- హానరరీ యూనిట్ల ఏర్పాటు...
- భద్రత, ఔట్‌సోర్సింగ్‌లకు పెద్దపీట
- 15 రోజుల్లో హెల్త్‌కార్డులు జారీ
- మంత్రి కామినేని
విశాఖపట్నం, మెడికల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులకు త్వరలోనే పదోన్నతులు కల్పిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు వెల్లడిం చారు. ఖాళీగా ఉన్న వైద్యులు, పారామెడికల్, నర్సుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరి శుభ్రత, భద్రతపై బుధవారం ఆంధ్రవైద్య కళాశాలలో ప్రాంతీ య సదస్సుకు ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తమిళనాడు పారిశు ద్ధ్య విధానాలను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. ఆస్పత్రి సూపరింటెండెంట్లు కాంట్రాక్టు సంస్థల పని తీరుపై నిత్యం పర్యవేక్షణ చూపాలన్నా రు. నూతన పారిశుద్ధ్య విధానంలోని నిబంధనలను సరిగా పాటించని సంస్థలను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వ వైద్యులు ఉదయం 9 గంట ల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విధుల్లో ఉండాల్సిందేనన్నారు.
వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న పెద్దాసుపత్రుల్లో ఇకపై డెప్యూటేషన్లు, ఒక వైద్య విభాగానికి చెందిన వైద్యులు వేరే వైద్య విభాగంలో పనిచేసే మిస్‌మ్యాచ్ విధానానికి స్వస్తిపలకనున్నట్లు చెప్పారు. వైద్య రంగంలో అనేక సంస్కరణలను తీసుకురానున్నామని, పేషెంట్ కేర్ మినహా మందులు, రోగనిర్థారణ వైద్య పరీక్షలు, రోగులకు ఇచ్చే ఆహారం వంటి అనేక విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ విధానాన్ని అమలు చేసే యోచనలో ఉందన్నారు.
విమ్స్ ఆస్పత్రిలో త్వరలో ఏడు వైద్య విభాగాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు అందించేందుకు ప్రభుత్వం సుముఖంగాఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అక్టోబర్ 15 నుంచి నూ తన పారిశుద్ధ్యం, భద్రత పాలసీని అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం చెప్పారు. అక్టోబర్ నెలాఖరునాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు జరుగుతున్న పారిశు ద్ధ్య, భద్రత కార్యక్రమాలపై ఆస్పత్రి పాలకులు సమ గ్ర ప్రణాళికను రూపొందించి సమర్పించాలన్నారు.