
సాక్షి, న్యూఢిల్లీ: జూలైలో జరగాల్సిన జేఈఈ , నీట్ పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం తెలిపారు. పరిస్థితిని సమీక్షించి, వారి సిఫారసులను రేపటిలోగా సమర్పించాలని ఎన్‌టీఏ, ఇతర నిపుణులతో కూడిన కమిషన్‌ను కోరినట్లు హెచ్‌ఆర్‌డీ మంత్రి గురువారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. (జూలై 26న నీట్)
జేఈఈ పరీక్ష జూలై 19-23 మధ్య జరగాల్సి ఉండగా, నీట్ పరీక్ష జూలై 26 న జరగాల్సి ఉంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయా లేదా అనే అంశంపై మొత్తం 30 లక్షల మంది విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర సంబంధిత వ్యక్తులు ట్విట్టర్‌లో #RIPNTA అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. 24 గంటల్లో 314800 కంటే ఎక్కువమంది దీనిని రీట్వీట్ చేశారు. దీంతో ఇది టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లో నిలిచింది . దీనిపై స్పందించిన హెచ్‌ఆర్‌డీ మంత్రి "మీ సమస్యలను నేను అర్థం చేసుకున్నాను, వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనటానికి మేము ప్రయత్నిస్తున్నాం" అని ఒక ప్రకటనలో తెలిపారు.ఇదిలా ఉండగా భారతదేశంలో 19 కేసులు 6 లక్షలు దాటాయి. (ఆన్‌లైన్ క్లాసులు: హెచ్‌ఆర్‌డీ కీలక ప్రకటన)
Comments
Please login to add a commentAdd a comment