
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల్లో పలు పోస్టుల భర్తీకి మే 12 నుంచి 17 వరకు మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మొత్తం 1,099 ఖాళీల భర్తీకి గానూ 1:15 నిష్పత్తిలో 16,485 మందిని మెయిన్ పరీక్షలకు ఎంపిక చేసినట్టు పేర్కొంది. మే 12న లైబ్రేరియన్, 13న ఫిజికల్ డైరెక్టర్, 14న ప్రిన్సిపల్ (పాఠశాలలు), 15న జూనియర్ లెక్చరర్లు, 16న ప్రిన్సిపల్ (జూనియర్ కళాశాలలు), 17న డిగ్రీ లెక్చరర్ల పోస్టులకు హైదరాబాద్‌లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment