
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థులు వరుస ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇటీవల కాలంలో విద్యార్థుల బలవన్మరణాలు పెరిగిపోయాయి. మానసిక ఒత్తిడి, చదవు భయంతో బంగారు భవిష్యత్తును చేజేతులారా చిదిమేస్తున్నారు. వారానికి ఒక ఆత్మహత్య కేసు నమోదవ్వడం కలవరపెడుతున్నాయి.
తాజాగా కోటాలో గురువారం మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు విడిచాడు. కోటాలో గడిచిన వారం రోజుల వ్యవధిలో విద్యార్ధి ఆత్మహత్య నమోదవ్వడం ఇది మూడోది కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని అజంఘర్‌కు చెందిన 17 ఏళ్ల మనీష్ ప్రజాపత్ ఆరు నెలల కిత్రం కోటాకు వచ్చాడు. ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్‌లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) కోసం ప్రిపేర్ అవుతున్నారు.
ఏమైందో ఏమో కానీ గురువారం ఉదయం తన హాస్టల్ రూమ్‌లో విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని వద్ద ఎలాంటి సుసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు.
కాగా కోటాలో ఈ ఏడాది బలవన్మరణం చెందిన విద్యార్థుల సంఖ్య 21కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఇదే పట్టణంలో 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అఖిల భారత స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు కోటా ప్రసిద్ధి గాంచింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వేల మంది విద్యార్థులు కోచింగ్ కోసం వస్తుంటారు. ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే చదువులో ఒత్తిడి వల్ల అక్కడ విద్యార్థులు ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
చదవండి: Hyderabad: తాగుడుకు బానిసైన భర్త.. ఉద్యోగం మానేసి అబద్ధాలు చెప్తుండటంతో
Comments
Please login to add a commentAdd a comment