జయాన్ని ఖాయం చేసుకోవాలంటే.. | JEE MAIN - 2015 | Sakshi
Sakshi News home page

జయాన్ని ఖాయం చేసుకోవాలంటే..

Published Thu, Nov 13 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

జయాన్ని ఖాయం  చేసుకోవాలంటే..

జయాన్ని ఖాయం చేసుకోవాలంటే..

JEE MAIN - 2015

 
సాంకేతిక విద్య.. నేటి ఆధునిక ప్రపంచంలో సమున్నత కెరీర్ దిశగా  వెళ్లేందుకు సరైన దారి! అందుకే ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్  చేసి, కెరీర్‌ను అత్యున్నతంగా  తీర్చిదిద్దుకోవాలని ఇంటర్ ఎంపీసీ  విద్యార్థులు కలలుగంటారు. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు ఉత్తమ మార్గం  జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్  (జేఈఈ).. ఇది నిట్‌లు, ట్రిపుల్ ఐటీలు,  కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర
 సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు  వీలుకల్పించే పరీక్ష. అంతేకాదు..  ఐఐటీల్లో సీటు కోసం పోటీపడాల్సిన  జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత  సాధించాలంటే జేఈఈ మెయిన్‌లో  మెరుగైన మార్కులు సంపాదించాల్సిందే! తాజాగా జేఈఈ మెయిన్- 2015కు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో విజయ శిఖరాన్ని  అందుకునేందుకు సీనియర్ ఫ్యాకల్టీ  ఎం.ఎన్.రావు అందిస్తున్న సూచనలు...
 
మ్యాథమెటిక్స్
 
మ్యాథమెటికల్ రీజనింగ్; వేరియన్స్, మీన్ డీవియేషన్; స్టాండర్డ్ డీవియేషన్‌లో ఆరోహణ, అవరోహణ క్రమం చాలా ముఖ్యమైనవి. మీన్ వాల్యూ థీరమ్; సెట్స్ అండ్ రిలేషన్స్; 3డీ లైన్స్-ప్లేన్స్; వెక్టార్స్ ఆల్జీబ్రా; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; మ్యాట్రిసెస్; ప్రమేయాల్లో రేంజ్, డొమైన్; డెఫినెట్ ఇంటెగ్రల్స్; కంటిన్యుటీ; డిఫరెన్షిబిలిటీ; మాక్సిమ-మినిమ అంశాలపై దృష్టి సారించాలి. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే కాన్సెప్టులపై పట్టు సాధించాలి.
 
ఫిజిక్స్

గత పరీక్షల సరళిని ప్రశ్నిస్తే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీలతో పోలిస్తే ఫిజిక్స్ ప్రశ్నలు క్లిష్టంగా ఉంటున్నాయి. అయితే కాన్సెప్టులను అర్థం చేసుకుని, వాటికి సంబంధించిన ప్రశ్నలు, అనువర్తనాలు, సమస్యల్ని సాధిస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. కరెంట్ ఎలక్ట్రిసిటీలో రెసిస్టెన్స్; ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్‌లో సెల్ఫ్ ఇండక్షన్, మ్యాగ్నటిక్ ఫీల్డ్ ముఖ్యమైనవి. మోడర్న్ ఫిజిక్స్‌లో బైండింగ్ ఎనర్జీ, లాజిక్ గేట్స్, హాఫ్ లైఫ్ టైమ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. హీట్, థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్ అంశాలు కూడా ముఖ్యమైనవి.
 
 కెమిస్ట్రీ
 
గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నల ఆధారంగా చూస్తే కెమికల్ కైనటిక్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, సొల్యూషన్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అంశాలు ముఖ్యమైనవని తెలుస్తోంది. అభ్యర్థులు వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి చాప్టర్ల వారీగా రియాక్షన్స్‌ను నోట్ చేసుకోవాలి. ప్రతి రియాక్షన్‌కు సంబంధించి దాని విశ్లేషణ, వ్యవస్థ, ఉత్పత్తులు, కావల్సిన నిబంధలను ఒక క్రమ పద్ధతిలో రాసుకోవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, రిడాక్స్ రియాక్షన్స్, గ్రూప్స్, ప్రాక్టికల్ కెమిస్ట్రీ అంశాలపై పట్టుతో మంచి ఫలితాలు సాధించవచ్చు.
 
 
మ్యాథమెటిక్స్


http://img.sakshi.net/images/cms/2014-11/41415818828_Unknown.jpg
 
 
ఫిజిక్స్

http://img.sakshi.net/images/cms/2014-11/41415818893_Unknown.jpg

 
కెమిస్ట్రీ

http://img.sakshi.net/images/cms/2014-11/81415818953_Unknown.jpg
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement