
కడియం శ్రీహరి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. మహారాష్ట్ర పర్యటనలో కడియం శ్రీహరి ముంబైలో మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేతో శుక్రవారం సమావేశమై విద్యారంగంలో ఇరు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలపై చర్చించారు. దేశంలో ఎక్కడా లేనన్ని 573 గురుకులాలను ఈ నాలుగేళ్లలో తెలంగాణలో ఏర్పాటు చేశామన్నారు.
ఈ ఏడాది నుంచే మొదటి ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ వంటి పరీక్షల్లో ఎక్కువ సీట్లు సాధించే విధంగా కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను వినోద్ తావ్డే కడియం శ్రీహరికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.,,
Comments
Please login to add a commentAdd a comment