882 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ పరీక్షలు
Published Mon, Aug 28 2017 1:41 AM | Last Updated on Tue, Sep 12 2017 1:07 AM
నేడు మరో రెండు కేటగిరీ పోస్టులకు రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీ పోస్టుల భర్తీకి ఆదివారం టీఎస్‌పీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. కంప్యూటర్ ఆధారితంగా ఆన్‌లైన్‌లోనే ఈ పరీక్షలు జరిగాయి. 463 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 4 ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, 7 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, 407 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ లాంగ్వేజెస్ (హిందీ, తెలుగు, ఉర్దూ) పోస్టులకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 130 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించింది. ఇందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ పోస్టులకు పరీక్షలు రాసేందుకు 75,546 మంది దరఖాస్తు చేసుకోగా 64.29 శాతం మంది హాజరయ్యారు. పీజీసీ లాంగ్వేజెస్ మెయిన్ పరీక్షలకు 2,280 మంది అర్హత సాధించగా.. అందులో 87.51 శాతం మంది హాజరయ్యారు.
నేటి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
మరోవైపు ఈనెల 28న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్, మెకానికల్ పరీక్షలను నిర్వహించేందుకు 73 కేంద్రాలను, పీజీటీ (ఇంగ్లిష్) పరీక్ష నిర్వహణకు 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. సివిల్ మెకానికల్ పరీక్షల్లో కామన్ పేపరు ఉంటుందని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్షకు 44,483 మంది, పీజీటీ (ఇంగ్లిష్) పరీక్షకు 2,900 మంది హాజరుకానున్నారు.
Advertisement
Advertisement