ఐఐటీల్లో ప్రొఫెసర్ల కొరత: విజయ సాయిరెడ్డి
ఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని ఐఐటీలను బలోపేతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి కోరారు. ఆయన మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ .. ఐఐటీల్లో కాంట్రాక్ట్ పద్దతిలో కాకుండా శాశ్వత పద్ధతిలో నియామకాలు చేపట్టాలన్నారు. ఒక్కో ఐఐటీకి ఒక డైరెక్టర్ నియమించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఐఐటీకి రూ. 1,750 కోట్లు అవసరమైతే ఇప్పటివరకూ కేవలం రూ. 60 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఆయన అన్నారు.
ప్రస్తుతం తిరుపతి ఐఐటీలో నాలుగు కోర్సులు మాత్రమే ఉన్నాయని విజయ సాయిరెడ్డి అన్నారు. కోర్సులు, విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. తిరుపతి ఐఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ ప్రోగ్రామ్లను కూడా ప్రారంభించాలని ఆయన కోరారు.