NEET-2
-
తమిళనాడు అసెంబ్లీలో ‘నీట్’ రగడ
సాక్షి ప్రతినిధి, చెన్నై: నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) అంశం సోమవారం అసెంబ్లీలో మ రోమారు చర్చకు వచ్చింది. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపించేందుకు, గవర్నర్ ఎన్ఆర్ రవి సమ్మతించారంటూ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నే పథ్యంలో వాస్తవ పరిణామాలను పరిశీలించిన తరువాత అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని సోమవారం సీఎం స్టాలిన్ సభలో వెల్లడించారు. తేనేటి విందుకు గైర్హాజరుపై లేఖ.. తమిళనాడు అసెంబ్లీలో 110 విధుల కింద సీఎం స్టాలిన్ ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులోని వివరాలు.. ‘ఏడున్నర కోట్ల తమిళ ప్రజానీకం ప్రతిఫలించేలా అసెంబ్లీలో ఆమోదించిన నీట్ వ్యతిరేక తీర్మానం గత 210 రోజులుగా రాజ్‌భవన్‌లోనే పడి ఉంది. వందేళ్లు పూర్తి చేసుకున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీట్ మినహాయింపు బిల్లు చెన్నై గిండీలోని రాజ్‌భవన్ ప్రాంగణంలో ఎవరికీ పట్టని విధంగా మూలవేశారు. అలాంటి రాజ్‌భవన్‌లో జరిగిన తేనీటి విందుకు ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకావడం ప్రజాభీష్టాన్ని అవమానించడమే అవుతుంది. అందుకే గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు గైర్హాజరయ్యాం. ఈ పరిస్థితులకు సంబంధించి గవర్నర్‌కు నేనే ఓ ఉత్తరం రాశాను. మీతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి భేధాభిప్రాయం లేదు, సామాజిక బాధ్యతకు కట్టుబడే తేనీటి విందుకు రాలేదని ఆ ఉత్తరంలో స్పష్టం చేశాను. మా ప్రభుత్వ విధానాల గురించి గవర్నరే బహిరంగ వేదికలపై ప్రశంసించారు. గవర్నర్ అనే హోదాకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ తగిన గౌరవం ఇస్తూనే ఉంటుంది. వ్యక్తిగతంగా నాకు లభించే ప్రశంసల కంటే రాష్ట్ర ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం. అలాగే గవర్నర్ సైతం ఈ అసెంబ్లీని గౌరవించి నీట్ వ్యతిరేక తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి. అలా పంపక పోవ డం తమిళనాడు ప్రజలను అవమానించడమే అవుతుంది. ఇదే గవర్నర్ గతంలో తిప్పిపంపిన నీట్ వ్యతిరేక తీర్మానంపై ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరోసారి తీర్మానం చేసి రాజ్‌భవన్‌కు పంపి 70 రో జులు అవుతోంది. ఈ పరిస్థితుల్లో సదరు తీర్మానా న్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని గవర్నర్ నిర్ణయించుకున్నట్లు మీడియాలో ప్రచారం అవుతోంది. ఈ ప్రచారాన్ని వాస్తవం చేస్తూ జరిగే పరిణామాలను గమనిస్తాం, అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తదుపరి చర్యలపై ముందుకు సాగుతాం..’అని స్టాలిన్ పేర్కొన్నారు. ముల్‌లెపైరియార్ వ్యవహారంపై.. ముల్‌లెపైరియార్ ఆనకట్ట వ్యవహారంలో చట్టపరమైన చర్యలపై సీఎం, అఖిలపక్ష నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి దురైమురుగన్ అసెంబ్లీలో తెలిపారు. అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, పీఎంకే పార్టీల అసెంబ్లీ సభ్యులు సోమవారం నాటి అసెంబ్లీలో ముల్‌లెపైరియార్ ఆనకట్టపై ప్రవేశపెట్టిన తీర్మానానికి మంత్రి దురైమురుగన్ ఈ మేరకు బదులిచ్చారు. ఈ సమయంలో ప్రధాన ప్రతిపక్ష ఉప నేత ఓ పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ, కేరళ ప్రభుత్వం ముల్‌లెపైరియార్ ఆనకట్ట విషయంలో ఏకపక్షంగా సర్వే చేస్తోందని, అక్కడి బేడీ ఆనకట్ట, సిట్రనై ఆనకట్ట దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలన కోసం తమిళనాడు నుంచి వెళ్లినవారిని కేరళ ప్రభుత్వం అడ్డుకుంటోందని చెప్పారు. కేరళ ప్రభుత్వంతో తమిళనాడు సీఎంకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నందున తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే తమిళనాడులో వేసవి కాలంలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరాకు యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకుంటున్నాం.. రాష్ట్రంలో విద్యుత్ కోత అనే మాటకు ఎంతమాత్రం చోటు లేదని మంత్రి సెంథిల్ బాలాజీ స్పష్టం చేశారు. మధుర మీనాక్షిని దర్శనానికి మధుౖ రెకి వచ్చే భక్తుల కోసం రూ.35 కోట్లతో అతి గృహాలు నిర్మిస్తున్నట్టు మంత్రి శేఖర్‌బాబు తెలిపారు. ఇది చదవండి: సాధ్వి రితంబర వివాదాస్పద వ్యాఖ్యలు -
NEET Coaching: డబ్బుల కోసం హుండీల చోరీ
రాంగోపాల్‌పేట్: నీట్ కోచింగ్ కోసం ఓ యువకుడు ఏకంగా గుడిలోని హుండీలకే కన్నం వేశాడు. ఇలా 8 గుళ్లలో హుండీలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డాడు. చివరకు గోపాలపురం పోలీసులు అరెస్టు చేసి చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన బాలాజీ కుమారుడు మూలే సంతోష్ అలియాస్ రవి (21) చదువుకునేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. నీట్ రాసి డాక్టర్ కావాలని కలలుగన్నాడు. గత ఏడాది నీట్ పరీక్ష రాసినా ర్యాంకు రాలేదు. దీంతో కోచింగ్ తీసుకోవాలని అనుకున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో చోరీల బాట పట్టాడు. ఆలయాల్లో చోరీలు చేసి తరువాత వీలున్నపుడు చెల్లించాలని అనుకున్నాడు. జనవరి నుంచి ఐదు నెలల్లోనే హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిల్లో ఉండే 7 దేవాలయాల్లో హుండీలను పగుల గొట్టి దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ నెల 14న సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో చోరీ చేశాడు. సుమారు రూ.80 వేల వరకు హుండీలో ఉండే నగదును దొంగిలించి తప్పించుకుని తిరుగుతూ గోపాలపురం పోలీసులకు ప ట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 74 వేల నగదును స్వాధీనం చేసుని రిమాండ్‌కు తరలించారు. ఇంకా డబ్బు సంపాదించడానికి ఐపీఎల్, లూడో లాంటివి కూడా ఆడాడని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా నిందితుడు పోలీసులకు విచారణలో చుక్కలు చూపించినట్లు తెలిసింది. తాను చేసింది నేరమే కాదని నన్నెట్లా అరెస్టు చేస్తారని పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టాడు. దేవుడి డబ్బు తీసుకున్నా ఆయనకే ఇచ్చేస్తా ఇందులో తప్పెక్కడిది అంటూ వారినే ప్రశ్నిస్తూ విచారణలో ముప్పుతిప్పలు పెట్టాడు. చదవండి: ప్రియురాలిని బీరు సీసాతో పొడిచి చంపిన ప్రేమోన్మాది -
అనిత వీడియో: అడ్డంగా బుక్కైన మంత్రి
సాక్షి, చెన్నై: మంత్రి పాండియరాజన్ ట్విట్టర్లో ఓ వీడియో వివాదానికి దారి తీసింది. నీట్‌కు వ్యతిరేకంగా బలవన్మరణానికి పాల్పడిన అనిత అన్నాడీఎంకేకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఆ వీడియో ఉండడం ఈ వివాదానికి కారణం. ఈ వ్యవహారంపై నెటిజన్లు తిట్ల పురాణం అందుకోవడంతో ఆ వీడియోతో తనకు సంబంధం లేదని మంత్రి దాటవేయడం గమనార్హం. నీట్‌కు వ్యతిరేకంగా గతంలో అనిత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మెరిట్ మార్కులు దక్కినా, నీట్ రూపంలో వైద్య సీటు దూరం కావడంతో రాష్ట్రంలో బలన్మరణానికి పాల్పడిన తొలి విద్యార్థిగా అనిత ఉన్నారు. ఆమె మరణంతో నీట్‌కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలే సాగాయి. తాజా ఎన్నికల్లో నీట్‌కు వ్యతిరేకంగా ప్రతి పక్షాలు వ్యాఖ్యలు చేసే సమయంలో తప్పనిసరిగా అనిత పేరును స్మరించుకోవడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆమె గొంతుతో ఓట్లను దండుకునేందుకు చేసిన ఓ ప్రయత్నం అన్నాడీఎంకే ఆవడి అభ్యర్థి, మంత్రి పాండియరాజన్‌కు బెడిసికొట్టింది. మిమిక్రీతో.. అనిత నీట్‌కు వ్యతిరేకంగా గతంలో తీవ్రంగానే వ్యాఖ్యలు చేసింది. దీనిని ఆసరాగా చేసుకుని ,అన్నాడీఎంకేకు మద్దతుగా ఆమె వ్యాఖ్యలు చేసినట్టుగా మిమిక్రీ చేసి ఓ వీడియోను సిద్ధం చేసినట్టున్నారు. ఇది మంత్రి అధికార ట్విట్టర్లో దర్శనం ఇచ్చింది. అన్నాడీఎంకేకు అనుకూలంగా అనిత వ్యాఖ్యలు ఎప్పుడు చేసినట్టో అని, నెటిజన్లు తీవ్రంగానే విరుచుకు పడే పనిలో పడ్డారు. ఇదేం నీచ రాజకీయం అని తిట్ల పురాణం అందుకున్న వాళ్లూ ఉన్నారు. దీంతో మేల్కొన్న మంత్రి పాండియరాజన్ తన వ్యాఖ్యలతో ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోతో తనకు సంబంధం లేదని, తన అను మతి లేకుండా ట్విట్టర్లోకి వచ్చినట్టు స్పందించడం గమనార్హం. అయితే, అనిత సోదరుడు మణిరత్నం ఈ వ్యవహారంపై తీవ్రంగానే స్పందించాడు. తన చెల్లెల్ని నీట్‌రూపంలో పొట్టన పెట్టుకుంది కాకుండా, ఇప్పుడు ఆమె గొంతును మిమిక్రీ చేసి ఓట్లు దండుకునే యత్నం చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఈ వీడియో అనితను కించ పరిచనట్టుగానే ఉందని, ఇందుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. చదవండి: 3 రాష్ట్రాలు, ఒక యూటీలో ముగిసిన ఎన్నికల ప్రచారం -
జేఈఈ, నీట్ పరీక్షలపై నిర్ణయం అప్పుడే!
సాక్షి, న్యూఢిల్లీ: జూలైలో జరగాల్సిన జేఈఈ , నీట్ పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం తెలిపారు. పరిస్థితిని సమీక్షించి, వారి సిఫారసులను రేపటిలోగా సమర్పించాలని ఎన్టీఏ, ఇతర నిపుణులతో కూడిన కమిషన్‌ను కోరినట్లు హెచ్ఆర్డీ మంత్రి గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు. (జూలై 26న నీట్) జేఈఈ పరీక్ష జూలై 19-23 మధ్య జరగాల్సి ఉండగా, నీట్ పరీక్ష జూలై 26 న జరగాల్సి ఉంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయా లేదా అనే అంశంపై మొత్తం 30 లక్షల మంది విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర సంబంధిత వ్యక్తులు ట్విట్టర్లో #RIPNTA అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. 24 గంటల్లో 314800 కంటే ఎక్కువమంది దీనిని రీట్వీట్ చేశారు. దీంతో ఇది టాప్ ట్రెండింగ్ లిస్ట్‌లో నిలిచింది . దీనిపై స్పందించిన హెచ్ఆర్డీ మంత్రి "మీ సమస్యలను నేను అర్థం చేసుకున్నాను, వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనటానికి మేము ప్రయత్నిస్తున్నాం" అని ఒక ప్రకటనలో తెలిపారు.ఇదిలా ఉండగా భారతదేశంలో 19 కేసులు 6 లక్షలు దాటాయి. (ఆన్లైన్ క్లాసులు: హెచ్ఆర్డీ కీలక ప్రకటన) -
నేడే నీట్-2 పరీక్ష
- హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్ష - యాజమాన్య కోటా - మెడికల్ సీట్లకు ఈ పరీక్షే కీలకం సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)-2’కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఈ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లను నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేయనుండడంతో ఈ పరీక్షకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వ కాలేజీల్లోని మెడికల్ సీట్లకు, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఎంసెట్-2 నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ కన్వీనర్ కోటాలో అవకాశం లభించని వారంతా ‘నీట్-2’కు పోటీ పడుతున్నారు. నీట్-2 ర్యాంకులతో రాష్ట్రం సహా దేశంలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లోని సీట్ల కోసం కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇక నీట్-2 ప్రవేశ పరీక్షకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల సహకారంతో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 27 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల వివరాలను విద్యార్థుల హాల్టికెట్లలో పొందుపరిచారు.