main exams
-
నేడు, రేపు ఎస్ఐ పోస్టులకు మెయిన్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్ఐ పోస్టుల భర్తీకోసం మెయిన్ పరీక్షలను శని, ఆదివారాల్లో నిర్వహించేందుకు పోలీసు నియామక మండలి ఏర్పాట్లు చేసింది. అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల నిర్వహణపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఈ మెయిన్ పరీక్షల నిర్వహణపై ప్రభావం చూపదని పోలీసు నియామక మండలి తెలిపింది. ఈ మేరకు వెబ్సైట్లో కూడా ప్రకటించింది. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఇప్పటికే నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలపై నిర్ణయాన్ని తరువాత ప్రకటించనుంది. రాష్ట్రంలోని నాలుగు కేంద్రాల్లో.. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలుల్లో శని, ఆదివారాల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించనుంది. ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్ విధానంలో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. మెయిన్ పరీక్షలకు మొత్తం 31,193 మంది అర్హత సాధించారు. వారిలో పురుషులు 27,590, మహిళలు 3,603. పరీక్షలకు సంబంధించి సందేహాలుంటే హెల్ప్‌లైన్ నంబర్లు 9441450639, 9100203323కు ఫోన్ చేయవచ్చని, ఈమెయిల్: mail- slprb@ap.gov.in లో సంప్రదించవచ్చని సూచించింది. ఈ పరీక్షల వివరాలు.. అక్టోబరు 14: పేపర్–1 (డిస్క్రిప్టివ్ ) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పేపర్–2 (డిస్క్రిప్టివ్ ) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అక్టోబరు 15: పేపర్–3 (ఆబ్జెక్టివ్) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పేపర్–4 (ఆబ్జెక్టివ్) మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు -
ఆ ఆన్సర్ షీట్లు చూసి టీచర్లు షాక్
ఆగ్రా : పరీక్షలకు ముందు సరైన సన్నద్ధత లేక, సమాధాన పత్రాల్లో దేవుడి బొమ్మలు వేస్తూ.. దేవుడా మమ్మల్ని పాస్ చేయించూ అంటూ కోరుకోవడం సినిమాల్లో చూస్తుంటాం. అచ్చం సినిమాల్లో మాదిరే భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు చేశారు. యూనివర్సిటీ విద్యార్థుల సమాధాన పత్రాలు చూసి పేపర్ మూల్యాంకన చేసే టీచర్లే షాకైపోయారు. వర్సిటీ 2017-18 సంవత్సరానికి సంబంధించిన మెయిన్ ఎగ్జామ్స్ సమాధాన పత్రాల్లో విద్యార్థులు హనుమాన్ భజన్లు, హారతి పాటలు రాశారు. భక్తి పాటలు, హారతి లైన్లతో విద్యార్థులు తమ సమాధాన పత్రాలను నింపేశారని పేపర్లు మూల్యాంకన చేసిన టీచర్లు పేర్కొన్నారు. ఒక విద్యార్థి అయితే ఏకంగా హారతి లైన్లకు అర్థం కూడా రాసినట్టు ఓ టీచర్ చెప్పారు. తన గర్ల్‌ఫ్రెండ్ తనని చదువుల్లో మంచి ప్రతిభ గల వాడిగా భావిస్తుందని, తనని పాస్ చేయాలని లేదంటే ఆమె తనని విడిచిపెడుతుందంటూ ఓ విద్యార్థి తన మనోవేదనను వెల్లబుచ్చాడు. ఇలా సమాధాన పత్రాల్లో వింత వింత జవాబులతో పేపర్లు దిద్దే టీచర్లకే చుక్కలు చూపించారు. కొన్ని కేసుల్లో 20 పేజీల సమాధాన పత్రాలను సినిమా స్క్రిఫ్ట్‌లు, కవితలు, పాస్ మార్కులు వేయాలంటూ అభ్యర్థనలు ఇవే కనిపించాయని, కొంతమంది విద్యార్థులైతే ఏకంగా టీచర్లను ప్రలోభపెట్టేందుకు కరెన్సీ నోట్లను కూడా ఆఫర్ చేసినట్టు ఓ సీనియర్ టీచర్ చెప్పారు. వింత వింత సమాధానాలు రాసిన విద్యార్థుల తుది ఫలితాలు జూన్ 15న వర్సిటీ అధికారులు వెల్లడించనున్నారు. ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయకుండా.. ఇలాంటి సిల్లీ సిల్లీ అంశాలు రాసి పాస్ కావాలని విద్యార్థులు యోచిస్తున్నారని భీమ్ రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ జీఎస్ శర్మ అన్నారు. ప్రతి రోజు టీచర్లు 5000కు పైగా సమాధాన పత్రాలను దిద్దుతారని వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫైనల్ ఎగ్జామ్స్‌కు దాదాపు 5.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. -
12 నుంచి మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: గురుకుల జూనియర్, డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీలో భాగంగా పలు సబ్జెక్టుల మెయిన్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. ఈ నెల 12 నుంచి పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. ఒక సబ్జెక్టు కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన వారి విజ్ఞప్తి మేరకు షెడ్యూల్‌ను సవరించినట్లు తెలిపింది. మెయిన్ పరీక్షలకు 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో లైబ్రేరియన్, స్కూల్స్, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీల్లో మార్పు లేదని పేర్కొంది. డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ పరీక్ష తేదీల్లో మార్పులు ఉన్నట్లు వివరించింది. హెచ్ఎండీఏ పరిధిలో కంప్యూటర్ ఆధారితంగా మెయిన్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. -
సజావుగా గ్రూప్–2 మెయిన్ పరీక్షలు
అనంతపురం రూరల్: వసతి గృహాల సంక్షేమ అధికారుల నియామకానికి ఏపీపీఎస్సీ గురువారం నిర్వహించిన మెయిన్ పరీక్ష సజావుగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్–2 మెయిన్ పరీక్షలకు మొత్తం 650 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 179 మంది అభ్యర్థులు గైర్వాజరయ్యారు. రాప్తాడు మండల పరిధిలోని ఎస్వీఐటీ కళాశాలలో నిర్వహించిన పరీక్ష కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ రమామణి పరిశీలించారు. -
రేపటి నుంచి ఏపీపీఎస్సీ మెయిన్ పరీక్షలు
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21న జరుగుతున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్‌డబ్ల్యూఓ) మెయిన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై ఆయా కేంద్రాల ప్రిన్సిపాళ్లు, లైజన్ అధికారులతో మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆమె మంగళవారం సమీక్షించారు. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు తర్వాత మధ్యాహ్నం 1.30 గంటకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోరాదన్నారు. అలాగే ఈ నెల 22, 23 తేదీల్లో ఏఎస్ఓ, ఏబీసీడబ్ల్యూఓ, ఏటీడబ్ల్యూఓ పరీక్షలు గుత్తిలోని గేట్స్ కళాశాలలో ఉంటాయని పేర్కొన్నారు. హెచ్‌డబ్ల్యూఓ పరీక్ష కేంద్రాలు + పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల రుద్రంపేట, సనప రోడ్డు, అనంతపురం + శ్రీ షిరిడీసాయి ఇంజనీరింగ్ కళాశాల, పొడరాళ్ల, బుక్కరాయసముద్రం + ఎస్వీఐటీ ఇంజనీరింగ్ కళాశాల, హంపాపురం, రాప్తాడు + చిరంజీవిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, బళ్లారి రోడ్డు, రాచానపల్లి + గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల, గుత్తి అనంతపురం, పెద్దవడుగూరు మండలం