ఢిల్లీ వారి అల్లరి ముద్దు బిడ్డ | Mamata Banerjee Says Main Hoon Na To JEE Students | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వారి అల్లరి ముద్దు బిడ్డ

Published Thu, Sep 3 2020 9:15 AM | Last Updated on Thu, Sep 3 2020 9:17 AM

Mamata Banerjee Says Main Hoon Na To JEE Students - Sakshi

పోస్టర్‌పై మమతా బెనర్జీ

తొమ్మిదేళ్లుగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు మమతా బెనర్జీ. ఏడాదిగా పశ్చిమ బెంగాల్‌ గవర్నరుగా ఉన్నారు జగదీప్‌ ధన్‌ఖర్‌. నాలుగేళ్లు పెద్ద ఆమె కన్నా ఆయన. మమతకు 65. ఆయనకు 69. అయితే మనిషిలో ఆ పెద్దరికం లేదు! ప్రజాదరణ ఉన్న ఆ నాయకురాలికి అధికార పార్టీ ఆదరణ ఉన్న ఈ నాయకుడు ఏడాది కాలంగా అడ్డుపడుతూనే ఉన్నాడు. అడ్డు పడుతున్నందుకు పెద్దరికం లేదనడం కాదు. పదవికి ఉండే పెద్దరికం.. దాన్ని నిలుపుకోవాలి కదా? అది లేదు! సీఎంని వెక్కిరిస్తాడు. వెటకరిస్తాడు. ఆమె తుమ్మితే ఈయన ‘హాచ్చ్‌’ మని ఇమిటేట్‌ చేస్తాడు.  ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్న ఢిల్లీ వారి అల్లరి ముద్దు బిడ్డ అయిపోయాడు.

మమతను ఆయన చికాకు పెట్టడం ఎలా ఉంటుందో చూడండి. తృణమూల్‌ పార్టీ వాళ్లు నిన్న ఒక పోస్టర్‌ విడుదల చేశారు. అందులో మమతా బెనర్జీ ‘నీట్‌’, జేఈఈ విద్యార్థులకు ‘మై హూ నా’ (నేనున్నాను) అని అభయం ఇస్తుంటారు. పరీక్షలను వాయిదా వేయిస్తానని ఆ భరోసా. వెంటనే గవర్నర్‌ అందుకున్నాడు. ఆ పోస్టర్‌ ని ట్యాగ్‌ చేస్తూ ‘మై భీ హూ నా’ (నేను కూడా ఉన్నాను) అని రీట్వీట్‌ చేశాడు! దేనికి అతడు ఉన్నది అంటే.. పరీక్షల్ని జరిపించడానికి!! గవర్నర్‌ మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి మాట్లాడకుండా ఉండకూడదు. మమత మాత్రమే తన పని తను చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement