Online Exams
-
ప్రశ్న పత్రం లీక్ యత్నం కేసులో సెల్ఫోన్లు సీజ్
పెడన: కోర్టుల్లో పోస్తుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఆన్లైన్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ చేసేందుకు యత్నించి అరెస్టయిన ముగ్గురు నిందితుల నుంచి పోలీసులు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో మచిలీపట్నం సబ్ జైలుకు పంపించినట్టు కృష్ణాజిల్లా పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.ప్రసన్నవీరయ్యగౌడ్ తెలిపారు. ఇప్పటికే వారి ఫోన్లో ప్రశ్న పత్రానికి సంబంధించిన ఫోటోలను వాటి జిరాక్స్ కాపీలను తీయించడంతో పాటు ఆ ఫోన్లను ఫోరెన్సిక్ (ఎఫ్ఎస్ఎల్)ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు. నివేదిక వచ్చేందుకు నెల రోజుల సమయం పడుతుందని, రాగానే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని వివరించారు. -
జేఎన్టీయూ(ఏ): ఎక్కడి నుంచైనా ఆన్లైన్ పరీక్షలు రాసే వీలు
అనంతపురం విద్య: ఆండ్రాయిడ్ మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్.. వీటిలోఏదో ఒకటి ఉంటే చాలు.. పరీక్ష హాలుకు వెళ్లాల్సిన పనిలేకుండా ఉన్నచోటి నుంచే ఆన్లైన్లో పరీక్ష రాసేయొచ్చు. విద్యార్థులు ఎక్కడి నుంచైనా సరే ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలు కల్పిస్తూ జేఎన్టీయూ (అనంతపురం) నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. బీటెక్ సెమిస్టర్ ప్రధాన పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్న జేఎన్టీయూ (ఏ) ముందుగా మిడ్ పరీక్షల్లో దీన్ని అమలు చేసింది. పైలట్ ప్రాజెక్ట్‌గా జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం మిడ్ పరీక్షలను ఈ నూతన విధానంలోనే ప్రారంభించారు. దీన్ని పరిశీలించాక వర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షల్ని ఈ నూతన విధానంలోనే నిర్వహిస్తామని వీసీ జింకా రంగజనార్దన చెప్పారు. నూతన విధానంలో పరీక్ష నిర్వహణ కోసం వర్సిటీ ప్రత్యేక వెబ్‌పోర్టల్ ఏర్పాటు చేసింది. విద్యార్థి యూజర్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేసిన వెంటనే మెయిల్‌కు ప్రశ్నపత్రం వస్తుంది. పరీక్షల షెడ్యూల్ ప్రకారం నిర్దేశించిన సమయానికే ప్రశ్నపత్రం అందుబాటులోకి వస్తుంది. -
ఆన్లైన్లో డిగ్రీ పరీక్షలు నిర్వహించలేరా..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. కరోనా వైరస్ కారణంగా హాస్టల్స్ మూసి ఉన్నందున పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడతారని, చివరి సెమిస్టర్ పరీక్షలన్నీ ఆన్లైన్లో నిర్వహించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. పిటిషనర్ వాదనపై స్పందించిన న్యాయస్థానం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సాంకేతికతను ఉపయోగించుకుని ఇంజనీరింగ్ కోర్సులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. అలాగే సప్లమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని కూడా రెగ్యులర్‌గా పరిగణిస్తారా అని హైకోర్టు అడిగింది. న్యాయస్థానం ప్రశ్నలకు స్పందించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. ప్రభుత్వాన్ని అడిగి చెప్తానని అన్నారు. దీంతో విచారణ ఈనెల 15కు వాయిదా వేసింది. (కరోనా విచారణ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు) మరోవైపు లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన వివిధ డిగ్రీ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధమైంది. ఈనెల 22 నుంచి బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్షలు మొదలవుతాయి. అదేవిధంగా ఈనెల 15 నుంచి ఇంజనీరింగ్, బీసీఏ, బీఈడీ, బీఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించేందుకు స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. -
లాక్డౌన్ సమయంలో ఇఫ్లూ పరీక్షలు..
హైదరాబాద్: కరోనా వైరస్, లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ఇఫ్లూ (ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ) చివరి సెమిస్టర్ పరీక్షలను నిర్వహించింది. లాక్డౌన్ సమయంలో పరీక్షలు నిర్వహించిన మెదటి కేంద్రీయ విశ్వవిద్యాలయంగా ఇఫ్లూ రికార్డు సృష్టించింది. దేశంలోనే విదేశీ భాషల శిక్షణకు ఇఫ్లూ(కేంద్రీయ విశ్వవిద్యాలయం) ఎంతో పేరు పొందిన విషయం తెలిసిందే. పరీక్షలు విజయవంతం కావడానికి వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ ఈ.సురేష్ కుమార్, విద్యార్థుల కృషితో సాధ్యమయిందని ఇఫ్లూ తెలిపింది. పరీక్షల నిర్వహణకు అధ్యాపకులు ఎంతో కృషి చేశారని వీసీ కొనియాడారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొని విద్యాసంవత్సరం విజయవంతంగా పూర్తి చేశామని ఇప్లు తెలిపింది. ప్రస్తుతం షిల్లాంగ్‌లోని తమ ప్రాంతీయ క్యాంపస్‌లో ఆన్లైన్ ద్వారా పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపింది. దేశంలోని పీహెచ్డీ స్కాలర్లకు వైవా పరీక్షలు నిర్వహించిన మొదటి విశ్వవిద్యాలయంగా చరిత్ర సృష్టించామని పేర్కొంది. ఇప్పటి వరకు 15 వైవా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. సామాజిక సేవలలో కూడా ఇఫ్లూ ముందుందని.. కరోనా నియంత్రణకు వివిధ రూపాలలో చర్యలు చేపట్టామని తెలిపింది. ఇఫ్లూలో కరోనా నియంత్రణకు 23 ఏప్రిల్, 2020 న కేంద్ర మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఇప్లులో షార్ట్ ఫిల్మ్ సంస్థను ప్రారంభించారు. విదేశీ భాషలకు ప్రత్యేకంగా ఉచిత ఆన్లైన్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ద్వారా ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, రష్యన్, జర్మన్, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, చైనీస్, పెర్షియన్ భాషలలో అందిస్తోంది. కరోనాను నియంత్రించేందుకు ఎఫ్ఎమ్ రేడియో ద్వారా అవగాహన కలిగించామని తెలిపింది. విద్యార్థులు ఇబ్బందులను దృష్టిలో పెట్టడానికి ఆన్లైన్ శిక్షణను సమర్థవంతంగా కొనసాగించామని పేర్కొంది. హాస్టల్లో నివసించే విదేశీ విద్యార్థులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కరోనావైరస్ను ఎదుర్కొని.. విద్యాసంవత్సరం విజయవంతంగా పూర్తి చేయడంలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి వైస్ ఛాన్సలర్ సురేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్ధులు ఎన్నుకున్న రంగంలో రాణించాలని.. వారు జీవితంలో అత్యున్నత స్థాయిలో ఎదగాలని వీసీ సురేష్ కుమార్ ఆకాంక్షించారు -
జూలై 27 నుంచి ఎంసెట్
ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించాల్సిన ఎంసెట్–2020 ఆన్లైన్ పరీక్షలు జూలై 27 నుంచి 31 వరకు జరగనున్నాయి.అలాగే ఇతర కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లలో కూడా మార్పులు చేశారు. ఈ మేరకు సవరించిన వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించాల్సిన ఎంసెట్–2020 ఆన్లైన్ పరీక్షలు జూలై 27 నుంచి 31 వరకు జరగనున్నాయి. అలాగే ఇతర కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లలో కూడా మార్పులు చేశారు. ఈ మేరకు సవరించిన వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ ప్రేమ్‌కుమార్ బుధవారం విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి 24 వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ను గతంలో ఉన్నత విద్యామండలి ప్రకటించిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఈసెట్, ఐసెట్, పీజీసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ తదితర సెట్ల తేదీలను కూడా విడుదల చేసింది. అయితే కరోనా, లాక్డౌన్లతో ప్రవేశ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వాటిని విద్యామండలి నిరవధికంగా అప్పట్లో వాయిదా వేసింది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర జాతీయ విద్యాసంస్థల్లోకి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్స్ ఆన్లైన్ పరీక్షలను జూలై 18 నుంచి 23 వరకు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ ఇతర సెట్ల నిర్వహణకు వీలుగా షెడ్యూళ్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇప్పటికే ఈ ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఎంసెట్‌కు 2,48,614 దరఖాస్తులు అందాయి. వీటిలో ఇంజనీరింగ్‌కు 1,69,137, అగ్రి,మెడికల్‌కు 78,959, రెండింటికీ 518 దరఖాస్తులు వచ్చాయి. -
నీట్ మినహా అన్నీ ఆన్లైన్లో
సాక్షి, హైదరాబాద్ : జాతీయ స్థాయి సంస్థల్లోని సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం 13 రకాల పోటీ పరీక్షల షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జారీ చేసింది. 2020–21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్), యూజీసీ నెట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఎంబీఏ అడ్మిషన్ టెస్టు, సీఎస్ఐఆర్ యూజీసీ నెట్, కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్), గ్రాడ్యు యేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్టు (జీప్యాట్), ఆలిండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్టు, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ ఎంబీఏ, బీఎడ్ అడ్మిషన్ టెస్టు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్), జేఎన్‌యూ ఎంట్రెన్స్ టెస్టు, ఢిల్లీ వర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు నిర్వహణకు షెడ్యూలు విడుదల చేసింది. వీటిల్లో జేఈఈ, యూజీసీ నెట్, సీఎస్ఐఆర్–యూజీసీ నెట్ వంటి పరీక్షలను ఏటా రెండుసార్లు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించింది. నీట్ మినహా మిగతా పరీక్షలన్నింటినీ ఆన్లైన్లో నిర్వహిస్తామని పేర్కొంది. విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో 4 వేల ప్రాక్టీస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ వివరించింది. ఇవి సెప్టెంబర్ 1 నుంచి పని చేస్తాయని, ప్రతి శనివారం, ఆదివారం వీటిని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. పరీక్షల షెడ్యూలు వివరాలు.. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు: సెప్టెంబర్ 2 నుంచి 30 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్: డిసెంబర్ 6 నుంచి పరీక్షల తేదీలు:2020 జనవరి 6 నుంచి 11 వరకు ఫలితాల వెల్లడి: జనవరి 31 జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు: 2020 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : మార్చి 16 నుంచి పరీక్షల తేదీలు : ఏప్రిల్ 3 నుంచి 9 వరకు ఫలితాల వెల్లడి : ఏప్రిల్ 30 నీట్ పరీక్షలు.. రిజిస్ట్రేషన్ తేదీలు : డిసెంబర్ 2 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : 2020 మార్చి 27 నుంచి పరీక్ష తేదీ: మే 3 ఫలితాల వెల్లడి: జూన్ 4 ఐఐఎఫ్‌టీ ఎంబీఏ అడ్మిషన్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 25 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : నవంబర్ 11 నుంచి పరీక్ష తేదీ : డిసెంబర్ 1 ఫలితాల వెల్లడి : డిసెంబర్ 11 యూజీసీ నెట్ మొదటి విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు : సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : నవంబర్ 9 నుంచి పరీక్షల తేదీలు : డిసెంబర్ 2నుంచి 6 వరకు ఫలితాల వెల్లడి : డిసెంబర్ 31 యూజీసీ నెట్ రెండో విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు :2020 మార్చి 16 నుంచి ఏప్రిల్ 16 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : మే 15 నుంచి పరీక్షల తేదీలు : జూన్ 15 నుంచి 20 వరకు ఫలితాల వెల్లడి : జూలై 5 సీఎస్ఐఆర్ మొదటి విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు : సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : నవంబర్ 9 నుంచి పరీక్ష తేదీ : డిసెంబర్ 15 ఫలితాల వెల్లడి : డిసెంబర్ 31 సీఎస్ఐఆర్ రెండో విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 మార్చి 16 నుంచి ఏప్రిల్15 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : మే 15 నుంచి పరీక్ష తేదీ: జూన్ 21 ఫలితాల వెల్లడి : జూలై 5 సీమ్యాట్, జీప్యాట్ రిజిస్ట్రేషన్ తేదీలు : నవంబర్ 1 నుంచి 30 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : డిసెంబర్ 24 నుంచి పరీక్ష తేదీ : 2020 జనవరి 24 ఫలితాల వెల్లడి : ఫిబ్రవరి 3 ఆలిండియా ఆయుష్ పీజీ ఎంట్రన్స్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 జనవరి 1 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 1 నుంచి పరీక్ష తేదీ : ఏప్రిల్ 29 ఫలితాల వెల్లడి : మే 10 నేషనల్ కౌన్సిల్ ఫర్హోటల్ మేనేజ్మెంట్ (ఎన్సీహెచ్ఎం) రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 29 వరకు. హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 1నుంచి పరీక్ష తేదీ : ఏప్రిల్ 25 ఫలితాల వెల్లడి : మే 10 ఇగ్నో ఎంబీఏ, బీఎడ్ అడ్మిషన్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 29 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 1 నుంచి పరీక్ష తేదీ : ఏప్రిల్ 29 ఫలితాల వెల్లడి : మే 10 జేఎన్‌యూ ఎంట్రన్స్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 మార్చి 2 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 21 నుంచి పరీక్షల తేదీలు : మే 11 నుంచి 14 వరకు ఫలితాల వెల్లడి : మే 31 ఐకార్ ఏఐఈఈఏ రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 మార్చి 1 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 25 నుంచి పరీక్ష తేదీ: జున్ 1 ఫలితాల వెల్లడి : జూన్ 15 ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 మార్చి 2 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 30 నుంచి పరీక్షల తేదీలు : జూన్ 2 నుంచి 9 వరకు ఫలితాల వెల్లడి : జూన్ 25 -
‘దోస్త్’ షురూ
పాపన్నపేట (మెదక్): దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్) పద్ధతిన డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మూడు విడతల్లో ఆన్లైన్ ప్రవేశాలు జరగనున్నాయి. దేశంలోనే మొట్ట మొదటిసారిగా 2016లో దోస్త్ పద్ధతిన తెలంగాణలో ఆన్లైన్ ప్రవేశాలు నిర్వహించారు. గతంలో చోటుచేసుకున్న లోటుపాట్లను గుర్తించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులతో పాటు కొత్త సౌకర్యాలు కల్పించారు. డిమాండ్‌లేని కోర్సుల సీట్లకు కోత విధించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత అందులో పాసైన వారికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి ఇంటర్లో ఫలితాలు తగ్గిన నేపథ్యంలో డిగ్రీ సీట్లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. మార్కులు, రిజర్వేషన్ల ప్రకారం కేటాయింపు జిల్లాలో నాలుగు ప్రభుత్వ, 15ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 12వేల మంది విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉంది. 2016 వరకు ఇంటర్‌పరీక్షల్లో సాధించిన మార్కులు, కుల, స్పోర్ట్స్, దివ్యాంగుల రిజర్వేషన్లకు అనుగుణంగా డిగ్రీలో ప్రవేశాలు కల్పించేవారు. 2016లో దోస్త్ పద్ధతిని ప్రవేశ పెట్టారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కులు, రిజర్వేషన్లకు అనుగుణంగా విద్యార్థులకు కళాశాల కేటా యిస్తారు. ఈ విధానంపై మొదట్లో కొన్ని విమర్శలు వ్యక్తమయ్యాయి. మీసేవతోపాటు ఆధార్ అనుసంధానమైన మొబైల్ నుంచి విద్యార్థులు రిజస్ట్రేషన్ చేసుకునేవారు. కొంతమందికి వేలి ముద్రలు నమోదు కాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెం దిన విద్యార్థులు ఆన్లైన్ సౌకర్యం అందుబా టులో లేక, వాటిపై అవగాహన కరువై ఇంటర్‌తోనే విద్య మానేసిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 27 ప్రైవేట్, 20 మైనార్టీ డిగ్రీ కళాశాలలు దోస్తులో చేరకుండా సొంతంగా ప్రవేశాలు చేసుకుంటున్నాయి. -
ఐటీఐ ట్రేడ్లకు ఆన్లైన్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్)లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న తరుణంలో పరిశ్రమల అవసరాలకు తగినట్లు నిపుణులను తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి రంగంలోనూ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో నైపుణ్య శిక్షణకు సాంకేతికతను జోడించాయి. పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)ని అమలు చేసేందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 290 ఐటీఐలున్నాయి. వీటిలో ప్రభుత్వ ఐటీఐలు 65, ప్రైవేటు ఐటీఐలు 235 ఉన్నాయి. వీటి పరిధిలో 48,265 మంది అభ్యర్థులు వివిధ ట్రేడ్లలో శిక్షణ పొందుతున్నారు. ట్రేడ్ల వారీగా శిక్షణలు తీసుకుంటున్న విద్యార్థులకు ఆన్లైన్ పద్ధతిలో ప్రతిభను కనబర్చేందుకు సీబీటీ దోహదపడుతుందని ఆ శాఖ భావిస్తోంది. దీంతో ఈ ఏడాది జూన్‌లో జరిగే వార్షిక పరీక్షలను సీబీటీ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి కేటగిరీలో 50 ప్రశ్నలు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీఐలలో 31 ట్రేడ్లు ఉన్నాయి. వీటిలో 27 ట్రేడ్లలో మాత్రమే విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరికి ఈ ఏడాది జూన్‌లో వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహించగా... ఈసారి ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. థియరీ, వర్క్‌షాప్ కాలి క్యులేషన్స్, ఎంప్లాయిబులిటీ స్కిల్స్ కేటగిరీలకు సీబీటీ పద్ధతిలో పరీక్షలు జరుగుతాయి. మిగతా పరీక్షలు మాత్రం ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ప్రతి కేటగిరీలో 50 ప్రశ్నలుంటాయి. వీటికి ఒకదానివెంట ఒకటి సమాధానాలు ఇస్తూ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. పరీక్షల నిర్వహణకుగాను కేం ద్రాల్లో వసతులు కల్పించాలని కార్మిక ఉపాధి కల్పన శాఖ ఆదేశాలు జారీ చేసింది. విస్తృత అవగాహన వచ్చేలా... తొలిసారి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్న తరుణంలో విద్యార్థులు ఆందోళన చెందకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. సీబీటీ పరీక్షలపై వారికి అవగాహన కార్యక్రమాలు పూర్తిచేసి విద్యార్థులను సన్నద్ధం చేయనున్నట్లు కార్మిక ఉపాధి కల్పన శాఖ సంచాలకులు కేవై నాయక్ ‘సాక్షి’తో అన్నారు. -
పరీక్షల ‘కీ’.. అక్రమార్కుల చేతికి!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఆన్లైన్ పరీక్షలైన టోఫెల్, పీటీఈ, ఐఈఎల్టీఎస్ల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. వీటికి సంబంధించిన ‘కీ’లు ముందే బయటకు వచ్చేస్తున్నాయి. లాడ్జిల్లో ‘కోచింగ్ సెంటర్లు’ఏర్పాటు చేసి అభ్యర్థులకు తర్ఫీదు ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ దందాలో దాదాపు 40 మంది మంచి స్కోర్స్ సాధించి విదేశీ విద్యకు వెళ్లారు. మరో 40 మంది సఫలీకృతులు కాలేకపోయారు. తమ సిరీస్‌కు చెందిన ‘కీ’లు ఇస్తామంటూ మోసం చేశారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వేట మొదలుపెట్టిన మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక ఏజెంట్ కె.కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి ఆయా పరీక్షలకు సంబంధించిన ‘కీ’లు తీసుకువచ్చి అందిస్తున్న సూత్రధారి యువరాజ్ సింగ్ కోసం గాలిస్తున్నారు. వీరి ద్వారా లబ్ధిపొంది, ఆన్లైన్ పరీక్షల్లో మంచి స్కోర్ సాధించి విదేశాలకు వెళ్లిన విద్యార్థులకూ నోటీసులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. పరీక్ష కోసం అయిన పరిచయంతో... నిజామాబాద్‌లోని ఆనంద్‌నగర్‌కు చెందిన కుర్రా కిరణ్‌కుమార్ 2013లో అక్కడి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. 2016 మేలో హైదరాబాద్‌కు వచ్చి కేపీహెచ్బీలో ఉన్న మలేషియా టౌన్షిప్లో స్థిరపడ్డాడు. ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేద్దామనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్టీఎస్) పరీక్ష రాయాలని సిద్ధమయ్యాడు. విదేశాల్లో విద్యనభ్యసించాలని భావించే వారు ఐఈఎల్టీఎస్, పీయర్సన్ టెస్ట్స్ ఆఫ్ ఇంగ్లిష్ (పీటీఈ), టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాస్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ (టోఫెల్) వంటి పరీక్షలు ఆన్లైన్లో రాసి మంచి స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కిరణ్‌కు పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన యువరాజ్ సింగ్‌తో పరిచయమైంది. పరీక్ష అడ్డదారిలో పాస్ కావడానికి సహకరిస్తానని చెప్పడంతో కిరణ్ అంగీకరించడమే గాక, పరీక్ష రాసే అభ్యర్థుల్ని వెతికే పనిలోపడ్డాడు. 12 గంటల ముందే ‘కీ’ బయటకు... పరీక్షల్లో అడ్డదారిలో స్కోర్ సాధించాలనుకునే వారి నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసేవాడు. కిరణ్, యువరాజ్ సగం సగం తీసుకునేవారు. పరీక్షకు ముందు రోజు.. దాదాపు 12 గంటల ముందు యువరాజ్ క్వశ్చన్ పేపర్ ‘కీ’ని తెచ్చి ఇచ్చేవాడు. వీరిద్దరూ కలసి స్థానికంగా ఉన్న లాడ్జిల్లో గదులు బుక్ చేసి, నగదు చెల్లించిన అభ్యర్థుల్ని తీసుకువచ్చి రాత్రంతా ప్రిపేర్ చేయించేవారు. అయితే మూడు నాలుగు సిరీస్లుండే పేపర్లో ఒక్క సిరీస్ మాత్రమే తెచ్చేవారు. మరుసటి రోజు ఆ సిరీస్ వచ్చిన వారు ఉత్తీర్ణులవుతుండగా... మిగిలిన వారికి సరైన స్కోర్ రావట్లేదు. ఇలా మంచి స్కోర్ పొందిన వారిలో 40 మంది విదేశాలకు వెళ్లిపోయారు. మోసపోయామని ఫిర్యాదు చేయడంతో... కిరణ్‌కు రూ.50 లక్షలు చెల్లించిన మరో 40మందికి సరైన స్కోర్ రాలేదు. దీంతో వీరిలో కొందరు కిరణ్‌పై సైఫాబాద్, మీర్‌చౌక్, జూబ్లీహిల్స్ ఠాణాల్లో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం గత వారం కిరణ్‌ను పట్టుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించింది. ఇతడి విచారణలోనే యువరాజ్ పేరు వెలుగులోకి వచ్చింది. అతడికి క్వశ్చన్ పేపర్ ‘కీ’ బ్రిటిష్ కౌన్సిల్ నుంచే అందుతున్నట్లు బయటపెట్టాడు. దేశ వ్యాప్తంగా ఈ దందా చేస్తున్న యువరాజ్ కోసం గాలిస్తున్నారు. గతంలో ఇలాంటి కేసుల్లో పంజాబ్, హరియాణాల్లో ఇతను పోలీసులకు పట్టుబడ్డాడు. వీరి ద్వారా అక్రమంగా లబ్ధిపొంది విదేశాలకు వెళ్లిన 40 మందికి నోటీసు లు జారీచేయాలని భావిస్తున్నారు. మోసపోయినట్లు చెప్తున్న వారూ అక్రమ మార్గంలో స్కోర్ సాధించాల ని ప్రయత్నించిన వారే కాబట్టి వీరిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉం దా? అనే కోణాన్నీ పరిశీలిస్తున్నారు. -
అమ్మో... ఆన్లైన్ పరీక్షలు..!
తక్కువ ఖర్చుతో స్వల్ప సమయంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించవచ్చనే భావనతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్లైన్ పరీక్షలు అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయి. ఆన్లైన్ విధానంలో నిర్వహించే పరీక్షలకు కంప్యూటర్ నైపుణ్యాలు లేకపోవడం, తగినంత శిక్షణ పొందేందుకు వనరుల లేమి కారణంగా గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు నష్టపోతున్నారు. తిరువూరు: జిల్లాలోని పశ్చిమకృష్ణా ప్రాంతంలో గిరిజన జనాభా అధికంగా ఉన్న ఏకొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం మండలాల్లో కంప్యూటర్లు విద్యార్థులకు అందుబాటులో ఉండట్లేదు. హైస్కూలు స్థాయి నుంచి కూడా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కేవలం కంప్యూటరు విద్య ప్రకటనలకే పరిమితమవుతోంది. జిల్లాలోని 284 జెడ్పీ హైస్కూళ్లలో లక్షా 10 వేల మంది విద్యార్థులున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో కూడా రెట్టింపు విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 10 శాతం మందికి కూడా కంప్యూటర్ విద్య అందట్లేదు. కంప్యూటర్ శిక్షణలో వెనుకబాటే... విద్యాపరంగా ముందంజలో ఉన్న కృష్ణాజిల్లాలో బీటెక్, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు కూడా కంప్యూటర్ నైపుణ్యాలు కరువవుతున్నాయి. బీటెక్‌లో ఐటీ, సీఎస్ఈ, ఈసీఈ, బీఎస్సీ, బీకాంలలో కంప్యూటర్ సబ్జెక్టుతో పట్టా పుచ్చుకున్న విద్యార్థులు కూడా ఆన్లైన్ పరీక్షలు రాయడానికి తడబడే పరిస్థితి నెలకొనడం గమనార్హం. ఏపీపీఎస్సీ, డీఎస్సీ, టెట్ పరీక్షలకు, ప్రభుత్వోద్యోగులు పదోన్నతుల కోసం రాసే డిపార్టుమెంటల్ పరీక్షలకు కూడా ఆన్లైన్ టెస్టులే జరుగుతున్నాయి. ఎడ్‌సెట్, ఈసెట్, ఐసెట్, ఎంసెట్, పీజీఈసెట్, డీసెట్ వంటి ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశ పరీక్షలకూ ఆన్లైన్ విధానాన్ని అనుసరిస్తున్న ప్రభుత్వం ఇందుకు అవసరమైన ప్రాథమిక శిక్షణ కూడా ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. మాక్ టెస్టుల పేరుతో ఆయా ఎంపిక సంస్థలు వెబ్సైటులో నమూనా పరీక్షలు పెడుతున్నా అభ్యర్థులకు అర్థం కావట్లేదు. ప్రైవేటు వెబ్సైట్లు ఆన్లైన్ పరీక్షలను అందుబాటులో ఉంచుతున్నా ఉచితంగా లభ్యంకాక పేద విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారు. ‘టెట్’ గందరగోళంతో మరింత ఆందోళన 2017 టెట్‌లో ప్రైవేటు ఏజెన్సీకి పరీక్ష నిర్వహణను విద్యాశాఖ అప్పగించగా, ఆన్లైన్ ప్రశ్నపత్రం కూర్పులో గానీ, వాల్యుయేషన్, రీవెరిఫికేషన్, రెస్పాన్స్షీట్ల జారీలో ఫైనల్ కీతో సంబంధం లేకుండా గజిబిజిగా ఫలితాలు వెల్లడవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి కూడా టెట్‌పరీక్ష ఆన్లైన్లోనే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించగా, ఆఫ్‌లైన్‌లోనే జరపాలని అభ్యర్థులు కోరుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వలె అన్ని పోటీపరీక్షలకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ పరీ క్షలు నిర్వహిస్తే గ్రామీణ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని పలువురు సూచిస్తున్నారు. ‘టెట్’లో అర్హత సాధించలేకపోయా టెట్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహించడంతో కంప్యూటర్ పరిజ్ఞానం తగినంత లేక అర్హత సాధించలేకపోయా. టెట్ పరీక్షకై పూర్తిస్థాయిలో సిద్ధమైనప్పటికీ ఆన్లైన్ పరీక్ష నిర్వహించడంతో ఇబ్బందికి గురయ్యా. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా పోటీపరీక్షలు నిర్వహించాలి. – రమాదేవి, మల్లేల అభ్యర్థులను ఇబ్బంది పెట్టడం తగదు గ్రామీణ ప్రాంతాలలో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు తక్కువ సంఖ్యలో ఉన్నందున పట్టణ అభ్యర్థులతో పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. ఆన్లైన్ పరీక్షలతో నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోతున్నందున వారి ఇబ్బందులు గమనించి ప్రభుత్వం పునరాలోచించాలి. ప్రతి మండలంలో ఒక ఆన్లైన్ శిక్షణ కేంద్రం నిర్వహించాలి.– రాంప్రదీప్, ఉపాధ్యాయుడు, గానుగపాడు -
‘గురుకులాల్లో మే12 నుంచి మెయిన్ పరీక్షలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల్లో పలు పోస్టుల భర్తీకి మే 12 నుంచి 17 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. మొత్తం 1,099 ఖాళీల భర్తీకి గానూ 1:15 నిష్పత్తిలో 16,485 మందిని మెయిన్ పరీక్షలకు ఎంపిక చేసినట్టు పేర్కొంది. మే 12న లైబ్రేరియన్, 13న ఫిజికల్ డైరెక్టర్, 14న ప్రిన్సిపల్ (పాఠశాలలు), 15న జూనియర్ లెక్చరర్లు, 16న ప్రిన్సిపల్ (జూనియర్ కళాశాలలు), 17న డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు హైదరాబాద్‌లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. -
ఉదయం 7 నుంచే పరీక్ష హాల్లోకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో 2018–19 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఏప్రిల్ 8న జరగనున్న జేఈఈ మెయిన్ రాత పరీక్షల కోసం సీబీఎస్ఈ అన్ని ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో మెయిన్ ఆన్లైన్ పరీక్షలను రోజూ 2 దఫాలుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు సం బంధించిన పూర్తిస్థాయి టైంటేబుల్‌ను జారీ చేసింది. ఉదయం 9:30కు జరిగే పరీక్షకు విద్యార్థులను ఉదయం 7 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు మధ్యాహ్నం 12:45 గంటల నుంచే అనుమతిస్తామని వెల్లడించింది. నిర్ణీత పరీక్ష ప్రారంభ సమయం తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. 8న ఉదయం బీఈ/బీటెక్ కోసం పేపర్–1 పరీక్ష ఉంటుందని, బీఆర్క్/బీప్లానింగ్‌లో ప్రవేశాలకు మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష ఉంటుందని వెల్లడించింది. 15, 16 తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు ఉంటాయని, ఉదయం ఆఫ్‌లైన్ పరీక్ష టైంటేబులే వర్తిస్తుందని వివరించింది. అయితే 15వ తేదీ మధ్యాహ్నం రెండో విడత పేపర్–1 ఆన్లైన్ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అవుతుందని, విద్యార్థులను 12:45నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పింది. మెయిన్ పరీక్షల సిలబస్, ప్రశ్నపత్రాల విధానంలో మార్పు లేదని, 2014, 2015, 2016, 2017ల్లో ఇచ్చినట్లే ఈసారీ ఉంటుందని చెప్పింది. -
ఆన్‌లైనా.. ఆఫ్‌లైనా!
బాలాజీచెరువు(కాకినాడ సిటీ) : ఐటీఐ విద్యలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్ పరీక్షల విధానం తీసుకొస్తుంది. ఇప్పటికే సెమిస్టర్ విధానంలో సంవత్సరానికి రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఒక సంవత్సరం ట్రేడ్వారికి ఏడాది చివర్లో, రెండేళ్ల ట్రేడ్వారికి రెండో ఏడాది చివర్లో పరీక్షలు నిర్వహించేది. ఈ విధానం వల్ల ఉత్తీర్ణతశాతం తగ్గిపోవడం, సాంకేతిక నైపుణ్యం విద్యార్థుల్లో పెరగకపోవడంతో ఈ విధానానికి ప్రభుత్వం పూర్తిగా స్వస్తి పలికి, సంవత్సరం ట్రేడ్వారికి ఆరు నెలలు చొప్పున రెండు సార్లు, రెండేళ్ల ట్రేడ్వారికి ఆరు నెలల చొప్పున నాలుగుసార్లు పరీక్షలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ విధానం 2013 జూలై నెలలో ఐటీఐలో చేరే విద్యార్థులకు వర్తింపజేసేలా సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టినా పరీక్షలు మాత్రం మాన్యువల్ పద్ధతిలో నిర్వహించింది. ఇప్పుడు తాజాగా అదే సెమిస్టర్ పరీక్షలకు ఆన్లైన్ విధానంలో నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వ ఆలోచన బాగున్నా... ఆ మార్పునకు తగ్గట్టుగా ఐటీఐ కళాశాలలో ఆధునిక పరికరాలు సమకూర్చకపోవడం, అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయకపోవడం తదితర కారణాలతో విద్యార్థులకు పరీక్షలకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వడానికి ఏ మాత్రం అవకాశం కనపించడంలేదు. ప్రస్తుతం ఐటీఐలో రెండు సంవత్సరాల కోర్సులు 12, ఏడాది కోర్సులు ఆరు ఉన్నాయి. అలాగే అధ్యాపకుల కొరత కూడా సమస్యగా ఏర్పడింది. కళాశాలలో ఉన్న అధ్యాపకుల్లో సగానికిపైగా కాంట్రాక్టు పద్ధతిలో, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తుండగా 15 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. దీంతో విద్యార్థులకు విద్యాపరంగా కూడా సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ వాడ్రేవు శ్రీనివాసరావును వివరణ కోరగా ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఐటీఐలో ఆన్లైన్ విధానానికి చర్యలు చేపడుతుందన్నారు. అయితే ఎటువంటి ఆదేశాలు తమకు రాలేదని, కళాశాలల్లో పూర్తిస్థాయిలో సదుపాయాలు లేకపోయినా ప్రైవేట్ సంస్థల్లో పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. పరీక్షల సమయం దగ్గరపడుతుండడంతో ఈ సారి ఆఫ్‌లైన్‌లో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. -
‘టీఆర్టీ’ తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టిన ‘టీచర్ రిక్రూట్మెంట్ (టీఆర్టీ)’ పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. ఏ తేదీన, ఏ సమయంలో ఏయే పరీక్షలు నిర్వహిస్తారు, పరీక్షా కేంద్రాలు తదితర పూర్తి వివరాలను బుధవారం ప్రకటించింది. గురుకుల పోస్టులకు ఈ నెల (ఫిబ్రవరి) 19వ తేదీ నుంచి, ఉపాధ్యాయ పోస్టులకు 24వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ గతంలోనే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయా పోస్టులకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య మేరకు పరీక్ష కేంద్రాలు, పరీక్ష విధానాన్ని నిర్ణయించి.. తదనుగుణంగా పూర్తి వివరాలను బుధవారం వెల్లడించింది. గురుకుల పోస్టులకు పూర్తిగా ఆన్లైన్లో ‘కంప్యూటర్ ఆధారిత భర్తీ పరీక్ష (సీబీఆర్టీ)’ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉపాధ్యాయ పోస్టుల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియం ఎస్జీటీ పోస్టులు, బయాలజీ, మ్యాథ్స్, సోషల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఓఎంఆర్ విధానంలో... మిగతా వాటికి సీబీఆర్టీ విధానంలో పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఇక లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్–తెలుగు, పీఈటీ, స్కూల్ అసిస్టెంట్–బయాలజీ, మేథ్స్ అండ్ సోషల్ స్టడీస్ (తెలుగు మీడియం) పరీక్షలు మినహా మిగతా అన్ని పరీక్షలను కేవలం హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు. గురుకుల పరీక్షల షెడ్యూల్ ఇదీ.. – విద్యాశాఖ గురుకులాల్లోని జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఫిబ్రవరి 19న రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం పేపర్–1 (పెడగాజీ), మధ్యాహ్నం పేపర్–2 (సంబంధిత సబ్జెక్టు) ఉంటాయి. – డిగ్రీ లెక్చరర్ పోస్టులకు 20వ తేదీన ఉదయం పరీక్ష నిర్వహిస్తారు. – డిగ్రీ కాలేజీల లైబ్రేరియన్ పోస్టులకు 20న మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది. – గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ పోస్టులకు 21న ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్షలు నిర్వహిస్తారు. – జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్ పోస్టులకు 22న ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 పరీక్షలు ఉంటాయి. – జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు 23న ఉదయం, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు 23వ తేదీన మధ్యాహ్నం పరీక్షలు ఉంటాయి. -
మే 2 నుంచి 5 వరకు ఎంసెట్
సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో వివిధ వృత్తి విద్య, సాంకేతిక కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. 2018–19 విద్యా సంవత్సరంలో అన్ని ప్రవేశ పరీక్షలను ఆన్లైన్ విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఎంసెట్‌ను 2018 మే 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. రెండు దఫాలుగా 25 వేల మంది చొప్పున రోజుకు 50 వేల మందికి ఎంసెట్ పరీక్ష నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేసినట్లు చెప్పారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం దాదాపు 1.4 లక్షల మంది పరీక్షకు హాజరయ్యే అవకాశముందని, అగ్రికల్చర్ కోసం మరో 50 వేల మంది వరకు హాజరవుతారని వివరించారు. మిగతా సెట్స్ తేదీలను కూడా ప్రకటించారు. ప్రాక్టీస్ కోసం మాక్ టెస్టులు ప్రవేశ పరీక్షలను మొదటిసారిగా ఆన్లైన్ విధానంలో నిర్వ హిస్తున్నందున విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకా శాన్ని కల్పించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బంది పడ కుండా, ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా.. వచ్చే నెల మొదటి లేదా రెండో వారం నుంచే ఆన్లైన్లో మాక్ టెస్టులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇక ఆన్లైన్ ప్రవేశ పరీక్షలను టీసీఎస్ సంస్థ సాంకేతిక సహకారంతో తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) నేతృత్వంలో నిర్వహించేలా ఇప్పటికే ఉన్నత విద్యా మండలి ఒప్పందం చేసుకుంది. సెట్స్ కన్వీనర్లను ప్రకటించాక ఆయా సెట్స్ కమిటీలు పరీక్షల నిర్వహణకు టీసీఎస్‌తో ఒప్పందాలు చేసుకుంటాయి. ఆ సమయంలో సెట్స్ ఫీజులు ఖరారు కానున్నాయి. అయితే ఆన్లైన్లో పరీక్షల నిర్వహణ, జీఎస్టీ నేపథ్యంలో.. ఫీజుల భారం కొంత ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పాత కన్వీనర్లకే బాధ్యతలు! ఏయే యూనివర్సిటీల ఆధ్వర్యంలో ఏయే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో.. సెట్స్ కన్వీనర్ల ఖరారుపై ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. కన్వీనర్‌గా నియామకం కోసం ముగ్గురితో కూడిన జాబితాలు ఇవ్వాలని ఆయా వర్సిటీలకు లేఖలు రాసింది. దీంతో ఒక్క ఐసెట్ మినహా మిగతా సెట్స్‌కు సంబంధించిన జాబితాలు ఇప్పటికే ఉన్నత విద్యా మండలికి చేరినట్లు తెలిసింది. అయితే గతంలో సెట్స్‌కు కన్వీనర్లుగా వ్యవహరించిన వారికే ఈసారి కూడా బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన ఎంసెట్‌కు జేఎన్టీయూ రిజిస్ట్రార్ యాదయ్య, పీఈసెట్‌కు వి.సత్యనారాయణ, ఈసెట్‌కు గోవర్ధన్, ఎడ్‌సెట్‌కు మధుమతి, పీజీఈసెట్‌కు సమీనా ఫాతిమా, లాసెట్‌కు ద్వారకానాథ్ కన్వీనర్లుగా బాధ్యత అప్పగించే అవకాశ ముంది. లాసెట్, ఐసెట్ లను నిర్వహించిన కన్వీ నర్లు రిటైరైన నేపథ్యంలో కొత్తవారికి బాధ్యత అప్ప గించే అవకాశముంది. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించాక నిర్ణయం తీసుకోవాలని మండలి భావిస్తోంది. పేపర్ లీక్ సమస్యలకు చెక్ జాతీయ స్థాయి పరీక్షలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ విధానంలో మార్పులు తీసుకువచ్చినట్లు పాపిరెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలను ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తున్నందున రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ విధానం వల్ల పేపర్ లీక్ వంటి ప్రధాన సమస్యలకు చెక్ పెట్టవచ్చన్నారు. -
882 పోస్టుల భర్తీకి ఆన్లైన్ పరీక్షలు
నేడు మరో రెండు కేటగిరీ పోస్టులకు రాత పరీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీ పోస్టుల భర్తీకి ఆదివారం టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. కంప్యూటర్ ఆధారితంగా ఆన్లైన్లోనే ఈ పరీక్షలు జరిగాయి. 463 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 4 ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, 7 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, 407 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ లాంగ్వేజెస్ (హిందీ, తెలుగు, ఉర్దూ) పోస్టులకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 130 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించింది. ఇందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ పోస్టులకు పరీక్షలు రాసేందుకు 75,546 మంది దరఖాస్తు చేసుకోగా 64.29 శాతం మంది హాజరయ్యారు. పీజీసీ లాంగ్వేజెస్ మెయిన్ పరీక్షలకు 2,280 మంది అర్హత సాధించగా.. అందులో 87.51 శాతం మంది హాజరయ్యారు. నేటి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి మరోవైపు ఈనెల 28న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్, మెకానికల్ పరీక్షలను నిర్వహించేందుకు 73 కేంద్రాలను, పీజీటీ (ఇంగ్లిష్) పరీక్ష నిర్వహణకు 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. సివిల్ మెకానికల్ పరీక్షల్లో కామన్ పేపరు ఉంటుందని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్షకు 44,483 మంది, పీజీటీ (ఇంగ్లిష్) పరీక్షకు 2,900 మంది హాజరుకానున్నారు. -
ఎంసెట్ పరీక్షకు తేదీ ఖరారు!
-
మే 12న ఎంసెట్
► ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి ► పీజీఈసెట్, ఈసెట్‌లను ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయం ► సంక్రాంతి అనంతరం కన్వీనర్లు, ఇతర వివరాల ప్రకటన సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్యా కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం (2017–18) ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం ప్రకటించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ మినహా మిగతా అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సులు, ఇంజనీరింగ్‌లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం మే 12న ఎంసెట్‌ను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. దీంతోపాటు బీఈ/బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, యూజీడీపీఈడీ, బీపీఈడీ, మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎంఈ/ ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఎం.ప్లానింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల తేదీలనూ ఖరారు చేశామని నిర్వహణ విద్యా సంస్థలను ఎంపిక చేశామన్నారు. ఏపీలో ఆలస్యమయ్యే పరిస్థితి ఉన్నందునే..: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేశాక.. రాష్ట్రంలో తేదీలను ఖరారు చేయాలని తొలుత ఉన్నత విద్యా మండలి భావించింది. అయితే పరీక్షలపై ఏపీ అధికారులు కసరత్తు చేసినా ఇంకా తేదీలను ప్రకటించలేదు. దీంతో తామే ముందుగా తేదీలను ఖరారు చేశామని పాపిరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలకు కొన్ని రోజులు అటూఇటుగా ఏపీ పరీక్షల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉందన్నారు. ఆన్లైన్లో పీజీఈసెట్, ఈసెట్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) మే 6వ తేదీన నిర్వహించే ఈసెట్ పరీక్షను.. ఎంటెక్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ పరీక్షను ఈ సారి ఆన్లైన్ విధానంలో చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సంక్రాంతి తర్వాత కన్వీనర్లు, పరీక్ష వేళలు ఖరారు! ప్రవేశ పరీక్షలను నిర్వహించే యూనివర్సిటీలను ఖరారు చేసిన ఉన్నత విద్యా మండలి.. ఆయా పరీక్షలను నిర్వహించే కన్వీనర్లు, పరీక్ష వేళలపై కసరత్తు చేస్తోంది. శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు ఉన్నందున.. ఈనెల 17 లేదా 18వ తేదీన వీటిని ఖరారు చేయనుంది. కన్వీనర్లకు సంబంధించి ఒక్కో సెట్‌కు ఆయా యూనివర్సిటీలు ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలి. అందులోంచి కన్వీనర్లను ఖరారు చేస్తారు. -
టీచర్లకూ ‘పరీక్ష’
– ఆన్లైన్ టెస్టు ఇప్పుడొద్దంటున్న టీచర్లు – పరీక్షలు సెలవుల్లో జరపాలని డిమాండ్ – 20,21 జరిగే ఆన్లైన్ పరీక్ష రద్దు చేయాలని విన్నపం – ఆందోళనలో ఉపాధ్యాయులు చిత్తూరు (ఎడ్యుకేషన్): రాష్ట్రంలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ప్రై వేటు యాజమాన్యాల్లోని ఉన్నత పాఠశాలల్లో బోధిస్తున్న టీచర్లకు ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించే ఆన్లైన్ (కంప్యూటర్ ఆధారిత పరీక్షలు) ఇప్పుడొద్దని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో నిర్వహించిన పలు సర్వేల ప్రకారం ఏపీ విద్యా ప్రమాణాల్లో వెనుకబడి ఉన్నట్లు తేలింది. ప్రధానంగా ఇంగ్లీషు, గణితం, సైన్సు సబ్జెక్టుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు ఆ సర్వేలు వెల్లడించాయి. ఈ సర్వే ఆధారంగా రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాఅభియాన్ (ఆర్ఎస్ఎంఏ) ద్వారా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయులు ఏ విషయాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించడానికి ట్రై నింగ్ నిడ్స్ ఐడింటిఫికేషన్ టెస్టు (టీఎన్‌ఐటీ) ఆన్లైన్ విధానంలో నిర్వహించడానికి విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ, ప్రై వేటు యాజమాన్యాల్లో పనిచేస్తున్న సబ్జెక్ట్ టీచర్లందరూ ఈ పరీక్ష రాయాల్సిందేనని రాష్ట్ర విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు ద్వారా స్పష్టం చేశారు. ఈ విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమలులో భాగంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఒకే ప్రశ్నాపత్రంతో కూడిన కామన్ పరీక్షలను జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో నిర్వహించే త్రై మాసిక (ఎస్ఏ–1), అర్థసంవత్సరం (ఎస్ఏ–2), వార్షిక పరీక్షలు (ఎస్ఏ–3) రాష్ట్రం మొత్తం ఈ ఏడాది ఒకే విధమైన ప్రశ్నాపత్రాలతో పరీక్షలను జరపనున్నారు. కేంద్రం నిర్వహించిన పలు సర్వేల్లో ఏపీలో విద్యాప్రమాణాల్లో చిట్టచివరి స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది. ఆసర్వే ఆధారంగా తీసుకున్న ప్రభుత్వం ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను గుర్తించి వారికి శిక్షణ ఇస్తే విద్యాప్రమాణాలు పెరుగుతాయని ఈ నిర్ణయం తీసుకుంది. ఆందోళనలో టీచర్లు సామర్థ్యాల ముదింపునకు ప్రభుత్వం నిర్వహించనున్న ఆన్లైన్ పరీక్షపై టీచర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ విధానంపై టీచరదరూ పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకోకుండా విద్యాప్రమాణాల వెనుకబాటుకు టీచర్లను బాధ్యులను చేయడం తగదన్నారు. దశాబ్ధాల క్రితం అప్పటి సిలబస్ ఆధారంగా ఉత్తీర్ణులైన తమకు ఇంటర్మీడియట్ సిలబస్‌ను నిర్ణయించి పరీక్ష రాయమంటే ఎలా రాయాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది టీచర్లకు కంప్యూటర్ పై అవగాహన లేకపోవడంతో ఈ పరీక్షపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఆకస్మాత్తుగా పరీక్ష ఉంటుందని చెబితే ఎలా రాయాలని ప్రశ్నిస్తున్నారు..? వార్షిక సెలవుల్లో జరపాల్సిన ఇటువంటి విధానాలు విద్యాసంవత్సరం జరిగే సమయంలో పెట్టడం అన్యాయమని చెబుతున్నారు. టీఎన్‌ఐటీ సెలవుల్లోనే నిర్వహించాలి – ఏహెసానుల్లా, ఆప్టా జిల్లా అధ్యక్షులు ప్రభుత్వం జరపబోయే టీఎన్‌ఐటీ పరీక్షను సెలవుల్లోనే నిర్వహించాలి. ఆన్లైన్ పరీక్ష పేరుతో ప్రభుత్వం టీచర్లను భయాందోళనకు గురి చేస్తోంది. ఆ విధానం వలన టీచర్లు తరగతులు చెప్పడంలో ఏకాగ్రతను కోల్పోతున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం కల్పించిన తరువాత ఇటువంటి పరీక్షలను పెట్టాలి. ఆన్లైన్ పరీక్ష వద్దు శ్రీకాళహస్తి టౌన్ : స్కూల్ అసిస్టెంట్లు ఇప్పటికే అనేక పనులతో అవస్థలు పడుతుంటే వారిని అవమానించే విధంగా ఆన్లైన్ పరీక్ష నిర్వహించడం మానుకోవాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లందుల గుణశేఖర్ రెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఒక వింత ఆలోచన చేస్తోందని, ఈ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో దీన్ని ఫ్యాప్టో ఆధ్వర్యంలో బహిష్కరిస్తామని తెలిపారు. అలాగే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలో కంప్యూటర్ విద్యపై అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రేషనలైజేషన్ పేరుతో పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని, దీన్ని ఉపాధ్యాయులు ఎదుర్కోవాలని,సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేంత వరకు పోరాడాలని కోరారు. అలాగే ఉమ్మడి సర్వీస్ రూల్స్‌ను ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.ఎస్.బి.సూర్యప్రకాష్, పట్టణ అధ్యక్షుడు రమణయ్య, ప్రధాన కార్యదర్శి కె.ఈశ్వర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కె,సుబ్రమణ్యంరెడ్డి పాల్గొన్నారు. -
ఇక అన్ని పరీక్షలూ ఆన్లైన్లోనే..
- వచ్చే ఏడాది నుంచి టెన్త్‌లో సీసీఈ విధానం - టీచర్లకు బయోమెట్రిక్ - జూన్‌కి 10,300 మంది టీచర్లకు నియామక ఉత్తర్వులు - మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం : వచ్చే ఏడాది నుంచి ఒకటో తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు అన్ని పరీక్షలూ ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వీటితోపాటు ప్రభుత్వం నిర్వహించే అన్ని ‘సెట్లు’ కూడా ఆన్లైన్లోనే జరుపుతామన్నారు. ఇందుకోసం ఒక కమిటీని కూడా నియమించామని చెప్పారు. మంగళవారం పదో తరగతి ఫలితాలు విడుదల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. ఈ విధానంలో సీబీఎస్ఈ తరహాలో నాణ్యమైన విద్యాబోధన ఉంటుందన్నారు. డీఎస్సీలో ఎంపికైన 10,300 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు జూన్ ఒకటికల్లా నియామక ఉత్తర్వులు అందజేస్తామని మంత్రి తెలిపారు. వీరితో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిజ్ఞ (ప్లెడ్జ్) చేయిస్తారన్నారు. వీరికి పది రోజుల పాటు శిక్షణ కూడా ఇస్తామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రేషనలైజేషన్ పూర్తి చేస్తామన్నారు. ఉపాధ్యాయులు పనిచేసే చోటనే నివాసం ఉండాలన్న నిబంధన అమలు చేయనున్నామని, దీనిపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కూడా చర్చించామని చెప్పారు. వచ్చే నెల నుంచి టీచర్లకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని తెలిపారు. దీంతో టీచర్లు ఆలస్యంగా పాఠశాలలకు రావడం, ముందుగానే వెళ్లిపోవడం వంటివి నిరోధించడానికి వీలవుతుందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.10 వేల కోట్ల అంచనా వ్యయాన్ని ప్రతిపాదించామన్నారు. తొలిదశలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్.పి.సిసోడియా మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ఆంగ్లం బోధించే టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నట్టు చెప్పారు. వీరికి ఏప్రిల్ 3న అసెస్మెంట్ టెస్ట్ కూడా నిర్వహించామని తెలిపారు. -
ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహణ
పరీక్షలంటే ప్రశ్న పత్రాలను తయారు చేయటం నుంచి మొదలు పెడితే ముద్రణ, పరీక్షల నిర్వహణ, ఫలితాలు.. ఇలా చాలా వ్యవహారం ఉంటుంది. అయితే ఇవేవీ లేకుండా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే! అది కూడా క్లౌడ్ ఆధారంగా మొబైల్లో, డెస్క్‌టాప్‌లో కానిచ్చేస్తే!! దీన్నే వ్యాపార సూత్రంగా మలుచుకుంది స్కోర్స్‌ఎన్‌ర్యాంక్స్. కృష్ణ, కౌశిక్ చిత్రపు, ప్రదీప్ చేబోలు కలిసి రూ.10 లక్షల పెట్టుబడితో ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ కేంద్రంగా స్కోర్స్‌ఎన్‌ర్యాంక్స్.కామ్‌ను ప్రారంభించారు. మరిన్ని వివరాలివిగో... ♦ జీమ్యాట్, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం వంటి పరీక్షలన్నీ ఆన్లైన్లో నిర్వహిస్తున్న రోజులివి. ఇంకా చెప్పాలంటే ఎంసెట్, డైట్‌సెట్ సహా ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలు కూడా ఆన్లైన్లోనే నిర్వహించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మరి వీటిని ఎదుర్కొనే సామర్థ్యం మన విద్యార్థుల్లో ఉందా అంటే కాసేపు ఆలోచించే పరిస్థితి! ఎందుకంటే కళాశాలు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించే స్థాయికి ఎదగలేదు. అందుకే అకాడమీని పూర్తి చేసుకొని బయటికొచ్చిన విద్యార్థులు ఆన్లైన్ పరీక్షల్లో పోటీపడలేకపోతున్నారు. దీనికి పరిష్కారం చూపించడమే స్కోర్స్‌ఎన్‌ర్యాంక్స్.కామ్ పని. అంటే ఆయా విద్యా సంస్థలకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించుకునే టెక్నాలజీని అభివృద్ధి చేసిస్తామన్నమాట. ♦ స్కోర్స్‌ఎన్‌ర్యాంక్స్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే క్లౌడ్ ఆధారంగా మొబైల్ అండ్ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం మా ప్రత్యేకత. ఉదాహరణకు ఆన్లైన్ పరీక్ష రాస్తున్న విద్యార్థి సరైన సమాధానమివ్వగానే ఆ తర్వాత వచ్చే ప్రశ్న కాసింత కష్టతరమైంది వస్తుంది. ఒకవేళ తప్పుగా ఇస్తే మరింత సులువైన ప్రశ్న వస్తుంది. దీంతో అప్పటికప్పుడే ఆ విద్యార్థి తనకుతానుగా నాలెడ్జ్‌ను తెలుసుకునే వీలుంటుంది. ♦ ప్రస్తుతానికి మా సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాం. స్కోర్స్‌ఎన్‌ర్యాంక్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ వివిధ ఆల్గరిథంలపై 7 పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాం. ప్రస్తుతం కెనడాలోని మూడు కళాశాలలు మా సేవలను పొందుతున్నాయి. ♦ ఇటీవలే ఓ ప్రైవేట్ ఇన్వెస్టర్ సీడ్ లెవల్ ఫండింగ్‌లో పెద్ద మొత్తంలోనే పెట్టుబడులు పెట్టారు. బెంగళూరు, ఆఫ్రికా, న్యూజెర్సీ ప్రాంతాల్లో కార్యాలయాలను ప్రారంభించాలని నిర్ణయించాం. ఇన్వెస్టర్లు ముందుకొస్తే ఫ్రాంచైజీ విధానంలోనూ ప్రారంభించేందుకు సిద్ధం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ఆన్లైన్లో పోటీ పరీక్షలు నిర్వహించిన TSPSC
-
ఏప్రిల్ 4నే జేఈఈ మెయిన్
ఆఫ్‌లైన్, ఆన్లైన్ పరీక్ష తేదీలు మార్పు ఏప్రిల్ 6కు బదులు 4వ తేదీనే రాత పరీక్ష నిర్వహణ తెలంగాణలో కేంద్రాలు రాత పరీక్షతోపాటు ఆన్లైన్ పరీక్ష హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఏర్పాటు చేసే కేంద్రాల్లో రెండూ ఉంటాయి. కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండలో మాత్రం ఆన్లైన్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారు. ఆన్లైన్ పరీక్ష రెండు రోజులకే పరిమితం ఏప్రిల్ 10, 11 తేదీల్లోనే ఆన్లైన్ పరీక్షలు ఏపీలో 22 కేంద్రాల్లో, తెలంగాణలో 6 కేంద్రాల్లోనే పరీక్షలు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ విడుదల, దరఖాస్తులకు అవకాశం సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల్లో (ట్రిపుల్ ఐటీ) వచ్చే ఏడాది ప్రవేశాల కోసం సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్ష తేదీలు మారాయి. వచ్చే ఏప్రిల్ 6న రాత పరీక్షను, 9, 11, 12, 19 తేదీల్లో ఆన్లైన్ పరీక్షను నిర్వహిస్తామని మొదట తమ వెబ్సైట్లో ప్రకటించిన సీబీఎస్ఈ శుక్రవారం జారీ చేసిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో పరీక్ష తేదీలను మార్పు చేసింది. రాత పరీక్షను ఏప్రిల్ 4వ తేదీనాడే నిర్వహిస్తామని ప్రకటించింది. ఆన్లైన్ పరీక్షను కూడా రెండు రోజులకే పరిమితం చేసి ఏప్రిల్ 10, 11 తేదీల్లో నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 22 కేంద్రాలను, తెలంగాణలో 6 కేంద్రాలను పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసింది. విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు శుక్రవారం నుంచి అవకాశం కల్పించింది. ఈనెల 18వ తేదీవరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా 30 ఎన్ఐటీలు, 9 ట్రిపుల్ ఐటీలు, 15 ఇతర ప్రభుత్వ సహాయం పొందే జాతీయ, రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జూన్ 25లోపు ఇంటర్ మార్కులు ఇవ్వాల్సిందే.. జేఈఈ మెయిన్ తుది ర్యాంకు ఖరారులో జేఈఈ మెయిన్ పరీక్షలో వచ్చిన మార్కులకు 60 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి జేఈఈ మెయిన్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు. ఆ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అయితే ఈసారి జూన్ 25వ తేదీలోగా అన్ని రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డులు తమ విద్యార్థుల మార్కులను సీబీఎస్ఈకి అందజేయాలి. జూన్ 25 తరువాత మార్కుల వివరాలు వస్తాయని అనుకునే విద్యార్థులు మెయిన్ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, ఫలితాల వెల్లడి, రీవ్యాల్యుయేషన్, రీవెరిఫికేషన్‌కు సంబంధించిన అన్ని ఫలితాలను జూన్ 25లోగా ప్రకటించాల్సిందే. ఆ తరువాత విద్యార్థుల వివరాలు ఇస్తామంటే కుదరదు. నిర్ణీత వ్యవధిలో సంబంధిత బోర్డుల నుంచి అందిన మార్కులను పరిగణనలోకి తుది ర్యాంకులను ప్రకటిస్తారు. గత ఏడాది జులై 25 వరకు కూడా విద్యార్థుల ఇంటర్ మార్కులను స్వీకరించగా, ఈసారి అది కుదరదు. ఈ లెక్కన ఇంటర్మీడి యట్ అడ్వాన్స్డ్ పరీక్షలను ఈసారి మరింత ముందుగా నిర్వహించాల్సి వస్తుంది. జేఈఈ మెయిన్ షెడ్యూలు ప్రధాన వివరాలు.. నవంబరు 7 నుంచి దరఖాస్తులు ప్రారంభం. నవంబరు 18: దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ. మార్చి 1 నుంచి హాల్ టికెట్లకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 4వ తేదీన ఆఫ్‌లైన్ రాత పరీక్ష, బీఈ/బీటెక్ కోసం పేపరు-1 పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు. బీఆర్క్/బీప్లానింగ్ కోసం పేపరు-2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఆన్లైన్ పరీక్ష. పరీక్షలో నెగిటివ్మార్కులుంటాయి. తప్పుడు సమా ధానం రాస్తే ప్రతి ప్రశ్నకు 1 మార్కు కోత పడుతుంది.