post replacement
-
4,755 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో మరో భారీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 4,755 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకానుంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా వైద్య, ఆరోగ్య శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. గ్రామీణ ప్రజలు వైద్యం కోసం దూరప్రాంతాల్లోని పట్టణాలు, నగరాలకు వెళ్లే అవసరం లేకుండా.. గ్రామాల్లోనే మెరుగైన వైద్య సేవలందించేందుకు 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో సేవలందించేందుకు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల నియామకం చేపట్టారు. గతేడాది నవంబర్‌లో 3,393 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి.. నియామక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. తాజాగా మరో 4,755 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తు చేసుకోవడానికి గురువారం నుంచి ఈ నెల 16 వరకు గడువిచ్చింది. అర్హతలు.. ► అభ్యర్థులు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్మెన్లకు 40 ఏళ్లలోపు వయసు ఉండాలి. ► అభ్యర్థులు hmfw.ap.gov.in,cfw.ap.nic వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. -
ఉద్యోగాల భర్తీకి రెడీ.. ఏపీపీఎస్సీ ద్వారా 3,946 పోస్టులు భర్తీ
సాక్షి, అమరావతి: నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుస్తూ అందుబాటులో ఉన్న అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా గ్రూప్–1, గ్రూప్–2 పోస్టులను సాధ్యమైనంత ఎక్కువగా భర్తీ చేసేలా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసిన పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా త్వరగా పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేయనున్నారు. మరిన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకూ ఏపీపీఎస్సీ సన్నాహాలు ప్రారంభించింది. 6 లక్షలకుపైగా పోస్టుల భర్తీతో సరికొత్త చరిత్ర దేశ చరిత్రలో ఎక్కడా, ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో సీఎం జగన్ నిరుద్యోగ అభ్యర్థులకు మేలు చేకూరుస్తున్నారు. రెగ్యులర్ పోస్టులతో పాటు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ తదితర మార్గాల్లో యువతకు ప్రయోజనం కల్పిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 6,03,756 పోస్టులను భర్తీ చేశారు. ఇందులో రెగ్యులర్ పోస్టులు 1,84,264 ఉండగా కాంట్రాక్టు పోస్టులు 19,701, అవుట్ సోర్సింగ్ పోస్టులు 3,99,791 ఉన్నాయి. వీటిలో ప్రధానంగా సచివాలయ వ్యవస్థ ద్వారా 1,21,518 మందికి ఉద్యోగాలు కల్పించడం గమనార్హం. నాడు నోటిఫికేషన్లతో సరి.. నేడు పోస్టులన్నీ భర్తీ గత సర్కారు హయాంలో ఎన్నికల ముందు వరకు పట్టించుకోకుండా ఆరు నెలల ముందు 2018 చివరిలో హడావుడిగా నోటిఫికేషన్లు జారీ చేశారు. కేవలం యువతను మభ్యపెట్టేలా నోటిఫికేషన్లు ఇవ్వడమే కానీ పోస్టులు భర్తీ చేయలేదు. కొన్ని న్యాయవివాదాలతో నిలిచిపోయాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం 3,946 పోస్టులకు సంబంధించిన న్యాయ వివాదాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంది. రెండున్నరేళ్లలో దాదాపు రెండేళ్లు కరోనాతో ఇబ్బందులు ఎదురైనా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి మొత్తం పోస్టులు భర్తీ చేసింది. కొత్తగా 1,237 పోస్టులకు నోటిఫికేషన్లు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొత్తగా 1,237 పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయడంతో పాటు పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ ద్వారా ఏర్పాట్లు చేసింది. ఇవేకాకుండా త్వరలో మరో 458 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేయనుంది. వీటిలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో వాటి సంఖ్యను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల మేరకు గ్రూప్ 1లో 31, గ్రూప్ 2 సర్వీస్‌లో 30 పోస్టులను గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరగనుంది. వైద్యశాఖలో 39 వేల పోస్టుల భర్తీ వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇప్పటికే 27 వేల మంది నియామకాలు పూర్తి కాగా మొత్తం 39 వేల పోస్టులు భర్తీ చేయనున్నారు. జిల్లా బోధనాసుపత్రినుంచి విలేజ్ క్లినిక్ వరకు అన్ని చోట్లా పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. 2 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో 2 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో 1,110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి ఏపీపీఎస్సీ ద్వారా ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించినా న్యాయవివాదాలతో ప్రక్రియ నిలిచిపోయింది. రేషనలైజేషన్ పేరుతో పోస్టులను టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మార్చేశారు. వీటన్నిటినీ సరిదిద్దడంతో పాటు పోస్టుల సంఖ్యను 2 వేలకు పెంచి న్యాయవివాదాలకు తావులేని విధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ద్వారా చర్యలు చేపట్టింది. న్యాయవివాదాలను పరిష్కరించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనున్నారు. 10,143 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. అయితే నిరుద్యోగులకు మేలు చేస్తూ పోస్టుల సంఖ్య మరింత పెరిగేలా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటు పోలీసు విభాగంలో ఏటా 6,500 పోస్టుల భర్తీకి ఇటీవల పోలీసు విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులకు న్యాయం ఎన్నికలకు ముందు గత సర్కారు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకొన్న 2018 డీఎస్సీకి సంబంధించి వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే పూర్తి చేసి వారందరికీ ఉద్యోగాలు కల్పించింది. మొత్తం 7,902 మందికి ఇలా ఉద్యోగాలు వచ్చాయి. ఇదే కాకుండా దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయిన 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులకు సీఎం జగన్మోహన్రెడ్డి న్యాయం చేశారు. ఆ డీఎస్సీలో 2,192 మందికి ఉద్యోగాలు కల్పించి మినిమం టైమ్‌స్కేలును అమలు చేస్తున్నారు. అలాగే కేజీబీవీల్లో 958 పోస్టులను, మోడల్ స్కూళ్లలో 164 టీచింగ్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. -
వైద్య ఆరోగ్యశాఖలో 10,865 పోస్టుల భర్తీకి చర్యలు
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేని రీతిలో వైద్య ఆరోగ్యశాఖలో ఇప్పటికే ఉన్న ఖాళీలతోపాటు పెద్ద ఎత్తున కొత్త పోస్టులను సృష్టించి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 10,865 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు 7,390, కొత్తగా సృష్టించినవి 3,475 ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ (ఏపీవీవీపీ), డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. డీఎంఈ పరిధిలోని 15 వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉన్న 35 ఆస్పత్రుల్లో 1,952 పోస్టులు ఖాళీగా ఉండగా 2,190 పోస్టులను సృష్టించారు. ఏపీవీవీపీ పరిధిలో 2,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 2,918 పోస్టులు ఖాళీగా ఉండగా 1,285 పోస్టులను సృష్టించారు. బోధనాస్పత్రుల్లోని చాలా విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలు అమలు చేయడం ఇబ్బందిగా ఉంటోంది. బోధనాస్పత్రుల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వివిధ విభాగాలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సృష్టించిన పోస్టులను కూడా ఒకేసారి భర్తీ చేయనున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో భాగంగా 1,149 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు అసిస్టెంట్ సివిల్ సర్జన్లు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్.. ఇలా మొత్తం 12 మంది ఉండాలని నిర్ణయించింది. అదేవిధంగా 560 వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లలో ఒక్కో ఫార్మసిస్ట్‌లు ఉండేలా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి ఆయా విభాగాలు, జిల్లా ఎంపిక కమిటీలు నోటిఫికేషన్లు ఇవ్వనున్నాయి. -
ఏపీపీఎస్ ద్వారా త్వరలో 1,200కు పైగా పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా 1,200కు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీకానున్నాయి. ఇందుకు సంబంధించి పోస్టుల సంఖ్యపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే సమగ్రంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. గ్రూప్–1, గ్రూప్–2 సహా 1,200కు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఆగస్టులో ఈ నోటిఫికేషన్లు జారీచేస్తామని ఏపీపీఎస్సీ సభ్యుడు ఎస్.సలాంబాబు మీడియాతో చెప్పారు. ‘ఇటీవల ప్రభుత్వం జారీచేసిన జాబ్ క్యాలెండర్‌పై కొందరిలో కొన్ని అపోహలు తలెత్తాయి. అవేవీ నిజం కాదు. వాస్తవానికి అనేక పోస్టుల భర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ వద్ద 1,180 వరకు ఖాళీ పోస్టుల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా గ్రూప్–1, గ్రూప్–2 కేటగిరీల్లో మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది’ అని ఆయన వివరించారు. 2018లో జారీచేసిన నోటిఫికేషన్లకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేక దాదాపు 364 పోస్టులు భర్తీ కాలేదు. వాటితో పాటు ఇతర ఖాళీలభర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. -
ఫీజుల ‘దడ’ఖాస్తు..!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ దరఖాస్తు సగటు నిరుద్యోగికి చుక్కలు చూపిస్తోంది. దరఖాస్తుకు భారీ మొత్తంలో ఫీజు నిర్ధారించడంతో అభ్యర్థి చేతి చమురు వదులుతోంది. ఎలాంటి ఆదాయ వనరు లేని నిరుద్యోగి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషస్ జారీ చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. దరఖాస్తు ఫీజును రూ.1,200 నిర్ధారించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులకు రూ.600 చొప్పున ఖరారు చేసింది. దీంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ సగటున ఓ దరఖాస్తుకు రూ.200 ఫీజు నిర్ధారించిందని, అందుకు 6 రెట్లు పెంచడం సరికాదంటున్నారు. పీజీటీ, టీజీటీ కలిపి రూ. 2,400 సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2,932 పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో టీజీటీ పోస్టులు 960, పీజీటీ పోస్టులు 1,972 ఉన్నాయి. వీటికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో రూ. 1,200 దరఖాస్తు ఫీజు చూసిన అభ్యర్థులు అవాక్కయ్యారు. పీజీటీ, టీజీటీ అర్హత ఉన్న జనరల్ అభ్యర్థి దరఖాస్తుకు రూ. 2,400 చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. సర్కారు బడ్జెట్ ఇవ్వకపోవడంతో.. గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం టీఆర్‌ఈఐఆర్‌బీ (తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాల ప్రక్రియ జాప్యమవుతుండటంతో త్వరగా భర్తీ చేసేందుకు బోర్డును ఏర్పాటు చేశారు. కానీ బోర్డు నిర్వహణకు సర్కారు నిధులివ్వకుండా.. ఉద్యోగాలకు వచ్చే దరఖాస్తు ఫీజుతోనే పరీక్షల నిర్వహణ, నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. దీంతో రంగంలోకి దిగిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. దరఖాస్తు ఫీజును అమాంతం పెంచేసింది. 12 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్దేశించిన ఫీజు అభ్యర్థులను నిలువునా దోచేయడమే. ఆ ఫీజుతో 12 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు, కోచింగ్‌లంటూ రూ. వేలల్లో ఖర్చు చేస్తున్న నిరుద్యోగుల నుంచి అడ్డగోలుగా వసూలు చేయడం సరికాదు. ఫీజు తగ్గించి.. టీఎస్పీఎస్సీ మాదిరిగా రూ. 200 చొప్పున తీసుకుంటే బాగుంటుంది. – పల్రెడ్డి అనూష, అభ్యర్థి -
12 నుంచి మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీలో భాగంగా పలు సబ్జెక్టుల మెయిన్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. ఈ నెల 12 నుంచి పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. ఒక సబ్జెక్టు కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన వారి విజ్ఞప్తి మేరకు షెడ్యూల్‌ను సవరించినట్లు తెలిపింది. మెయిన్ పరీక్షలకు 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో లైబ్రేరియన్, స్కూల్స్, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీల్లో మార్పు లేదని పేర్కొంది. డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ పరీక్ష తేదీల్లో మార్పులు ఉన్నట్లు వివరించింది. హెచ్ఎండీఏ పరిధిలో కంప్యూటర్ ఆధారితంగా మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. -
882 పోస్టుల భర్తీకి ఆన్లైన్ పరీక్షలు
నేడు మరో రెండు కేటగిరీ పోస్టులకు రాత పరీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీ పోస్టుల భర్తీకి ఆదివారం టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. కంప్యూటర్ ఆధారితంగా ఆన్లైన్లోనే ఈ పరీక్షలు జరిగాయి. 463 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 4 ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, 7 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, 407 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ లాంగ్వేజెస్ (హిందీ, తెలుగు, ఉర్దూ) పోస్టులకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 130 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించింది. ఇందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ పోస్టులకు పరీక్షలు రాసేందుకు 75,546 మంది దరఖాస్తు చేసుకోగా 64.29 శాతం మంది హాజరయ్యారు. పీజీసీ లాంగ్వేజెస్ మెయిన్ పరీక్షలకు 2,280 మంది అర్హత సాధించగా.. అందులో 87.51 శాతం మంది హాజరయ్యారు. నేటి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి మరోవైపు ఈనెల 28న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్, మెకానికల్ పరీక్షలను నిర్వహించేందుకు 73 కేంద్రాలను, పీజీటీ (ఇంగ్లిష్) పరీక్ష నిర్వహణకు 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. సివిల్ మెకానికల్ పరీక్షల్లో కామన్ పేపరు ఉంటుందని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్షకు 44,483 మంది, పీజీటీ (ఇంగ్లిష్) పరీక్షకు 2,900 మంది హాజరుకానున్నారు. -
‘గురుకుల’ పరీక్షా విధానంలో మార్పులు
ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల రాత పరీక్ష ఒకే పూట సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల విధానంలో టీఎస్పీఎస్సీ మార్పులు చేసింది. గురువారం ఈ మేరకు రివైజ్డ్ షెడ్యూల్‌ను జారీ చేసింది. ఇదివరకు ప్రతి కేటగిరీలో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించేలా రెండు పేపర్ల విధానాన్ని ప్రకటించింది. తాజాగా ప్రతి కేటగిరీలో ఒకే పేపర్‌గా రాత పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ జారీ చేసింది. ఈనెల 31న ఆర్ట్ టీచర్ పోస్టులకు ఉదయం జనరల్ స్టడీస్, మధ్యాహ్నం ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుందని పేర్కొనగా.. ఇప్పుడు దానిని మార్పు చేసింది. 31వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జనరల్ స్టడీస్–ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. అలాగే క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టుల పరీక్షల పేపర్లలోనూ మార్పులు చేసింది. వచ్చే నెల 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జనరల్ స్టడీస్–క్రాఫ్ట్ అండ్ క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ పరీక్ష, అదే రోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జనరల్ స్టడీస్–మ్యూజిక్ అండ్ మ్యూజిక్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుందని వివరించింది. పూర్తి వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని వెల్లడించింది. -
వైద్యులు, నర్సులు, పారామెడికల్ పోస్టుల భర్తీ
హానరరీ యూనిట్ల ఏర్పాటు... భద్రత, ఔట్‌సోర్సింగ్‌లకు పెద్దపీట 15 రోజుల్లో హెల్త్‌కార్డులు జారీ మంత్రి కామినేని విశాఖపట్నం, మెడికల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులకు త్వరలోనే పదోన్నతులు కల్పిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు వెల్లడిం చారు. ఖాళీగా ఉన్న వైద్యులు, పారామెడికల్, నర్సుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరి శుభ్రత, భద్రతపై బుధవారం ఆంధ్రవైద్య కళాశాలలో ప్రాంతీ య సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమిళనాడు పారిశు ద్ధ్య విధానాలను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. ఆస్పత్రి సూపరింటెండెంట్లు కాంట్రాక్టు సంస్థల పని తీరుపై నిత్యం పర్యవేక్షణ చూపాలన్నా రు. నూతన పారిశుద్ధ్య విధానంలోని నిబంధనలను సరిగా పాటించని సంస్థలను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వ వైద్యులు ఉదయం 9 గంట ల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విధుల్లో ఉండాల్సిందేనన్నారు. వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న పెద్దాసుపత్రుల్లో ఇకపై డెప్యూటేషన్లు, ఒక వైద్య విభాగానికి చెందిన వైద్యులు వేరే వైద్య విభాగంలో పనిచేసే మిస్‌మ్యాచ్ విధానానికి స్వస్తిపలకనున్నట్లు చెప్పారు. వైద్య రంగంలో అనేక సంస్కరణలను తీసుకురానున్నామని, పేషెంట్ కేర్ మినహా మందులు, రోగనిర్థారణ వైద్య పరీక్షలు, రోగులకు ఇచ్చే ఆహారం వంటి అనేక విభాగాల్లో ఔట్సోర్సింగ్ విధానాన్ని అమలు చేసే యోచనలో ఉందన్నారు. విమ్స్ ఆస్పత్రిలో త్వరలో ఏడు వైద్య విభాగాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు అందించేందుకు ప్రభుత్వం సుముఖంగాఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అక్టోబర్ 15 నుంచి నూ తన పారిశుద్ధ్యం, భద్రత పాలసీని అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం చెప్పారు. అక్టోబర్ నెలాఖరునాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు జరుగుతున్న పారిశు ద్ధ్య, భద్రత కార్యక్రమాలపై ఆస్పత్రి పాలకులు సమ గ్ర ప్రణాళికను రూపొందించి సమర్పించాలన్నారు.