4 నోటిఫికేషన్లు.. 423 పోస్టులు | tspsc issued four notices on thursday | Sakshi
Sakshi News home page

4 నోటిఫికేషన్లు.. 423 పోస్టులు

Published Fri, Jan 26 2018 2:50 AM | Last Updated on Tue, Sep 4 2018 5:37 PM

tspsc issued four notices on thursday

సాక్షి, హైదరాబాద్‌: వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 423 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గురువారం నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసింది. 27 హార్టికల్చర్‌ ఆఫీసర్, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌లో 6 అసిస్టెంట్‌ లైబ్రేరియన్, 238 గ్రేడ్‌–2 ఫార్మసిస్టు, 152 ఏఎన్‌ఎం/ఎంపీహెచ్‌ఏ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్లను జారీ చేసింది. మరిన్ని వివరాలను  tspsc.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొంది. అభ్యర్థులు ఈ నెల 29 నుంచి వచ్చే నెల 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 31న మరో 310 పోస్టుల భర్తీకి మూడు నోటిఫికేషన్లను జారీ చేస్తామని వెల్లడించింది. బీసీ సంక్షేమ శాఖలో 219 గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, గిరిజన సంక్షేమ శాఖలో 4 గ్రేడ్‌–1, 87 గ్రేడ్‌–2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement