IIT courses
-
స్టెమ్ కోర్సుల్లో మహిళల ముందడుగు
సాక్షి, అమరావతి: ఒకప్పుడు సంప్రదాయ కోర్సులకే పరిమితమవుతూ వచ్చిన మహిళలు ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులవైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్‌తో కూడిన స్టెమ్ (ఎస్టీఈఎం) కోర్సుల్లో వారి చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆలిండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఐష్) కొద్దికాలం కిందట విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో స్టెమ్ కోర్సుల్లో మహిళల సంఖ్య భారీగా పెరిగింది. సాంకేతిక విద్యాకోర్సులు అమలవుతున్న ఐఐటీలు, ఎన్ఐటీలు తదితర జాతీయ విద్యాసంస్థల్లో వీరి చేరికల శాతం 2016–17లో 8 మాత్రమే ఉండగా 2020–21 నాటికి 20కి పెరిగింది. 2021–22 విద్యాసంవత్సరంలో ఇది 22.1 శాతానికి చేరింది. సాంకేతిక విద్యాకోర్సుల్లో మహిళల చేరికలను పెంచేందుకు కేంద్రప్రభుత్వం కూడా వారికోసం 2017 నుంచి సూపర్ న్యూమరరీ కోటాను ప్రవేశపెట్టింది. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరుతోపాటు అర్హత సాధించడంలోను మహిళల శాతం తక్కువగా ఉండేది. దీనివల్ల ఐఐటీల్లో వారిసంఖ్య స్వల్పంగా ఉండేది. సూపర్ న్యూమరరీ కోటాను పెట్టడంతో గత ఐదేళ్లలోనే వారి చేరికలు 20 శాతానికి పెరిగాయి. ఎన్ఐటీల్లో అయితే వారి చేరికలు 23 శాతంగా ఉండడం గమనార్హం. ఐఐటీల్లో 2017లో చేరిన మహిళలు 995 మందే కాగా 2021లో ఆ సంఖ్య 2,990కి చేరింది. -
ఐఐటీ అకాడమీల్లో నాణ్యమైన విద్య
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఐటీ అకాడమీల్లోని విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యనందిస్తోంది. ఐఐటీ, నీట్ వంటి వృత్తి విద్యపై మక్కువతో అకాడమీ కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ప్రయివేట్ కాలేజీల్లో ఇస్తున్న కోచింగ్ కంటే ఉన్నతమైన ప్రమాణాలతో శిక్షణనిస్తోంది. కరోనా నేపథ్యంలో ఇళ్లలోనే ఉన్న విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా రోజూ గురుకుల అధ్యాపకులు పాఠాలు చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు కొనివ్వడంతో విద్యార్థులందరూ ఆన్లైన్ తరగతులను అనుసరిస్తున్నారు. నిత్యం అధ్యాపకులతో మాట్లాడుతూ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. విద్యార్థులకు కావాల్సిన మెటీరియల్‌ను అధ్యాపకులు ఆన్లైన్లోనే పంపుతున్నారు. దూరదర్శన్, రేడియోతో పాటు పలు యాప్‌ల ద్వారా గురుకుల సొసైటీ కోచింగ్ ఇస్తోంది. 3 అకాడమీలు.. 1300 మంది విద్యార్థులు ► ప్రస్తుతం 3 చోట్ల ఐఐటీ అకాడమీలున్నాయి. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులోని ఐఐటీ అకాడమీలో 580 మంది, కర్నూలు జిల్లా చిన్న టేకూరు ఐఐటీలో 480, గుంటూరు జిల్లా గోరంట్ల గురుకుల ఐఐటీలో 250 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతూ ఐఐటీ, నీట్ కోచింగ్ తీసుకుంటున్నారు. ► స్కూలు భవనాల సామర్థ్యాన్ని బట్టి ప్రభుత్వం సీట్లు కేటాయిస్తోంది. కనీస సౌకర్యాల్లేకుండా ఎక్కువ మందిని చేర్చుకుంటే ఇబ్బందులుంటాయని మొదట్నుంచీ భావిస్తున్న గురుకుల సొసైటీ.. అవసరం మేరకే విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ► ఈ అకాడమీలను నిర్వహిస్తున్న కాలేజీలకు మెరికల్లాంటి విద్యార్థులను గురుకుల సొసైటీ ఎంపిక చేసుకుంటోంది. ఏటా ప్రత్యేక పరీక్ష నిర్వహించి అత్యంత ప్రతిభావంతులను తీసుకుంటోంది. మరో 5 అకాడమీల ఏర్పాటుకు ప్రతిపాదనలు గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా కొత్తగా మరో ఐదు ఐఐటీ అకాడమీల ఏర్పాటుకు గురుకుల సొసైటీ ప్రతిపాదనలు రూపొందించింది. విశాఖలో బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి, రాజమహేంద్రవరంలో బాలురకు, నెల్లూరు, తిరుపతిలో బాలికలకు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఐదు ఐఐటీల ద్వారా సుమారు 3,000 మందికి ఐఐటీ, నీట్‌లలో కోచింగ్ ఇవ్వాలని గురుకుల సొసైటీ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త ఐఐటీ అకాడమీలకు అనుమతొస్తే మరింత మందికి చాన్స్ ఇటీవల జరిగిన సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పాలక మండలి సమావేశంలో కొత్తగా ఐదు ఐఐటీ అకాడమీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అనుమతులు వస్తే మరింత మంది విద్యార్థులు సాంకేతిక విద్యను అభ్యసించేందుకు అవకాశం కలుగుతుంది. – కల్నల్ వి.రాములు, గురుకుల కార్యదర్శి -
ఐఐటీల్లో ఫస్ట్ సెమిస్టర్ ఆన్లైన్లోనే!
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఐఐటీల్లో అన్ని కోర్సులకు సంబంధించిన ప్రథమ సెమిస్టర్‌ను ఆన్లైన్లోనే నిర్వహించాలని ఆరు ఐఐటీల డైరెక్టర్లతో కూడిన సబ్ కమిటీ సిఫారసు చేసింది. ఒకవేళ విద్యార్థులు వద్దనుకుంటే వారికి ఒక సెమిస్టర్ లేదా విద్యా సంవత్సరం ఆగిపోయేలా అవకాశమివ్వాలని పేర్కొంది. కరోనా తర్వాత ఐఐటీల్లో విద్యా కార్యక్రమాలు, పరీక్షలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణపై అధ్యయనం చేసేందుకు ఐఐటీల కౌన్సిల్ స్టాడింగ్ కమిటీ ఏర్పాటు చేసిన ఈ సబ్ కమిటీ తమ నివేదికను అందజేసింది. దీనిపై త్వరలోనే ఐఐటీల కౌన్సిల్ స్టాడింగ్ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటివరకు రెండేళ్లున్న పీజీ కోర్సులను 18 నెలలకు కుదించాలని పేర్కొంది. దానిని 3 రెగ్యులర్ సెమిస్టర్లకు లేదా ఇప్పుడున్న సెమిస్టర్ల పనిదినాలను కుదించి 4 సెమిస్టర్లుగా నిర్వహించాలని వెల్లడించింది. ల్యాబ్ కార్యక్రమాలను అన్నింటిని ఇప్పుడు రద్దు చేసి, 2021 వేసవిలో రెండు, మూడు వారాల ఇంటెన్సివ్ ప్రోగ్రాం నిర్వహించాలని వివరించింది. ఇక పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు డిసెంబర్లో లేదా వచ్చే జనరిలోనే విద్యా కార్యక్రమాలను ప్రారంభించాలని పేర్కొంది. కేవలం పీహెచ్డీ విద్యార్థులకు మాత్రమే అదీ ఆన్లైన్ సదుపాయం లేని వారిని పరిమితంగా క్యాంపస్‌లకు అనుమతించాలని వెల్లడించింది. ఇక బీటెక్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో జేఈఈ షెడ్యూల్ ప్రకారం ప్రవేశాలు చేపట్టాలని పేర్కొంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ సెమిస్టర్లలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా బ్రాంచిని ఎంచుకునే అవకాశం కల్పించాలని తెలిపింది. 2019–20 విద్యా సంవత్సరపు రెండో సమిస్టర్ వారికి ఆన్లైన్లో పరీక్షలు ఇతరత్రా విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది. ఇతర కోర్సుల్లోనూ ఫస్ట్ సెమిస్టర్ ఆన్లైన్లోనే! ఐఐటీలే కాకుండా ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లోనూ ప్రవేశాలు, విద్యా కార్యక్రమాలు, పరీక్షలకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీ చేసిన మార్గదర్శకాలను మరోసారి పరిశీలించి తగిన సిఫారసులు చేయాలని బుధవారం యూజీసీకి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ ట్విట్టర్లో సూచించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమిచ్చేలా తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇటు దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌లో తరగతుల నిర్వహణ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని కోర్సులకు సంబంధించి ప్రథమ సెమిస్టర్‌ను ఆన్లైన్లోనే నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నివేదికలోని ప్రధాన అంశాలు.. యూజీ ప్రథమ సెమిస్టర్ విద్యా కార్యక్రమాలు ఆన్లైన్లోనే నిర్వహించాలి. ఆన్లైన్ క్విజ్లు, ఆన్లైన్ పరీక్షలు వైవాల ద్వారా మూల్యాంకనం చేయాలి. విద్యార్థులకు ఇష్టం లేకపోతే సెమిస్టర్, విద్యా సంవత్సరం ఆపేసుకోవచ్చు పీజీ ప్రవేశాలు ఇప్పుడు నిలిపేయాలి. ఆన్లైన్ సెలెక్షన్స్ ఉండవు. పీజీ అకడమిక్ ఇయర్ డిసెంబర్లో లేదా జనవరిలోనే ప్రారంభించాలి. రెండేళ్ల పీజీని 18 నెలలకు కుదించాలి. ఎంబీఏ, సంబంధిత ఇతర కోర్సుల ప్రథమ సెమిస్టర్ల బోధనను ఆన్లైన్లో చేపట్టాలి. బీటెక్, ఎంటెక్ ప్రాజెక్టులను థియరీ విధానంలో, ఆన్లైన్ ద్వారా చేపట్టాలి. అక్టోబర్‌లో పరిస్థితిని మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకోవాలి. -
ఐఐటీ, జేఈఈ, నీట్కి ప్రిపేరవుతున్నారా?
హైదరాబాద్ : ఐఐటీ, జేఈఈ, నీట్ లాంటి పరీక్షలకు సిద్ధమవుతున్నారా? మీ ఇంట్లోనే ఉండి అనుభవఙ్ఞులైన అధ్యాపకులచే లైవ్ క్లాసెస్ వినే అద్భుతమైన అవకాశాన్ని కల్పించడానికి వచ్చేసింది యుప్ మాస్టర్ యాప్. దీంట్లో 10-25 సంవత్సరాల అనుభవం ఉన్న లెక్చరర్స్ పాఠాలు బోధిస్తారు. ఈ లైవ్ స్ట్రీమింగ్ క్లాసెస్‌ను దేశంలోని మెట్రో సిటీ నుంచి మారుమూల ప్రాంతాల వరకు అందరికీ చేరువ చేసేందుకు సిద్ధమైంది ఈ యాప్ అది కూడా చాలా తక్కువ ధరకే ఈ లైవ్ స్ట్రీమింగ్ క్లాసులు మీ ఇంట్లోనే కూర్చొని వినొచ్చు. పాఠాలు బోధించడమే కాదు, లైవ్ చాటింగ్ ఫీచర్ ద్వారా విద్యార్థుల సందేహాలను కూడా నివృత్తి చేస్తారు. వందల కొద్దీ వీడియోలు, మాక్ టెస్టులతో మిమ్మల్ని పరీక్షలకు సంసిద్ధం చేస్తాం అంటున్నారు యాప్ నిర్వాహకులు. “యుప్ మాస్టర్‌ను లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దేశానికి సేవ చేసే అవకాశంగా దీన్ని భావిస్తున్నాను. పట్టణంలోనే ప్రతీ పల్లెలోనూ డోర్ డెలివరీలాగా క్లాసెస్‌ను విస్తరిస్తున్నాం. కొన్ని కారణాల వల్ల మంచి విద్యను పొందలేని విద్యార్థులకు ఈ యాప్ ద్వారా నాణ్యమైన బోధనను అందిస్తాం అని చెప్పటానికి గర్వంగా ఉంది. ప్రస్తుతానికి మా ఫోకస్ ఐఐటీ, జేఈఈ, నీట్ పైనే. కొన్ని రోజుల తర్వాత ప్రతీ విద్యార్థికి క్లాసెస్‌ను విస్తరిస్తాం” అని యాప్ సీఈవో ఉదయ్‌రెడ్డి తెలిపారు. అత్యుత్తమ ఫ్యాకల్టీ ద్వారా 45 రోజులపాటు ప్రతీరోజు నాలుగున్నర నుంచి ఆరు గంటలపాటు ఐఐటీ, జేఈఈ, నీట్ తరగతులను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా విద్యార్థులకు అందిస్తారు. లైవ్ క్లాసెస్ యాక్సెస్ కూడా యుప్ మాస్టర్ యాప్ నిర్వాహకులే కల్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే యాప్‌లో మీరూ మెంబర్ అయిపోండి. క్వాలిటీ క్లాసెస్‌ను వినండి. -
ఐఐటీల్లో రెండేళ్లలో 2461 డ్రాపవుట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అయిదు జాతీయ స్థాయి విద్యా సంస్థలకు శాశ్వత భవనాలు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం మొత్తం 3,562 కోట్ల రూపాయలు కేటాయించగా ఇప్పటి వరకు 1021 కోట్లు విడుదల చేసినట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ వెల్లడించారు. రాజ్య సభలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరచిన హామీలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌లోని తిరుపతిలో ఐఐటీ, తాడేపల్లి గూడెంలో ఎన్ఐటీ, కర్నూలులో ట్రిపుల్ ఐటీ, విశాఖపట్నంలో ఐఐఎం, తిరుపతిలో ఐఐఎస్ఈఆర్ సంస్థలను ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. ఈ అయిదు జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు కోసం మొత్తం 3,526 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు 1,688 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. మంజూరు చేసిన మొత్తంలో 1021 కోట్లు విడుదల చేయగా 776 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ అయిదు విద్యా సంస్థలతోపాటు అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీ, విజయనగరంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. అనంతపురంలోని సెంట్రల్ యూనివర్శిటీ తొలి దశ నిర్మాణం కోసం 450 కోట్లు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2018-19 సంవత్సరంలో 10 కోట్లు కేటాయించగా 8 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు. అలాగే విజయనగరంలో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ నిర్మాణం తొలి దశ కోసం 420 కోట్ల కేటాయింపుకు మంత్రివర్గం ఆమోదం తెలపగా అందులో 10 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇక తిరుపతిలోని ఐఐటీ శాశ్వత భవనాలు, ప్రాంగణం నిర్మాణం పనులు మార్చి 2020 నాటికి, తాడేపల్లిగూడెంలోని ఎన్ఐటీ క్యాంపస్ నిర్మాణ పనులు డిసెంబర్ 2020 నాటికి, కర్నూలులోని ట్రిపుల్ ఐటీ ఇప్పటికే శాశ్వత ప్రాంగణంలోకి మారగా విశాఖపట్నంలోని ఐఐఎం క్యాంపస్ నిర్మాణం జూన్ 2021 నాటికి, తిరుపతిలోని ఐఐఎస్ఈఆర్ నిర్మాణం డిసెంబర్ 20121 నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వివరించారు. ఐఐటీల్లో రెండేళ్ళలో 2461 డ్రాపవుట్లు దేశంలోని 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో గడచిన రెండేళ్ళ వ్యవధిలో మొత్తం 2461 మంది విద్యార్ధులు చదువును మధ్యలోనే ఆపేసి (డ్రాపవుట్) వెళ్ళిపోయారని మానవ వనరుల మంత్రి రాజ్యసభలో వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. అలాగే దేశంలోని 20 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)ల్లో రెండేళ్ళలో డ్రాపవుట్ల సంఖ్య 99 మాత్రమే అని చెప్పారు. ఐఐటీల్లో మొత్తం 2461 డ్రాపవుట్లలో 371 మంది షెడ్యూల్డు కులాలకు చెందిన విద్యార్ధులు, 199 మంది ఎస్టీలు, 601 మంది బీసీ విద్యార్ధులు ఉన్నారని మంత్రి తెలిపారు. డ్రాపవుట్లలో ఎక్కువ శాతం పోస్టు గ్రాడ్యుయేట్, పీహెచ్డీ విద్యార్ధులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇతర కాలేజీలు, ఇన్స్టిట్యూట్లకు మారడం, వ్యక్తిగత కారణాలు, విదేశాలలో ఉన్నత విద్యావకాశాలు లభించడం కారణాలు కావచ్చని మంత్రి తెలిపారు. ఇక అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో డ్రాపవుట్లకు కారణాలను విశ్లేషిస్తే తప్పుగా బ్రాంచ్‌ల ఎంపిక, అకడమిక్స్‌లో రాణించలేకపోవడం, వ్యక్తిగత, వైద్య సంబంధ కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయని అన్నారు. అకడమిక్స్‌లో వెనుకబడుతున్న విద్యార్ధులకు కౌన్సెలింగ్ చేయడానికి సలహాదారుల నియామకం, వారికి అదనంగా క్లాసులు నిర్వహించడం, వ్యక్తిగత, కుటుంబ సంబంధ సమస్యలకు కౌన్సిలింగ్, మానసికంగా ధృఢంగా తయారు చేయడానికి సైకలాజికల్ మోటివేషన్ కోసం ప్రతి ఐఐటీలో ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. అటవీ భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించాలి అడవుల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీలకు ఆ భూములపై హక్కులు కల్పించేలా అటవీ హక్కుల చట్టాన్ని సవరించాలని విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘గిరిజనులకు చారిత్రకంగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దే ఉద్దేశంతో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం అమలులోకి వచ్చి 13 ఏళ్ళు కావస్తున్నా దానిని సక్రమంగా అమలు చేయడంలో అనేక వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా అటవీ భూములపై గిరిజనుల న్యాయమైన హక్కులు తిరస్కరణకు గురవుతున్నాయి. అటవీ హక్కుల చట్టం స్పూర్తికి విరుద్దంగా సాగుతున్న ఈ చర్యలు తీవ్ర గర్హనీయం అన్నారు. తాము సాగు చేసుకుంటున్న అటవీ భూములపై హక్కులు కల్పించవలసిందిగా కోరుతూ ఆదివాసీలు, గిరిజనలు సమర్పించిన దరఖాస్తులను కుంటి సాకులు చెప్పి గ్రామ సభ, సబ్ డివిజినల్ కమిటీ, జిల్లా స్థాయి కమిటీలు తిరస్కరిస్తున్నాయి. ఆ విధంగా తిరస్కరణకు గురైన దరఖాస్తులు లక్షల సంఖ్యకు చేరుకోవడం శోచనీయం’ అని అన్నారు. ‘దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది ఆదివాసీలు ఉంటే అందులో 45 లక్షల మంది తాము సాగు చేస్తున్న అటవీ భూములపై హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో కేవలం 17 లక్షల దరఖాస్తులను మాత్రమే ఆమోదించగా మిగిలినవి తిరస్కరణకు గురయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తుల తిరస్కరణ అటవీ హక్కుల చట్టం ఉద్దేశాలనే నీరుగార్చేలా ఉంది. కొన్ని రాష్ట్రాలలో యధేచ్చగా అటవీ హక్కుల చట్టం ఉల్లంఘనలు జరిగినట్లుగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2015 జూలై 17న రాసిన లేఖలోనే స్పష్టం చేసింది. అటవీ భూములపై హక్కుల కోసం దరఖాస్తు చేసే గిరిజనలు, ఆదివాసీలు తాము గడచిన 75 ఏళ్ళుగా లేదా మూడు తరాలుగా అడవుల్లోనే నివసిస్తున్నట్లు రుజువు సమర్పిస్తే సరిపోతుంది. అంతేగానీ ఆ భూములను సాగు చేస్తున్నట్లుగా రుజువు సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ అటవీ శాఖాధికారులు మాత్రం భూములు సాగు చేస్తున్నట్లుగా రుజువులు సమర్పించాలని పట్టుబడుతూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. అటవీ భూములపై హక్కులు పొందలేకపోయిన ఆదివాసీలు, గిరిజనులను అడవుల నుంచి ఖాళీ చేయించాలని గత ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతే లక్షలాది గిరిజనుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. సుప్రీం కోర్టు ఆదేశాలపై స్టే విధించినప్పటికీ గిరిజనుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించడం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి తిరస్కరణకు గురైన గిరిజనుల హక్కులను పరిరక్షించేలా చట్ట సవరణ చేయాలని’ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
వి‘జేఈఈ’భవ!
సాక్షి, హైదరాబాద్ : ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఈనెల 20న నిర్వహించేందుకు ఐఐటీ కాన్పూర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాలని పేర్కొంది. అభ్యర్థులు ఉదయం 7:30 గంటలకే పరీక్ష హాల్లోకి చేరుకోవాలని సూచించింది. నిర్ణీత సమయం తర్వా త నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు 2,31,024 మందికి అర్హత కల్పిస్తే.. 1,64,822 మందే పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి దాదాపు 18 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు అంచనా. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్‌లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఇవి తీసుకెళ్లవద్దు.. బ్రాస్లెట్, ఇయర్ రింగ్స్, నోస్ పిన్, చైన్, నెక్లెస్ వంటి ఆభరణాలు, హెయిర్‌పిన్, హెయిర్ బ్యాండ్ వంటివి ధరించకూడదు. పర్సులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, హ్యాండ్ బ్యాగులు, వాచీలు, క్యాలికులేటర్, అద్దాలు, సెల్ఫోన్లు తీసుకెళ్లకూడదు. విద్యార్థులు పాటించాల్సినవి.. విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ జిరాక్స్, ఫొటో, ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్, కాలేజీ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్టు, పాన్‌కార్డు) వెంట తెచ్చుకోవాలి. ఉదయం 7:30 నుంచే పరీక్షా కేంద్రంలో రిపోర్టు చేయాలి. పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లాక బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్/వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ తర్వాత 7:45 గంటలకు పేపర్–1 పరీక్షకు, మధ్యాహ్నం 12:45 గంటలకు పేపర్–2 పరీక్ష కోసం విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. తొలుత కంప్యూటర్ స్క్రీన్‌పై పేరు, ఫొటో, రోల్‌నంబర్ కనిపిస్తుంది. అభ్యర్థులు లాగిన్ అయ్యాక ముందుగా సూచనలు చదువుకోవాలి జోన్ల వారీగా అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే విద్యార్థులు జోన్ విద్యార్థుల సంఖ్య ఐఐటీ బాంబే 28,813 ఐఐటీ ఢిల్లీ 31,884 ఐఐటీ గౌహతి 11,907 ఐఐటీ కాన్పూర్ 20,428 ఐఐటీ ఖరగ్‌పూర్ 19,145 ఐఐటీ మద్రాసు 38,231 ఐఐటీ రూర్కీ 14,414 మొత్తం 1,64,822 -
విచిత్ర చదువులు... వింతైన పరీక్షలు
ఏ విద్యా సంస్థలోనైనా విద్యార్థులకు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రభుత్వం విడుదల చేసిన మెటీరియల్, పుస్తకాలను పరిశీలించి అవసరమయితే వాటిపై శిక్షణ తీసుకుని పిల్లలకు బోధించాకే కదా... కానీ పుస్తకాలు, మెటీరియల్ పాఠశాలలకు ఇవ్వకుండానే బొబ్బిలిలోని పురపాలక పాఠశాలల్లో ఐఐటీ కోర్సులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ర్యాంకులు ఇస్తున్నారు. వీటిని రాష్ట్ర స్థాయిలో అప్లోడ్ చేస్తున్నారు. అసలు ఈ ర్యాంకులేమిటో... ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో... విద్యార్థులకే తెలియడం లేదు. ఇదీ మునిసిపాలిటీల్లో అనుసరిస్తున్న విద్యా విధానం. బొబ్బిలి: పురపాలక సంఘాల పరిధిలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఐఐటీ ఫౌండేషన్ కోర్సులు ఇటీవల ప్రారంభించారు. ఈ కోర్సులకు సంబంధించిన మెటీరియల్ అందకపోయినా పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం రెండో స్పెల్‌లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సుకు సంబంధించి పరీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులకు పరీక్షలు జరుగుతున్నాయి. మునిసిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం ఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా పాఠశాలల్లో విద్యార్థులను ఉన్నత ప్రయోజకుల్ని చేస్తామని ఐఐటీ ఫౌండేషన్ కోర్సులను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రతీ పాఠశాలలోనూ సాధారణ తరగతులు ప్రారంభించే గంట ముందు, ముగిసిన తరువాత ఓ గంట పాటు శిక్షణ పొందేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఈ ఐఐటీ కోర్సుల్లో చేర్పించింది. జిల్లాలో 1688మంది ఎంపిక జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 1688 మంది విద్యార్థులను ఐఐటీ కోర్సుల్లో చేర్పించారు. పార్వతీపురంలోని మూడు పాఠశాలలకు చెందిన 405 మంది, బొబ్బిలిలో రెండు పాఠశాలలకు చెందిన 317, సాలూరులోని రెండు పాఠశాలలకు చెందిన 423, విజయనరంలో మూడు పాఠశాలలకు చెందిన 543 మంది విద్యార్థులు ఈ కోర్సులో చేరారు. వీరికి రోజూ ఉదయం 8.30 గంటల నుంచి, 9.30 వరకూ సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటల వరకూ బిట్లు ప్రాక్టీసు చేయడం, అడ్వాన్స్డ్ కోర్సులను చెప్పడం, కెరీర్ ఫౌండేషన్ సిలబస్‌ను అవలోకనం చేయడం వంటివి చేయాలి. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు 10 నుంచి 20 మంది బోధకులను ఎంపిక చేసి వారికి గంటకు రూ. 250ల చొప్పున చెల్లించి ఉన్నత ప్రమాణాలు బోధించాల్సి ఉంది. దీనికి సంబంధించి విడతల వారీగా మెటీరియల్, పుస్తకాలు ఇవ్వాలి. కానీ బొబ్బిలిలోని రెండు పురపాలక పాఠశాలల్లోనూ ఈ మెటీరియల్ ఇవ్వలేదు. పరీక్షలు మాత్రం నిర్వహించేశారు. గురువారం సాయంత్రం రెల్లివీధిలోని పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాల, గొల్లపల్లిలోని వేణుగోపాల ఉన్నత పాఠశాలల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్టు కో–ఆర్డినేటర్, హెచ్ఎంలు స్వయంగా విలేకర్లకు తెలిపారు. ఇవీ కారణాలు... పాఠశాలలకు మెటీరియల్, పుస్తకాలు ఇవ్వకుండా పరీక్షలు నిర్వహించడానికి కారణం ఏమిటని ఆరా తీస్తే మున్సిపల్ చైర్పర్సన్ అందుబాటులో లేరని కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాసరావు తెలిపారు. అలాగే తాను కూడా గుంటూరులో జరిగిన సమావేశానికి వెళ్లాల్సి వచ్చిందని, శుక్రవారం లేదా శనివారం పుస్తకాలను ఆయా పాఠశాలలకు ఇచ్చేస్తామని చెప్పుకొచ్చారు. జూలైలో ప్రారంభించిన ఈ శిక్షణకు సంబంధించి ఇప్పటికి రెండు స్పెల్స్‌లో పుస్తకాలు రావాల్సి ఉండగా ప్రారంభంలో ఒక స్పెల్ పుస్తకాలు ఇచ్చారు. ఇప్పుడు రెండో స్పెల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి మూడో స్పెల్ కూడా తరగతులు ప్రారంభమయ్యే సమయం వచ్చేసిందని స్థానికులు చెబుతున్నారు. -
ఐఐటీల్లో ప్రొఫెసర్ల కొరత: విజయ సాయిరెడ్డి
ఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని ఐఐటీలను బలోపేతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి కోరారు. ఆయన మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ .. ఐఐటీల్లో కాంట్రాక్ట్ పద్దతిలో కాకుండా శాశ్వత పద్ధతిలో నియామకాలు చేపట్టాలన్నారు. ఒక్కో ఐఐటీకి ఒక డైరెక్టర్ నియమించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఐఐటీకి రూ. 1,750 కోట్లు అవసరమైతే ఇప్పటివరకూ కేవలం రూ. 60 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఆయన అన్నారు. ప్రస్తుతం తిరుపతి ఐఐటీలో నాలుగు కోర్సులు మాత్రమే ఉన్నాయని విజయ సాయిరెడ్డి అన్నారు. కోర్సులు, విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. తిరుపతి ఐఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ ప్రోగ్రామ్‌లను కూడా ప్రారంభించాలని ఆయన కోరారు. -
'ఐఐటీల్లో ప్రొఫెసర్ల కొరత'