పాపన్నపేట (మెదక్): దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్) పద్ధతిన డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మూడు విడతల్లో ఆన్‌లైన్ ప్రవేశాలు జరగనున్నాయి. దేశంలోనే మొట్ట మొదటిసారిగా 2016లో దోస్త్ పద్ధతిన తెలంగాణలో ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించారు. గతంలో చోటుచేసుకున్న లోటుపాట్లను గుర్తించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులతో పాటు కొత్త సౌకర్యాలు కల్పించారు. డిమాండ్‌లేని కోర్సుల సీట్లకు కోత విధించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత అందులో పాసైన వారికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి ఇంటర్‌లో ఫలితాలు తగ్గిన నేపథ్యంలో డిగ్రీ సీట్లకు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది.
మార్కులు, రిజర్వేషన్ల ప్రకారం కేటాయింపు
జిల్లాలో నాలుగు ప్రభుత్వ, 15ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 12వేల మంది విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉంది. 2016 వరకు ఇంటర్‌పరీక్షల్లో సాధించిన మార్కులు, కుల, స్పోర్ట్స్, దివ్యాంగుల రిజర్వేషన్లకు అనుగుణంగా డిగ్రీలో ప్రవేశాలు కల్పించేవారు. 2016లో దోస్త్ పద్ధతిని ప్రవేశ పెట్టారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
మార్కులు, రిజర్వేషన్లకు అనుగుణంగా విద్యార్థులకు కళాశాల కేటా యిస్తారు. ఈ విధానంపై మొదట్లో కొన్ని విమర్శలు వ్యక్తమయ్యాయి. మీసేవతోపాటు ఆధార్ అనుసంధానమైన మొబైల్ నుంచి విద్యార్థులు రిజస్ట్రేషన్ చేసుకునేవారు. కొంతమందికి వేలి ముద్రలు నమోదు కాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెం దిన విద్యార్థులు ఆన్‌లైన్ సౌకర్యం అందుబా టులో లేక, వాటిపై అవగాహన కరువై ఇంటర్‌తోనే విద్య మానేసిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 27 ప్రైవేట్, 20 మైనార్టీ డిగ్రీ కళాశాలలు దోస్తులో చేరకుండా సొంతంగా ప్రవేశాలు చేసుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment