సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద పెద్ద నగరాల్లో చదువుకోకపోయినా, పేరు పొందిన సంస్థల్లో కోచింగ్ తీసుకోలేకపోయినా, దుర్భరమైన దారిద్య్రాన్ని అనుభవిస్తున్నా అతను జేఈఈ మెయిన్స్‌లో 90% స్కోరు సాధించి సత్తా చాటాడు. ఛత్తీస్‌గఢ్‌లో జష్‌పూర్‌కి చెందిన బాలముకుంద్ పైక్రా అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. తండ్రి ప్రభుత్వ పాఠశాలలో వంట చేస్తూ బతుకు బండి లాగిస్తున్నాడు. వారి ఆదాయం రోజుకి కేవలం 40 రూపాయలు.
అంతటి దుర్భర పేదరికాన్ని అనుభవిస్తూ కూడా బాలముకుంద్ చదువుకి అత్యంతప్రాధాన్యత ఇచ్చాడు. ప్రభుత్వం ఉచితంగా నడిపే సంకల్ప శిక్షణ సంస్థాన్‌లో కోచింగ్ తీసుకొని టాప్ స్కోర్ సాధించాడు. తనకు చదువు చెప్పే టీచర్లు అత్యంత ప్రతిభావంతులని, ఇంజనీర్ కావాలన్న తన కల వారి వల్లే నెరవేరిందని అంటున్నాడు బాలముకుంద్. మరోవైపు ఈ సంస్థాన్‌కు చెందిన ఎందరో విద్యార్థులు జేఈఈలో మంచి స్కోరే సాధించారు.
తమ విద్యార్థులకు క్రమశిక్షణ ఎక్కువని, కోచింగ్‌సెంటర్‌లో గడిపే ప్రతీ సెకండ్‌కి వాళ్లు ఎంతో విలువ ఇస్తారని అక్కడ టీచర్లు చెబుతున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, పూట గడవడమే కష్టమైన పరిస్థితుల్లో కూడా ఈ సంస్థాన్‌కు చెందిన విద్యార్థులు విద్యా సుగంధాలు వెదజల్లుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment