GMAT
-
జీ మ్యాట్ ఆన్లైన్ పరీక్షలో మరో విభాగం
న్యూఢిల్లీ: గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్) ఆన్లైన్ పరీక్షా విధానంలో గతంలో తొలగించిన అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్(ఏడబ్ల్యూఏ) విభాగాన్ని తిరిగి చేర్చారు. పరీక్షార్థులకు అదనపు సౌలభ్యాన్ని అందించడంతోపాటు, వాస్తవ పరీక్షా కేంద్రం అనుభూతినిచ్చేందుకు చేపట్టిన పలు చర్యల్లో ఇది కూడా ఒకటని జీమ్యాట్‌ను నిర్వహించే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్(జీమ్యాక్) తెలిపింది. వేగంగా మారుతున్న మార్కెటింగ్ అవసరాలకు అనుగుణంగా ఏడబ్ల్యూఏ వంటి జీమ్యాట్లోని కొన్ని అంశాలను ప్రారంభ ఆన్లైన్ పరీక్షలో తొలగించినట్లు జీమ్యాక్ అధికారులు తెలిపారు. కోవిడ్–19 మహమ్మారి కారణంగా జీమ్యాట్‌ను ఆన్లైన్ ద్వారా జీమ్యాక్ చేపడుతోంది. ఇప్పటి వరకు 150 దేశాలు, ప్రాంతాల్లో 45 వేలకుపైగా పరీక్షలు చేపట్టినట్లు జీమ్యాక్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,300 బిజినెస్ స్కూళ్లలో ప్రవేశాలకు జీమ్యాట్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎంబీఏ ప్రవేశాలు ప్రతి పదింటిలో తొమ్మిదింటికి జీమ్యాట్ స్కోరే ఆధారం. జీమ్యాక్ అనే లాభాపేక్ష లేని సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 223 గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూళ్లున్నాయి. చదవండి: పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే! ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు? -
నీట్ మినహా అన్నీ ఆన్లైన్లో
సాక్షి, హైదరాబాద్ : జాతీయ స్థాయి సంస్థల్లోని సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం 13 రకాల పోటీ పరీక్షల షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జారీ చేసింది. 2020–21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్), యూజీసీ నెట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఎంబీఏ అడ్మిషన్ టెస్టు, సీఎస్ఐఆర్ యూజీసీ నెట్, కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్), గ్రాడ్యు యేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్టు (జీప్యాట్), ఆలిండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్టు, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ ఎంబీఏ, బీఎడ్ అడ్మిషన్ టెస్టు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్), జేఎన్‌యూ ఎంట్రెన్స్ టెస్టు, ఢిల్లీ వర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు నిర్వహణకు షెడ్యూలు విడుదల చేసింది. వీటిల్లో జేఈఈ, యూజీసీ నెట్, సీఎస్ఐఆర్–యూజీసీ నెట్ వంటి పరీక్షలను ఏటా రెండుసార్లు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించింది. నీట్ మినహా మిగతా పరీక్షలన్నింటినీ ఆన్లైన్లో నిర్వహిస్తామని పేర్కొంది. విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో 4 వేల ప్రాక్టీస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ వివరించింది. ఇవి సెప్టెంబర్ 1 నుంచి పని చేస్తాయని, ప్రతి శనివారం, ఆదివారం వీటిని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. పరీక్షల షెడ్యూలు వివరాలు.. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు: సెప్టెంబర్ 2 నుంచి 30 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్: డిసెంబర్ 6 నుంచి పరీక్షల తేదీలు:2020 జనవరి 6 నుంచి 11 వరకు ఫలితాల వెల్లడి: జనవరి 31 జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు: 2020 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : మార్చి 16 నుంచి పరీక్షల తేదీలు : ఏప్రిల్ 3 నుంచి 9 వరకు ఫలితాల వెల్లడి : ఏప్రిల్ 30 నీట్ పరీక్షలు.. రిజిస్ట్రేషన్ తేదీలు : డిసెంబర్ 2 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : 2020 మార్చి 27 నుంచి పరీక్ష తేదీ: మే 3 ఫలితాల వెల్లడి: జూన్ 4 ఐఐఎఫ్‌టీ ఎంబీఏ అడ్మిషన్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 25 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : నవంబర్ 11 నుంచి పరీక్ష తేదీ : డిసెంబర్ 1 ఫలితాల వెల్లడి : డిసెంబర్ 11 యూజీసీ నెట్ మొదటి విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు : సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : నవంబర్ 9 నుంచి పరీక్షల తేదీలు : డిసెంబర్ 2నుంచి 6 వరకు ఫలితాల వెల్లడి : డిసెంబర్ 31 యూజీసీ నెట్ రెండో విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు :2020 మార్చి 16 నుంచి ఏప్రిల్ 16 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : మే 15 నుంచి పరీక్షల తేదీలు : జూన్ 15 నుంచి 20 వరకు ఫలితాల వెల్లడి : జూలై 5 సీఎస్ఐఆర్ మొదటి విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు : సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : నవంబర్ 9 నుంచి పరీక్ష తేదీ : డిసెంబర్ 15 ఫలితాల వెల్లడి : డిసెంబర్ 31 సీఎస్ఐఆర్ రెండో విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 మార్చి 16 నుంచి ఏప్రిల్15 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : మే 15 నుంచి పరీక్ష తేదీ: జూన్ 21 ఫలితాల వెల్లడి : జూలై 5 సీమ్యాట్, జీప్యాట్ రిజిస్ట్రేషన్ తేదీలు : నవంబర్ 1 నుంచి 30 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : డిసెంబర్ 24 నుంచి పరీక్ష తేదీ : 2020 జనవరి 24 ఫలితాల వెల్లడి : ఫిబ్రవరి 3 ఆలిండియా ఆయుష్ పీజీ ఎంట్రన్స్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 జనవరి 1 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 1 నుంచి పరీక్ష తేదీ : ఏప్రిల్ 29 ఫలితాల వెల్లడి : మే 10 నేషనల్ కౌన్సిల్ ఫర్హోటల్ మేనేజ్మెంట్ (ఎన్సీహెచ్ఎం) రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 29 వరకు. హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 1నుంచి పరీక్ష తేదీ : ఏప్రిల్ 25 ఫలితాల వెల్లడి : మే 10 ఇగ్నో ఎంబీఏ, బీఎడ్ అడ్మిషన్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 29 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 1 నుంచి పరీక్ష తేదీ : ఏప్రిల్ 29 ఫలితాల వెల్లడి : మే 10 జేఎన్‌యూ ఎంట్రన్స్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 మార్చి 2 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 21 నుంచి పరీక్షల తేదీలు : మే 11 నుంచి 14 వరకు ఫలితాల వెల్లడి : మే 31 ఐకార్ ఏఐఈఈఏ రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 మార్చి 1 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 25 నుంచి పరీక్ష తేదీ: జున్ 1 ఫలితాల వెల్లడి : జూన్ 15 ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 మార్చి 2 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 30 నుంచి పరీక్షల తేదీలు : జూన్ 2 నుంచి 9 వరకు ఫలితాల వెల్లడి : జూన్ 25 -
విదేశాల్లో మేనేజ్మెంట్ విద్యకు.. జీమ్యాట్
విదేశీ విద్య ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ దేశాల్లో ఎంబీఏ, ఇతర బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే రాయాల్సిన పరీక్ష గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్). దీన్ని యూఎస్‌లోని గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ నిర్వహిస్తోంది. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1700 యూనివర్సిటీలు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ఆయా కోర్సుల్లో స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ అందించడానికి జీమ్యాట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. మనదేశ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, కెనడా, ఫిన్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యూకే, యూఎస్‌లలోని ప్రముఖ కాలేజీలు/యూనివర్సిటీలు జీమ్యాట్ స్కోర్ ఆధారంగానే గ్రాడ్యుయేట్ బిజినెస్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. మనదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు, బిట్స్ పిలానీ, ఐఎస్బీ-హైదరాబాద్, ఎక్స్ఎల్ఆర్ఐ-జంషెడ్పూర్, మైకా-అహ్మదాబాద్, ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి ప్రముఖ సంస్థలు జీమ్యాట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. నిబంధనలు: జీమ్యాట్ రాసేవారికి కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలి. పరీక్ష తేదీ నాటికి కనీసం వారం రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఒక ఏడాదిలో గరిష్టంగా ఐదుసార్లు పరీక్ష రాయొచ్చు. ఒకసారి పరీక్ష రాస్తే 31 రోజుల తర్వాత మాత్రమే మళ్లీ పరీక్ష రాయడానికి అవకాశం లభిస్తుంది. పరీక్ష: మూడున్నర గంటల వ్యవధిలో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. ఎనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్: ఇందులో ఎనాలిసిస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ విధానంలో ప్రశ్న ఉంటుంది. ఇందులో రాణించాలంటే నిర్దేశిత అంశాలకు చెందిన కాన్సెప్ట్స్‌పై అవగాహన పొందే నైపుణ్యాలను అలవర్చుకోవాలి. ఇచ్చిన నిర్దేశిత అంశం ఉద్దేశం ఏమిటి? అందులో కీలక ఆర్గ్యుమెంట్స్ ఏమిటి? వాటి వల్ల కలిగే పర్యవసానాలు, ఫలితాలు ఏంటి? తదితర అంశాలను గుర్తించాలి. విశ్లేషణాత్మకంగా ఆలోచించి సమాధానాలు రాయాలి. ఈ విభాగానికి కేటాయించిన సమయం 30 నిమిషాలు. ఇంటిగ్రేటెడ్ రీజనింగ్: ఇందులో 12 ప్రశ్నలు ఇస్తారు. టేబుల్ ఎనాలిసిస్, మల్టీసోర్స్ రీజనింగ్, గ్రాఫిక్స్ ఇంటర్‌ప్రిటేషన్‌లపై ప్రశ్నలు అడుగుతారు. 30 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. క్వాంటిటేటివ్: ఈ విభాగంలో అడిగే ప్రశ్నల సంఖ్య 37. డేటా సఫిషియన్సీ, ప్రాబ్లం సాల్వింగ్లపై ప్రశ్నలు ఉంటాయి. 75 నిమిషాల్లో ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఇందులో రాణించాలంటే ఇచ్చిన స్టేట్మెంట్లో మినహారుుంపులు, ముగింపు, వాదనలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అర్థమెటిక్, ఆల్జీబ్రా, ఎలిమెంటరీ జామెట్రీల్లో పట్టు ఉంటే మంచి స్కోరు సాధించొచ్చు. వెర్బల్: ఇందులో భాగంగా రీడింగ్ కాంప్రహెన్షన్, క్రిటికల్ రీజనింగ్, సెంటెన్స్ కరెక్షన్లపై మొత్తం 41 ప్రశ్నలు అడుగుతారు. రీడింగ్ కాంప్రహెన్షన్‌లో... ఇచ్చిన ప్యాసేజ్ ను అర్థం చేసుకుని సమాధానాలు గుర్తించాలి. రీడింగ్ ఎబిలిటీని పెంచుకుంటే ఇందులో రాణించొచ్చు. కరెక్ట్ ఎక్స్ప్రెషన్, ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్, ప్రాపర్ డిక్షన్ తదితర అంశాల్లో పట్టు సాధిస్తే సెంటెన్స్ కరెక్షన్లో మంచి స్కోరు సాధిస్తారు. క్రిటికల్ రీజనింగ్ ద్వారా అభ్యర్థిలోని లాజికల్ నైపుణ్యాలు పరీక్షిస్తారు. ఇందులో ఇచ్చిన ఆర్గ్యుమెంట్‌ను సరిగ్గా విశ్లేషించి సమాధానాలు ఇవ్వాలి. ఈ విభాగానికి నిర్దేశించిన కాలపరిమితి 75 నిమిషాలు. జీమ్యాట్ పరీక్ష విధానం, ప్రశ్నల తీరు తెలుసుకోవడానికి మాదిరి ప్రశ్నలను వెబ్సైట్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా జీమ్యాట్ ప్రిపరేషన్ టిప్స్, జీమ్యాట్ అలుమ్ని సూచనలు, సలహాలు, వీడియోలు వంటివి జీమ్యాట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. స్కోరు: పరీక్ష రాసిన మూడు వారాల తర్వాత స్కోర్ కార్డ్‌ను మెయిల్ చేస్తారు. ఈ స్కోర్ ఐదేళ్లపాటు చెల్లుతుంది. జీమ్యాట్ అభ్యర్థుల స్కోర్ రిపోర్ట్‌లో వెర్బల్, క్వాంటిటేటివ్, ఎనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, టోటల్ స్కోర్లు ఉంటాయి. టోటల్ స్కోర్ వెర్బల్, క్వాంటిటేటివ్ స్కోర్ ఆధారంగా ఇస్తారు. మిగిలిన ఎనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ స్కోర్లను పరిగణనలోకి తీసుకోరు. సాధారణంగా ఈ టోటల్ స్కోర్ 200 నుంచి 800 మధ్యలో ఉంటుంది. చాలామంది విద్యార్థులు 400-600 మధ్య స్కోర్ సాధిస్తారు. ప్రధాన బీ-స్కూల్స్‌లో ప్రవేశానికి కనీస స్కోరు ప్రకటించనప్పటికీ 600-700 వరకు మంచి స్కోరుగా భావించొచ్చు. దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఫోన్, పోస్టల్ మెయిల్ ద్వారా సంవత్సరమంతా దరఖాస్తు చేసుకోవచ్చు. క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా 250 యూఎస్ డాలర్లు పరీక్ష ఫీజుగా చెల్లించాలి. మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం. వెబ్సైట్: www.mba.com/india