breaking news
GPAT
-
నీట్ మినహా అన్నీ ఆన్లైన్లో
సాక్షి, హైదరాబాద్ : జాతీయ స్థాయి సంస్థల్లోని సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం 13 రకాల పోటీ పరీక్షల షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జారీ చేసింది. 2020–21 విద్యా సంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్), యూజీసీ నెట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఎంబీఏ అడ్మిషన్ టెస్టు, సీఎస్ఐఆర్ యూజీసీ నెట్, కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్), గ్రాడ్యు యేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్టు (జీప్యాట్), ఆలిండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్టు, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ ఎంబీఏ, బీఎడ్ అడ్మిషన్ టెస్టు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్), జేఎన్‌యూ ఎంట్రెన్స్ టెస్టు, ఢిల్లీ వర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు నిర్వహణకు షెడ్యూలు విడుదల చేసింది. వీటిల్లో జేఈఈ, యూజీసీ నెట్, సీఎస్ఐఆర్–యూజీసీ నెట్ వంటి పరీక్షలను ఏటా రెండుసార్లు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించింది. నీట్ మినహా మిగతా పరీక్షలన్నింటినీ ఆన్లైన్లో నిర్వహిస్తామని పేర్కొంది. విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో 4 వేల ప్రాక్టీస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ వివరించింది. ఇవి సెప్టెంబర్ 1 నుంచి పని చేస్తాయని, ప్రతి శనివారం, ఆదివారం వీటిని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. పరీక్షల షెడ్యూలు వివరాలు.. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు: సెప్టెంబర్ 2 నుంచి 30 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్: డిసెంబర్ 6 నుంచి పరీక్షల తేదీలు:2020 జనవరి 6 నుంచి 11 వరకు ఫలితాల వెల్లడి: జనవరి 31 జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు: 2020 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : మార్చి 16 నుంచి పరీక్షల తేదీలు : ఏప్రిల్ 3 నుంచి 9 వరకు ఫలితాల వెల్లడి : ఏప్రిల్ 30 నీట్ పరీక్షలు.. రిజిస్ట్రేషన్ తేదీలు : డిసెంబర్ 2 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : 2020 మార్చి 27 నుంచి పరీక్ష తేదీ: మే 3 ఫలితాల వెల్లడి: జూన్ 4 ఐఐఎఫ్‌టీ ఎంబీఏ అడ్మిషన్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 25 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : నవంబర్ 11 నుంచి పరీక్ష తేదీ : డిసెంబర్ 1 ఫలితాల వెల్లడి : డిసెంబర్ 11 యూజీసీ నెట్ మొదటి విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు : సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : నవంబర్ 9 నుంచి పరీక్షల తేదీలు : డిసెంబర్ 2నుంచి 6 వరకు ఫలితాల వెల్లడి : డిసెంబర్ 31 యూజీసీ నెట్ రెండో విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు :2020 మార్చి 16 నుంచి ఏప్రిల్ 16 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : మే 15 నుంచి పరీక్షల తేదీలు : జూన్ 15 నుంచి 20 వరకు ఫలితాల వెల్లడి : జూలై 5 సీఎస్ఐఆర్ మొదటి విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు : సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : నవంబర్ 9 నుంచి పరీక్ష తేదీ : డిసెంబర్ 15 ఫలితాల వెల్లడి : డిసెంబర్ 31 సీఎస్ఐఆర్ రెండో విడత పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 మార్చి 16 నుంచి ఏప్రిల్15 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : మే 15 నుంచి పరీక్ష తేదీ: జూన్ 21 ఫలితాల వెల్లడి : జూలై 5 సీమ్యాట్, జీప్యాట్ రిజిస్ట్రేషన్ తేదీలు : నవంబర్ 1 నుంచి 30 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : డిసెంబర్ 24 నుంచి పరీక్ష తేదీ : 2020 జనవరి 24 ఫలితాల వెల్లడి : ఫిబ్రవరి 3 ఆలిండియా ఆయుష్ పీజీ ఎంట్రన్స్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 జనవరి 1 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 1 నుంచి పరీక్ష తేదీ : ఏప్రిల్ 29 ఫలితాల వెల్లడి : మే 10 నేషనల్ కౌన్సిల్ ఫర్హోటల్ మేనేజ్మెంట్ (ఎన్సీహెచ్ఎం) రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 29 వరకు. హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 1నుంచి పరీక్ష తేదీ : ఏప్రిల్ 25 ఫలితాల వెల్లడి : మే 10 ఇగ్నో ఎంబీఏ, బీఎడ్ అడ్మిషన్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 29 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 1 నుంచి పరీక్ష తేదీ : ఏప్రిల్ 29 ఫలితాల వెల్లడి : మే 10 జేఎన్‌యూ ఎంట్రన్స్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 మార్చి 2 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 21 నుంచి పరీక్షల తేదీలు : మే 11 నుంచి 14 వరకు ఫలితాల వెల్లడి : మే 31 ఐకార్ ఏఐఈఈఏ రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 మార్చి 1 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 25 నుంచి పరీక్ష తేదీ: జున్ 1 ఫలితాల వెల్లడి : జూన్ 15 ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు రిజిస్ట్రేషన్ తేదీలు : 2020 మార్చి 2 నుంచి 31 వరకు హాల్‌టికెట్ల డౌన్లోడ్ : ఏప్రిల్ 30 నుంచి పరీక్షల తేదీలు : జూన్ 2 నుంచి 9 వరకు ఫలితాల వెల్లడి : జూన్ 25 -
సీమ్యాట్‌లో ఒకే ఒక్కడు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆమోదం పొందిన మేనేజ్మెంట్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్), జాతీయ స్థాయి ఫార్మసీ, ఎంఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్టు (జీప్యాట్) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. గత నెల 28, 29 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించింది. సీమ్యాట్‌లో శర్మ నవాంశ్ సురేంద్ర అనే విద్యార్థి ఒక్కరే 100 పర్సంటైల్ సాధిం చి మొదటి ర్యాంకర్‌గా నిలిచినట్లు ఎన్టీఏ వెల్లడించింది. జ్యీపాట్‌లోనూ 302 మార్కులతో యావల్కర్ అంకిత నితిన్ ఒక్కరే 100 పర్సంటైల్ సాధించి మొద టి ర్యాంకర్‌గా నిలిచినట్లు వివరించింది. జీప్యాట్ స్కోర్‌కు మూడేళ్ల వ్యాలిడిటీ ఉంటుందని వెల్లడించింది. సీమ్యాట్‌కు హాజరయ్యేందుకు 64,582 మంది దరఖాస్తు చేసుకోగా 54,516 మంది హాజరైనట్లు వెల్లడించింది. బాలికలు 29,166 మంది బాలురు, 25,350 మంది బాలికలు హాజరైనట్లు వెల్లడించింది. జీప్యాట్ రాసేందుకు 42,827 మంది దరఖాస్తు చేసుకోగా, 40,649 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 18,044 మంది బాలురు, 22, 604 మంది బాలికలు ఉన్నట్లు వివరించింది. అందులో పీహెచ్డీ లో ప్రవేశానికి, స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకునేం దుకు 4,119 మంది అర్హత సాధించినట్లు తెలిపింది. అందులో 1,909 మంది బాలురు, 2,210 మంది బాలికలు ఉన్నారు. ఇందుకు అన్‌రిజర్వ్‌డ్‌లో 141 మార్కులు కటాఫ్ అని, దాంతో 1,952 మంది ఎంపి కయ్యారు. ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో కటా ఫ్ 117 మార్కులుగా 1,103 ఎంపిక అయ్యారు. ఎస్సీలలో 95 మార్కుల కటాఫ్‌తో 626 మంది, ఎస్టీలలో 74 కటాఫ్‌తో 313 మంది ఎంపికైనట్లు వివరించింది. -
బహుళ ప్రయోజనాల.. జీప్యాట్
ఆర్.వేణుగోపాల్, మాస్టర్స్ ఫార్మసీ అకాడమీ, హైదరాబాద్ మాస్టర్ ఆఫ్ ఫార్మసీ.. సంక్షిప్తంగా ఎం.ఫార్మ్. బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి చదవాలనుకునే కోర్సు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలలో ఎం.ఫార్మ్ కోర్సులో ప్రవేశం కోరుకునే విద్యార్థులందరూ జీప్యాట్ పరీక్షకు హాజరు కావల్సిందే. ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి చక్కని వేదిక.. గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్). 2014 సంవత్సరానికి జీప్యాట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంబంధిత వివరాలపై ఫోకస్.. జీప్యాట్‌లో మంచి స్కోరు సాధించడం ద్వారా ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న అన్ని ఇన్‌స్టిట్యూట్‌లతోపాటు అన్ని యూనివర్సిటీలలో ఎం.ఫార్మసీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. ప్రయోజనాలు జీప్యాట్‌లో అర్హత సాధించడం ద్వారా బహుళ ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అవి.. జీప్యాట్ స్కోర్‌కు ఏడాదిపాటు చెల్లుబాటు ఉంటుంది. ఈ స్కోర్ ఆధారంగా అన్ని సెంట్రల్, స్టేట్ యూనివర్సిటీలలో ప్రవేశం పొందొచ్చు. నిర్దేశించిన విధంగా ఎంఫార్మసీ కోర్సులో ప్రవేశం పొందితే నెలకు రూ. 8 వేల స్కాలర్షిప్ లభిస్తుంది. జీప్యాట్ ప్రిపరేషన్ ఫార్మసీ నేపథ్యంగా నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు- పీజీఈసెట్, మణిపాల్సెట్, బిట్స్-పీజీ, ఫార్మ్పీజీ (భారతీయ విద్యాపీఠ్), ప్రభుత్వ రంగంలో నిర్వహించే ఫార్మాసిస్ట్, డ్రగ్ ఇన్స్పెక్టర్ల నియామకం కోసం నిర్వహించే పరీక్షలు. నైపర్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్)లో ప్రవేశం కోసం నిర్వహించే నైపర్-జేఈఈకి హాజరు కావాలంటే జీప్యాట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. బెనారస్ హిందూ యూనివర్సిటీ, బిట్స్ పిలానీ, పంజాబ్ యూనివర్సిటీ, బాంబే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందొచ్చు (ఇందుకోసం 100లోపు ర్యాంక్ సాధించాలి). జీప్యాట్ స్కోర్‌తో సీసీఎంబీ, సీడీఆర్ఐ వంటి పరిశోధన సంస్థల నుంచి ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ చేయవచ్చు. జీప్యాట్‌లో అర్హత సాధించడం ద్వారా ఉస్మానియా, జేఎన్టీయూ వంటి యూనివర్సిటీల నుంచి పార్ట్ టైం/ఫుల్ టైం పీహెచ్డీ కోర్సులను చేయవచ్చు. ఆన్లైన్లో పరీక్ష జీప్యాట్ను జాతీయ స్థాయిలో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉండే ఈ పరీక్షలో మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. వీటికి మూడు గంట (180 నిమిషాలు)ల్లో సమాధానాలను గుర్తించాలి. సిలబస్ బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు కేటాయించిన మార్కులు నాలుగు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో వె బ్‌సైట్‌లో ట్రయల్ టెస్ట్ అందుబాటులో ఉంచారు. పరీక్ష రోజున నోటిఫికేషన్లో నిర్దేశించిన గుర్తింపు కార్డులను పరీక్ష కేంద్రానికి తీసుకురావాలి. స్కిల్స్ కీలకం జీప్యాట్‌లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్, అసెర్షన్-రీజన్, స్టేట్మెంట్ బేస్డ్ విధానంలో ఉంటాయి. కాబట్టి మెరుగైన స్కోరును సొంతం చేసుకోవాలంటే అభ్యర్థుల్లో అనలిటికల్ రీజనింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉండాలి. కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ఒక విషయాన్ని వాస్తవ పరిస్థితుల్లో అంచనా వేసే సామర్థ్యం సొంతం చేసుకోవాలి (ఉదాహరణకు బీపీ, షుగర్ ఉన్న రోగికి ఓ డ్రగ్ ఇస్తే ఎదురయ్యే పరిణామాలను ముందుగానే అంచనా వేయగలగడం). బ్యాచిలర్ స్థాయిలో అకడెమిక్‌గా పట్టున్న వారు ఈ విషయంలో ముందుంటారనేది నిస్సందేహం. ముందుగా నిర్దేశించిన సిలబస్ ప్రకారం ఆయా సబ్జెక్టుల్లో బేసిక్స్‌పై పట్టు సాధించడానికి కృషి చేయాలి. ముఖ్యమైన అంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి. సిద్ధం ఇలా ప్రిపరేషన్ పరంగా వ్యూహాన్ని రూపొందించుకోవాలి. ప్రస్తుతం ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే సిలబస్ పూర్తి చేయాలంటే కష్టం. కాబట్టి గ్రూప్ డిస్కషన్, షాట్ నోట్స్ వంటి వ్యూహాలను అనుసరించాలి. ఫార్మకాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ రెండు అంశాలను ఒకే సమయంలో సమన్వయంతో ప్రిపేర్ కావడం ఉపకరిస్త్తుంది. ఉదాహరణకు ఫార్మకాలజీలో ఏఎన్ఎస్ (ఊ) గురించి చదివే సమయంలో మెడిసినల్ కెమిస్ట్రీలోని ఏఎన్ఎస్ (ఊ) గురించి కూడా ప్రిపేర్ కావాలి. అదే సమయంలో ఈ రెండు అంశాల్లోని క్లాసిఫికేషన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. టేబుల్స్ రూపొందించుకోవడం ద్వారా ఫార్మాకోగ్నసీలోని అంశాలపై పట్టు సాధించడం సులభమవుతుంది. గత గేట్ (పీవై)/జీప్యాట్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. తద్వారా ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పడుతుంది. ప్రిపరేషన్ నిర్దేశించిన సిలబస్‌ను పరిశీలిస్తే.. ఫార్మాస్యుటిక్స్, ఫార్మాస్యుటికల్ ఎనాలసిస్, ఫార్మకాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మోకోగ్నసీ, బయోకెమిస్ట్రీ, క్లినికల్ ఫార్మసీ, ఫిజికల్ ఫార్మసీ, బయోఫార్మాస్యుటిక్స్ వంటివి కీలకమైనవి. అంశాలవారీగా ప్రిపరేషన్ విధానాన్ని పరిశీలిస్తే.. ఫార్మాస్యుటిక్స్ ఫార్మాస్యుటిక్స్ లాచ్మన్ (్చఛిజిఝ్చ) పుస్తకంలో ఉన్న అన్నీ చార్ట్స్, సెమీసాలిడ్, ట్యాబ్లెట్స్ (క్యూసీ డిసొల్యూషన్ అపర్చెస్, డెఫిక్టిస్, కోటింగ్), క్యాప్సూల్స్(ఇ్చఞటఠ్ఛట), పరెంతరల్స్ (్క్చట్ఛ్ట్ఛట్చట), ఏరోసోల్స్ (అ్ఛటౌటౌట), ఫార్మాస్యుటికల్ ఈక్వేషన్స్ (ఆర్ ఎం మోహతా, రేమింగ్టన్), సైజ్రిడక్షన్, సైజ్ సెపరేషన్ వంటి అంశాలకు సంబంధించిన అన్నీ టేబుల్స్‌ను క్షుణ్నంగా ప్రిపేర్ కావాలి. అంతేకాకుండా వీటిని వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. పునశ్చరణకు తప్పకుండా సమయం కేటాయించాలి. ఫార్మకాలజీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్ కేటగిరీ డ్రగ్స్-మెకానిజం ఆఫ్ యాక్షన్, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్, డ్రగ్ ఇంటర్యాక్షన్స్, వాటి ఉపయోగాలు వంటి కీలకాంశాలు. ఈ అంశాలను తరచుగా పునశ్చరణ చేయడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. రిఫరెన్సెస్: Rang & Dale, K.D.Tripathi. ఫార్మాస్యుటికల్ అనాలిసిస్ యూవీ విజిబిల్ (ఉడ్‌వర్డ్ ఫిస్చేర్ రూల్), ఎన్ఎంఆర్ (NMR), ఎంఏఎస్ఎస్ (MASS), ఐఆర్ (I.R)-రేజెంస్, (సోర్సెస్, డిటెక్టర్స్, ఇన్స్ట్రుమెంటేషన్) ఎక్స్-ఆర్డీ డిఫరాక్షన్ (చాత్వాల్), ఈఎస్ఆర్ (ESR చాత్వాల్), ప్రాబ్లమ్స్ (వైఆర్ శర్మ), క్రోమాటోగ్రఫీ మెథడ్స్-డిటెక్టర్స్ (రేమింగ్టన్), ఎసెస్ (Assays- పీయూష్ పబ్లికేషన్స్‌లోని చార్ట్స్), ఎక్స్, వై గ్రాఫ్స్, మెథడ్స్, రిగెంట్స్ యూజ్డ్ ఫర్ కాలిబిరేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వంటి అంశాలను క్షుణ్నంగా చదవాలి. రిఫరెన్సెస్: Remington, Pavia, Y.R.Sharma. మెడిసినల్ కెమిస్ట్రీ ఈ అంశంలో మెరుగైన మార్కుల కోసం ముందుగా ఆర్గానిక్ కెమిస్ట్రీలోని టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ (సబ్స్ట్యూషన్స్, ఎలిమినేషన్ తదితర), ఆక్సిడిటేషన్, డ్రగ్స్‌కు సంబంధించి రసాయనిక సంశ్లేషణలో ఉపయోగపడే ఫంక్షనల్ గ్రూప్స్ రిడక్షన్, ప్రిపరేషన్ వంటి ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. మెడిసినల్ కెమిస్ట్రీలోని ముఖ్యాంశాలు.. స్ట్రక్చర్ అండ్ నోమెన్ క్లేచర్ సెంథిసిస్, ఎస్ఏఆర్ (SAR), స్టీరియో మార్సిజమ్- ప్రాధాన్యత, ఎంఓఏ (MOA), మెటబాలిజం (మెటబాలిక్ ప్రొడక్ట్ అండ్ ఇట్స్ యాక్షన్), అడ్వర్స్ ఎఫెక్ట్స్. రిఫరెన్సెస్: Wilson and Grisvold, Foye, S.N.Pandeya క్లినికల్ ఫార్మసీ డ్రగ్-డ్రగ్ ఇంటరాక్షన్, డ్రగ్-ఫుడ్ ఇంటరాక్షన్, డ్రగ్ ఎఫెక్ట్స్ ఇన్ ప్రెగ్నెసీ, పిడియాట్రిక్స్, జిరియాటిక్ కండీషన్స్, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ వంటి అంశాలు కీలకమైనవి. రిఫరెన్సెస్:Leon Shargel, Remington. ఫార్మోకోగ్నసీ ఇందులో ఆల్కలాయిడ్స్, గ్లైకోసైడ్స్, టెర్పెనోయిడ్స్, లిపిడ్స్ వంటి అంశాలను చార్ట్స్ రూపంలో రూపొందించుకోవాలి. ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్, ఫైబర్స్, బయోసెంథిటిక్ ఫాథ్ వేస్, ప్లాంట్ టిష్యూ కల్చర్, కెమికల్ టెస్ట్స్ , డిజిటాలిస్, స్ట్రోపెన్థస్ వంటి డ్రగ్స్ హైడ్రోలాసిస్ ప్రొడక్ట్స్, బయోసెంథిటిక్ ప్రీకర్సర్స్ ఫర్ ఆల్కలాయిడ్స్, క్వాలిటేటివ్ ఎవల్యూషన్, మైక్రోస్కోపీ, అడుల్తేరంత్స్ వంటివి కీలకాంశాలు. రిఫరెన్సెస్: Kokate, Trease & evans, khandelwa. బయో కెమిస్ట్రీ విటమిన్స్ (స్ట్రక్చర్స్, యూజెస్, డెఫిసీయెన్సీ), ఎంజైమ్స్ (బైండింగ్ సైట్స్), హార్మోన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, బయో కెమికల్ సైకిల్స్ (రేట్ లిమిటింగ్ ఎంజైమ్స్ మాత్రమే), ఆర్గాన్ ఫంక్షన్ టెస్ట్స్ వంటి అంశాలపై అధికంగా దృష్టి సారించాలి. రిఫరెన్సెస్: U.Satyanarayan, lehninger. జ్యురిస్ప్రుడెన్స డీ అండ్ సీ యాక్ట్ (షెడ్యూల్స్ అండ్ ఫార్మ్స్), ఫార్మసీ యాక్ట్, షెడ్యూల్స్ అండ్ కమిటీ మెంబర్స్ (రిఫర్ చార్ట్స్), ఆఫెన్సెస్ అండ్ పెనాల్టీస్, డీటీఏబీ, డీసీసీ, పీసీఐ సంబంధిత అంశాలను క్షుణ్నంగా ప్రిపేర్ కావాలి. రిఫరెన్సెస్: B.S.Kuchekar, Kokate, agrawal. ఫిజికల్ ఫార్మసీ రీయాలజీ, మైక్రోమెరిటిక్స్, కాంప్లెక్సెషన్, రేట్ అండ్ కైనటిక్స్ ఆఫ్ రియాక్షన్(ప్రాబ్లమ్స్ ఆన్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్) వంటి అంశాలను క్షుణ్నంగా చదవాలి. రిఫరెన్సెస్: martin, CVS subramanyam. బయో ఫార్మాస్యుటిక్స్ ఇందులోని చార్ట్స్, స్టాండర్డ్ ఈక్వేషన్స్,కాంపార్టమెంటల్ మోడల్స్ ఎన్డీడీఎస్ (NDDS) అంశాలను పక్కాగా ప్రిపేర్ కావాలి. రిఫరెన్సెస్: Bramhankar, Leon Sharge నెలకు రూ. 8 వేల స్కాలర్షిప్ జీప్యాట్‌కు నిర్దేశించిన సిలబస్ బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. ప్రశ్నలు అప్లికేషన్ పద్ధతిలో ఉంటాయి. మల్టిపుల్ చాయిస్, అసెర్షన్-రీజన్, స్టేట్మెంట్ బేస్డ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఫార్మాస్యుటిక్స్ , ఫార్మాస్యుటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ వంటివి కీలక చాప్టర్లు. ఇందులో ఫార్మాస్యుటిక్స్కు ఎక్కవగా వెయిటేజీ ఉంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్ సాగించాలి. కాన్సెప్ట్‌ను, బేసిక్స్‌ను అవగాహన చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం లాభిస్తుంది. కనీసం రోజుకు నాలుగు గంటలు ప్రిపరేషన్ కోసం కేటాయించాలి. నైపర్-జేఈఈకి హాజరు కావాలంటే జీప్యాట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. నైపర్-జేఈఈలో జనరల్ అవేర్నెస్, అప్టిట్యూడ్ ప్రశ్నలు అదనంగా ఉంటాయి. జీప్యాట్‌లో అర్హత సాధించి ఎంఫార్మసీ కోర్సులో ప్రవేశం పొందితే నెలకు రూ. 8 వేల స్కాలర్షిప్ లభిస్తుంది. -చంద్ర కిరణ్, నైపర్-మొహాలీ. నోటిఫికేషన్ సమాచారం అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ (ఇంటర్మీడియెట్/ 10+2 తర్వాత నాలుగేళ్ల కోర్సు). చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజు: రూ.1,200 (ఎస్సీ/ఎస్టీ/పీడీలకు రూ.600) ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:జనవరి 7, 2014 ఆన్లైన్ పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 25-27, 2014 రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. ఫలితాల విడుదల: మార్చి 15, 2014 వెబ్సైట్: www.aicte&gpat.in