నీట్‌ మినహా అన్నీ ఆన్‌లైన్‌లో | NAtional Testing Agency Gave Statement That Except NEET All Exams Are Are Online Mode Only | Sakshi
Sakshi News home page

నీట్‌ మినహా అన్నీ ఆన్‌లైన్‌లో

Published Sat, Aug 24 2019 1:52 AM | Last Updated on Sat, Aug 24 2019 1:52 AM

NAtional Testing Agency Gave Statement That Except  NEET All Exams Are Are Online Mode Only - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జాతీయ స్థాయి సంస్థల్లోని సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం 13 రకాల పోటీ పరీక్షల షెడ్యూలును నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జారీ చేసింది. 2020–21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్, నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (నీట్‌), యూజీసీ నెట్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) ఎంబీఏ అడ్మిషన్‌ టెస్టు, సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్, కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌), గ్రాడ్యు యేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్టు (జీప్యాట్‌), ఆలిండియా ఆయుష్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ వర్సిటీ ఎంబీఏ, బీఎడ్‌ అడ్మిషన్‌ టెస్టు, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐకార్‌), జేఎన్‌యూ ఎంట్రెన్స్‌ టెస్టు, ఢిల్లీ వర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్టు నిర్వహణకు షెడ్యూలు విడుదల చేసింది. వీటిల్లో జేఈఈ, యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ వంటి పరీక్షలను ఏటా రెండుసార్లు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించింది. నీట్‌ మినహా మిగతా పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని పేర్కొంది. విద్యార్థులు ఆన్‌లైన్‌ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో 4 వేల ప్రాక్టీస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్‌టీఏ వివరించింది. ఇవి సెప్టెంబర్‌ 1 నుంచి పని చేస్తాయని, ప్రతి శనివారం, ఆదివారం వీటిని వినియోగించుకోవచ్చని వెల్లడించింది.

పరీక్షల షెడ్యూలు వివరాలు.. 
జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్ష
రిజిస్ట్రేషన్‌ తేదీలు: సెప్టెంబర్‌ 2 నుంచి 30 వరకు 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: డిసెంబర్‌ 6 నుంచి  
పరీక్షల తేదీలు:2020 జనవరి 6 నుంచి 11 వరకు 
ఫలితాల వెల్లడి: జనవరి 31 

జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్ష
రిజిస్ట్రేషన్‌ తేదీలు: 2020 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ : మార్చి 16 నుంచి 
పరీక్షల తేదీలు : ఏప్రిల్‌ 3 నుంచి 9 వరకు 
ఫలితాల వెల్లడి : ఏప్రిల్‌ 30 

నీట్‌ పరీక్షలు.. 
రిజిస్ట్రేషన్‌ తేదీలు : డిసెంబర్‌ 2 నుంచి 31 వరకు 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ : 2020 మార్చి 27 నుంచి 
పరీక్ష తేదీ: మే 3 
ఫలితాల వెల్లడి: జూన్‌ 4 

ఐఐఎఫ్‌టీ ఎంబీఏ అడ్మిషన్‌ టెస్టు 
రిజిస్ట్రేషన్‌ తేదీలు : సెప్టెంబర్‌ 9 నుంచి అక్టోబర్‌ 25 వరకు 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ : నవంబర్‌ 11 నుంచి 
పరీక్ష తేదీ : డిసెంబర్‌ 1 
ఫలితాల వెల్లడి : డిసెంబర్‌ 11 

యూజీసీ నెట్‌ మొదటి విడత పరీక్ష 
రిజిస్ట్రేషన్‌ తేదీలు : సెప్టెంబర్‌ 9 నుంచి అక్టోబర్‌ 9 వరకు 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ : నవంబర్‌ 9 నుంచి 
పరీక్షల తేదీలు : డిసెంబర్‌ 2నుంచి 6 వరకు 
ఫలితాల వెల్లడి : డిసెంబర్‌ 31 

యూజీసీ నెట్‌ రెండో విడత పరీక్ష 
రిజిస్ట్రేషన్‌ తేదీలు :2020 మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 16 వరకు 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ : మే 15 నుంచి 
పరీక్షల తేదీలు : జూన్‌ 15 నుంచి 20 వరకు 
ఫలితాల వెల్లడి : జూలై 5 

సీఎస్‌ఐఆర్‌ మొదటి విడత పరీక్ష
రిజిస్ట్రేషన్‌ తేదీలు : సెప్టెంబర్‌ 9 నుంచి అక్టోబర్‌ 9 వరకు 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ : నవంబర్‌ 9 నుంచి 
పరీక్ష తేదీ : డిసెంబర్‌ 15 
ఫలితాల వెల్లడి : డిసెంబర్‌ 31 

సీఎస్‌ఐఆర్‌ రెండో విడత పరీక్ష
రిజిస్ట్రేషన్‌ తేదీలు : 2020 మార్చి 16 నుంచి ఏప్రిల్‌15 వరకు 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ : మే 15 నుంచి 
పరీక్ష తేదీ: జూన్‌ 21 
ఫలితాల వెల్లడి : జూలై 5 

సీమ్యాట్, జీప్యాట్‌ 
రిజిస్ట్రేషన్‌ తేదీలు : నవంబర్‌ 1 నుంచి 30 వరకు 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ : డిసెంబర్‌ 24 నుంచి 
పరీక్ష తేదీ : 2020 జనవరి 24 
ఫలితాల వెల్లడి : ఫిబ్రవరి 3 

ఆలిండియా ఆయుష్‌ పీజీ ఎంట్రన్స్‌ టెస్టు 
రిజిస్ట్రేషన్‌ తేదీలు : 2020 జనవరి 1 నుంచి 31 వరకు 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ : ఏప్రిల్‌ 1 నుంచి 
పరీక్ష తేదీ : ఏప్రిల్‌ 29 
ఫలితాల వెల్లడి : మే 10 

నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌సీహెచ్‌ఎం) 
రిజిస్ట్రేషన్‌ తేదీలు : 2020 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 29 వరకు. 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ : ఏప్రిల్‌ 1నుంచి  
పరీక్ష తేదీ : ఏప్రిల్‌ 25 
ఫలితాల వెల్లడి : మే 10 

ఇగ్నో ఎంబీఏ, బీఎడ్‌ అడ్మిషన్‌ టెస్టు 
రిజిస్ట్రేషన్‌ తేదీలు : 2020 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 29 వరకు 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ : ఏప్రిల్‌ 1 నుంచి 
పరీక్ష తేదీ : ఏప్రిల్‌ 29 
ఫలితాల వెల్లడి : మే 10 

జేఎన్‌యూ ఎంట్రన్స్‌ టెస్టు 
రిజిస్ట్రేషన్‌ తేదీలు : 2020 మార్చి 2 నుంచి 31 వరకు 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ : ఏప్రిల్‌ 21 నుంచి 
పరీక్షల తేదీలు : మే 11 నుంచి 14 వరకు 
ఫలితాల వెల్లడి : మే 31 


ఐకార్‌ ఏఐఈఈఏ 
రిజిస్ట్రేషన్‌ తేదీలు : 2020 మార్చి 1 నుంచి 31 వరకు 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ : ఏప్రిల్‌ 25 నుంచి 
పరీక్ష తేదీ: జున్‌ 1 
ఫలితాల వెల్లడి : జూన్‌ 15 

ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు 
రిజిస్ట్రేషన్‌ తేదీలు : 2020 మార్చి 2 నుంచి 31 వరకు 
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ : ఏప్రిల్‌ 30 నుంచి  
పరీక్షల తేదీలు : జూన్‌ 2 నుంచి 9 వరకు 
ఫలితాల వెల్లడి : జూన్‌ 25  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement