సాక్షి, న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్‌డ్–2020 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 2.50 లక్షల మంది అర్హత సాధించినా 1.60 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షలు నిర్వహించారు. రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరైనట్టు నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా 222 పట్టణాల్లో 1000 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
తెలంగాణలో 15 పట్టణాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో 30 చోట్ల ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాట చేశారు. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మాస్క్, శానిటైర్ ఉన్నవిద్యార్థులనే నిర్వాహకులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారని తెలిసిందే. ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే ఈ పరీక్షల్లో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. వచ్చే నెల 5న ఫలితాలు విడుదల కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment