‘టీఆర్టీ’ తేదీలు ఖరారు | tspsc declare trt 2018 exam dates, schedule | Sakshi
Sakshi News home page

‘టీఆర్టీ’ తేదీలు ఖరారు

Published Thu, Feb 1 2018 2:44 AM | Last Updated on Tue, Sep 4 2018 5:37 PM

tspsc declare trt 2018 exam dates, schedule - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టిన ‘టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ (టీఆర్‌టీ)’ పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. ఏ తేదీన, ఏ సమయంలో ఏయే పరీక్షలు నిర్వహిస్తారు, పరీక్షా కేంద్రాలు తదితర పూర్తి వివరాలను బుధవారం ప్రకటించింది. గురుకుల పోస్టులకు ఈ నెల (ఫిబ్రవరి) 19వ తేదీ నుంచి, ఉపాధ్యాయ పోస్టులకు 24వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ గతంలోనే షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఆయా పోస్టులకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య మేరకు పరీక్ష కేంద్రాలు, పరీక్ష విధానాన్ని నిర్ణయించి.. తదనుగుణంగా పూర్తి వివరాలను బుధవారం వెల్లడించింది. గురుకుల పోస్టులకు పూర్తిగా ఆన్‌లైన్‌లో ‘కంప్యూటర్‌ ఆధారిత భర్తీ పరీక్ష (సీబీఆర్‌టీ)’ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉపాధ్యాయ పోస్టుల్లో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం ఎస్జీటీ పోస్టులు, బయాలజీ, మ్యాథ్స్, సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఓఎంఆర్‌ విధానంలో... మిగతా వాటికి సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఇక లాంగ్వేజ్‌ పండిట్, స్కూల్‌ అసిస్టెంట్‌–తెలుగు, పీఈటీ, స్కూల్‌ అసిస్టెంట్‌–బయాలజీ, మేథ్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (తెలుగు మీడియం) పరీక్షలు మినహా మిగతా అన్ని పరీక్షలను కేవలం హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు.

గురుకుల పరీక్షల షెడ్యూల్‌ ఇదీ..
– విద్యాశాఖ గురుకులాల్లోని జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు ఫిబ్రవరి 19న రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం పేపర్‌–1 (పెడగాజీ), మధ్యాహ్నం పేపర్‌–2 (సంబంధిత సబ్జెక్టు) ఉంటాయి.
– డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు 20వ తేదీన ఉదయం పరీక్ష నిర్వహిస్తారు.
– డిగ్రీ కాలేజీల లైబ్రేరియన్‌ పోస్టులకు 20న మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది.
– గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్‌ పోస్టులకు 21న ఉదయం పేపర్‌–1, మధ్యాహ్నం పేపర్‌–2 పరీక్షలు నిర్వహిస్తారు.
– జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్‌ పోస్టులకు 22న ఉదయం పేపర్‌–1, మధ్యాహ్నం పేపర్‌–2 పరీక్షలు ఉంటాయి.
– జూనియర్‌ కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు 23న ఉదయం, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు 23వ తేదీన మధ్యాహ్నం పరీక్షలు ఉంటాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement