
సాక్షి, హైదరాబాద్: వివిధ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల నిర్వహించిన టీఆర్‌టీ పరీక్షల ప్రాథమిక కీలను tspsc.gov.in వెబ్‌సైట్‌లో బుధవారం నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల కీలపై ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొంది.
ఈ నెల 31 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంతరాలను స్వీకరించమని స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను ‘టెక్స్‌ట్ బాక్స్ ఆఫ్ సబ్మిట్ ఆబ్జెక్షన్స్’లింకు ద్వారా పంపించాలని తెలిపింది. టెక్స్‌ట్ బాక్సులో ఇంగ్లిష్‌లో మాత్రమే టైప్ చేయాలని సూచించింది. ఇతర భాషల్లో తమ అభ్యంతరాలను తెలియజేయాలనుకునే వారు పీడీఎఫ్ రూపంలో ఫైల్ అటాచ్ లింకు ద్వారా పంపించాలని సూచించింది. అందులో అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పేపరు కోడ్, సిరీస్, ప్రశ్న నంబర్/ప్రశ్న ఐడీ ఉండేలా చూడాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment