kamineni Rao
-
ఆరోగ్య రాజధానిగా విశాఖ
మంత్రి కామినేని శ్రీనివాసరావు మణిపాల్‌లో ఫీటల్ మెడిసిన్ ప్రారంభం విశాఖ మెడికల్: విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగానే కాకుండా ఆరోగ్య రాజధానిగా తీర్చిదిద్దనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు తెలిపారు. జగదాంబ జంక్షన్‌లోని మణిపాల్ తల్లి, పిల్లల ఆస్పత్రిలో బుధవారం ఫీటల్ మెడిసిన్, నవజాత నిశిత శిశు చికిత్సా(ఎన్ఐసీయూ) విభాగాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల వైద్య కేంద్రంగా విరాజిల్లుతోందని, భవిష్యత్‌లో మరిన్ని అధునాతన వైద్య సదుపాయాలను తీసుకురావడం ద్వారా దీనిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఒడిశా, చత్తీస్ఘడ్, ఉత్తరాఖండ్ రాష్టాల సరిహద్దు జిల్లాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు విశాఖ నగరానికి వైద్యం కోసం వస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ వైద్య రంగంలో ప్రత్యేక వైద్య సదుపాయాలు నగరంలో అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. విశాఖలో తొలిసారిగా మణిపాల్ తల్లి,పిల్ల ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య విభాగమైన ఫీటల్ మెడిసిన్ ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. మణిపాల్ ఆస్పత్రి సీఈవో, మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ అజయ్‌భక్షి మాట్లాడుతూ నగరంలో తొలిసారిగా మణిపాల్ ఆస్పత్రి అధునాతన నవజాత శిశు ైవె ద్య సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. 2007లోనే నవజాత శిశు వైద్యంలో లెవల్-3 చికిత్స సదుపాయాలను మణిపాల్ ఆస్పత్రి నగరానికి పరిచయం చేసిందన్నారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఫీటల్ మెడిసిన్ చికిత్స పుస్తకాన్ని మంత్రితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఆస్పత్రి ఫీటల్ మెడిసిన్ అధిపతి డాక్టర్ ఎం.మాధురి, నవజాత శిశు వైద్య నిపుణుడు డాక్టర్ సునీల్‌కిషోర్, పిల్లల వైద్యురాలు డాక్టర్ అమితా త్రిపాఠి, జి.రాము, మణిపాల్ గ్రూప్ దక్షిణ భారత సీఓఓ గౌరవ్ రేఖి తదితరులు పాల్గొన్నారు. -
పేద క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని నెల్లూరు ( వైద్యం ) : జిల్లాలోని పేద క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కళాశాలలో శనివారం ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్ పేషంట్లకు రెడ్‌క్రాస్ లేదా మెడికల్ కళాశాల పరిధిలో సేవలు అందించాల్సిన విషయాన్ని చర్చిస్తున్నామన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలించి వారంలోగా నివేదికలు పంపాలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు. సివిల్ సర్జన్ల విషయం డీఎంఈతో చర్చిస్తా జీఓ నంబరు 138తో తమకు అన్యాయం జరిగిందని సివిల్ సర్జన్లు మంత్రి కామినేనిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కొన్నేళ్లుగా ఇక్కడ సేవలందిస్తున్న తమను ఇతర జిల్లాలకు బదిలీచేయడంతో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం మధ్యలో అర్ధాంతరంగా బదిలీలు చేస్తే పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడుతాయని వివరించారు. స్పందించిన మంత్రి బదిలీలపై డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌తో చర్చిస్తానన్నారు. వీలైనంత వరకు దగ్గరలో ఉండే ఆసుపత్రులలోనే సివిల్ సర్జన్లు పనిచేసేలా చూస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, కలెక్టర్ శ్రీకాంత్, కమిషనర్ చక్రధర్‌బాబు, ఇన్చార్జి డీఎంహెచ్ఓ కోటేశ్వరి, ప్రిన్సిపల్ ప్రభాకర్‌రావు, డీసీహెచ్ఎస్ సుబ్బారావు, మెడికల్ సూపరింటెండెంట్ విజయభాస్కర్‌రెడ్డి, ఆర్ఎంఓ ఉషా సుందరి, వైద్యులు శాస్త్రి, నిరంజన్, కెఎస్ రాజు, రమణయ్య, నాయకులు రామకృష్ణారావు, శేషారత్నం పాల్గొన్నారు. -
వైద్యులు, నర్సులు, పారామెడికల్ పోస్టుల భర్తీ
హానరరీ యూనిట్ల ఏర్పాటు... భద్రత, ఔట్‌సోర్సింగ్‌లకు పెద్దపీట 15 రోజుల్లో హెల్త్‌కార్డులు జారీ మంత్రి కామినేని విశాఖపట్నం, మెడికల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులకు త్వరలోనే పదోన్నతులు కల్పిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు వెల్లడిం చారు. ఖాళీగా ఉన్న వైద్యులు, పారామెడికల్, నర్సుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరి శుభ్రత, భద్రతపై బుధవారం ఆంధ్రవైద్య కళాశాలలో ప్రాంతీ య సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమిళనాడు పారిశు ద్ధ్య విధానాలను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. ఆస్పత్రి సూపరింటెండెంట్లు కాంట్రాక్టు సంస్థల పని తీరుపై నిత్యం పర్యవేక్షణ చూపాలన్నా రు. నూతన పారిశుద్ధ్య విధానంలోని నిబంధనలను సరిగా పాటించని సంస్థలను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వ వైద్యులు ఉదయం 9 గంట ల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విధుల్లో ఉండాల్సిందేనన్నారు. వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న పెద్దాసుపత్రుల్లో ఇకపై డెప్యూటేషన్లు, ఒక వైద్య విభాగానికి చెందిన వైద్యులు వేరే వైద్య విభాగంలో పనిచేసే మిస్‌మ్యాచ్ విధానానికి స్వస్తిపలకనున్నట్లు చెప్పారు. వైద్య రంగంలో అనేక సంస్కరణలను తీసుకురానున్నామని, పేషెంట్ కేర్ మినహా మందులు, రోగనిర్థారణ వైద్య పరీక్షలు, రోగులకు ఇచ్చే ఆహారం వంటి అనేక విభాగాల్లో ఔట్సోర్సింగ్ విధానాన్ని అమలు చేసే యోచనలో ఉందన్నారు. విమ్స్ ఆస్పత్రిలో త్వరలో ఏడు వైద్య విభాగాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు అందించేందుకు ప్రభుత్వం సుముఖంగాఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అక్టోబర్ 15 నుంచి నూ తన పారిశుద్ధ్యం, భద్రత పాలసీని అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం చెప్పారు. అక్టోబర్ నెలాఖరునాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు జరుగుతున్న పారిశు ద్ధ్య, భద్రత కార్యక్రమాలపై ఆస్పత్రి పాలకులు సమ గ్ర ప్రణాళికను రూపొందించి సమర్పించాలన్నారు.