ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరలో ఢిల్లీ పర్యటించనున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభ కానున్న నేపథ్యంలో మమతా హస్తిన పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తన పర్యటనలలో భాగంగా అపాంట్‌మెంట్ దొరికితే.. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌కొవింద్‌ను కలుస్తానని పేరొన్నారు. అదే విధంగా ఆమె కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీతో భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
‘రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లలేదు. ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితి నియంత్రణలోకి వస్తోంది. పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి, పలువురు నేతలను కాలవనున్నాను’ అని మమతా బెనర్జీ గురువారం పేరొన్నారు. మమత ఢిల్లీ పర్యటన నేపథ్యంలో 2024లో బీజేపీని ఎదుర్కొవడానికి పలు ప్రతిపక్ష పార్టీలతో కూడిన సంకీర్ణ కూటమీలో ఆమె భాగస్వామ్యం కానున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక మమతాబెనర్జీ జూలై 25న ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వార్షాకాల పార్లమెంట్ సమావేశాలు జూలై 19 నుంచి ఆగస్టు13 వరకు జరుగుతాయి. ఇటీవల బీజేపీ వ్యకతిరేక కూటమికి చెందిన పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఎన్సీపీ నేత శరద్ పవర్ నివాసంలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక, ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. శరద్ పవార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలలో వరుసగా భేటీ అవుతున్న నేపథ్యంలో మమత పర్యటనపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment