏర్పరచుకుంటే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. రివిజన్‌కు ప్రాధాన్యం సబ్జెక్టుల వారిగా అన్ని టాపిక్స్‌ను పూర్తి చేసుకున్న తర్వాత రివిజన్‌కు ప్రాధాన్యం∙ఇవ్వాలి. ఆయా టాపిక్స్‌లోని ముఖ్యమైన అంశాలు తేలిగ్గా గుర్తుకు వచ్చేవిధంగా షార్ట్‌నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పరీక్ష ముందు రివైజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మాక్ టెస్టులతో స్పీడ్ విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలంటే.. ఎక్కువగా మాక్‌టెస్టులు, మోడల్ టెస్టులను రాయాలి. దీనివల్ల పరీక్షను వేగంగా నిర్దేశిత సమయంలోపు పూర్తిచేయడానికి వీలవుతుంది. అంతే కాకుండా మాక్ టెస్టులు విద్యార్థులు పరీక్షలో మంచి ప్రతిభ చూపేందుకు ఉపయోగపడతాయి. అలాగే ఆన్లైన్ పరీక్ష విధానంపైనా అవగాహన ఏర్పడుతుంది. సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో ప్రయోజనాలెన్నో! -
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే ఈసారి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు వెనుకబడ్డారు. ఎప్పుడూ 100 పర్సెంటైల్ స్కోర్ సాధించే రాష్ట్ర విద్యార్థులు.. జేఈఈ ఫిబ్రవరి సెషన్లో 100 పర్సెంటైల్ సాధించలేకపోయారు. రాష్ట్రాల వారీ, కేటగిరీల వారీ ఉన్న 41 మంది టాపర్స్‌లో రాష్ట్ర విద్యార్థులు ఇద్దరు ఉన్నారు. అందులో చల్లా విశ్వనాథ్ 100 పర్సెంటైల్‌కు 99.9990421, కొమ్మ శరణ్య 99.9990421 పర్సెంటైల్ సాధించారు. అత్యధిక మార్కులు 300కు 290 మార్కులు రాష్ట్ర విద్యార్థులకు లభించాయి. కాగా, సోమవారం ఉదయమే వస్తాయనుకున్న జేఈఈ మెయిన్ ఫలితాలను ఎట్టకేలకు రాత్రికి విడుదల చేశారు. జేఈఈ మెయిన్ వెబ్సైట్లో (jeemain.nta.nic.in) ఫలితాల లింకులు అందుబాటులోకి తెచ్చారు. ప్రశ్నల్లో తప్పులతో గందరగోళం.. గత నెలలో నిర్వహించిన మొదటి విడత జేఈఈ మెయిన్ పరీక్షల్లో ఇచ్చిన చాయిస్ ప్రశ్నల్లో దొర్లిన తప్పులు ఫలితాల వెల్లడిలో ప్రతిష్టంభనకు కారణమయ్యాయి. జేఈఈ మెయిన్ పరీక్షల్లో (న్యూమరికల్ వాల్యూ విభాగంలో) గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం ప్రతి సబ్జెక్టుల్లో సెక్షన్–బి కింద 10 చొప్పున ప్రశ్నలు ఇచ్చి వాటిల్లో ప్రతి సబ్జెక్టులో ఏవేనా 5 ప్రశ్నలకు సమాధానాలు రాసే వెసులుబాటు కల్పించారు. ఇలా మూడు సబ్జెక్టుల్లో 30 ప్రశ్నలు ఇచ్చి, 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలని అడిగారు. అయితే తప్పుల్లేకుండా ప్రశ్నపత్రాలు రూపొందించడంలో ఎన్టీఏ విఫలమైంది. ఆ తప్పులు చాయిస్ ఉన్న విభాగంలో రావడం మరింత సమస్యగా మారింది. గందరగోళానికి కారణమిదీ.. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తం నాలుగు సార్లు నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. అందులో భాగంగా మొదటి విడత పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీల్లో రోజు రెండు సెషన్లలో నిర్వహించింది. అందులో మొదటి రోజు బీ–ఆర్క్, బీ–ప్లానింగ్‌కు నిర్వహించగా, 24 నుంచి 26 వరకు బీఈ/బీటెక్ కోసం జేఈఈ పరీక్షలను 6 సెషన్లలో నిర్వహించింది. అయితే 24 ఉదయం సెషన్లో ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలను (1 సాధారణం, మరొకటి న్యూమరికల్), కెమిస్ట్రీలో 1 న్యూమరికల్ ప్రశ్నను, అదేరోజు రెండో సెషన్లో కెమిస్ట్రీలో మరో ప్రశ్నకు సబంధించి కీలో మార్పులు చేశారు. అదే రోజు 2వ సెషన్ గణితంలో 2 ప్రశ్నలను డ్రాప్ చేశారు. 26న మొదటి సెషన్ గణితంలో ఒక పశ్నను తొలగించారు. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నను డ్రాప్ చేశారు. అలాగే అదే రోజు ఫిజిక్స్‌లో 3, కెమిస్ట్రీలో 3 న్యూమరికల్ ప్రశ్నల జవాబుల కీలను మార్చారు. 25న ఫిజిక్స్‌లో 1 ప్రశ్నను డ్రాప్ చేయగా, కెమిస్ట్రీలో 3 న్యూమరికల్ ప్రశ్నల కీలను మార్పు చేశారు. సాధారణంగా అయితే ఆ ప్రశ్నలకు ఒక్కో దానికి 4 మార్కులు హాజరైన విద్యార్థులందరికీ కలుపుతారు. అయితే ఆ ప్రశ్నలను చాయిస్లో వదిలేసి గణితంలో 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు ఇప్పుడు అదనంగా కలిసే మార్కుల వల్ల వారి మార్కులు వంద శాతానికి పైగా రానుంది. అయితే 100 శాతం మార్కులకు బదులుగా బోనస్ మార్కులతో వచ్చే 100 శాతానికిపైగా మార్కులను పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తే, ఆ సెషన్లో విద్యార్థులకు కొంత మేర న్యాయం జరిగినా, అన్ని స్లాట్లను కలిపి ర్యాంకులు కేటాయించేటప్పుడు ఇతర సెషన్ల వారికి నష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు. -
జేఈఈలో తొలివిడతకే ఎక్కువమంది..
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ (మెయిన్) తొలివిడత పరీక్షకే ఎక్కువమంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తం నాలుగు విడతల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలకు తొలివిడతకే 6,61,761 మంది రిజిష్టర్ చేసుకున్నారు. అతి తక్కువగా ఏప్రిల్ సెషన్‌కు 4,98,910 రిజిస్ట్రేషన్లు ఉండగా మార్చి సెషన్‌కు 5,04,540, మే సెషన్‌కు 5,09,972 మంది రిజిష్టర్ అయ్యారు. తొలివిడత సెషన్ పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం రాత్రి విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డులు జరభద్రం అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నాక వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని ఎన్టీఏ సూచించింది. అలాగే.. ► ‘జేఈఈమెయిన్.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ► అడ్మిట్ కార్డులను అభ్యర్థులు తమ వ్యక్తిగత మెయిల్లో వెంటనే భద్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఎలాంటి డూప్లికేట్లు జారీచేయరు. ► జేఈఈ అడ్మిషన్లు పూర్తయ్యేవరకు వీటిని దాచుకోవలసిన బాధ్యత అభ్యర్థులదే. ► అడ్మిట్‌కార్డులోని వివరాలన్నింటినీ అభ్యర్థులు తాము సమర్పించిన ఆన్లైన్ దరఖాస్తు ఫారంలోని వివరాలతో సరిపోతున్నాయో లేదో సరిచూసుకోవాలి. ► అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురైతే 0120–6895200 నెంబర్లో ఉ.10 నుంచి సా.5లోపు సంప్రదించవచ్చు. దరఖాస్తులో అసంపూర్ణ సమాచారాన్ని నింపిన వారికి అడ్మిట్‌కార్డు జారీచేయడంలేదని ఎన్టీయే పేర్కొంది. ఈ–మెయిల్ ఐడీ: ‘జేఈఈఎంఏఐఎన్–ఎన్‌టీఏఎట్‌దరేట్‌జీఓవీ.ఐఎన్’లో కూడా సంప్రదించవచ్చు. అభ్యర్థులకు ఎన్టీఏ సూచనలు.. ► పరీక్ష కేంద్రానికి జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు, అందులో ఉన్నలాంటిదే మరో పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటో తీసుకువెళ్లాలి. దాన్ని అటెండెన్సు షీటులో నిర్దేశిత ప్రాంతంలో అంటించాలి. ► పాన్‌కార్డు, ఆధార్‌కార్డు తదితర ఏదైనా ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును తీసుకువెళ్లాలి. ► ఎన్టీఏ వెబ్సైట్ నుంచి అండర్‌టేకింగ్ ప్రొఫార్మాను డౌన్లోడ్ చేసుకుని దానిపై సంతకం చేసి పరీక్ష కేంద్రంలో అందించాలి. ► కరోనా నేపథ్యంలో పారదర్శక బాటిళ్లలో శానిటైజర్, మంచినీటిని అనుమతిస్తారు. ► మధుమేహం ఉన్న అభ్యర్థులు తమతో పాటు పరీక్ష కేంద్రంలోకి పండ్లు, సుగర్ టాబ్లెట్లు తీసుకెళ్లొచ్చు. ► పారదర్శకంగా ఉండే బాల్‌పెన్నునే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ► రఫ్‌వర్కు కోసం ఖాళీ పేపర్ షీట్లను పరీక్ష హాలులో అందిస్తారు. ► పరీక్షా హాల్ నుండి బయటకు వెళ్లే ముందు అభ్యర్థులు తమ పేరు, రోల్ నంబర్‌ను షీట్ పైభాగంలో రాసి వాటిని ఇన్విజిలేటర్‌కు అందించాలి. ► పరీక్ష ప్రారంభమైన తర్వాత ఏ అభ్యర్థినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అడ్మిట్ కార్డులేని వారినీ అనుమతించరు. నిర్ణీత సమయానికి ముందే చేరుకోవాలి అభ్యర్థులందరూ తప్పనిసరిగా నిర్ణీత సమయానికి 2 గంటలు ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ► పరీక్షలు ఉదయం సెషన్ 9 నుంచి 12వరకు, మధ్యాహ్నం సెషన్ 3 నుంచి 6 వరకు జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లోనికి ఉ.7.30 నుంచి 8.30 వరకు, మ. 2 నుంచి 2.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ► ఉదయం సెషన్లో 8.30 నుంచి 8.50, మ.2.30 నుంచి 2.50 వరకు ఇన్విజిలేటర్లు సూచనలు చేస్తారు. ► అలాగే, ఉ.9 నుంచి.. మ.3 నుంచి పరీక్ష ప్రారంభం అవుతుంది. ► పరీక్షా హాలులోకి ప్రవేశించిన తర్వాత, ఇన్విజిలేటర్లు అభ్యర్థులకు అటెండెన్సు షీట్ అందిస్తారు. అభ్యర్థుల పేర్లతో ఉండే ఈ షీట్లో పేరు ముందు కేటాయించిన స్థలంలో సంతకం చేయాల్సి ఉంటుంది. షీట్లో సంతకం చేయని వారిని పరీక్షకు గైర్హాజరైనట్లుగా పరిగణిస్తారు. పరీక్షహాలులోకి వీటిని అనుమతించరు.. జామిట్రీ బాక్సు, హ్యాండ్‌బాగులు, పర్సులు, పేపర్లు, మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్, మైక్రోఫోన్, పేజర్, కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు.. డాక్యుపెన్, స్లైడ్ రూలర్, లాగ్ టేబుల్స్, కెమెరా, టేప్ రికార్డర్ వంటి పరికరాలు.. కాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ గడియారాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు సహా ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులనూ అనుమతించరు. ఇంటర్/బోర్డు పరీక్షలకు ఇబ్బంది లేకుండా.. ఇదిలా ఉంటే.. మే 24, 25, 26, 27, 28 తేదీల్లో జరిగే నాలుగో విడత జేఈఈ మెయిన్ పరీక్షలకు ఎన్టీఏ ఇంతకుముందే షెడ్యూల్ ప్రకటించింది. అయితే, సీబీఎస్ఈతో పాటు వివిధ రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డుల పరీక్షలు కూడా అదే సమయంలో ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీనిపై వచ్చిన విజ్ఞప్తులకు స్పందిస్తూ ఎన్టీఏ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మే 3 నుంచి 12 వరకు ఎన్టీఏ వెబ్‌సైట్‌లోని అభ్యర్థుల అప్లికేషన్ ఫారంలో తమ 12వ తరగతి రోల్ నెంబర్, బోర్డు పేరును నమోదు చేయాలని సూచించింది. మే సెషన్ జేఈఈ పరీక్షల తేదీలైన మే 24, 25, 26, 27, 28 తేదీల్లో ఏ రోజున ఆ అభ్యర్థి బోర్డు పరీక్షకు హాజరుకానున్నారో ఆన్లైన్ దరఖాస్తులో పొందుపరచాలని పేర్కొంది. దీనికి సంబంధించిన సమాచారానికి ఎన్టీఏ వెబ్‌సైట్‌లోని అప్డేట్ సమాచారాన్ని అనుసరించాలని సూచించింది. -
సిద్ధాంత్‌కు సీటివ్వండి!
న్యూఢిల్లీ: జేఈఈ పరీక్షలో మంచి ర్యాంకు సంపాదించినా ఒక్క రాంగ్ క్లిక్‌తో ఐఐటీ సీటు కోల్పోయిన సిద్ధాంత్ బత్రాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బత్రాకు మధ్యంతర ప్రవేశం కల్పించాలని కోర్టు ఐఐటీ బాంబేని ఆదేశించింది. జస్టిస్ ఎస్కే కౌల్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. ముందుగా బత్రాకు అడ్మిషన్ ఇవ్వాల్సిందిగా ఐఐటీని ఆదేశించి తదుపరి విచారణను శీతాకాలం సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ప్రస్తుతం బత్రాకు ఇచ్చే అడ్మిషన్ తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపింది. ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బత్రాకు జేఈఈలో 270వ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సీటు సంపాదించాడు. అయితే అక్టోబర్ 31న తన రోల్ నంబర్‌పై అప్డేట్ల కోసం నెట్లో బ్రౌజ్ చేస్తుండగా ఒక లింక్‌ను అనుకోకుండా క్లిక్ చేశాడు. ‘‘విత్ డ్రా ఫ్రం సీట్ అలకేషన్ అండ్ ఫర్దర్ రౌండ్స్’ అని ఉన్న లింక్‌ను తను క్లిక్ చేశాడు. ఇప్పటికే తనకు సీటు దొరికినందున ఇకపై ఎలాంటి అడ్మిషన్ రౌండ్లు ఉండవన్న నమ్మకంతో ఈ లింక్‌ను క్లిక్ చేసినట్లు బత్రా చెప్పారు. అయితే నవంబర్ 10న విడుదలైన 93మంది విద్యార్దుల తుది జాబితాలో బత్రా పేరు లేదు. దీంతో ఆయన బొంబాయి హైకోర్టులో పిటీషన్ వేశారు. 19న పిటిషన్ విచారించిన కోర్టు రెండురోజుల్లో బత్రా పిటిషన్‌ను ఆయన విజ్ఞాపనగా పరిగణించమని ఐఐటీని ఆదేశించింది. అయితే విత్‌డ్రా లెటర్‌ను రద్దు చేసే అధికారం తమకు లేదంటూ ఐఐటీ గత నెల 23న బత్రా అప్పీలును తిరస్కరించింది. నిబంధనలు అతిక్రమించి ఏమీ చేయలేమని తెలిపింది. అడ్మిçషన్లన్నీ జేఒఎస్‌ఎస్‌ఏ చూసుకుంటుందని ఐఐటీ రిజిస్ట్రార్ చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద ఖాళీ సీటు లేదన్నారు. వచ్చేఏడాది జేఈఈకి బత్రా అప్లై చేసుకోవచ్చన్నారు. ఐఐటీ వాదనతో ఏకీభవించిన బాంబే హైకోర్టు తన అభ్యర్థనను కొట్టివేయడంతో బత్రా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన అభ్యర్థనను మానవతా ధృక్పథంతో పరిశీలించాలని, తనకోసం అదనపు సీటు సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు విద్యార్ధికి అడ్మిషన్ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. -
పేద విద్యార్థిని నీట్లో సీటు
సాక్షి, కూనవరం: పేదింటి విద్యార్థిని గడ్డం ప్రేమలత సీట్లో సీటు సాధించింది. కూనవరం గ్రామానికి చెందిన ప్రేమలత తల్లిదండ్రులు చిరువ్యాపారులు. తండ్రి చెప్పుల దుకాణం నడుపుతూ, తల్లి తోపుడు బండిపై ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతూ జీవిస్తున్నారు. తల్లిదండ్రులు పెద్దగా చదువు కోనప్పటికీ తమ పిల్లలను చదివించాలన్న దృఢ సంకల్పంతో చాలీచాలని సంపాదనతోనే ఇద్దరు పిల్లలను మాంటిస్సోరీ కాన్వెంట్లో 6వ తరగతి వరకూ చదివించారు. అనంతరం ప్రేమలత 7, 8 తరగతులు కోతులగుట్ట ఏపీఆర్ గురుకుల పాఠశాలలో చదివింది. జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎటపాకలో తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకూ చదివింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన ఆలిండియా స్థాయి జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్స్‌లో మంచి ర్యాంక్ సాధించి, త్రిపుర రాష్ట్రం అగర్తలలో నిట్‌లో (ఎన్ఐటీ) సీటు సాధించింది. సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని ప్రేమలత తెలిపింది. -
జేఈఈ మెయిన్స్ తెలుగు, ఉర్దూలో..
సాక్షి, హైదరాబాద్ : జేఈఈ మెయిన్ పరీక్షల్లో ఇంగ్లిష్‌లో ఉండే ఫార్ములాలు అర్థంకాక.. ఒక్కోసారి ఇంగ్లిష్ పదాలే అర్థంకాక తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ జాతీయ స్థాయి పోటీపరీక్షలో తెలుగు, ఉర్దూ, ఇతర ప్రాంతీయ భాషల్లో చదివిన ఇంటర్మీ డియట్ విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. కొందరు అర్థమైన వరకు పరీక్ష రాసి ‘మమ’అనిపిస్తుంటే, ఇంకొందరు అసలు పరీక్షలే రాయట్లేదు. దీంతో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతో పోటీపడలేక ప్రాంతీయ భాషల్లో చదువుకున్న విద్యార్థులు జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో సీట్లను పొందలేకపోతున్నారు. ఇప్పటివరకు ఉన్న ఈ పరిస్థితి ఇకపై మారనుంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న భాషా సమస్యలకు చెక్‌పెడుతూ ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు లక్షన్నర మందికిపైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులు 2021 నుంచి జేఈఈ మెయిన్‌ను తమ భాషల్లోనే రాసుకోవచ్చు. దీంతో ప్రాంతీయ భాషల విద్యార్థులు జాతీయస్థాయిలో సత్తా చాటే అవకాశం లభించింది. ఇంగ్లిష్, హిందీ సహా 11 భాషల్లో నిర్వహణ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) తాజా ఆదేశాలతో.. మాతృభాషలో చదువుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఇకపై జేఈఈ మెయిన్ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్తో పాటు 9 ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కసరత్తు చేస్తోంది. ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారు ఇంగ్లిష్/హిందీ లేదా గుజరాతీలో పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఈ క్రమంలో విద్యార్థుల భాషా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఎంహెచ్ఆర్డీ గుర్తించింది. మరోవైపు వివిధ రాష్ట్రాలు కూడా ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించాలని విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందీ, ఇంగ్లిష్ సహా 9 ప్రాంతీయ భాషలతో కలిపి మొత్తం 11 భాషల్లో జేఈఈ మెయిన్ నిర్వహించాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఇకపై ఏటా ఇంగ్లిష్, హిందీ, గుజరాతీతోపాటు అస్సామీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్ నిర్వహించనున్నారు. ఇంకా ఏవైనా రాష్ట్రాలు కోరితే ఆయా భాషల్లోకి ప్రశ్నపత్రాలను అనువాదం చేసిచ్చే అంశాన్నీ ఎన్టీఏ పరిశీలిస్తోంది. రానున్న జేఈఈ మెయిన్ నుంచే అమలు ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో బీఈ/బీటెక్, బీఆర్క్‌లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను ఎన్టీఏ ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది. వచ్చే జనవరి, ఏప్రిల్‌లోనూ ఈ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఇంటర్మీడియట్లో ప్రత్యక్ష విద్యాబోధన కాకుండా ఆన్లైన్ బోధనే కొనసాగుతోంది. దీంతో 2021లో రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అన్న మీమాంసలో ఎన్టీఏ ఉంది. దీనిపై అన్ని రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డులతోనూ సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే జనవరిలో పరీక్ష నిర్వహణ సాధ్యం కాదన్న భావనకు ఇప్పటికే వచ్చింది. అయితే ఫిబ్రవరిలో నిర్వహించాలా? వద్దా? అన్నది తేలాల్సి ఉంది. ఫిబ్రవరిలో నిర్వహించకపోతే ఏప్రిల్‌కు బదులు మేలో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించాలని భావిస్తోంది. మన విద్యార్థులకెంతో మేలు జేఈఈ మెయిన్‌ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలనే నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ మీడియంలో 3,48,070 మంది, తెలుగులో 89,996 మంది, ఉర్దూలో 6,394 మంది, హిందీలో 111 మంది, మరాఠీలో 87 మంది, కన్నడలో ఏడుగురు.. ఇలా మొత్తంగా 4,44,665 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు 5 లక్షల మంది వరకు ఉన్నారు. వీరుకాక రెండు రాష్ట్రాల్లోనూ మరో 50 వేలకుపైగా ప్రైవేటు విద్యార్థులున్నారు. ఇలా మొత్తంగా రెండు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరాన్ని ఏటా దాదాపు 10 లక్షల మంది పూర్తి చేస్తున్నారు. అందులో జేఈఈ మెయిన్‌కు దాదాపు 2 లక్షల మంది హాజరవుతుండగా, తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులు 75 వేలకుపైగా ఉంటారని అంచనా. ఇప్పుడు పరీక్ష సులభతరం కానున్న నేపథ్యంలో మరో లక్ష మంది వరకు తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు ఎలాంటి భయాందోళన లేకుండా హాజరయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో మొత్తంగా లక్షన్నర మందికిపైగా విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఇక ఫస్టియర్ నుంచే ప్రిపరేషన్.. ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్ నిర్వహించాలన్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. తెలుగు, ఉర్దూ మీడియంలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు లక్షల మంది ఉన్నారు. వారంతా తమ మీడియంలో జేఈఈ మెయిన్‌కు ప్రిపేర్ కావచ్చు. అలాంటి వారు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం నుంచే వాటికి సిద్ధమవుతారు. తద్వారా జాతీయస్థాయి విద్యాసంస్థల్లో తెలుగు మీడియం విద్యార్థులకు సీట్లు వస్తాయి. సీట్లు పొందే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. – సయ్యద్ ఉమర్ జలీల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి -
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్–2020 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 2.50 లక్షల మంది అర్హత సాధించినా 1.60 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షలు నిర్వహించారు. రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరైనట్టు నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా 222 పట్టణాల్లో 1000 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో 15 పట్టణాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో 30 చోట్ల ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాట చేశారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మాస్క్, శానిటైర్ ఉన్నవిద్యార్థులనే నిర్వాహకులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారని తెలిసిందే. ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే ఈ పరీక్షల్లో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. వచ్చే నెల 5న ఫలితాలు విడుదల కానున్నాయి. -
నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్ పరీక్ష
-
‘నీట్, జేఈఈపై ఇప్పుడేం చేయలేం’
న్యూఢిల్లీ: సమాజంలో జరిగే కీలక అంశాలపై విశ్లేషించే రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా నీట్, జేఈఈ పరీక్షలపై ట్విటర్ వేదికగా స్పందించారు. సుబ్రహ్మణ్యస్వామి ఆదివారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో నీట్ ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని కొందరు తనను కలిసారని, కానీ తనను ముందే సంప్రదిస్తే మరో విధంగా ఉండేదని తెలిపారు. పరీక్షలు రద్దు చేయాలని కొందరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేయలేదని, వారు సైతం రద్దుకు మద్దతిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అయితే నీట్, జేఈఈ పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీలు, కొందరు సామాజికవేత్తలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రవేశ పరీక్షలు(నీట్, జేఈఈ) నిర్వహించాలని పట్టుదలతో ఉంది. కాగా ఇది వరకే కోవిడ్ నిబంధనలు పాటించి ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవచ్చని సుప్రీం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రవేశ పరీక్షలను ఆపడం అసాధ్యమని, సుప్రీం తన తీర్పును సమీక్షించే అవకాశం లేదని పేర్కొన్నారు. మరోవైపు నీట్ పరీక్షలను రద్దు చేయాలని ఆగస్ట్ 4న కొందరు రివ్యూ పిటిషన్ వేశారు. కానీ సుప్రీం కోర్టు వాదనలను(రివ్యూ పిటిషన్) వినడానికి నిరాకరించింది. కాగా పరీక్షలు రద్దు చేయాలని రివ్యూ పిటిషన్ వేసిన వారిలో పశ్చిమ బెంగాల్ న్యాయ శాఖ మంత్రి మొలోయ్ ఘటక్, జార్ఖండ్ ఆర్థిక మంత్రి రామేశ్వర్ ఒరాన్, రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ, పంజాబ్ కార్మిక శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్దూ, మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్ సమంత్ తదితరులు ఉన్నారు. (చదవండి: గాంధీ హత్యకేసుపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు) -
ఢిల్లీ వారి అల్లరి ముద్దు బిడ్డ
తొమ్మిదేళ్లుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మమతా బెనర్జీ. ఏడాదిగా పశ్చిమ బెంగాల్ గవర్నరుగా ఉన్నారు జగదీప్ ధన్ఖర్. నాలుగేళ్లు పెద్ద ఆమె కన్నా ఆయన. మమతకు 65. ఆయనకు 69. అయితే మనిషిలో ఆ పెద్దరికం లేదు! ప్రజాదరణ ఉన్న ఆ నాయకురాలికి అధికార పార్టీ ఆదరణ ఉన్న ఈ నాయకుడు ఏడాది కాలంగా అడ్డుపడుతూనే ఉన్నాడు. అడ్డు పడుతున్నందుకు పెద్దరికం లేదనడం కాదు. పదవికి ఉండే పెద్దరికం.. దాన్ని నిలుపుకోవాలి కదా? అది లేదు! సీఎంని వెక్కిరిస్తాడు. వెటకరిస్తాడు. ఆమె తుమ్మితే ఈయన ‘హాచ్చ్’ మని ఇమిటేట్ చేస్తాడు. ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్న ఢిల్లీ వారి అల్లరి ముద్దు బిడ్డ అయిపోయాడు. మమతను ఆయన చికాకు పెట్టడం ఎలా ఉంటుందో చూడండి. తృణమూల్ పార్టీ వాళ్లు నిన్న ఒక పోస్టర్ విడుదల చేశారు. అందులో మమతా బెనర్జీ ‘నీట్’, జేఈఈ విద్యార్థులకు ‘మై హూ నా’ (నేనున్నాను) అని అభయం ఇస్తుంటారు. పరీక్షలను వాయిదా వేయిస్తానని ఆ భరోసా. వెంటనే గవర్నర్ అందుకున్నాడు. ఆ పోస్టర్ ని ట్యాగ్ చేస్తూ ‘మై భీ హూ నా’ (నేను కూడా ఉన్నాను) అని రీట్వీట్ చేశాడు! దేనికి అతడు ఉన్నది అంటే.. పరీక్షల్ని జరిపించడానికి!! గవర్నర్ మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి మాట్లాడకుండా ఉండకూడదు. మమత మాత్రమే తన పని తను చేస్తున్నారు. In this time of constant uncertainty and anxiousness, @BJP4India led govt is pushing our students into further distress. To timely address this burning issue, @MamataOfficial came forward to fight for providing a safe environment to the students. She is truly everyone's leader! pic.twitter.com/3KaoJuEZqx — All India Trinamool Congress (@AITCofficial) August 27, 2020 -
జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలి
సాక్షి, న్యూఢిల్లీ : జేఈఈ, నీట్ పరీక్షలను 15 రోజుల పాటు వాయిదా వేయాలని రాయ్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ , పద్మశ్రీ అవార్డు గ్రహీత శంకర్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా పద్నాలుగు రాష్ట్రాలలో తీవ్రమైన వరదలు వచ్చాయని, అనేక చోట్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు తమ ఇల్లు విడిచి వేరే ప్రాంతాలకు వెళ్లటం వల్ల వాళ్లకు పరీక్షలు రాసే పరిస్థితులు లేవని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కేవలం పట్టణ ప్రాంత విద్యార్థులనే కాదు, గ్రామీణ ప్రాంత విద్యార్థుల సమస్యలను కూడా పట్టించుకోవాలి. సమాన విద్యావకాశాలు అందరికీ కలగాలి. వరద ప్రాంతాల్లోని విద్యార్థులను పరీక్ష సెంటర్ల సమీపంలో ఒక వారం ముందే ప్రిపరేటరీ జోన్లో ఉంచాలి. లేదంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుంది. పరీక్షలను 15 రోజుల పాటు వాయిదా వేస్తే వచ్చే నష్టం ఏమీ లేదు. ఎన్నడూ లేనంతగా అసాధారణ రీతిలో దేశవ్యాప్తంగా వరదలు వస్తున్నాయి. ( జేఈఈ, నీట్ పరీక్షలపై సందేహాలెన్నో!?) కరోనాను ఎదుర్కొనేందుకు ఇప్పటికే విద్యార్థులంతా మానసికంగా సిద్ధమయ్యారు. కరోనా కారణంగా పరీక్షలు వాయిదా వేయాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు సైతం ఈ అంశంలో మానవీయ దృక్పథంతో స్పందించాలి. పదిహేను రోజుల పాటు వాయిదా వేస్తే విద్యాసంవత్సరం నష్టం ఏమీ జరగదు. తీవ్రమైన వరదలతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పరీక్ష సెంటర్లకు చేరుకునేందుకు ఎటువంటి సదుపాయాలు లేవు. విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రాన పరీక్షకు అంగీకరించినట్లు కాద’’ని అన్నారు. -
ఇదే ప్రభుత్వానికి నేనిచ్చే సలహా: సోనియా
న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో జరగాల్సిన జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించి తీరుతామని మొండిగా తేల్చి చెప్పింది. అయితే చాలామంది ప్రముఖులు విద్యార్థుల పక్షాన నిలబడుతూ పరీక్షలు వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల బాధను అర్థం చేసుకుని పరీక్షలు వాయిదా వేయాలని కేంద్రానికి విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం ఓ వీడియోను షేర్ చేశారు. (చదవండి: నీట్, జేఈఈల వాయిదా ఉండదు!) "ప్రియమైన విద్యార్థులారా.. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు మీరు అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పరీక్షలు ఎప్పుడు, ఎక్కడ జరపాలి అనే విషయాలు మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి కూడా ప్రధానమైన సమస్యగా పరిణమించాయి. మీరే రేపటి భవిష్యత్తు. భావి భారత నిర్మాణం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి మీ భవిష్యత్తును శాసించే ఏ నిర్ణయమైనా మీ అనుమతితోనే తీసుకోవాలి. అదే ముఖ్యం కూడా. ప్రభుత్వం మీ మొర ఆలకిస్తుందని ఆశిస్తున్నా. మీ ఇష్టానికి అనుగుణంగా నడుచుకుంటుందని భావిస్తున్నా. ఇదే ప్రభుత్వానికి నేనిచ్చే సలహా. ధన్యవాదాలు" అని వీడియోలో పేర్కొన్నారు. కాగా జేఈఈ, నీట్ పరీక్షలు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డాయి. పరీక్షల నిర్వహణ ఆలస్యం చేసే కొద్దీ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని కేంద్ర విద్యాశాఖ అభిప్రాయపడుతోంది. (చదవండి: నీట్ పరీక్ష వాయిదాకు విపక్ష సీఎంల డిమాండ్) Students are our future, we depend on them to build a better India, therefore, if any decision has to be taken regarding their future it is important that it is taken with their concurrence.: Congress President Smt. Sonia Gandhi #SpeakUpForStudentSafety pic.twitter.com/Jf18cmykbd — Congress (@INCIndia) August 28, 2020 -
జేఈఈ, నీట్‌పై సుప్రీంను ఆశ్రయించిన విపక్షాలు
-
ప్రభుత్వ వైఫల్యానికి విద్యార్ధులు బాధ్యులా?
ఢిల్లీ : ప్రభుత్వ వైఫల్యం కారణంగా విద్యార్థులు తమ భద్రత విషయంలో రాజీపడకూడదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. విద్యార్థులు దేశ భవిష్యత్తు, వారే భారత కీర్తిని మరింత ఎత్తుకు తీసుకెళ్లేది అని రాహుల్ పేర్కొన్నారు. 'నాకు అర్థం కాని విషయం ఏమిటంటే కరోనా నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం ఉంటే దానికి మీరెందుకు బాధ్యత వహించాలి? తర్వాత ఎదురయ్యే పర్యవసనాలకు మీరెందుకు బాధ పడాలి? అసలు ఈ విషయంలో ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకు బలవంతం చేయాలి? ప్రభుత్వమే విద్యార్థుల మాట వినడం చాలా ముఖ్యం' అని విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ వీడియోలో పేర్కొన్నారు. జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం విద్యార్థులతో ముచ్చటించి ఒక ఏకాభిప్రాయానికి రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ రెండు పరీక్షలను వాయిదా వేయాలని శుక్రవారం విపక్షాలు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బీజేపేతర ప్రభుత్వాలు పశ్చిమబెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, చత్తీస్గడ్, పంజాబ్, మహారాష్ర్ట రాష్ర్టాలు ఈ మేరకు సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి. (జేఈఈ, నీట్‌పై సుప్రీంను ఆశ్రయించిన విపక్షాలు) ముందుగా నిర్ణయించిన సెప్టెంబర్ నెలలో జేఈఈ, నీట్ పరీక్షలు జరుగుతాయని సుప్రీం కోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. పరీక్షల వాయిదాని కోరుతూ 11 మంది విద్యార్థులు దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. పరీక్షలను వాయిదా వేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపింది. ఏడాదిపాటు అకడమిక్ ఇయర్‌ను విద్యార్థులు కోల్పోతారని, అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించింది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాల్లో నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. (జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయలేం: సుప్రీం కోర్టు) NEET-JEE aspirants’ safety should not compromised due to the failures of the Govt. Govt must listen to all stakeholders and arrive at a consensus.#SpeakUpForStudentSafety pic.twitter.com/Y1CwfMhtHf — Rahul Gandhi (@RahulGandhi) August 28, 2020 -
జేఈఈ, నీట్‌పై సుప్రీంను ఆశ్రయించిన విపక్షాలు
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, వైద్యవిద్యల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలను కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో వాయిదా వేయాలని విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే పరీక్షలను వాయిదా వేసేది లేదని ఇదివరకే సుప్రీం స్పష్టం చేసిన నేపథ్యంలో మరోమారు సమీక్షించాలని కోరాయి. ఈ మేరకు బీజేపేతర ప్రభుత్వాలు పశ్చిమబెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, చత్తీస్గడ్, పంజాబ్, మహారాష్ర్ట రాష్ర్టాలు శుక్రవారం సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఇది వరకే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్, అశోక్ గహ్లోత్, భూపేష్ బాగేల్, హేమంత్ సోరేన్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రేలు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పాలిత సీఎంలు పేర్కొన్న సంగతి తెలిసిందే. (నీట్, జేఈఈల వాయిదా ఉండదు!) అయితే పరీక్షల వాయిదాని కోరుతూ 11 మంది విద్యార్థులు దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముందుగా నిర్ణయించిన సెప్టెంబర్ నెలలో జేఈఈ, నీట్ పరీక్షలు జరుగుతాయని కోర్టు స్పష్టం చేసింది. పరీక్షలను వాయిదా వేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపింది. ఏడాదిపాటు అకడమిక్ ఇయర్‌ను విద్యార్థులు కోల్పోతారని, అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించింది. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిందేనని పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. (నీట్, జేఈఈ : రియల్ హీరో రంగంలోకి) -
నీట్, జేఈఈ : రియల్ హీరో రంగంలోకి
-
నీట్, జేఈఈ : రియల్ హీరో రంగంలోకి
సాక్షి, ముంబై: కరోనా పరిస్థితుల నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై ఇప్పటికే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ప్రస్తుత పరిస్థితుల రీత్యా తనదైన శైలిలో కార్య రంగంలోకి దిగిపోయారు. ఈ పరీక్షల నిర్వహణపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్నప్పటికీ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహించి తీరుతామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కరాఖండిగా తేల్చి చెప్పింది. దీంతో విద్యార్థులకు అండగా నిలిచేందుకు నిర్ణయించుకున్న సోనూ సూద్ అందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నారు. (నీట్, జేఈఈల వాయిదా ఉండదు!) ఒకవైపుకోవిడ్-19 రిస్క్, మరోవైపు తండ్రి పేదరికం, లోన్ల బెడద తదితర ఆర్థిక కష్టాల నేపథ్యంలో చాలాదూరంలో ఉన్న పరీక్ష కేంద్రానికి ఎలా వెళ్లాలి.. దయచేసి సాయం చేయండి అంటూ కన్నీరు మున్నీరవుతున్న విద్యార్థి ఆవేదనను సోనూ షేర్ చేశారు. ఈ నేపథ్యంలోనే సోనూ సూద్ తాజా నిర్ణయం తీసుకున్నారు. (విద్యార్థుల లైఫ్‌ను రిస్క్‌లో పెట్టలేం: సోనూ సూద్) నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణ ఖాయమైతే..ఆయా ప్రాంతాల విద్యార్థులు పరీక్షా కేంద్రాలను చేరుకోవడానికి కావల్సిన రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా బిహార్, అస్సాం, గుజరాత్ లోని వరద బాధిత ప్రాంతాలలో పరీక్షకు హాజరు కానున్న విద్యార్థులందరికీ నేనున్నాంటూ భరోసా ఇచ్చారు. బాధిత విద్యార్థులు దీనికి సంబంధించిన సమాచారాన్ని తనకు అందించాలని, ఏ ఒక్కరు కూడా ఈ పరీక్ష మిస్ కావడానికి వీల్లేదని ట్వీట్ చేశారు. (ఫస్ట్ కారు కొన్నపుడు కూడా ఇలా లేదు : సోనూసూద్) -
నీట్, జేఈఈల వాయిదా ఉండదు!
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, వైద్యవిద్యల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షల వాయిదా ఉండదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణ ఆలస్యం చేసే కొద్దీ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని అభిప్రాయపడింది. ఈ పరీక్షలు వాయిదా వేయాలంటూ కొందరు విద్యార్థులు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే! అయితే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పరీక్షలకు సన్నాహాలు ఆరంభించిన ప్రభుత్వం బుధవారం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. గురువారం ఉదయానికి దాదాపు 16 లక్షల మందికి పైగా విద్యార్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపింది. డౌన్లోడ్స్ భారీగా ఉండడం విద్యార్థులు పరీక్షను కోరుకుంటున్నారనడానికి గుర్తని విద్యాశాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ వ్యాఖ్యానించారు. పరీక్ష నిర్వహించాల్సిందిగా తల్లిదండ్రులు, పలువురు విద్యార్థులు తమకు మెయిల్స్ పంపారని వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 7–11 మధ్యకాలంలో జేఈఈ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా కోవిడ్ నేపథ్యంలో ముందుగా జూలై 18 –23కు తాజాగా సెప్టెంబరు 1 –6కు వాయిదా పడింది. వైద్య విద్య ప్రవేశానికి నిర్వహించే నీట్ ఈ ఏడాది మే 3వ తేదీన జరగాల్సి ఉండగా జూలై 26వ తేదీకి తాజాగా సెప్టెంబర్ 13కు వాయిదా పడింది. జేఈఈలో 9.53 లక్షల మంది, నీట్లో 15.97 లక్షల మంది పాల్గొనే అవకాశముంది. వాయిదా అంటే వినాశనమే.. జేఈఈ, నీట్ పరీక్షలను మరింత కాలం వాయిదా వేయడం విద్యార్థుల భవిష్యత్తుతో రాజీపడటమేనని దేశ విదేశాలకు చెందిన సుమారు 150 మంది విద్యావేత్తలు ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. సొంత రాజకీయ ఎజెండాల అమలుకు కొందరు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని లేఖలో ఆరోపించారు. ‘‘యువత, విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు. అయితే కోవిడ్–19 నేపథ్యంలో వారి కెరీర్‌పై నీలినీడలు అలుముకొన్నాయి. కోర్సుల్లో ప్రవేశం మొదలుకొని పలు అంశాలపై ఏర్పడిన అస్పష్టతను వీలైనంత వేగంగా తొలగించాల్సిన అవసరం ఉంది. జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే తేదీలు ప్రకటించింది. ఇంకా జాప్యం చేస్తే విద్యార్థుల విలువైన విద్యాసంవత్సరం వృథా అవుతుంది. యువత, విద్యార్థుల భవిష్యత్తు కలలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ తగదు’’ అని పేర్కొన్నారు. లేఖపై సంతకం చేసిన వారిలో ఢిల్లీ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, లక్నో యూనివర్సిటీ, జేఎన్‌యూ, బీహెచ్‌యూ, ఐఐటీ ఢిల్లీలతోపాటు లండన్, కాలిఫోర్నియా, హీబ్రూ, బెన్ గురియాన్ యూనివర్సిటీల విద్యావేత్తలు ఉన్నారు. పరీక్షలు జాప్యం జరిగితే ఈ విద్యా సంవత్సరం జీరో విద్యా సంవత్సరంగా మారుతుందని, ఇది అనేక విపరిణామాలకు దారితీస్తుందని ఐఐటీ రూర్కీ, ఖరగ్ పూర్, రోపార్, గాంధీనగర్, గువాహటి డైరెక్టర్లు అభిప్రాయపడ్డారు. వ్యవస్థపై విద్యార్ధులు నమ్మకముంచాలన్నారు. మరోవైపు జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని బీజేపీ గురువారం ఆరోపించింది. వాయిదా వల్ల విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతారని వాదనలు వస్తున్న నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ కాస్త మెత్తపడ్డట్లు కనిపించారు. ఈ విషయమై మాట్లాడుతూ ఆ పరీక్షలను పూర్తిగా నిలిపివేయమనడం లేదని, రెండు మూడు నెలలు వాయిదా వేయాల్సిందిగా కోరుతున్నానని చెప్పారు. పరీక్షలను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిన ఏడు మంది ముఖ్యమంత్రుల్లో అమరీందర్ కూడా ఉన్నారు. -
పరీక్షలు వాయిదావేయాలని .. ఆమరణ నిరాహార దీక్ష
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా ప్రకటించారు. గాంధీభవన్‌లో ఎన్ఎస్యూఐ చేపట్టిన దీక్షాస్థలిని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. (నీట్-జేఈఈ వివాదం : అన్ని జాగ్రత్తలతో పరీక్షలు) రాష్ట్ర ప్రభుత్వ తీరుతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో పరీక్షలు ఏంటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. విద్యార్థుల కోసం ఎన్ఎస్యూఐ నిరాహార దీక్ష చేస్తుందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్, జేఈఈని పోస్ట్ పోన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. విద్యార్థుల జీవితాలతో దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న టైంలో పరీక్షలు పోస్ట్ ఫోన్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయ్యకార్ భవన్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. -
జేఈఈ, నీట్‌లపై గళమెత్తిన గ్రెటా థన్‌బెర్గ్
కరోనా కరాళ నృత్యం చేస్తుంటే విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతూ జేఈఈ, నీట్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు భిన్నంగా కేంద్రం మాత్రం పరీక్షలకు పచ్చజెండా ఊపింది. సెప్టెంబర్ 1-6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) జరగనున్నట్లు వెల్లడించింది. మరోవైపు వచ్చే నెల 13న నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్–2020) పరీక్ష జరుగుతుండగా, కరోనా అనుమానితులకు ఐసోలేషన్ గదిలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తెలిపింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: పరీక్ష కేంద్రాల్లో ఐసోలేషన్ గదులు ) తాజాగా స్వీడిష్ యువ కెరటం, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ విద్యార్థుల తరపున గళమెత్తారు. కరోనా కాలంలో భారత విద్యార్థులను జాతీయ పరీక్షలకు హాజరు కావాల్సిందేనని చెప్పడం అన్యాయమన్నారు. ఇప్పటికే అక్కడ లక్షలాది మంది వరదల వల్ల ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. కాబట్టి జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. కాగా ఇప్పటికే విద్యార్థులను కరోనా భయం వెంటాడుతుంటే, మరోవైపు అస్సాం, బిహార్, గుజరాత్, చత్తీస్ఘడ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఈ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం కూడా కష్టమేనన్నది ప్రతిపక్షాల వాదన. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలోనే పరీక్షలు నిర్వహించి తీరుతామని కేంద్రం తేల్చి చెప్పడం గమనార్హం. (చదవండి: జేఈఈ మెయిన్స్‌కు కరోనా ఆంక్షలు) -
పరీక్ష కేంద్రాల్లో ఐసోలేషన్ గదులు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు 99.4 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రత ఉన్నట్లు తేలితే వారికి ప్రత్యేక ఐసోలేషన్ గదిలో ‘నీట్’పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తెలిపింది. కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి కూడా ఐసోలేషన్ గదిలోనే పరీక్ష నిర్వహిస్తారని పేర్కొంది. ఇందుకోసం పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వచ్చేనెల 13న జరగనున్న నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్–2020) మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. నీట్(అండర్ గ్రాడ్యుయేట్)–2020కు 15,97,433 మంది హాజరుకానున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. నీట్ నిర్వహణ మార్గదర్శకాలివీ.. ►పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులందరూ గుంపులుగా రాకుండా స్లాట్ల విధానం అమలు చేస్తారు. ళీ ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఎవరు ఏ సమయంలో రావాలో హాల్‌టికెట్లపై ముద్రిస్తారు. విద్యార్థుల సెల్ఫోన్లకు ఆయా వివరాలను మెసేజ్ రూపంలో పంపిస్తారు. ►పరీక్ష కేంద్రాల వద్ద గుమిగూడకుండా భౌతిక దూరం పాటించేందుకు గేటు బయట తాళ్లు కడతారు. వాటి వరుసల మధ్య నుంచే విద్యార్థులు లోపలికి ప్రవేశించేలా ఏర్పాట్లు చేస్తారు. ►థర్మోగన్స్ ద్వారా ప్రవేశ ద్వారం వద్ద సిబ్బంది సహా విద్యార్థులందరి శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తారు. కరోనాకు సంబంధించిన స్థానిక హెల్ప్‌లైన్ నెంబర్‌ను పరీక్షా కేంద్రాల్లో ప్రముఖంగా ప్రదర్శిస్తారు. అత్యవసరమైతే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసేలా ఏర్పాట్లు ఉంటాయి. ►పరీక్షా గదిలోకి విద్యార్థులతోపాటు మాస్క్, గ్లోవ్స్, వాటర్ బాటిల్, సొంత శానిటైజర్ (50 మి.లీ.), అడ్మిట్ కార్డ్, ఐడీ కార్డ్‌లకు మాత్రమే అనుమతిస్తారు. మరే ఇతర వస్తువులను అనుమతించరు. మా స్క్, శానిటైజర్ తప్పనిసరి తెచ్చుకోవాలి. ►పరీక్షా కేంద్రంలో సిబ్బందికి, గేటు వద్ద ఉండే సెక్యూరిటీ గార్డులకు గ్లోవ్స్, మాస్క్‌లు ఉండాలి. ►పరీక్షా కేంద్రాల లోపల టేబుల్, డోర్ హ్యాండిల్స్, లిఫ్ట్ బటన్స్ వంటి వాటిపై వైరస్ చేరకుండా సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేయాలి. ►పరీక్షా కేంద్రాల అంతస్తులు, గోడలపై స్ప్రే చేయాలి. అన్ని వాష్‌రూమ్‌లను శుభ్రపరచాలి. చేతులు కడుక్కోవడానికి వీలుగా వాష్‌రూంలలో సబ్బు ఉండాలి. -
జేఈఈ, నీట్ వాయిదాకు సుప్రీం నో!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశ పరీక్షలు జేఈఈ, నీట్లు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. విలువైన విద్యా సంవత్సరాన్ని వృథా కానివ్వలేమని, కరోనా వైరస్ ఉన్నప్పటికీ జీవితం ముందుకు సాగాల్సిందేనని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. (3 కోట్లు దాటిన పరీక్షలు) ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం జేఈఈ పరీక్ష సెప్టెంబరు 1 –6 తేదీల్లో, నీట్ పరీక్ష అదే నెల 13వ తేదీన జరగాల్సి ఉంది. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా వీటిని వాయిదా వేయాలని 11 మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పదకొండు రాష్ట్రాలకు చెందిన ఈ విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించి జూలై మూడున జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని తమ పిటిషన్లో కోరారు. అయితే ఈ అంశాలపై జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వీడియో కాన్ఫరెన్సింగ్ విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్‌మిశ్రా మాట్లాడుతూ విద్యార్థుల కెరీర్‌ను దీర్ఘకాలం డోలాయమానంలో ఉంచలేమని వ్యాఖ్యానించారు. దీంతో జేఈఈ, నీట్ పరీక్షలు సెప్టెంబరులోనే జరిగేందుకు మార్గం సుగమమైంది. విచారణ సందర్భంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ సమయంలో అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత మాత్రమే జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని, పరీక్షల వాయిదాతో తమకు సాంత్వన చేకూరుతుందని లక్షల మంది విద్యార్థులు సుప్రీంకోర్టువైపు చూస్తున్నారని అన్నారు. పరీక్ష నిర్వహణ కేంద్రాల సంఖ్యను పెంచాలని కూడా ఆయన తన పిటిషన్లో కోరారు. ‘‘ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో జేఈఈ, నీట్ నిర్వహించడం పిటిషన్దారులతోపాటు లక్షలాది విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టడమే. మరికొంత కాలం వేచి చూడటం మేలైన పని. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రాణాలు కాపాడేందుకు కోవిడ్ పరిస్థితులు చక్కబడిన తరువాతే పరీక్షలు నిర్వహించాలి’’అని ఆ పిటిషన్లో కోరారు. జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ ఈ ఏడాది 161 కేంద్రాల్లో జేఈఈని ఆన్లైన్ పద్ధతిలోనూ, నీట్‌ను ఆఫ్లైన్లోనూ నిర్వహించాలని తీర్మానించిందని పిటిషన్‌దారులు పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో ఎన్టీఏ జూన్ 22న జరగాల్సిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ పరీక్షను వాయిదా వేసిందని పిటిషన్‌దారులు తెలిపారు. బిహార్, అసోం, ఈశాన్య రాష్ట్రాల్లో వరదల కారణంగా విద్యార్థులు ఎదుర్కొనే కష్టాలను ఎన్టీఏ పరిగణనలోకి తీసుకోలేదని, ఈ రాష్ట్రాల విద్యార్థులు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ పరీక్షలకు హాజరయ్యే పరిస్థితుల్లో లేరని వివరించారు. ఇదిలా ఉండగా.. ఆయుష్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష ఏఐఏపీజీఈటీని వాయిదా వేయాలని, కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్న తరుణంలో పరీక్ష నిర్వహణ సరికాదని పలువురు డాక్టర్లు సోమవారం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం కొసమెరుపు. -
జేఈఈ, నీట్ పరీక్షలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ముందుగా నిర్ణయించిన సెప్టెంబర్ నెలలో జేఈఈ, నీట్ పరీక్షలు జరుగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కరోనా భయాలతో అతి ముఖ్యమైన జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేసేందుకు నిరాకరించింది. పరీక్షలను వాయిదా వేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపింది. ఏడాదిపాటు అకడమిక్ ఇయర్‌ను విద్యార్థులు కోల్పోతారని, అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించింది. (చదవండి: ఈ వీడియో చూసి ఐఏఎఫ్‌కు సెల్యూట్ చేయాల్సిందే) పరీక్షల వాయిదాని కోరుతూ 11 మంది విద్యార్థులు వేసిన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ‘కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిందే. మరో ఏడాది కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవచ్చు. ఇప్పుడు వైరస్ భయాలతో పరీక్షలు వాయిదా వేస్తే వచ్చే ఏడాది కూడా అలాంటి పరిస్థితే ఎదురు కావొచ్చు. అప్పుడు కూడా వాయిదా వేస్తారా?’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. (చదవండి: జేఈఈ, నీట్ వాయిదా) -
జేఈఈ, నీట్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్, నీట్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్చార్డీ) మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించారు. ఈ నెలలో జేఈఈ మెయిన్, నీట్, వచ్చే నెలలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జరగాల్సి ఉండగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్, నిపుణులతో గురువారం ఓ కమిటీ ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ కమిటీ తన నివేదిక సమర్పించింది. కమిటీ నివేదిక ప్రకారం విద్యార్థుల భద్రతను పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 23 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈనెల 26న జరగాల్సిన నీట్‌ను సెప్టెంబర్ 13న నిర్వహిస్తామని తెలిపారు. అలాగే వచ్చే నెల 23న నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను సెప్టెంబర్ 27న నిర్వహిస్తామని వివరించారు. రద్దుకు అవకాశం లేనందునే.. వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశ పరీక్ష ద్వారా మాత్రమే ప్రవేశాలు చేపట్టాలని 2005లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కేంద్రం పరీక్షలను వాయిదా వేసింది. కానీ రద్దు చేయలేదు. పోటీ అధికంగా ఉన్నప్పుడు ప్రవేశ పరీక్ష లేకుండా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్కుల ఆధారంగా వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదని, ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగానే ప్రవేశాలు చేపట్టాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ ప్రకారమే కేంద్రం పరీక్షల నిర్వహణ వైపే మొగ్గు చూపింది. జాతీయ ప్రవేశాలు ఆలస్యమే.. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ప్రవేశాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర జాతీయ స్థాయి సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ ఏటా నిర్వహిస్తుంటుంది. ఈసారి కూడా అలాగే నిర్వహించనుంది. అయితే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సెప్టెంబర్ 27న జరిగితే ఫలితాలను ఆ తర్వాతి నాలుగైదు రోజులకు వెల్లడించే అవకాశం ఉంటుంది. అంటే అక్టోబర్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ చేపట్టే అవకాశం ఉంటుంది. ఏడెనిమిది దశల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను అక్టోబర్‌లో పూర్తి చేసినా నవంబర్‌లో తరగతులు ప్రారంభం అవుతాయి. అయితే అప్పటికీ కరోనా అదుపులోకి రాకపోతే రెగ్యులర్ తరగతులు నిర్వహించే పరిస్థితి ఉండదు. అందుకే ఐదు ఐఐటీల డైరెక్టర్లతో కూడిన కమిటీ ఐఐటీల స్టాండింగ్ కౌన్సిల్‌కు ఇటీవల ఓ నివేదిక అందజేసింది. అందులో డిసెంబర్ నుంచి తరగతులు ప్రారంభించేలా సిఫారసు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ఆదుపులోకి వస్తే నవంబర్‌లో తరగతులు ప్రారంభం అవుతాయి. లేదంటే డిసెంబర్లోనే తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోనూ ఆగస్టులో సెట్స్! ఈ నెలలో జరగాల్సిన ఎంసెట్ సహా ఇతర సెట్స్‌ను ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ పరీక్షలను నిర్వహించేందుకు సెట్ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. కోర్టులో పిల్ పడటంతో ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై వెనక్కి తగ్గి వాయిదా వేసింది. మళ్లీ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది చెప్పలేదు. దీంతో రాష్ట్రంలో ఇక ప్రవేశ పరీక్షలు ఉండవని, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు చేపడతారని కొంత మంది విద్యార్థులు భావించారు. అయితే తాజాగా కేంద్రం జాతీయ స్థాయి పరీ„క్షలను రద్దు చేయకుండా వాయిదా మాత్రమే వేసింది. దీంతో దీంతో రాష్ట్రంలోనూ ప్రవేశ పరీక్షలు ఉంటాయన్న విషయం అర్థం అవుతోంది. ఆగస్టు రెండో వారంలో రాష్ట్ర సెట్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఏపీలో ఈనెల 27 నుంచి ఎంసెట్ ఉన్నందునా ఏపీ ప్రభుత్వం వాటిని చేపట్టి నిర్వహిస్తే అదే పద్ధతిలో రాష్ట్రంలో ఎంసెట్ సహా ఇతర సెట్స్ నిర్వహణ సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే ఆగస్టు రెండో వారంలో రాష్ట్ర ఎంసెట్ జరగనుంది. సెప్టెంబర్‌లో ప్రవేశాలు.. రాష్ట్రంలో ఆగస్టులో ఎంసెట్, ఇతర సెట్స్ చేపట్టి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అవసరమైతే కోర్టులో పిటిషన్ వేసి పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడతామని, ఏర్పాట్లపై అనుమానాలు ఉంటే కోర్టు అబ్జర్వర్‌ను కూడా నియమించి చూసుకునేలా కోర్టుకు విన్నవిస్తామని పేర్కొంటున్నారు. తద్వారా ఆగస్టులో పరీక్షలు నిర్వహించి ఆగస్టు చివరికల్లా ఫలితాలను వెల్లడించాలని భావిస్తున్నారు. ఇక సెప్టెంబర్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించి, అప్పటి పరిస్థితులను బట్టి ప్రత్యక్ష బోధన లేదా ఆన్లైన్ తరగతులు నిర్వహించే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. సర్టిఫికెట్లు ఆపకుండా ప్రత్యేక చర్యలు ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ వంటి జాతీయ స్థాయి సంస్థల్లో రాష్ట్రం నుంచి సీట్లు లభించే విద్యార్థులు 5 నుంచి 8 వేలలోపు ఉంటారు. వారి కోసం రాష్ట్ర స్థాయిలో మొత్తం 80 వేల ప్రవేశాల ప్రక్రియను ఆపే పరిస్థితి వద్దని ఈసారి ఉన్నత విద్యా శాఖ ఆలోచనలు చేస్తోంది. అందుకే ఆగస్టులో పరీక్షలు నిర్వహించి సెప్టెంబర్‌లో ప్రవేశాలు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఒకవేళ రాష్ట్ర కాలేజీల్లో సీట్లు లభించి చేరిన విద్యార్థుల్లో ఎవరికైనా జాతీయ స్థాయి కాలేజీల్లో జోసా కౌన్సెలింగ్ ద్వారా వారు వెళ్లిపోయేలా తగిన చర్యలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర కాలేజీల్లో చేరిన విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపకుండా, జాతీయ స్థాయి కాలేజీలకు వెళ్లేలా తగిన ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. -
జేఈఈ, నీట్ పరీక్షలపై నిర్ణయం అప్పుడే!
సాక్షి, న్యూఢిల్లీ: జూలైలో జరగాల్సిన జేఈఈ , నీట్ పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం తెలిపారు. పరిస్థితిని సమీక్షించి, వారి సిఫారసులను రేపటిలోగా సమర్పించాలని ఎన్టీఏ, ఇతర నిపుణులతో కూడిన కమిషన్‌ను కోరినట్లు హెచ్ఆర్డీ మంత్రి గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు. (జూలై 26న నీట్) జేఈఈ పరీక్ష జూలై 19-23 మధ్య జరగాల్సి ఉండగా, నీట్ పరీక్ష జూలై 26 న జరగాల్సి ఉంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయా లేదా అనే అంశంపై మొత్తం 30 లక్షల మంది విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర సంబంధిత వ్యక్తులు ట్విట్టర్లో #RIPNTA అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. 24 గంటల్లో 314800 కంటే ఎక్కువమంది దీనిని రీట్వీట్ చేశారు. దీంతో ఇది టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లో నిలిచింది . దీనిపై స్పందించిన హెచ్ఆర్డీ మంత్రి "మీ సమస్యలను నేను అర్థం చేసుకున్నాను, వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనటానికి మేము ప్రయత్నిస్తున్నాం" అని ఒక ప్రకటనలో తెలిపారు.ఇదిలా ఉండగా భారతదేశంలో 19 కేసులు 6 లక్షలు దాటాయి. (ఆన్లైన్ క్లాసులు: హెచ్ఆర్డీ కీలక ప్రకటన) -
పల్లె విద్యార్థులకు ఆనంద్ కుమార్ పాఠాలు
న్యూఢిల్లీ: ‘సూపర్–30’ కోచింగ్‌తో ఫేమస్ అయిన ఆనంద్ కుమార్ పల్లెటూర్లకు చెందిన పేద విద్యార్థుల కోసం ఒక్క రూపాయికే కోచింగ్ అందించే ప్రాజెక్టులో పాలుపంచుకున్నారని ఈ గవర్నెన్స్ బుధవారం తెలిపింది. ప్రజలకు సుపరిచితుడైన ఆనంద్ కుమార్ ఆన్లైన్లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చే మాడ్యూల్‌కు కోర్సును తయారు చేయనున్నారు. ఇది ఐఐటీ జేఈఈ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉపయోగపడనుంది. ఇది పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, సైన్సు, లెక్కలు విద్యార్థులు పట్టు సాధించేలా ఉంటుందని ఆనంద్ చెప్పారు. ఒక్క రూపాయికే పేద విద్యార్థులకు అందుబాటులో ఉంటుందన్నారు. కొత్త రకమైన బోధనా పద్ధతులతో విద్యార్థులు నేర్చుకునేలా, సబ్జెక్టులపై ఆసక్తి పెంచేలా ఉంటుందన్నారు. -
జూలై 6 నుంచి ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్‌ను జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలి స్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జూన్‌లోనూ ఎంసెట్‌ను నిర్వహించే అవకాశం లేదని భావిస్తున్న అధికారులు.. జూలై 6 నుంచి ఎంసెట్ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోనూ దీనిపై చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు తెలిసింది. జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు ఉన్నందున, జూలైలో వీలైనంత ముందుగా ఎంసెట్ నిర్వహించాలని యోచిస్తున్నారు. జూలై 6 నుంచి మొదలుపెడితే 15లోగా పూర్తి చేయవచ్చని, తద్వారా విద్యార్థులు 18వ తేదీ నుంచి జరిగే జేఈఈ మెయిన్‌కు సిద్ధం కావచ్చని అంటున్నారు. ఒకవేళ జూలై తొలివారంలో నిర్వహంచకపోతే ఆగస్టుకు వెళ్లే అవకాశం ఉంది. జూలై 23 వరకు జేఈఈ మెయిన్ ఉండగా, అదే నెల 27 నుంచి 31 వరకు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఉంది. పైగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్, తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్ రాస్తారు. మరోవైపు రెండు రాష్ట్రాల విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు హాజరవుతారు. కాబట్టి ఈ మూడు సెట్స్ తేదీలు క్లాష్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఓ అధికారి చెప్పారు. అందుకే జూలై మొదటివారంలోనే ఎంసెట్‌ను నిర్వహించేలా ప్రతిపాదించినట్టు వెల్లడించారు. ఒకవేళ జూలైలోనూ కరోనా అదుపులోకి రాకుండా, పరిస్థితి ఇబ్బందికరంగా మారితే ఏపీ ఎంసెట్ తరువాత ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ ఎంసెట్ నిర్వహించాల్సి వస్తుంది. ఎంసెట్ కౌన్సెలింగ్పైనా కసరత్తు జేఈఈ మెయిన్ ఫలితాల తరువాతే అగ్రికల్చర్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఎంసెట్ కౌన్సెలింగ్‌ను నిర్వహించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తద్వారా రాష్ట్రంలోని టాప్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు మిగిలిపోకుండా చూడటంతో పాటు మెరిట్ విద్యార్థులకు ఆ సీట్లు లభించేలా చూడవచ్చని భావిస్తున్నారు. జేఈఈ మెయిన్ ఫలితాల కంటే ముందే ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తే జేఈఈ ద్వారా ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో సీట్లు లభించనున్న విద్యార్థులు కూడా ఎక్కువ మంది ముందుగా రాష్ట్ర కాలేజీల్లోనే చేరిపోతారు. ఆ మేరకు కన్వీనర్ కోటాలో సీట్లు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా ఆ తరువాత మెరిట్లో ఉండే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. వారు కోరుకున్న కాలేజీలో, బ్రాంచీలో సీట్లు లభించవు. అదే జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడి తరువాత రాష్ట్ర కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఈ పరిస్థితిని నివారించవచ్చు. జేఈఈ విద్యార్థులు కూడా తమకు వచ్చిన ర్యాంకులను బట్టి తమకు ఎక్కడ (ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీలలో) సీటు లభిస్తుందనే అంశంపై ఓ అంచనాకు వస్తారు. అపుడు రాష్ట్ర ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తే రాష్ట్ర కాలేజీల్లో చేరే జేఈఈ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. తద్వారా తక్కువ సంఖ్యలో బ్లాక్ అయ్యే ఆ సీట్లను తదుపరి కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచి, మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరక్కుండా చూడవచ్చని భావిస్తున్నారు. అందుకే జూలై 18 నుంచి 23 వరకు జరిగే జేఈఈ మెయిన్ పరీక్షల ఫలితాలు జూలై 31 నాటికి వెలువడే అవకాశం ఉంది. అప్పటివరకు రాష్ట్ర ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించకుండా ఆగాలని భావిస్తున్నారు. మొత్తానికి ఆగస్టు మొదటి వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్ చేపడితే ఇబ్బంది ఉండదన్న భావనతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీచేసిన అకడమిక్ కేలండర్ ప్రకారం కొత్త విద్యార్థులకు సెప్టెంబరు 1 నుంచి తరగతులను ప్రారంభించవచ్చని చెబుతున్నారు. -
ఆగస్ట్ 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల తేదీ ఖరారు అయింది. ఆగస్ట్ 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జెఈఈ (మెయిన్) పరీక్ష జూలై 18 నుంచి 23 వరకు జరుగుతుందని, మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష జూలై 26 న జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. కాగా ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలైన జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో ప్రవేశాల కోసం గత జనవరిలో మెుదటి విడత జేఈఈ మెయిన్‌ను నిర్వహించింది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో ఏప్రిల్ 5 నుంచి 11 వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను కేంద్రం ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
ఆన్లైన్లో ఎంసెట్, జేఈఈ, నీట్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల కోసం ఆన్లైన్లో జేఈఈ, నీట్, ఎంసెట్ పాఠాలను బోధించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. సబ్జెక్టు నిపుణులు రూపొందించిన ఆ వీడియో పాఠాలను వినే విద్యా ర్థులకు గ్రాండ్ టెస్టులను ఈనెల 20వ తేదీ నుంచి ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇవీ వీడియో పాఠాల లింక్స్.. http://www.tdisk. in http://tsat.tv http://www.softnet. telangana. gov. in -
ఐఐటీ, జేఈఈ, నీట్కి ప్రిపేరవుతున్నారా?
హైదరాబాద్ : ఐఐటీ, జేఈఈ, నీట్ లాంటి పరీక్షలకు సిద్ధమవుతున్నారా? మీ ఇంట్లోనే ఉండి అనుభవఙ్ఞులైన అధ్యాపకులచే లైవ్ క్లాసెస్ వినే అద్భుతమైన అవకాశాన్ని కల్పించడానికి వచ్చేసింది యుప్ మాస్టర్ యాప్. దీంట్లో 10-25 సంవత్సరాల అనుభవం ఉన్న లెక్చరర్స్ పాఠాలు బోధిస్తారు. ఈ లైవ్ స్ట్రీమింగ్ క్లాసెస్‌ను దేశంలోని మెట్రో సిటీ నుంచి మారుమూల ప్రాంతాల వరకు అందరికీ చేరువ చేసేందుకు సిద్ధమైంది ఈ యాప్ అది కూడా చాలా తక్కువ ధరకే ఈ లైవ్ స్ట్రీమింగ్ క్లాసులు మీ ఇంట్లోనే కూర్చొని వినొచ్చు. పాఠాలు బోధించడమే కాదు, లైవ్ చాటింగ్ ఫీచర్ ద్వారా విద్యార్థుల సందేహాలను కూడా నివృత్తి చేస్తారు. వందల కొద్దీ వీడియోలు, మాక్ టెస్టులతో మిమ్మల్ని పరీక్షలకు సంసిద్ధం చేస్తాం అంటున్నారు యాప్ నిర్వాహకులు. “యుప్ మాస్టర్‌ను లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దేశానికి సేవ చేసే అవకాశంగా దీన్ని భావిస్తున్నాను. పట్టణంలోనే ప్రతీ పల్లెలోనూ డోర్ డెలివరీలాగా క్లాసెస్‌ను విస్తరిస్తున్నాం. కొన్ని కారణాల వల్ల మంచి విద్యను పొందలేని విద్యార్థులకు ఈ యాప్ ద్వారా నాణ్యమైన బోధనను అందిస్తాం అని చెప్పటానికి గర్వంగా ఉంది. ప్రస్తుతానికి మా ఫోకస్ ఐఐటీ, జేఈఈ, నీట్ పైనే. కొన్ని రోజుల తర్వాత ప్రతీ విద్యార్థికి క్లాసెస్‌ను విస్తరిస్తాం” అని యాప్ సీఈవో ఉదయ్‌రెడ్డి తెలిపారు. అత్యుత్తమ ఫ్యాకల్టీ ద్వారా 45 రోజులపాటు ప్రతీరోజు నాలుగున్నర నుంచి ఆరు గంటలపాటు ఐఐటీ, జేఈఈ, నీట్ తరగతులను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా విద్యార్థులకు అందిస్తారు. లైవ్ క్లాసెస్ యాక్సెస్ కూడా యుప్ మాస్టర్ యాప్ నిర్వాహకులే కల్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే యాప్‌లో మీరూ మెంబర్ అయిపోండి. క్వాలిటీ క్లాసెస్‌ను వినండి. -
జేఈఈలో ‘పేపర్’ గొడవ
దుండిగల్: ఇన్విజిలేటర్ తప్పిదం కారణంగా తమ కుమారుడి భవిష్యత్ అంధకారమైందని ఆరోపిస్తూ విద్యార్థి తల్లిదండ్రులు జేఈఈ పరీక్ష కేంద్రం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వీరికి పరీక్ష రాసేందుకు వచ్చిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు తెలపడంతో ఉద్రికత్త నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 7, 8, 9 తేదీల్లో దేశ వ్యాప్తంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దుండిగల్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం షాద్‌నగర్‌కు చెందిన విద్యార్థి బిక్కుమల్ల విష్ణుసాయి ఉదయం షిప్ట్‌లో పరీక్షకు హాజరయ్యాడు. ఆన్లైన్లో 3 గంటల పాటు జరిగిన ఈ పరీక్షలో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. అయితే ప్రతి ప్రశ్నకు జవాబు రాబట్టేందుకు వీలుగా విద్యార్థులు రఫ్ పేపర్లను వినియోగిస్తారు. అయితే విష్ణుసాయి పరీక్ష కేంద్రంలో ముందుగా రెండు అడిషనల్ షీట్ లు తీసుకున్నాడు. అనంతరం అదనంగా అడిషనల్ షీట్ కావాలని కోరగా ఇన్విజిలేటర్ అందుకు నిరాకరించాడు. కేవలం నాలుగు పేపర్లను మాత్రమే ఇవ్వడంతో సదరు విద్యార్థి పరీక్ష సరిగా రాయలేక పోయాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు కళాశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వీరికి మద్దతు తెలపడంతో పరీక్షా కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడికి వచ్చిన కళాశాల ప్రతినిధులు విద్యార్థి తల్లిదండ్రులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అబ్జర్వర్ రాము మాట్లాడుతూ సిబ్బంది పొరపాటు కారణంగా తప్పిదం జరిగిందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మెయిల్ పంపించి మరోసారి విద్యార్థికి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. అయినా తల్లిదండ్రులు శాంతించకపోవడంతో తమ ఇన్విజిలేటర్ తప్పిదం ఉందని అంగీకరిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మెయిల్ పంపించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఐదేళ్లుగా కష్టపడుతున్నా.. జేఈఈ పరీక్ష కోసం ఐదేళ్లుగా కష్టపడుతున్నా. ఎంట్రన్స్ పరీక్షలో 75 ప్రశ్నలకు జవాబులు రాయాలంటే కనీసం 20 రఫ్ పేపర్లు అవసరముంటుంది. అయితే ఇన్విజిలేటర్ సార్‌ను ఎంత బతిమాలినా కేవలం నాలుగు పేపర్లే ఇవ్వడంతో పరీక్ష సరిగ్గా రాయలేకపోయాను. దయచేసి నేను మళ్లీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలి.–విష్ణుసాయి, విద్యార్థి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది మా కుమారుడు విష్ణుసాయి టెన్త్‌లో 88 శాతం మార్కులు సాధించాడు. రెండు సార్లు ఒలంపియాడ్లో విన్నర్‌గా నిలిచాడు. అతడికి 8వ తరగతి నుంచి ఐఐటీ శిక్షణ ఇప్పిస్తున్నాం. ఎంతో కష్టపడి చదివి ఎంట్రన్స్‌లో పాస్ అవుతాడన్న నమ్మకం ఉంది. అయితే ఇన్విజిలేటర్ తప్పిదం వల్ల మా కుమారుడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. –శ్రీకాంత్, విద్యార్థి తండ్రి -
జేఈఈలో న్యూమరిక్ వ్యాల్యూ ప్రశ్నలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్‌లో కొత్తగా ప్రవేశపెడుతున్న న్యూమరిక్ వ్యాల్యూ ప్రశ్నల శాంపిల్ జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్ విభాగాల్లో ఇచ్చే ప్రశ్నల్లో 5 న్యూమరిక్ వ్యాల్యూకు చెందినవి ఉంటాయి. కొత్త విధానాన్ని వచ్చే ఏడాది నిర్వహించే తొలిదశ మెయిన్స్ నుంచి అమలు చేయనున్నారు. మూడు విభాగాల శాంపిల్ ప్రశ్నలను జేఈఈ–2020 వెబ్సైట్లో పొందుపరిచారు. మెరిట్ విద్యార్థులు నష్టపోకుండా.. జేఈఈ మెయిన్స్‌లో మల్టిపుల్ ఆన్సర్ల ప్రశ్నలకు సంబంధించి ఏదో ఒక సమాధానానికి గుడ్డిగా టిక్ చేస్తుండటంతో సామర్థ్యంలేని కొంతమంది విద్యార్థులకు కూడా ఎక్కువ మార్కులు వస్తున్నాయి. దీనివల్ల మెరిట్ విద్యార్థులకు నష్టం జరుగుతోందన్న సూచనలు ఎన్టీఏకు అందాయి. దాంతో పాటు జేఈఈలో ప్రశ్నల సంఖ్యను కూడా తగ్గిస్తూ కొత్త ప్యాట్రన్‌ను ఎన్టీఏ ప్రకటించింది. అడ్మిట్ కార్డులు సిద్ధం జేఈఈ–2020 మెయిన్స్ తొలిదశ ఆన్లైన్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయి. అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో పొందుపరిచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. విద్యార్థులు ‘జేఈఈ మెయిన్.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది. డౌన్లోడ్ కాని పక్షంలో ‘జేఈఈ మెయిన్.ఎన్‌టీఏఎట్‌దరేట్‌జీఓవీ.ఐఎన్’ అడ్రస్‌కు అభ్యర్థనను ఈ–మెయిల్ చేయాలని సూచించింది. గతంలో ఎలా..ఇప్పుడెలా... ►గతంలో జేఈఈ మెయిన్స్‌లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్ విభాగాల్లో 30 చొప్పున బహుళ సమాధానాల ప్రశ్నలు ఇచ్చేవారు. ►ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. సమాధానాలు తప్పుగా టిక్ పెడితే ఒక మార్కుచొప్పున కోత పడేలా మైనస్ మార్కుల విధానం అమలు చేస్తున్నారు. ►కొత్త ప్యాట్రన్ ప్రకారం 30 ప్రశ్నల సంఖ్యను 25కు కుదించి విద్యార్థులపై భారాన్ని తగ్గించారు. ►ఈ 25 ప్రశ్నల్లో 20 మల్టిపుల్ ఆన్సర్లతో కూడిన ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. మిగతా 5 న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు ఉంటాయి. ►ఈ విభాగంలో మల్టిపుల్ ఆన్సర్స్ ఇవ్వకుండా కేవలం ప్రశ్న మాత్రమే అడుగుతారు. ప్రశ్నకు సమాధానంగా కేవలం సంఖ్య మాత్రమే ఉంటుంది. ఆన్సర్ స్థానంలో ఖాళీని ఉంచుతారు. సరైన సమాధానం వచ్చే సంఖ్యను మాత్రమే విద్యార్థి రాయాల్సి ఉంటుంది. ►ఇలా మూడు విభాగాల్లోనూ న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలు ఐదేసి ఉంటాయి. ►మల్టిపుల్ ఆన్సర్ ఆబ్జెక్టివ్‌గా ఇచ్చే 20 ప్రశ్నలకు మాత్రమే మైనస్ మార్కులు ఉంటాయి. ►న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలకు ఇది వర్తించదు. ►గతంలో జేఈఈ మెయిన్స్‌లో మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల పేపర్లలో ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలకు 120 మార్కుల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు 360 మార్కులకు ఉండేవి. ►తాజాగా ప్రశ్నల కుదింపుతో ఇప్పుడు మూడు కేటగిరీల్లో 75 ప్రశ్నలతో 300 మార్కులకు ఉంటుంది. మెరిట్ విద్యార్థులకు ఎంతో మేలు ‘కొత్త ప్యాట్రన్‌లో న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల విధానం వల్ల మెరిట్ విద్యార్థులకు మేలు జరుగుతుంది. గతంలో సబ్జెక్టుపై పట్టులేకున్నా గుడ్డిగా ఏదో ఒక ఆన్సర్‌కు టిక్ చేసే వారు అదృష్టవశాత్తు అది కరెక్టు అయితే మెరిట్‌లోకి చేరేవారు. దీనివల్ల ప్రతిభగల అభ్యర్థులకు నష్టం వాటిల్లేది. ఇప్పుడు న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల వల్ల కేవలం ఆ ప్రశ్నకు సరైన సమాధానం తెలిసినవారే రాయగలుగుతారు. తద్వారా మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. – కేతినేని శ్రీనివాసరావు కెమిస్ట్రీ అధ్యాపకుడు, విజయవాడ -
‘అడ్వాన్స్డ్’గా ఉంటేనే...అదిరే ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ తరహాలో సిద్ధమైతేనే జేఈఈ మెయిన్‌లో మంచి ర్యాంకు సాధించవచ్చని ఐఐటీ నిఫుణులు చెబుతున్నారు. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల విధానమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఉన్న జేఈఈ మెయిన్ పరీక్ష విధానాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలే విద్యార్థులకు ర్యాంకుల ఖరారులో కీలకం కానున్నాయి. దీంతో జనవరిలో జరిగే జేఈఈ మెయిన్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకుంటేనే పక్కాగా ర్యాంకును సాధించొచ్చని నిఫుణులు పేర్కొంటున్నారు. ఇప్ప టివరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మాత్రమే న్యూమరికల్ వ్యాల్యూ పరీక్షల విధానముండగా, ఇప్పుడు జేఈఈ మెయిన్‌లోనూ తేవడంతో విద్యార్థులు అడ్వాన్స్డ్ తరహాలోనే మెయిన్‌కు ప్రిపేర్ అయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. న్యూమరికల్ప్రశ్నలకే 60 మార్కులు.. జేఈఈ మెయిన్‌లో గతంలో 360 మార్కులకు పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ ఇప్పుడు వాటిని 300 మార్కులకు తగ్గించింది. ప్రశ్నల సంఖ్య కూడా 90 నుంచి 75కు కుదించింది. అయితే పరీక్షల్లో అడిగే ప్రశ్నల విధానాన్ని కూడా మార్పు చేయడంతో విద్యార్థులు తమ ప్రిపరేషన్ విధానాన్ని కొంత మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యం గా జేఈఈ మెయిన్ టార్గెట్ చేసుకొని సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇది తప్పనిసరి అని ఐఐటీ నిఫుణుడు ఉమాశంకర్ సూచిస్తున్నారు. ఇక నుంచి నిర్వహించే జేఈఈ మెయిన్ ప్రశ్నల్లో 15 ప్రశ్నలు (ఫిజిక్స్‌లో 5, కెమిస్ట్రీలో 5, మ్యాథ్స్‌లో 5 చొప్పున) న్యూమరికల్ వ్యాల్యూ (సంఖ్యాత్మక సమాధానం వచ్చేవి) సమాధానంగా వచ్చే ప్రశ్నలను ఇవ్వనుంది. అయితే ఇప్పటివరకు జేఈఈ మెయిన్‌లో న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు ఇవ్వలేదు. కేవలం జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మాత్రమే ఈ ప్రశ్నలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు వాటిని ఎలాగూ నేర్చుకుంటారు కాబట్టి జేఈఈ మెయిన్‌కు ప్రిపరయ్యే విద్యార్థులు న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏటా తెలంగాణ నుంచి 75 వేల వరకు, ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 80 వేల మంది వరకు విద్యార్థులు జేఈఈ మెయిన్ రాస్తున్నారు. వారిలో మెయిన్ ద్వారా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో దాదాపు 10 వేల మందికి పైగా చేరుతున్నారు. ర్యాంకులపై ప్రభావం.. మొత్తంగా 75 ప్రశ్నలు కాగా ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 300 మార్కులకు జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రం ఉంటుంది. అందులో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో 25 ప్రశ్నల చొప్పున ఇస్తారు. ప్రతి సబ్జెక్టులో ఇచ్చే 25 ప్రశ్నల్లో 5 ప్రశ్నల చొప్పున 15 ప్రశ్నలు న్యూమరికల్ వ్యాల్యూ సమాధానంగా వచ్చేవి ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 60 మార్కులు వాటికే. కాబట్టి ర్యాంకుల ఖరారులో అవే కీలకం కానున్నాయి. కాబట్టి విద్యార్థులు న్యూమరికల్ వ్యాల్యూ సమాధానంగా వచ్చే ప్రశ్నలకు నిర్లక్ష్యం చేయొద్దని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ర్యాంకులు తారుమారు అవుతాయని చెబుతున్నారు. పైగా ఈ 15 ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి బాగా రాస్తే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుందని ఉమాశంకర్ తెలిపారు. అదే మిగతా 60 ఆబ్జెక్టివ్ విధానంలో ఇచ్చే ప్రశ్నలకు నెగిటివ్ మార్కుల విధానం ఉంటుంది. అందులో ఒక్క ప్రశ్నకు తప్పుడు సమాధానం రాస్తే ఒక మార్కు కోత పడుతుంది. అందుకే నెగిటివ్ మార్కులు లేని న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల్లో స్కోర్ చేసేందుకు ప్రయత్నించాలని చెబుతున్నారు. వచ్చే జనవరి 6 నుంచి 11వ తేదీ మధ్యలో, ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ మధ్యలో నిర్వహించే మొదటి, రెండో విడత జేఈఈ మెయిన్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు జాగ్రత్తగా చదువుకోవాలని సూచిస్తున్నారు. జనవరిలో జరిగే జేఈఈ మెయిన్‌కు సిద్ధమయ్యే వారికి ఈ మూడు నెలల సమయం కీలకమైందని పేర్కొంటున్నారు. -
నీట్ మినహా అన్నీ ఆన్లైన్లో
సాక్షి, హైదరాబాద్ : జాతీయ స్థాయి సంస్థల్లోని సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం 13 రకాల పోటీ పరీక్షల షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జారీ చేసింది. 2020–21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్), యూజీసీ నెట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఎంబీఏ అడ్మిషన్ టెస్టు, సీఎస్ఐఆర్ యూజీసీ నెట్, కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్), గ్రాడ్యు యేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్టు (జీప్యాట్), ఆలిండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్టు, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ ఎంబీఏ, బీఎడ్ అడ్మిషన్ టెస్టు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్), జేఎన్‌యూ ఎంట్రెన్స్ టెస్టు, ఢిల్లీ వర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు నిర్వహణకు షెడ్యూలు విడుదల చేసింది. వీటిల్లో జేఈఈ, యూజీసీ నెట్, సీఎస్ఐఆర్–యూజీసీ నెట్ వంటి పరీక్షలను ఏటా రెండుసార్లు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించింది. నీట్ మినహా మిగతా పరీక్షలన్నింటినీ ఆన్లైన్లో నిర్వహిస్తామని పేర్కొంది. విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో 4 వేల ప్రాక్టీస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ వివరించింది. ఇవి సెప్టెంబర్ 1 నుంచి పని చేస్తాయని, ప్రతి శనివారం, ఆదివారం వీటిని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. పరీక్షల షెడ్యూలు వివరాలు.. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు: సెప్టెంబర్ 2 నుంచి 30 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్: డిసెంబర్ 6 నుంచి పరీక్షల తేదీలు:2020 జనవరి 6 నుంచి 11 వరకు ఫలితాల వెల్లడి: జనవరి 31 జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు: 2020 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : మార్చి 16 నుంచి పరీక్షల తేదీలు : ఏప్రిల్ 3 నుంచి 9 వరకు ఫలితాల వెల్లడి : ఏప్రిల్ 30 నీట్ పరీక్షలు.. రిజిస్ట్రేషన్ తేదీలు : డిసెంబర్ 2 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : 2020 మార్చి 27 నుంచి పరీక్ష తేదీ: మే 3 ఫలితాల వెల్లడి: జూన్ 4 ఐఐఎఫ్‌టీ ఎంబీఏ అడ్మిషన్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 25 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : నవంబర్ 11 నుంచి పరీక్ష తేదీ : డిసెంబర్ 1 ఫలితాల వెల్లడి : డిసెంబర్ 11 యూజీసీ నెట్ మొదటి విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు : సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : నవంబర్ 9 నుంచి పరీక్షల తేదీలు : డిసెంబర్ 2నుంచి 6 వరకు ఫలితాల వెల్లడి : డిసెంబర్ 31 యూజీసీ నెట్ రెండో విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు :2020 మార్చి 16 నుంచి ఏప్రిల్ 16 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : మే 15 నుంచి పరీక్షల తేదీలు : జూన్ 15 నుంచి 20 వరకు ఫలితాల వెల్లడి : జూలై 5 సీఎస్ఐఆర్ మొదటి విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు : సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : నవంబర్ 9 నుంచి పరీక్ష తేదీ : డిసెంబర్ 15 ఫలితాల వెల్లడి : డిసెంబర్ 31 సీఎస్ఐఆర్ రెండో విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 మార్చి 16 నుంచి ఏప్రిల్15 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : మే 15 నుంచి పరీక్ష తేదీ: జూన్ 21 ఫలితాల వెల్లడి : జూలై 5 సీమ్యాట్, జీప్యాట్ రిజిస్ట్రేషన్ తేదీలు : నవంబర్ 1 నుంచి 30 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : డిసెంబర్ 24 నుంచి పరీక్ష తేదీ : 2020 జనవరి 24 ఫలితాల వెల్లడి : ఫిబ్రవరి 3 ఆలిండియా ఆయుష్ పీజీ ఎంట్రన్స్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 జనవరి 1 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 1 నుంచి పరీక్ష తేదీ : ఏప్రిల్ 29 ఫలితాల వెల్లడి : మే 10 నేషనల్ కౌన్సిల్ ఫర్హోటల్ మేనేజ్మెంట్ (ఎన్సీహెచ్ఎం) రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 29 వరకు. హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 1నుంచి పరీక్ష తేదీ : ఏప్రిల్ 25 ఫలితాల వెల్లడి : మే 10 ఇగ్నో ఎంబీఏ, బీఎడ్ అడ్మిషన్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 29 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 1 నుంచి పరీక్ష తేదీ : ఏప్రిల్ 29 ఫలితాల వెల్లడి : మే 10 జేఎన్‌యూ ఎంట్రన్స్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 మార్చి 2 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 21 నుంచి పరీక్షల తేదీలు : మే 11 నుంచి 14 వరకు ఫలితాల వెల్లడి : మే 31 ఐకార్ ఏఐఈఈఏ రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 మార్చి 1 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 25 నుంచి పరీక్ష తేదీ: జున్ 1 ఫలితాల వెల్లడి : జూన్ 15 ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 మార్చి 2 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 30 నుంచి పరీక్షల తేదీలు : జూన్ 2 నుంచి 9 వరకు ఫలితాల వెల్లడి : జూన్ 25 -
భారత్‌లోని పరీక్షతో బ్రిటన్‌లో చదవొచ్చు
న్యూఢిల్లీ: భారత్‌లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈతో పాటు ఇతర పోటీ పరీక్షల ద్వారా కూడా విద్యార్ధులను ఎంపిక చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్‌లోని క్వీన్ యూనివర్సిటీ తెలిపింది. సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో వారికి అవకాశం కల్పిస్తామని వైస్ చాన్స్‌లర్ ఇయాన్ గ్రీర్ స్పష్టంచేశారు. సాధారణంగా యూకే యూనివర్సిటీలు లెవెల్–ఏ పరీక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాయి. అయితే ప్రవేశ పరీక్షలకు వివిధ దేశాల్లో విభిన్న ప్రామాణికతలు ఉంటాయని, భారత్‌లోని పరీక్షలు తాము నిర్దేశించుకున్న స్థాయిలోనే ఉన్నాయని ఇయాన్ అన్నారు. చాలా మంది విద్యార్థులు ప్రతిభ ఉన్నా సీట్ల కొరతతో ఐఐటీల్లో చేరలేకపోతున్నారన్నారు. మరో అవకాశం లేక తక్కువ స్థాయి ఉన్న కాలేజీల్లో చేరతారన్నారు. ఇటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ కాలేజీల్లో చదివే అవకాశం కల్పిస్తామన్నారు. జేఈఈలాగే ఇతర జాతీయ స్థాయి పరీక్షలను కూడా పరిగణనలోకి తీసుకునే ఆలోచన చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా 200 మందికి పైగా భారత విద్యార్థులను చేర్చుకున్నామని, రానున్న అయిదేళ్లలో మరింత మందిని చేర్చుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు. -
‘అస్సలు ఊహించలేదు’
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికై ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జేఈఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఫోన్ నంబర్ రిజిస్టర్ చేసుకున్నఅభ్యర్థులందరికి ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలు పంపనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం విడుదలైన ఈ ఫలితాల్లో మహారాష్ట్ర విద్యార్థి ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. బల్లార్పూర్కి చెందిన కార్తికేయ గుప్తా 372 మార్కులకు గానూ 346 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక అలహాబాద్‌కి చెందిన హిమాన్షు సింగ్ రెండో స్థానంలో నిలవగా.. ఢిల్లీకి చెందిన ఈర్చిత్ బుబ్నా మూడో ర్యాంకు సాధించాడు. అస్సలు ఊహించలేదు.. ప్రతిష్టాత్మక పరీక్షలో టాపర్‌గా నిలవడం పట్ల కార్తికేయ హర్షం వ్యక్తం చేశాడు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్‌లో సీట్ లభిస్తుందని అనుకున్నాను గానీ.. ఏకంగా మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదన్నాడు. రోజుకు 6 నుంచి 7 గంటలు పరీక్ష కోసం సన్నద్ధమైనట్లు తెలిపాడు. సబ్జెక్టు నేర్చుకోవడాన్ని పూర్తిగా ఆస్వాదించినపుడే ఉత్తమైన ఫలితాలు పొందగలమన్నాడు. చదువుకునే సమయంలో సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నానని పేర్కొన్నాడు. తన ప్రిపరేషన్లో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు చంద్రేశ్ గుప్తా, పూనం కీలక పాత్ర పోషించారని వెల్లడించాడు. వారి సహకారంతోనే ఇంటర్మీడియట్లో 93.7 శాతం మార్కులు సాధించానని పేర్కొన్నాడు. కాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 19న జరగాల్సిన జేఈఈ పరీక్షను.. మే 27న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరీక్ష ఫలితాలను jeeadv.ac.in. తెలుసుకోవచ్చు. -
రిజర్వేషన్లు ఉన్నా దక్కని ఫలం
సాక్షి, అమరావతి: దేవుడు వరమిచ్చినా.... అన్నట్లుగా మారింది జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కు హాజరైన ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ (ఈడబ్ల్యూఎస్) పరిస్థితి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమల్లోకి తెచ్చినా అది వేలాది మంది అర్హులైన విద్యార్థులకు అందకుండా పోతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆయా విద్యా సంస్థలు సరైన రీతిలో ప్రచారం చేయకపోవడమే దీనికి కారణం. దీంతో 2019–20 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సులకు నిర్వహిస్తున్న ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈడబ్ల్యూఎస్‌కు రిజర్వేషన్లను కల్పిస్తూ కేంద్రం ప్రస్తుత పార్లమెంట్ చిట్టచివరి సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కేంద్రం ఈ బిల్లును ఆమోదించింది. బిల్లు ఆమోదానంతరం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు వీలుగా జాతీయ విద్యా సంస్థల్లో 2 లక్షలకు పైగా సీట్లను పెంచుతూ ఏప్రిల్ 15న కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఆయా విద్యా సంస్థల్లో సీట్ల పెంపుతోపాటు ఈడబ్ల్యూఎస్ కింద అర్హుల ఎంపికకు చర్యలు చేపట్టాలి. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఆయా విద్యాసంస్థలు సరైన ప్రచారం చేయాల్సి ఉంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున ఈడబ్ల్యూఎస్ కింద కొత్తగా ఆప్షన్ నమోదు చేసుకోవడంతోపాటు నిర్ణీత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయడానికి తగినంత సమయం కూడా ఇవ్వాలి. కానీ అలాంటి చర్యలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. జేఈఈలో ఆప్షన్‌కు ఒకే ఒక్కసారి అవకాశం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లలో ప్రవేశానికి జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)–2019ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. జాతీయ పరీక్ష ఏజెన్సీ (ఎన్టీఏ) ద్వారా జేఈఈ మెయిన్‌ను జనవరి, ఏప్రిల్ నెలల్లో రెండుసార్లు జరిపింది. జేఈఈలో ఈ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఆప్షన్ నమోదుకు ఎన్టీఏ మార్చి 2న పబ్లిక్ నోటీసు జారీ చేసింది. అందులో ఈడబ్ల్యూఎస్ కింద అర్హులైనవారు మార్చి 11 నుంచి 15లోగా ఆప్షన్‌ను నమోదు చేసుకోవాలంటూ గడువు విధించింది. అంటే.. కేవలం ఐదు రోజులు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. దీనిపై ఎలాంటి ప్రచారమూ లేకపోవడం, వేలాది మంది విద్యార్థులు పబ్లిక్ నోట్‌ను గమనించకపోవడంతో ఆప్షన్‌ను నమోదు చేసుకోలేకపోయారు. విద్యార్థులు ఆప్షన్ నమోదు చేసి ఉంటే సంబంధిత ధ్రువపత్రాలను జేఈఈ మెయిన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని ఎన్టీఏ పేర్కొంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసే సమయంలో మాత్రం సంబంధిత పోర్టల్‌లో ఆ ధ్రువపత్రాన్ని అప్లోడ్ చేయాలని సూచించింది. ఇంతవరకు బాగానే ఉన్నా మెయిన్ పరీక్ష సమయంలోనే ఆప్షన్ నమోదు చేయడంపై సరైన ప్రచారం కల్పించలేదు. ఆప్షన్ నమోదుకు ఒకటికి రెండుసార్లు విద్యార్థులకు గడువు ప్రకటించాల్సి ఉన్నా అదీ చేయలేదు. దీంతో అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రస్తుత ప్రవేశాల సమయంలో అమల్లోకి వచ్చాయన్న అంశం కూడా చాలా మందికి తెలియకుండా పోయింది. ఫలితాల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసి అవాక్కు కాగా.. జేఈఈ మెయిన్ పేపర్–1 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ర్యాంకులు స్కోరులను కూడా వెల్లడించింది. రెండు దశ (జనవరి, ఏప్రిల్)ల్లో బీఈ/బీటెక్‌కు సంబంధించిన పేపర్–1కు 9,35,741 మంది, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సులకు సంబంధించిన పేపర్–2కు 1,69,767 మంది హాజరయ్యారు. మన రాష్ట్రం నుంచి దాదాపు 60 వేల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారని అంచనా. ఏపీ, తెలంగాణ కలిపి 1.50 లక్షల మంది విద్యార్థులు మెయిన్ పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించినవారిలో మెరిట్లో ఉన్న తొలి 2.24 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపిక చేశారు. అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అవసరమైన కటాఫ్ ఎన్టీఏ స్కోర్లను కూడా ప్రకటించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 89.7548849, ఈడబ్ల్యూఎస్ (జనరల్‌లో ఆర్థికంగా వెనుకబడినవారు)కు 78.2174869, ఓబీసీ (ఎన్సీఎల్)లకు 74.3166557, ఎస్సీలకు 54.0128155, ఎస్టీలకు 44.3345172 కటాఫ్ స్కోర్లుగా నిర్దేశించారు. ఈ స్కోర్లు సాధించిన విద్యార్థులకు మే 27న అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటా చూసిన విద్యార్థులు అవాక్కయ్యారు.ఈడబ్ల్యూఎస్ కోటా గురించి తాము ముందుగా చూసుకోలేకపోయామని, సరైన ప్రచారమూ లేనందున ఎన్టీఏ ఇచ్చిన గడువులోగా ఆప్షన్‌ను నమోదు చేసుకోలేకపోయామని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. స్పందించని ఎన్టీఏ తమకు జరిగిన అన్యాయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాలు వచ్చిన వెంటనే మీడియా సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వివరించి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. జేఈఈ నిర్వహించేది కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎన్టీఏ కాబట్టి తామేమీ చేయలేమని రాష్ట్ర అధికారులు చేతులెత్తేశారు. పైగా ఎన్నికల హడావిడిలో ఉన్నందున దీనిపై దృష్టిపెట్టే పరిస్థితి కూడా అధికారులకు లేకుండా పోయింది. ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ నమోదుకు గడువు ఇస్తూ ఎన్టీఏ గతంలో విడుదల చేసిన నోటీసులోని ఫోన్ నెంబర్లను, ఈమెయిళ్లను సంప్రదించినా ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఆప్షన్ నమోదుకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. తమకు వచ్చిన స్కోరు, ర్యాంకు ప్రకారం అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసే సమయంలో సంబంధిత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయడానికి అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. దీనిపై ఎన్టీఏ నుంచి కానీ సంబంధిత అధికారుల నుంచి కానీ స్పందన లేకపోవడంతో రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు. దేశవ్యాప్తంగా ఇలా నష్టపోయే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని అంచనా. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఆయా విద్యాసంస్థలు సరైన ప్రచారం చేయాల్సి ఉంది. విద్యా సంస్థల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున ఈడబ్ల్యూఎస్ కింద కొత్తగా ఆప్షన్ నమోదు చేసుకోవడంతోపాటు నిర్ణీత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయడానికి తగినంత సమయం కూడా ఇవ్వాలి. కానీ అలాంటి చర్యలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. -
జేఈఈ మెయిన్‌లో మనోళ్ల సత్తా
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో మళ్లీ తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. సోమవారం విడుదలైన ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థిని కొండా రేణు జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు దక్కించుకుని సత్తా చాటింది. మన రాష్ట్రానికే చెందిన బొజ్జ చేతన్ రెడ్డి 21వ ర్యాంక్ సాధించాడు. తెలంగాణకు చెందిన బట్టేపాటి కార్తికేయ ఐదో ర్యాంకు, అడెల్లి సాయికిరణ్ ఏడో ర్యాంకు, కె.విశ్వనాథ్ 8వ ర్యాంకు, ఇందుకూరి జయంత్‌ఫణి సాయి 19వ ర్యాంకులతో రికార్డుల మోత మోగించారు. జాతీయ స్థాయిలో ఎన్టీఏ ప్రకటించిన టాప్–24 ర్యాంకర్లలోఏపీ నుంచి ఇద్దరికి, తెలంగాణ నుంచి నలుగురికి చోటు లభించింది. జనవరిలో జరిగిన తొలి దఫా జేఈఈ మెయిన్పరీక్షకు 8,74,469 మంది, ఏప్రిల్‌లో జరిగిన రెండో దఫా పరీక్షకు 8,81,096 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండు దఫాల్లో కలిపి మొత్తం 11,47,125 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్ష రాశారు. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన ఉత్తమ మార్కులను పరిగణలోకి తీసుకుని వీరికి ఎన్టీఏ ర్యాంకులను కేటాయించింది. మొత్తంగా 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. బీఈ, బీటెక్‌లో ప్రవేశాలకు సంబంధించిన ఈ ఏడాది జనవరి 8 నుంచి 12 వరకు తొలి దఫా, ఆ తర్వాత ఏప్రిల్ 7 నుంచి 12వరకు జరిగిన రెండో దఫా జేఈఈ మెయిన్ పేపర్–1 పరీక్ష జరిగింది. జనవరిలో జరిగిన తొలిదఫా పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పటికే ప్రకటించగా, ఏప్రిల్‌లో జరిగిన రెండో దఫా పరీక్ష ఫలితాలను సోమవారం రాత్రి ప్రకటించింది. ఢిల్లీకు చెందిన శుభాన్ శ్రీవాత్సవ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకును కైవసం చేసుకోగా, కర్ణాటకకు చెందిన కెవిన్ మార్టిన్ రెండో ర్యాంకు, మధ్యప్రదేశ్‌కు చెందిన ధ్రువ్ అరోరా మూడో ర్యాంకు సాధించారు. మే 27న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిలో మెరిట్ ప్రకారం తొలి 2.24 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేయనున్నారు. ఈ అభ్యర్థులకు మే 27న అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారితంగా పేపర్–1ను మే 27న ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్–2ను మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మెరిట్ సాధించిన అభ్యర్ధులకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్‌లో రెండు దఫాలుగా జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 100 పర్సంటైల్ స్కోరు సాధించిన 24 మంది విద్యార్థులు వివరాలను ఎన్టీఏ ప్రకటించింది. ర్యాంకుల వారీగా విద్యార్థుల జాబితా -
ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ ఏఐ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ను ప్రత్యేక బ్రాంచ్‌గా బీటెక్ ప్రోగ్రామ్‌ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(ఐఐటీహెచ్) ప్రారంభించింది. దేశంలో కృత్రిమ మేధస్సును బ్రాంచ్‌గా నాలుగేళ్ల బీటెక్ ప్రోగ్రామ్‌ను అందించనున్న తొలి ఇన్స్టిట్యూట్ గా ఘనతకెక్కింది. అంతర్జాతీయంగా మూడో ఇన్స్టిట్యూట్గా నిలిచింది. ప్రస్తుతం బీటెక్ (ఏఐ) కోర్సును ఎంఐటీ (యూఎస్), కార్నెగీ మిలన్ వర్సిటీ(యూఎస్)లే అందిస్తున్నాయి. 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఐఐటీ హెచ్లో ఏఐ అందుబాటులోకి రానుంది. తొలి బ్యాచ్‌లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ఆధా రంగా 20 మందితో దీన్ని ప్రారంభించనున్నట్లు ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ యూబీ దేశాయ్ తెలిపారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లో డిమాండ్‌కు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలను అందించేలా ఏఐ బ్రాంచ్ కరిక్యులమ్ ను రూపొందించినట్లు చెప్పారు. ఏఐ ఆధారిత పరిష్కారాలు ప్రస్తుతం మన దేశంలో హెల్త్‌కేర్, పంటలు, నేల నిర్వహణ, వాతావరణ అంచనాలు, భద్రత, రక్షణ వంటి విభాగాల్లో ఉపయోగపడుతున్నాయని ఐఐటీ హెచ్ఆర్ అండ్ డీ డీన్, ప్రొఫెసర్ ఎస్.చన్నప్పయ్య తెలిపారు. ఇతర బ్రాంచ్‌ల్లో బీటెక్ చేరిన అభ్యర్థులు ఏఐను మైనర్ కోర్సుగా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. దీంతో ఈ విభాగం లో మానవ వనరుల డిమాండ్–సప్లయ్ వ్యత్యా సం తగ్గించేలా అడుగులు వేస్తామన్నారు. -
నేటి నుంచి ఐఐటీ,జేఈఈ మెయిన్ పరీక్షలు
-
జనవరి 8 నుంచి జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మార్పులు చేసింది. జనవరి 6 నుంచి 20 వరకు నిర్వహించాల్సిన పరీక్షలను జనవరి 8 నుంచి 12 వరకు నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థులు తక్కువగా ఉండటంతో ఈ మేరకు మార్పులు చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 273 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించేలా ఇదివరకే షెడ్యూల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి రెండు గంటల ముందునుంచే అనుమతిస్తారు. కచ్చితంగా గంట ముందుగా విద్యార్థులు కేంద్రంలోకి వెళ్లాల్సిందేనని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఇక హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని పేర్కొంది. ఇందుకోసం jeemain@inta@nic.in ఈ మెయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. హాల్‌టికెట్ లేకుండా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. -
జేఈఈ అభ్యర్థులకు ‘ఆన్లైన్’ కష్టాలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీలు) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించి తొలిసారిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ద్వారా నిర్వహించనున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)– మెయిన్ విద్యార్థులకు అగ్నిపరీక్షలా మారుతోంది. ఈ పరీక్షను ఇక నుంచి కేవలం ఆన్లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లోనే నిర్వహించనుండడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. జేఈఈ మెయిన్‌కు దేశవ్యాప్తంగా 12 నుంచి 14 లక్షల మంది హాజరవుతారని అంచనా. గతేడాది వరకు పరీక్షను ఆఫ్‌లైన్ (పేపర్, పెన్ను విధానం)తోపాటు ఆన్లైన్లో నిర్వహించే వారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని విద్యార్థులు ఆఫ్‌లైన్ పరీక్షకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈసారి ఆఫ్‌లైన్‌ను రద్దు చేసి ఆన్లైన్లో మాత్రమే పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో కంప్యూటర్‌పై అవగాహన లేని వారు ఆన్లైన్లో పరీక్ష ఎలా రాయాలని ఆందోళనలో ఉన్నారు. కంప్యూటర్లే లేవు రాష్ట్రంలో 1100 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 2700 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్మీడియెట్ సెకండియర్ విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో 2 లక్షల మంది ఉండగా.. ప్రైవేటు కాలేజీల్లో దాదాపు 4 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో అత్యధిక శాతం మంది జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్నారు. వీరికి ఆన్లైన్ టెస్టులపై శిక్షణ ఇవ్వడానికి కళాశాలల్లో కంప్యూటర్లు లేవు. దీంతో విద్యార్థులకు మాక్ ఆన్లైన్ టెస్టులపై శిక్షణ అందడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులే కావడంతో వారికి ఆన్లైన్ పరీక్ష మరింత గడ్డుగా మారనుంది. ప్రైవేటు కాలేజీల్లోనూ విద్యార్థులతో బట్టీ పట్టించడమే తప్ప ఆన్లైన్లో జరిగే పరీక్షలను ఎలా ఎదుర్కొనాలో శిక్షణ ఇవ్వడం లేదు. రఫ్ వర్క్ చేసుకుంటూ ఆన్లైన్లో గుర్తించడం కష్టమే జేఈఈ మెయిన్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లలో ఇచ్చే ప్రశ్నలకు ఎంతో లోతుగా ఆలోచిస్తే కానీ సరైన సమాధానాలు గుర్తించడం కష్టం. వీటికి సంబంధించి రఫ్ వర్క్‌కే ఎంతో సమయం పడుతుంది. కంప్యూటర్ స్క్రీన్‌పై ఆయా ప్రశ్నలను చదివి, ఆప్షన్లను పరిశీలించి మరోపక్క బయట అందుకు సంబంధించిన రఫ్ వర్క్ పూర్తిచేసి సమాధానాన్ని గుర్తించడంలో తీవ్ర తడబాటుకు గురయ్యే ప్రమాదముంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. పైగా జేఈఈ మెయిన్‌లో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ మాత్రం తప్పుగా టిక్ చేసినా మార్కుల్లో కోతపడే ప్రమాదముందని విద్యార్థులు భయపడుతున్నారు. టీపీసీలు ఏర్పాటు చేసినా అదే పరిస్థితి మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థుల శిక్షణ కోసం దేశవ్యాప్తంగా టెస్టు ప్రాక్టీస్ సెంటర్స్ (టీపీసీ)లను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ ప్రకటించింది. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్టీఏ.ఏసీ.ఐఎన్’ వెబ్సైట్లో సెప్టెంబర్ 8 నుంచి వీటిని యాక్టివ్‌లోకి తెచ్చింది. ఈ సెంటర్లు శనివారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు, ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు, తిరిగి 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అలాగే ఎన్టీఏ స్టూడెంట్ యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా టెస్టు ప్రాక్టీస్‌లో పాల్గొనవచ్చు. అయితే కళాశాలల విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో వారు మాక్ టెస్టులకు ఎలా ప్రిపేర్ అవుతారనేది ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు టీపీసీలపై విద్యార్థులకు కాలేజీలు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. అటు మాక్ టెస్టులకు అవకాశం లేక, ఇటు టీపీసీ కేంద్రాల్లోనూ తర్ఫీదులేక తమ పిల్లలు నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నీట్, జేఈఈలకు ఉచిత శిక్షణ ఇస్తాం
న్యూఢిల్లీ: నీట్, జేఈఈ, నెట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు 2019, మే నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర మానవవనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్న 2,697 స్టడీ సెంటర్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శిక్షణ కేంద్రాలుగా మారుస్తుందని వెల్లడించారు. ఈ స్టడీ సెంటర్లు వచ్చే నెల 8 నుంచి ప్రారంభమవుతాయి. ఈ కేంద్రాలు విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజును వసూలు చేయబోవు. చదువుకోవాలన్న తపన ఉన్నప్పటికీ ఆర్థిక కారణాలతో వెనుకంజ వేస్తున్న విద్యార్థుల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్టీఏ తొలుత జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు 2019, జనవరిలో మాక్ టెస్టులు నిర్వహిస్తారు. మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ లో విద్యార్థులు మాక్ టెస్టుల కోసం సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్ కావొచ్చని వెల్లడించారు. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం కేంద్రం ఎన్టీఏను స్థాపించిన సంగతి తెలిసిందే. -
ఎంసెట్ ఇక కనుమరుగేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1983లో మొదలైన ఎంసెట్ ప్రస్థానానికి ఇక తెరపడనుందా? దీనికి విద్యా శాఖ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ ప్రవేశాలను జాతీయ స్థాయి నీట్ పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం.. ఇకపై జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ప్రవేశాలను జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) పరిధిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అది ఆచరణలోకి వస్తే రాష్ట్రంలో 35 ఏళ్ల పాటు నిర్వహించిన ఎంసెట్ అంతర్థానం కానుంది. ఇటీవల జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని (ఎన్టీఏ) ఏర్పాటు చేసి నీట్, జేఈఈని ఏటా రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఇంజనీరింగ్ కోర్సు ల్లో ప్రవేశాలను కూడా జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష ద్వారా చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చేసిన ప్రతిపాదనలకు ఇదివరకే ఆమోదం తెలిపింది. త్వరలోనే దాన్ని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. వీలైతే 2019–20 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తెచ్చే అవకాశముంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్, హరియాణా, నాగాలాండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల్లోని మరో 9 వర్సిటీలు జేఈఈ మెయి న్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. పరీక్ష మెరిట్ ప్రధానం జేఈఈ మెయిన్‌లో ఇంటర్మీడియట్ మార్కులకు ఇస్తూ వస్తున్న 40 శాతం వెయిటేజీని 2016లోనే కేంద్రం రద్దు చేసింది. ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగానే ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాలు చేపడుతోంది. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ అంతే. కానీ ఎంసెట్‌లో మాత్రం ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది. ఎంసెట్‌లో ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థుల ఇంటర్మీడియట్ చదువులు సాగుతుండటంతో 2007–08 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రొఫెసర్ నీరదారెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఎంసెట్ ర్యాంకుల ప్రాధాన్యాన్ని తగ్గించి, ఇంటర్ ప్రాధాన్యం పెంచేందుకు ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వాలని, దాన్ని క్రమంగా పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. ఆ సిఫారసు మేరకే 2009 నుంచి ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. అయితే ఎంసెట్‌ను తొలగిస్తే వెయిటేజీకి అవకాశమే ఉండదు. నీట్, జేఈఈవైపే రాష్ట్ర విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష విధానం అమల్లోకి వస్తే రాష్ట్ర విద్యార్థులంతా జేఈఈ, నీట్వైపే వెళ్లాల్సి వస్తుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, హోమియో, యునానీ, ఆయుర్వేద, యోగా, నేచురోపతి కోర్సుల్లో ప్రవేశాలు 2017–18 నుంచి నీట్ ద్వారానే జరగనుండగా, బీఈ/బీటెక్ వంటి ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు 2019–20 నుంచి జేఈఈ మెయిన్ ద్వారానే జరిగే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పరీక్షలకు హాజరయ్యే 2.5 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి మెడికల్ కోర్సులకు లక్ష మంది వరకు, ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు 1.5 లక్షల మంది సిద్ధమవుతున్నారు. ఎంటెక్ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కూడా జేఈఈ ద్వారానే చేపట్టే అవకాశముంది. అగ్రికల్చర్ కోర్సులకు ప్రత్యేక పరీక్ష! ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు మినహా మిగతా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష నిర్వహించే అవకాశముంది. ఇన్నాళ్లూ ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులతో పాటు బీఫార్మసీ, బీటెక్ బయో టెక్నాలజీ (బైపీసీ), ఫార్మా–డి (బైపీసీ), బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హార్టికల్చర్), బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, బీఎఫ్ఎస్సీ, బీటెక్ (ఎఫ్ఎస్టీ), బీఎస్సీ (సీఏ, బీఎం) వంటి కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ నిర్వహించారు. ఇంజనీరింగ్ ప్రవేశాలను జేఈఈ మెయిన్ ద్వారా చేపట్టే అవకాశం ఉండటంతో మిగతా కోర్సుల్లో ప్రవేశాలను ప్రత్యేక పరీక్ష పరీక్ష ద్వారానే చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు తామే ప్రత్యేక పరీక్ష నిర్వహించుకోవాలని గతంలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు యోచించారు. ఎంసెట్ రద్దయితే మాత్రం వారు ప్రత్యేక పరీక్షవైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. -
ఇకపై ఏడాదికి రెండుసార్లు నీట్, జేఈఈ పరీక్ష