సాక్షి, హైదరాబాద్: టీఆర్‌టీ ఆన్‌లైన్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మరోసారి ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 26, 27 తేదీల్లో ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని, ఇకపై మళ్లీ అవకాశం ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల దరఖాస్తుల్లో అభ్యర్థులు తమ జిల్లా విషయంలో పొరపాట్లు చేశారని దీంతో వారికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని పేర్కొంది. ఆ సమయంలోనూ చాలా మంది మళ్లీ పొరపాట్లు చేశా రని తెలిపింది. 31 జిల్లాల ప్రకారం చేసిన దరఖాస్తుల్లోనూ పొరపాట్లు చేశారని వెల్ల డించింది. మరోసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారని తెలిపింది.