జేఈఈ ప్రవేశాల రివైజ్డ్ షెడ్యూల్ జారీ
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాలకు చేపడుతున్న కౌన్సెలింగ్‌కు సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్‌ను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) బుధవారం ప్రకటించింది. ముందస్తు షెడ్యూలు ప్రకారం ఈ నెల 19 నాటికి ఏడు దశల కౌన్సెలింగ్ పూర్తి కావాల్సి ఉండగా, కోర్టు కేసు కారణంగా ఆలస్యమైంది. దీంతో ఈ నెల 22 వరకు కౌన్సెలింగ్ నిర్వహించేలా రివైజ్డ్ షెడ్యూల్‌ను జారీ చేసింది. సోమవారమే మూడో దశ సీట్లను కేటాయించింది.
ఇదీ రివైజ్డ్ షెడ్యూలు..
2017 జూలై 13న మధ్యాహ్నం ఒంటి గంట వరకు సీటు యాక్సె ప్టెన్స్/విత్‌డ్రా, సాయంత్రం 5 గంటలకు భర్తీ అయిన సీట్లు/ఖాళీల ప్రకటన, రాత్రి 8 గంటలకు నాలుగో దశ సీట్లు కేటాయింపు
జూలై 14, 15 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు సీటు యాక్సెప్టెన్స్/విత్‌డ్రా
జూలై 16న ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు/ ఖాళీల ప్రకటన, సాయంత్రం 5 గంటలకు ఐదో దశ సీట్లు కేటాయింపు.
జూలై 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీటు యాక్సెప్టెన్స్/విత్‌డ్రా
జూలై 18న ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు / ఖాళీల ప్రకటన, సాయంత్రం 5 గంటలకు ఆరో దశ సీట్లు కేటాయింపు
జూలై 19, 20 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీటు యాక్సెప్టెన్స్, రిపోర్టింగ్ కేంద్రాల్లో విద్యార్థులు రిపోర్టు చేయడం. సీటు విత్‌డ్రాకు ఇదే చివరి అవకాశం.
జూలై 21న ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు / ఖాళీల ప్రకటన, సాయంత్రం 5 గంటలకు ఏడో దశ సీట్లు కేటాయింపు.
జూలై 22న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల
వరకు రిపోర్టింగ్ కేంద్రాలకు వెళ్లి సీటు యాక్సెప్టెన్స్, రిపోర్టింగ్
(విత్‌డ్రా ఉండదు).