సాక్షి, హైదరాబాద్: గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీలో భాగంగా పలు సబ్జెక్టుల మెయిన్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసింది. ఈ నెల 12 నుంచి పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. ఒక సబ్జెక్టు కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన వారి విజ్ఞప్తి మేరకు షెడ్యూల్‌ను సవరించినట్లు తెలిపింది.
మెయిన్ పరీక్షలకు 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో లైబ్రేరియన్, స్కూల్స్, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీల్లో మార్పు లేదని పేర్కొంది. డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ పరీక్ష తేదీల్లో మార్పులు ఉన్నట్లు వివరించింది. హెచ్‌ఎండీఏ పరిధిలో కంప్యూటర్ ఆధారితంగా మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment