హైదరాబాద్ : ఐఐటీ, జేఈఈ, నీట్ లాంటి పరీక్షలకు సిద్ధమవుతున్నారా? మీ ఇంట్లోనే ఉండి అనుభవఙ్ఞులైన అధ్యాపకులచే లైవ్ క్లాసెస్ వినే అద్భుతమైన అవకాశాన్ని కల్పించడానికి వచ్చేసింది యుప్ మాస్టర్ యాప్. దీంట్లో 10-25 సంవత్సరాల అనుభవం ఉన్న లెక్చరర్స్ పాఠాలు బోధిస్తారు. ఈ లైవ్ స్ట్రీమింగ్ క్లాసెస్‌ను దేశంలోని మెట్రో సిటీ నుంచి మారుమూల ప్రాంతాల వరకు అందరికీ చేరువ చేసేందుకు సిద్ధమైంది ఈ యాప్ అది కూడా చాలా తక్కువ ధరకే ఈ లైవ్ స్ట్రీమింగ్ క్లాసులు మీ ఇంట్లోనే కూర్చొని వినొచ్చు.
పాఠాలు బోధించడమే కాదు, లైవ్ చాటింగ్ ఫీచర్ ద్వారా విద్యార్థుల సందేహాలను కూడా నివృత్తి చేస్తారు. వందల కొద్దీ వీడియోలు, మాక్ టెస్టులతో మిమ్మల్ని పరీక్షలకు సంసిద్ధం చేస్తాం అంటున్నారు యాప్ నిర్వాహకులు. “యుప్ మాస్టర్‌ను లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దేశానికి సేవ చేసే అవకాశంగా దీన్ని భావిస్తున్నాను. పట్టణంలోనే ప్రతీ పల్లెలోనూ డోర్ డెలివరీలాగా క్లాసెస్‌ను విస్తరిస్తున్నాం. కొన్ని కారణాల వల్ల మంచి విద్యను పొందలేని విద్యార్థులకు ఈ యాప్ ద్వారా నాణ్యమైన బోధనను అందిస్తాం అని చెప్పటానికి గర్వంగా ఉంది. ప్రస్తుతానికి మా ఫోకస్ ఐఐటీ, జేఈఈ, నీట్ పైనే. కొన్ని రోజుల తర్వాత ప్రతీ విద్యార్థికి క్లాసెస్‌ను విస్తరిస్తాం” అని యాప్ సీఈవో ఉదయ్‌రెడ్డి తెలిపారు.
అత్యుత్తమ ఫ్యాకల్టీ ద్వారా 45 రోజులపాటు ప్రతీరోజు నాలుగున్నర నుంచి ఆరు గంటలపాటు ఐఐటీ, జేఈఈ, నీట్ తరగతులను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా విద్యార్థులకు అందిస్తారు. లైవ్ క్లాసెస్ యాక్సెస్ కూడా యుప్ మాస్టర్ యాప్ నిర్వాహకులే కల్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే యాప్‌లో మీరూ మెంబర్ అయిపోండి. క్వాలిటీ క్లాసెస్‌ను వినండి.
Comments
Please login to add a commentAdd a comment